
కృష్ణానదిలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న బోట్ రేసర్లు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ రేసింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వాన జోరులో రయ్యిమంటూ కృష్ణమ్మ అలలపై పడవలు దూసుకెళుతుంటే.. ఒడ్డున ఉన్న సందర్శకులు ఉత్సాహం ఉరకలెత్తింది. తొలి రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 14 దేశాలకు చెందిన 9 జట్ల నుంచి 19 మంది రేసర్లు పాల్గొంటున్నారు.
ఓవర్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేశాం : కలెక్టర్ లక్ష్మికాంతం
పవర్ బోటు రేసింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి మీద, మట్టి, గాలిలోనూ ఓవర్ క్రాఫ్ట్‌లు నడుస్తాయని చెప్పారు. ఆదివారం పార్ములా –4 రేస్ 20 నుంచి 25 నిమిషాలపాటు జరుగుతుందన్నారు. 19 లూప్‌లు ఏర్పాటు చేశామని, 250 కి.మీ వేగంలో బోట్లు దూసుకెళతాయని చెప్పారు. 100 కోట్ల ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూస్తారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment