వడోదర: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు.
సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్ అవడం, పిల్లలెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు.
#WATCH | Gujarat: Vadodara MP Ranjanben Dhananjay Bhatt says, "The NDRF team is carrying out the rescue operation. The children have been taken to different hospitals...Strict action will be taken in this matter." pic.twitter.com/TsbhTrGPGK
— ANI (@ANI) January 18, 2024
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh
— ANI (@ANI) January 18, 2024
ఇదీచదవండి.. భారత స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment