
సరస్సు నుంచి మృతదేహాన్ని వెలికితీస్తున్న సహాయక సిబ్బంది
నైరోబి: టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో గురువారం పడవ మునిగిన ఘటనలో 126 మంది మృతి చెందారు. సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియాæ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. బాధితులంతా బుగొలొరా పట్టణంలో జరిగిన సంత నుంచి తిరిగి వస్తున్నారు. ఉకారా తీరం 50 మీటర్ల దూరంలో ఉందనగా కిందికి దిగే ప్రయత్నంలో అంతా పడవకు ఒకే వైపునకు చేరడంతో పడవబోల్తాపడింది.
ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి నిర్వాహకుల వద్ద ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. వందమందిని మాత్రమే తీసుకెళ్లే ఎంవీ న్యెరెరె అనే ఈ పడవలో రెట్టింపు సంఖ్యలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది. పాతకాలం నాటి ఈ పడవలో ప్రయాణికులతోపాటు పెద్ద మొత్తం లో సిమెంటు, మొక్కజొన్న, పండ్లు వంటి లగేజి కూడా ఉందని చెబుతున్నారు. టాంజాని యా, ఉగాండా, కెన్యాల పరిధిలో 27వేల చద రపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న విక్టోరియా లేక్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం.
Comments
Please login to add a commentAdd a comment