tanzania
-
కీలక ఖనిజాలపై భారత్ దృష్టి
న్యూఢిల్లీ: కీలక ఖనిజాల(మినరల్స్)తోకూడిన ఆస్తుల మైనింగ్‌కు ఆసక్తిగా ఉన్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతా రావు పేర్కొన్నారు. కాంగో, జాంబియా, టాంజానియా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కాబిల్తో ఆస్ట్రేలియా ప్రభుత్వం కలసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో దేశీ కంపెనీల కోసం కాంగో, టాంజానియా తదితర కొన్ని దేశాలలో కీలక ఖనిజ ఆస్తులను వెలికి తీసేందుకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ తదితరాలను అత్యంత ప్రాధాన్యతగల ముడిసరుకులుగా పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న శుద్ధ ఇంధన టెక్నాలజీలకు ఇవి బూస్ట్నివ్వగలని పేర్కొన్నారు. గాలి మరలు(విండ్ టర్బయిన్లు), ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీల తయారీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ తదితరాలలో వీటి వినియోగం విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలు కాబిల్తో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఆస్ట్రేలియాలో కీలక మినరల్ బ్లాకులను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. జాంబియా గ్రీన్ సిగ్నల్ కోబాల్ట్, కాపర్ అన్వేషణకు జాంబియా ప్రభుత్వం 9,000 చదరపు కిలోమీటర్ల క్షేత్రాల(గ్రీన్‌ఫీల్డ్)ను భారత్‌కు ఇచ్చేందుకు ఇటీవల అంగీకరించినట్లు రావు తెలియజేశారు. రెండు, మూడేళ్లలో ఖనిజాన్వేషణ చేపట్టనున్నట్లు, తద్వారా మైనింగ్ హక్కులను సైతం పొందనున్నట్లు పేర్కొన్నారు. దేశీ జియలాజికల్ సర్వే(జీఎస్ఐ).. భారీ డిమాండుగల లిథియం బ్లాకులను జమ్ము, కాశీ్మర్(జేఅండ్‌కే), చత్తీస్‌గఢ్‌లలో గుర్తించినట్లు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. వెరసి జేఅండ్కేలో లిథియం బ్లాకుల అన్వేషణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎస్ఐ నిర్ణయించినట్లు తెలియజేశారు. ఏప్రిల్, మే నెలకల్లా వీటిపై స్పష్టత రానున్నట్లు వెల్లడించారు. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది. -
Video: ఓకే రన్‌వేపై ప్రమాదానికి గురైన రెండు విమానాలు
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్‌వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. This is crazy 🤯 An Embraer E120 had problems with its landing gear when landing in Kikoboga in Tanzania and left the runway. another aircraft was sent to rescue passengers, but this one had problems taking off, hit a building and caught fire.pic.twitter.com/sTJmeEcRx5 — Flight Emergency (@FlightEmergency) November 29, 2023 కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్పోర్ట్ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్కు వెళ్లడానికి బయలు దేరింది. రన్‌వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ 🇹🇿 Embraer E120 Brasília had problems with its landing gear in Kikoboga, Tanzania and left the runway. Another Brasília plane had problems taking off, hit a building and caught fire. pic.twitter.com/KauBBB3V5U — Ryan sikorski (@Ryansikorski10) November 30, 2023 -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
దేశాలు వేరైనా డ్యాన్స్ నీదేనయా!
టాంజానియాలో కంటెంట్ క్రియేటర్ కలీపాల్ తన సోదరి నీల్పాల్తో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలోని ‘ఝుమ్ఖా’ పాటకు కలీపాల్, నీమ్పాల్లు స్టెప్పులు వేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన ఈ డ్యాన్స్ వీడియో 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ► ఏ దేశమేగినా గానం నుంచి నృత్యం వరకు ఏదో ఒక రూపంలో దేశం మనతో ఉంటుంది. తాజాగా ఐకానిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ (యూఎస్) బ్యాక్‌గ్రౌండ్‌గా స్వాతి జయశంకర్ భరతనాట్యం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్’ అంటూ కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. -
నయవంచన..నటిపై పలుసార్లు అత్యాచారం.. !
ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ బిజినెస్మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. (ఇది చదవండి: 'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!) కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్‌పై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్) On the basis of a complaint from a female actor, a rape case has been registered against a businessman in NM Joshi Marg police station. The complainant told police that the businessman raped her several times on the pretext of marriage. Further investigation underway: Mumbai… — ANI (@ANI) August 5, 2023 -
తేనెటీగల దాడి.. టాంజానియాలో వరంగల్ కౌలు రైతు మృతి
సాక్షి,వరంగల్: పొట్టకూటి కోసం దేశంకాని దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. టాంజానియాలో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు పడకంటి బ్రహ్మచారి తేనేటీగలు దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ బ్రహ్మచారి ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. మృతుని స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేట. ఉన్న ఊరిలో బతుకుభారమై పరాయి దేశానికి వెళ్లిన బ్రహ్మచారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడని స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
కిలిమంజారో పర్వతంపై వైఫై
డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే.. -
రూ.125 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. బుకింగ్స్ ఫ్రమ్ టాంజానియా!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల వరుసగా పట్టుబడిన రూ.125 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకువస్తూ పట్టుబడిన వారంతా క్యారియర్స్‌గా గుర్తించిన అధికారులు విదేశంలోని సప్లయర్లతో పాటు ఇక్కడి రిసీవర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పక్కా పథకం ప్రకారం ఈ స్మగ్లింగ్ చేయిస్తున్న సప్లయర్లు, మాదకద్రవ్యాలను తీసుకునే రిసీవర్లు ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. విమానాశ్రయంలో గడిచిన పక్షం రోజుల్లో నాలుగు కేసుల్లో చిక్కిన వారిలో టాంజానియన్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఈ డ్రగ్ హైదరాబాద్‌లో తీసుకునే రిసీవర్లు ఎవరనేది నిందితులకు కూడా తెలియదని అధికారులు చెప్తున్నారు. డ్రగ్‌తో ప్రయాణిస్తున్న క్యారియర్ల కోసం నగరంలో హోటల్ గదులనూ సప్లయర్లే బుక్ చేశారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న సద్గురు ట్రావెల్స్ సంస్థకు టాంజానియాలోనూ బ్రాంచ్ ఉంది. ఆ శాఖ నుంచే క్యారియర్ల కోసం సప్లయర్లు గచ్చిబౌలి, మాదాపూర్, మాసబ్‌ట్యాంక్‌ల్లోని హోటళ్లలో రూమ్స్ బుక్ చేశారు. క్యారియర్లతో పాటు ఈ బుకింగ్ రసీదులనూ సప్లయర్లు పంపారు. వీటిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు సదరు ట్రావెల్స్ సంస్థను సంప్రదించారు. టాంజానియాలోని తమ బ్రాంచ్‌కు వెళ్లిన కొందరు ఈ గదులను క్యారియర్స్‌గా వస్తున్న వారి కోసం బుక్ చేశారని, ఆ సందర్భంలో సగం నగదు చెల్లించాలని కోరినా... చెక్ ఇన్ సమయంలో ఇస్తామంటూ దాట వేశారని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము ఆ గదులను బుక్ చేయకుండా కేవలం బ్లాక్ చేసి ఉంచామని వివరించారు. సద్గురు ట్రావెల్స్‌కు సంబంధించిన టాంజానియా బ్రాంచ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలపాల్సిందిగా డీఆర్ఐ ఆ సంస్థను కోరింది. క్యారియర్లు డ్రగ్స్‌తో వచ్చిన విమానంలోనే సప్లయర్లు, రిసీవర్లకు చెందిన వ్యక్తి కూడా ప్రయాణించి, పరిస్థితులను గమనించి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా విమానాల్లో ప్రయాణించిన వారి జాబితాలను విశ్లేషిస్తున్నారు. క్యారియర్లు డ్రగ్స్‌తో విమానాశ్రయం దాటి వచ్చిన తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులకు రిసీవర్ నేరుగా వెళ్లి సరుకు తీసుకునేలా సప్లయర్లు పథకం వేశారు. క్యారియర్లు చిక్కినా తాము పట్టుబడకూదనే డ్రగ్ స్మగ్లర్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఈ కేసుల్లో ఇతర నిందితులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
Kili Paul: ఆస్పత్రిలో ఇంటర్నెట్ సెన్సేషన్.. కత్తులు, కర్రలతో దాడి!
Kili Paul Attacked: ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా, యాక్టివ్‌గా స్టెప్పులేసే అతను.. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ మీద దీనస్థితిలో ఉన్నాడు. చేతి బొటనవేలుకి రక్తపు మరకతో బ్యాండేజ్. కాళ్ల మీద గాయపు గుర్తులు.. ఇంటర్నెట్ సెన్సేషన్‌గా పేరొందిన కిలి పాల్ పరిస్థితి ఇది. కత్తులతో, కర్రలతో ఆయన మీద ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌ని, సోషల్ మీడియాలో ఇతర ఫ్లాట్‌ఫామ్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు.. కిలి పాల్. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖుల దాకా ఈ టాంజానియా ఇంటర్నెట్ సెలబ్రిటీకి ఫ్యాన్స్. అతని ఇన్‌స్టా రీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది భారతీయుల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్, నీమాపాల్‌లు. అయితే కిలి పాల్ మీద ఎవరో దుండగులు దాడి చేశారు. ‘కొందరు తనను కింద పడేయాలని చూస్తున్నారు. కానీ, దేవుడు మాత్రం తనకి సాయం చేస్తూ వస్తున్నాడు. నా కోసం ప్రార్థించండి’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు కిలి పాల్. అయితే అతని మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌లో వీడియోల ద్వారా పాపులర్ అయిన కిలి పాల్.. ఎక్కువ భారతీయ సినీ గేయాలు, డైలాగులకే డ్యాన్సులు చేస్తుంటాడు. తక్కువ టైంలో గుర్తింపు దక్కిన అతనికి ఫిబ్రవరిలో భారత హై కమిషన్ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. అంతెందుకు ప్రధాని మోదీ సైతం తన మన్ కీ బాత్‌లో కిలి పాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. -
సోషల్ స్టార్ కిలిపాల్ వీడియోస్‌కి భారత అధికారులు ఫిదా !
కిలి పాల్... ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. పల్లెల్లో పిల్లగాళ్ల దగ్గర నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు కిలిపాల్‌కి ఫ్యాన్స్ అయ్యారు. అతని ఇన్‌స్టారీల్స్‌కి ఫిదా అవుతుంటారు. బాలీవుడ్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంతో మంది ఇండియన్ల మనుసులు దోచేశారు టాంజానియాకి చెందిన అన్నా చెల్లెల్లు కిలిపాల్ నీమాపాల్‌లు. పూర్తిగా ఆఫ్రికా వేషధారణలో ఉంటూ ఇండియాకి చెందిన పాపులర్ సాంగ్స్‌కి కిలిపాల్, నీమాపాల్ కలిసి చేస్తున్న వీడియోలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ లిస్టులో విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా చేరారు. టాంజానియాలో భారత హైకమిషనర్‌గా పని చేస్తున్న బినయ ప్రధాన్ అనే అధికారి కిలిపాల్ని సన్మానించారు. టాంజానియా, ఇండియాల మధ్య సంబంధాలు కిలిపాల్తో మరింగా బలపడుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు బాగా అర్థమవుతున్నాయంటూ ప్రశంసించారు. Huyo jamaa ndio huyu eeh??😁 pic.twitter.com/Mm8GSCd3b1 — United (@JosephSailanga) February 21, 2022 -
టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
డోడొమా: టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లిడుంబే పరిధిలో హైవేపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షత గాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. అధికవేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధికారులు కారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనిపై టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహు హసన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చదవండి: శ్రీకృష్ణుడితో నేను రోజు మాట్లాడతా: అఖిలేష్ యాదవ్ -
Viral Video: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో వేటాడేస్తా
-
సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్‌లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్‌లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు. (చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?) అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్‌కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి. వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్‌కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా
స్టాక్‌హోమ్: సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను నోబెల్ బహుమతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. (చదవండి: 2021 నోబెల్ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం) BREAKING NEWS: The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j — The Nobel Prize (@NobelPrize) October 7, 2021 అబ్దుల్ రజాక్ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్ రాసిన ‘డిసర్షన్’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. చదవండి: వాతావరణంపై పరిశోధనలకు పట్టం -
‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’
డోడోమా: ఆఫ్రికన్ దేశం టాంజానియా అధ్యక్షురాలు ఫుట్‌బాల్ క్రీడాకారిణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ‘‘ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ట్రోఫీలు గెలవడం సంతోషమే కానీ.. వారి వైవాహిక జీవితాలను పరిశీలిస్తే.. అంత సవ్యంగా ఉండవు. ఛాతీ చిన్నగా ఉండటంతో.. వారు పురుషులను ఆకర్షించలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. ప్రెసిడెంట్ సామియా సులుహు హసన్ గత ఆదివారం జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ... ‘‘మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు చిన్నదైన వక్షస్థలం కలిగి ఉండటం వల్ల ఆకర్షణను కోల్పోతున్నారు. కనుక వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రాంతీయ టోర్నమెంట్ గెలిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హసన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (చదవండి: విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్ అయ్యాడు) ‘‘ఈ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఓ విషయం ఆలోచించాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేది పురుషులు.. స్త్రీలు కాదు. మీరు వారి ముఖాలను చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు వివాహం చేసుకోవాలని భావిస్తే.. అందంగా ఉన్న వ్యక్తినే కోరుకుంటారు. అలానే పురుషుడు కూడా తాను వివాహం చేసుకోవాలని భావించే అమ్మాయి అంతే అందంగా ఉండాని కోరుకుంటాడు. కానీ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఆ లక్షణాలు అదృశ్యమవుతున్నాయి’’ అన్నారు. (చదవండి: ఏం యాక్టింగ్‌రా బాబు; నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు) ‘‘ఈ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు ట్రోఫీలు తెచ్చి దేశం గర్వపడేలా చేస్తున్నారని, కానీ.. భవిష్యత్తులో వారి జీవితాలను చూస్తే అంత సవ్యంగా ఉండవు. ఆడటం వల్ల అలసిపోయిన శరీరంతో వారు ఎలాంటి జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ మీలో ఎవరైనా ఫుట్‌బాల్ క్రీడాకారిణీని మీ భార్యగా ఇంటికి తీసుకెళ్తే.. మీ అమ్మ.. ఆమెను చూసి.. మీరు వివాహం చేసుకుంది స్త్రీనా.. లేక పురుషుడినా అని ప్రశ్నిస్తుంది’’ అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వల్ల హసన్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ మహిళవు అయ్యి ఉండి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో ఆఫ్రికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 🙆🏿🙆🏿🙆🏿🙆🏿 🏃🏿♀️🏃🏿♀️🏃🏿♀️🏃🏿♀️ pic.twitter.com/oU0lOUJ0v3 — Mwanahamisi Singano (@MSalimu) August 22, 2021 -
నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం
సాక్షి, నేరేడ్మెట్: వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉంటూ డబ్బుల సంపాదన కోసం ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న టాంజానియా దేశానికి చెందిన యువతీ, యువకుడు కటకటాలపాలయ్యారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు సంయుక్తంగా చేసిన డెకాయ్ ఆపరేషన్‌లో ఆన్లైన్ వ్యభిచార కార్యకలాపాల గుట్టు రట్టు అయింది. నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా దేశానికి చెందిన యువతి(24), ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్(24) ఉన్నత విద్యనభ్యసించేందుకు గత ఏడాది జనవరిలో స్టడీ వీసాపై భారత్‌కు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సును పూర్తి చేశారు. వీసా గడువు ముగిసినా ఎఫ్ఆర్ఆర్ఓలో రెన్యూవల్ చేసుకోలేదు. కొంత కాలంపాటు తార్నాకలో నివసించిన వీరద్దరు రెండు నెలల క్రితం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని జీకే కాలనీకి మకాం మార్చారు. భార్యాభర్తలుగా చెప్పుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మీట్–24 యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిర్వాహకురాలు/బాధితురాలైన యువతి తన అర్ధనగ్న ఫొటోలను అప్లోడ్ చేస్త తద్వారా కస్టమర్లను ఆకర్షించేది. తరువాత యాప్ ద్వారా చాటింగ్ చేసిన కస్టమర్లకు తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, వారితో శృంగార సంభాషణ చేస్తూ ఇంటికి ఆహ్వానిస్తుంది. తరువాత వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్‌లు సహకరిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాచకొండ సీపీ మహేష్‌భగవత్ పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ఆన్లైన్ వ్యభిచార గుట్టును రట్టు చేశారు. సోమవారం పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. రెండు సెల్ఫోన్లు, పాస్‌పోర్టులను పోలీసులు సీజ్ చేశారని సీఐ చెప్పారు. చదవండి: వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్ -
వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’
డొడొమా: అడవిలో ఉండే జంతువులు కూడా, మనుషుల్లాగానే నిరంతరం మనుగడ కోసం పోరాడుతుంటాయి. ఈ క్రమంలో మాంసాహార జంతువులు శాఖాహర జంతువులను.. శాఖాహర జంతువులు గడ్డి, చెట్ల ఆకులను, ఫలాలను తిని జీవిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే, ఈ పోరాటంలో ఒక జీవి వేటలో మరొక జీవి బలవ్వాల్సిందే.. ఇదే ఆటవిక ధర్మం. కాగా, ఇప్పటికే అడవిలోని సింహం, పులులు, చిరుత పులులు తదితర జంతువులు, ఇతర జీవులను వేటాడటాన్ని మనం అనేక వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఈ పరస్పర దాడుల్లో ఒక్కొసారి.. క్రూరమృగాల వేటకు శాఖాహార జీవులు బలైతే, మరోసారి శాఖాహర జంతువులు మాంసాహార జంతువుల బారి నుంచి తెలివిగా తప్పించుకున్న వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే, ప్రస్తుతం ఈ వీడియో కూడా ఆ కోవకు చెందినదే. ఈ సంఘటన టాంజానియాలోని అడవిలో జరిగింది. దీనిలో ఒక జీబ్రా దట్టమైన అడవిలో గడ్డిని మేస్తుంది. ఈ క్రమంలో ఒక ఆడ సింహం జిబ్రాను దూరం నుంచి గమనించింది. ఈ జీబ్రా ఒక్కటే ఉండటంతో.. మెల్లగా ఒక్కొ అడుగు ముందుకు వేస్తు జీబ్రా దగ్గరకు వచ్చింది. పాపం.. జీబ్రా ధ్యాస మాత్రం మేత మీదే ఉంది. అప్పుడు సివంగి వెంటనే జీబ్రామీద దాడి చేసింది. దీంతో జీబ్రా ఒక్కసారిగా తేరుకొని.. సింహనికి చిక్కకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. ఈ క్రమంలో ఆడసింహం అమాంతం జీబ్రాపైకి దూకింది. అప్పుడు.. జీబ్రా .. తన బలమైన వెనుక కాళ్లతో ఆడసింహన్ని బలంగా ఒక్క తన్నుతన్నింది. దీంతో పాపం..ఆ ఆడసింహం గాల్లో ఎగిరి దూరంగా పడింది. పాపం... సివంగి ఈ ప్రతి దాడిని ఊహించి ఉండదు. కాగా, ఈ వీడియోను మాసాయి లెజెండ్ అనే సఫారీ టీమ్ ఇన్‌స్టాలోని వావో ఆఫ్రికా పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏమన్నా తన్నిందా..’, ‘ పాపం.. సివంగి.. నాలుగైదు అడుగుల దూరం పడుంటుంది..’,‘ సివంగి వేట మిస్..’, ‘గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడింది..’ ‘జీబ్రా ఆయుష్యు గట్టిదే..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో ఊహించని బహుమతి View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
Tanzania: ‘ఏంటో ఈ వింత’.. మహిళా ఎంపీ దుస్తులపై విమర్శలు
డోడోమా: సాధారణంగా పార్లమెంట్ సమావేశాల్లో పదే పదే ఆటంకం కలిగిస్తూ, గందరగోళం సృష్టిస్తే కొన్ని సమయాల్లో ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే తాజాగా టాంజానియీ దేశ పార్లమెంట్లో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ‘నువ్వేంటో నీ వింత బట్టలు ఏంటో? సభను గౌరవించి తక్షణమే భయటకు వెళ్లిపో’ అంటూ ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఓ మహిళ ఎంపీని సభ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం పార్లమెంట్లో చర్చనీయ అంశంగా మారింది. టాంజానియాలో ఓ మహిళా ఎంపీ నలుపు రంగు ప్యాంటు, పసుపు రంగు టాప్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆమె ధరించిన దుస్తులపై వివాదం తలెత్తింది. బిగుతైన దుస్తులు ధరించినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. మంచి దుస్తులు ధరించి సభలోకి రావాలని స్పీకర్ ఆమెకు తెలిపారు. ఈ విషయంపై స్పీకర్ సిచ్వాలే మాట్లాడుతూ.. ‘మా సోదరీమణులు కొందరు వింత బట్టలు ధరిస్తున్నారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. దేశంలో ఉన్నతమైన పార్లమెంట్ సభ, సాంప్రదయాల్ని అందరూ తప్పకుండా గౌరవించాలి. ముఖ్యంగా దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అటువంటి వాళ్లపై సభ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. స్పీకర్ వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. చదవండి: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్ బ్లాగరా అన్నారు -
టాంజానియా సామియా!
పురుషులతో సమానంగా రాజకీయాలను శాసిస్తున్నారు నేటితరం మహిళలు. న్యూజిలాండ్, బార్బడోస్, డెన్మార్క్, ఈస్టోనియా వంటి దేశాలను మహిళా అధ్యక్షులు సమర్థవంతంగా పాలిస్తూ... దేశాభివృద్ధిలో తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఈ దేశాల సరసన టాంజానియా దేశం కూడా చేరింది. టాంజానియా దేశపు మాజీ అధ్యక్షుడు మరణించడంతో.. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సామియా సులుహు హసన్ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా చరిత్రలో ఇప్పటివరకు మహిళలెవరూ అధ్యక్షులు కాలేదు. మూడురోజుల క్రితం మాజీ అధ్యక్షుడు జాన్ మగుఫులీ కరోనా, గుండెసంబంధ సమస్యలతో మరణించారు. దీంతో ఉపాధ్యక్షురాలైన సామియా సులుహు హసన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కారణంతోగానీ, లేదా అధ్యక్షుడు మరణించినప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్న అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని ఏళ్లు అధ్యక్షులుగా కొనసాగవచ్చు. 1960 జనవరి 27 పుట్టిన సామియా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి అధ్యక్షురాలుగా ఎదిగారు. అత్యధికంగా ముస్లిం జనాభా కలిగిన జంజీబార్ ప్రాంతంలో పుట్టిన సమియాను పిపోడే అని ప్రేమగా పిలుస్తారు. జంజీబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్‌లో స్టాటిస్టిక్స్ చదివిన సామియా, ముజంబే యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ డిప్లామా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టాపొందారు. సామియా సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ప్రణాళికా, అభివృద్ధి మంత్రిత్వ శాఖ లో క్లర్క్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పట్టా పొందారు. వ్యవసాయ అధికారి హఫీద్ అమీర్‌ను సామియా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. సామియా కుమార్తె కూడా జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో సామియాది 20 ఏళ్ల ప్రస్థానం. 2000వ సంవత్సరంలో లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె.. జంజీబార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కు ప్రత్యేక సభ్యురాలిగా ఎంపికయ్యారు. అప్పటి టాంజానియా అధ్యక్షుడు అమనీ అబేది కరుమే క్యాబినెట్లో ఉన్నతస్థాయి మహిళా మంత్రిగా కూడా పనిచేశారు. జంజీబార్ పర్యాటక శాఖ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, యూత్ ఎంప్లాయిమెంట్, మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగానేగాక, కేంద్ర వ్యవహారాల ఇంఛార్జి మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. మకుండుచి నియోజక వర్గ ఎంపీగా 2010 నుంచి2015 వరకు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చామా చా మాపిండుజీ(సీసీఎం) పార్టీతరపున 2015లో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు సమియా పదో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జంజీబార్ నుంచి ఎన్నికైన తొలి ప్రెసిడెంట్‌గానూ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో రెండో మహిళా ప్రెసిడెంట్‌గానూ సామియా నిలుస్తారు. ఆఫ్రికా దేశమైన రువాండాకు 1993 జూలై 18 నుంచి అగాతే ఉవిలింగియమానైన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె మరణించే వరకు పదవిలో కొనసాగారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన సామియా 2025 వరకు పదవిలో కొనసాగనున్నారు. టాంజానియా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సామియా సులుహు హసన్ -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడు: మళ్లీ రత్నం దొరికింది
టాంజానియా: రెండు అరుదైన రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన టాంజానియా వ్యక్తి సనెన్యూ లైజర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గనులు తవ్వే పని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అతనికి ఓ రోజు రెండు పెద్ద రత్నాలు దొరికడంతో కోటీశ్వరుడిగా మారిపోయాడు. తాజాగా ఆయనకు మరోసారి రత్నం దొరికింది. మన్యారాలోని టాంజానియా గనుల్లో లభ్యమైన ఈ రత్నం 6.3 కిలోల బరువు తూగింది. దీని విలువ 4.7 బిలియన్ టాంజానియా షిల్లాంగ్స్(రెండు మిలియన్ డాలర్లు)గా ఉంది. (రెండు రత్నాలతో కోటీశ్వరుడయ్యాడు) లైజర్‌కు తొలిసారిగా జూన్‌లో ఈ అరుదైన రత్నాలు రెండు దొరకగా వాటిని ప్రభుత్వానికి విక్రయించాడు. దీంతో సుమారు 25 కోట్ల వరకు సంపాదించి ఒక్కరోజులో ధనవంతుడయ్యాడు. వీటినే ఆ దేశంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద టాంజానిట్ రత్నాలని స్వయంగా ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే డబ్బులు సంపాదించిన తర్వాత తన జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు పోలేదని లైజర్ వెల్లడించాడు. ఎప్పటిలాగే తన 2 వేల ఆవులను పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ డబ్బుతో ఓ పాఠశాలను కట్టిస్తానంటున్నాడు. ఇతనికి నలుగురు భార్యలు, ముప్పై మంది పిల్లలు ఉన్నారు. కాగా ఈ భూమి మీదే అరుదైనవిగా టాంజానైట్ రత్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పర్పుల్ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే రానున్న 20 ఏళ్లలో ఇవి అంతరించిపోనున్నాయని అక్కడి స్థానిక భూగోళవేత్త అంచనా వేస్తున్నారు. (ముగ్గురు డాన్స్.. కానీ ఒక్కరే!) -
అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...
టాంజానియా: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏదో లాటరీ తగిలి కాదు, రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు. (తెరుచుకున్న ఈఫిల్ టవర్.. కానీ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సైమన్ మ్సంజిలా మాట్లాడుతూ.. మిరేరానీలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. టాంజానియా సెంట్రల్ బ్యాంక్ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్ మాగుఫులీ స్వయంగా ఫోన్ చేసి లైవ్‌లో అభినందించారు. మైనింగ్ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) -
మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!
దొడోమ: కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషులకు, పులులు, పిల్లులు వంటి కొన్ని జంతువులకూ వచ్చింది. అయితే విచిత్రంగా ఓ మేకకు, మరీ విచిత్రంగా ఓ బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఈ వింత సంఘటన టాంజానియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే టాంజానియా దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ చేసే పరీక్షా కిట్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని మనుషులతోపాటు బొప్పాయి, మేక, గొర్రెల పైనా పరీక్షించింది. ఈ క్రమంలో గొర్రె మినహా మిగతా రెండింటికి వైరస్ సోకినట్లు తప్పుడు ఫలితాలివ్వడంతో కిట్లలో డొల్లతనం బయటపడింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లలో సాంకేతిక లోపాలున్నాయని వెల్లడించారు. వీటి వాడకాన్ని నిలిపివేస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం) కాగా ఇప్పటికే వైరస్ వ్యాప్తి విషయాన్ని దాస్తోందని ప్రభుత్వంపై విమర్శలు వచ్చినవేళ నాసిరకం కిట్లతో ప్రజల ఆరోగ్యంపై చెలగాటమాడుతున్నారని విపక్షాలు మరోసారి భగ్గుమంటున్నాయి. మరోవైపు అధ్యక్షుడు జాన్ మగుఫులి మాత్రం ఈ కిట్ల ద్వారా.. కొంతమంది కరోనా బాధితులకు వైరస్ సోకలేదన్న విషయం నిరూపితమవుతోందన్నారు. ఆదివారం నాటికి టాంజానియాలో 480 కరోనా కేసులు నమోదవగా 17 మంది మరణించారు. అక్కడ పది లక్షల మందికి గానూ కేవలం 500 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) -
చర్చిలో తొక్కిసలాట.. 20 మంది మృతి
దారెస్సలామ్: టాంజానియాలోని ఓ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. టాంజానియాలో ప్రముఖ పాస్టర్ బోనిఫెస్ వాంపోసా ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అందులో ఆయన ప్రార్థించిన నూనెను వేదిక ఎదుట పోశారు. భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అది తాకితే రోగాల నుంచి విముక్తి పొందుతామని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడం తొక్కిసలాటకు దారితీసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనకు కారణమైన పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బైక్‌పై టాంజానియా విద్యార్థి హల్చల్
సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో శుక్రవారం టాంజానియా విద్యార్థి తన ద్విచక్రవాహనంపై హల్చల్ చేస్తూ, అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఓ వృద్ధుడ్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై వృద్ధుడి పరిస్థితి విషమంగా మారింది. వడ్డేశ్వరం కె.ఎల్.విశ్వ విద్యాలయంలో టాంజానియా దేశానికి చెందిన ఆల్మెట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఉండవల్లిలో నివాసం ఉండే ఆల్మెట్ తన ద్విచక్రవాహనంపై కాలేజీకి వెళ్లివస్తుంటాడు. కృష్ణాష్టమి కావడంతో కాలేజీకి సెలవు ప్రకటించారు. దీంతో ఆల్మెట్ తన ద్విచక్రవాహనంపై ఉండవల్లి–అమరావతి రహదారిలో ఫీట్లు చేస్తూ అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్ నుంచి గ్రామంలోకి వెళుతున్న ఆర్.శంకరరెడ్డి (పిడతలు) తన సైకిల్‌పై వెళుతూ ఉండగా, వెనుక నుంచి ఆల్మెట్ ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. శంకర్‌రెడ్డి సైకిల్‌పై నుంచి రోడ్డు మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆల్మెట్ అదే వేగంతో ముందుకు దూసుకుపోగా, రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ దుకాణంలోకి ద్విచక్రవాహనం దూసుకువెళ్లి, మార్బుల్ రాళ్లను గుద్ది కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆల్మెట్‌కు కూడా గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న మార్బుల్‌రాళ్లు 12 వరకు పగిలిపోయాయి. ఘటనా స్థలం వద్ద రాళ్లు పగిలిన తీరునుబట్టి ఆల్మెట్ ఎంత వేగంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 24 గంటలు గడిస్తే కాని పరిస్థితి చెప్పలేమంటూ డాక్టర్లు చెప్పడంతో శంకరరెడ్డి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. -
ట్యాంకర్ పేలి 62 మంది మృతి
దార్ ఎస్ సలామ్ (టాంజానియా): తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ దుర్ఘటనలో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం మొరోగొరో పట్టణంలో ఆయిల్‌ను వెలికితీయడానికి కొందరు వ్యక్తులు ఓ ఆయిల్ ట్యాంకర్ చుట్టూ చేరారు. ఆ ట్యాంకర్ అప్పటికే శిథిలావస్థలో ఉండడంతో పేలుడుకు గురైంది. ఈ ఘటనలో 62 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారని స్థానిక పోలీస్ కమిషనర్ స్టీవెన్ కాబ్వే తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి అక్రమంగా ఆయిల్‌ను దొంగిలించడం ఈ దేశంలో సాధారణంగా జరిగే విషయమే. 2013లో సైతం ఇలాంటి పేలుడులో 29 మంది మృతిచెందారు. ట్యాంకర్లనుంచి ఆయిల్‌ను తీసేటపుడు జరిగే పేలుళ్ల గురించి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోడ్డు భద్రతా నిపుణుడు హెన్రీ బంటు అన్నారు. -
టాంజానియాలో యాదాద్రి జిల్లావాసి దుర్మరణం
ఆత్మకూరు(ఎం): టాంజానియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్.ఎం మండలం కొరటికల్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. కొరటికల్ గ్రామానికి చెందిన సోలిపురం రాంరెడ్డి–రమణమ్మ దంపతుల కుమారుడు రాజశేఖరరెడ్డి(24) నాలుగేళ్లుగా ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో బోరువెల్ వాహనంపై డ్రైవర్ కమ్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. బోరు బావి డ్రిల్లింగ్‌కోసం మంగళవారం ఉదయం 5 గంటలకు దారుస్సలేం వెళుతుండగా ఎదురుగా కంటెయినర్ వాహనం వచ్చి బోరుబండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బోర్వెల్ వాహనం ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలంటుకున్నాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో 2 వాహనాలు పూర్తిగా కాలిపోగా.. రాజశేఖరరెడ్డి, కంటెయినర్ డ్రైవర్ కూడా మంటల్లో సజీవ దహనం అయ్యారు. రాజశేఖరరెడ్డి మృతి వార్తను అక్కడే మరో బోరువాహనంపై పనిచేస్తున్న ఓ సూపర్వైజర్ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. రాజశేఖర్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం
-
126 మంది జల సమాధి
నైరోబి: టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో గురువారం పడవ మునిగిన ఘటనలో 126 మంది మృతి చెందారు. సహాయ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం వరకు 126 మృత దేహాలను వెలికి తీశారని, మరికొన్నిటిని గుర్తించారని టాంజానియాæ రవాణా మంత్రి ఇసాక్ కమ్వెలె చెప్పారు. బాధితులంతా బుగొలొరా పట్టణంలో జరిగిన సంత నుంచి తిరిగి వస్తున్నారు. ఉకారా తీరం 50 మీటర్ల దూరంలో ఉందనగా కిందికి దిగే ప్రయత్నంలో అంతా పడవకు ఒకే వైపునకు చేరడంతో పడవబోల్తాపడింది. ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి నిర్వాహకుల వద్ద ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. వందమందిని మాత్రమే తీసుకెళ్లే ఎంవీ న్యెరెరె అనే ఈ పడవలో రెట్టింపు సంఖ్యలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది. పాతకాలం నాటి ఈ పడవలో ప్రయాణికులతోపాటు పెద్ద మొత్తం లో సిమెంటు, మొక్కజొన్న, పండ్లు వంటి లగేజి కూడా ఉందని చెబుతున్నారు. టాంజాని యా, ఉగాండా, కెన్యాల పరిధిలో 27వేల చద రపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న విక్టోరియా లేక్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. -
తుర్రో... తుర్రు..
సాక్షి, తెలంగాణ డెస్క్: అనగనగనగా టాంజానియా అనే దేశం.. మన దేశానికి చాలా దూరం లెండి.. అక్కడ సెరెన్గెటీలో ఓ సఫారీ పార్కు.. ఈ పార్కులో బోలెడన్ని పులులు, చిరుతలు.. సింహాలు.. ఏనుగులు.. పాములు.. ఆ.. మర్చిపోయాను.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొంగ బావ కూడా ఇక్కడే ఉంటోంది. ఈ మధ్య.. ఓ మిట్టమధ్యాహ్నం వేళ.. సరిగ్గా లంచ్ టైము అన్నమాట. ఈ చిరుత పులి కడుపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయి. అసలే దీనికి ఆకలి ఎక్కువ.. టైముకి తిండి ఠంచనుగా పడిపోవాల్సిందే.. మరి ఇదేమో జూ కాదాయే.. టైముకి ఫుడ్ పెట్టడానికి.. సఫారీ పార్కు.. దాంతో వేటకు బయల్దేరింది.. ఎంత వెతికినా.. ఒక్క జంతువూ కనపడలేదు.. ఇంక నీరసం వచ్చి పడిపోతుంది అనుకునే లోపు.. అక్కడికి దగ్గర్లో అప్పుడే లంచ్ కానిచ్చి.. అరగడానికి వాకింగ్ చేస్తున్న కొంగ బావ కనిపించింది.. అంతే.. గడ్డిలో చటుక్కున దాక్కుంది.. యుద్ధరంగంలోని సైనికుడిలాగ బరబరమని.. పాక్కుంటూ.. దాని దగ్గరికి వెళ్లింది.. ఈ కొంగ పని ఇక అయిపోయింది నా సామి రంగా అని అనుకుంటూ ఒక్కసారిగా దబీమని దూకింది.. అయితే.. కొంగబావకి మామూలుగానే తెలివితేటలు ఎక్కువ.. దీనికి కాస్త సిక్త్స్ సెన్స్ కూడా ఉన్నట్లుంది.. వెంటనే ప్రమాదాన్ని గ్రహించింది.... ఇంకేముంది.. తుర్రో.. తుర్రు.. -
నీది ఆకలి.. నాది బతుకు..!
వాషింగ్టన్ : బతకాలన్న కోరిక బలంగా ఉండాలేకానీ.. మృత్యు పాశం నుంచి తప్పించుకోవడం ఎంతసేపు. ఇది మనుషులకైనా జంతువులకైనా వర్తిస్తుంది. జీవించలేక.. జీవితం అంటే భయంతో జనాలు ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు. అదే జంతవులు మాత్రం జీవించేందుకు ఆఖరిప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని విజయం సాధిస్తున్నాయి. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్నది టాంజానియాలోని మారా నది. ఈ నదిని అక్కడి ప్రభుత్వం మొసళ్ల రక్షిత ప్రదేశంగా ప్రకటించింది. చుట్టూ కీకారణ్యంలో ప్రవహించే ఈ నదిలో నీటిని తాగేందుకు పలు జంతువులు వస్తుంటాయి. సరిగ్గా ఈ సమయంలో నీటిలోని మొసళ్లు జంతువులను పట్టి ఆకలి తీర్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక మధ్యాహ్నం గడ్డి తిని దాహం తీర్చుకునేందుకు నదిలోకి దిగాయి కొన్ని జింకలు.. జీబ్రాలు. అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక మొసలి.. పెద్దగా నోరు తెరిచి.. ఎదురుగా ఉన్న జింకను పట్టుకునేందుకు ప్రయత్నించింది. తవరకూ నీటిలో అటూఇటూ తిరుగుతున్న జింకకు మృత్యుదేవతలా ఎదురుగా మొసలి కనిపించే సరికి పైప్రాణాలు పోయినట్టు అనిపించింది. లేని ధైర్యాన్ని,శక్తిని కూడట్టుకుని.. ఒక్కసారిగా మొసలి నోటికి అందకుండా.. అంతెత్తుకు ఎగిరింది. జింక ఎగరడం.. దూకడంతో ఏదో ప్రమాదం వచ్చిందని ఊహించిన మిగిలిన జంతువులు ఒడ్డుకు పరుగులు తీశాయి. కేవలం రెప్పపాటు కాలంలో జింక.. మొసలి దాటుకుని.. మూడుగెంతుల్లో ఒడ్డుకు చేరుకుంది. మారియా నది ఒడ్డుకు అన్నిరకాల జంతువులు వస్తుండడంతో వాటిని ఫొటోలు తీసేందుకు ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫార్.. వార్నెన్ క్రెస్వెల్ అక్కడకు వెళ్లారు. జంతువుల మధ్య పోరాటాలు.. ఇతరత్రా పరిస్థితులను ఫొటోలు తీయాలని.. ఇక్కడకు వచ్చాను.. అయితే అనుకోకుండా.. ఈ ఫొటోలు తీశాను అని ఆయన చెప్పారు. -
కుప్పకూలిన బంగారు గని; కార్మికుల దుర్మరణం
-
కుప్పకూలిన బంగారు గని; కార్మికుల దుర్మరణం
దార్ ఏ సలామ్: బంగారు గని కుప్పకూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణంపాలైన ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో చోటుచేసుకుంది. గెటా ప్రాంతంలోని ఓ గనిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ఏడుగురు కార్మికుల బృందం.. పది అడుగుల లోతులో పనిచేస్తుండగా వారిపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయని గెటా రీజనల్ పోలీస్ కమాండర్ మ్వాబులాంబో తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఖ్యాతికెక్కిన విక్టోరియా సరస్సు, దాని తీరంలో భారీగా ఉన్న బంగారం నిక్షేపాలు గెటా ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే గనుల తవ్వకాలు ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా సంస్థలే చేపడుతుండటం, సరైన భద్రతాప్రమాణాలు పాటించకపోవడం వల్ల గెటాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జనవరిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక చైనీయుడు సహా 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
నీరు అని తాకితే.. శిలలయ్యాయి
-
నీరు అని తాకితే.. శిలలయ్యాయి
ఓ ముని శాపం కారణంగానో లేదా ఓ మాయ ప్రయోగం చేతనో లేదా ఏదైనా తాకకూడని వస్తువును తాకడం వల్ల జీవులు శిలలుగా మారడం మనం సినిమాల్లో చూసి ఉంటాం. కానీ భూమ్మీద నిజంగానే అలా తాకగానే శిలగా మార్చేసే ప్రదేశం ఉంది. అదే ఆఫ్రికాలోని టాంజానియాలో గల నాట్రాన్ సరస్సు. అక్కడి నీటిని తాకిన ప్రతి జీవి శరీరంలోని కణ కణాన్ని రాతి శిలగా మార్చేస్తుంది ఈ సరస్సు. ఈ సరస్సును సందర్శించిన ఓ ఫోటోగ్రాఫర్ నీటిని తాకగానే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షులను చూసి షాక్‌కు గురయ్యారు. తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోను కెమెరాలో బంధించారు. శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఆయన తీసిన చిత్రాల్లో కనిపిస్తుంది. ఈ ఫోటోలన్నీ తన ఫొటో పుస్తకం 'అక్రాస్ ది రవగేడ్ ల్యాండ్'లో పొందుపర్చాడు. సరస్సు ఇంత ప్రమాదకారిగా మారడానికి కారణం దానికి చేరువలో ఉన్న అగ్నిపర్వతంగా భావిస్తున్నారు. అగ్నిపర్వత అంతర్భాగం నుంచి వచ్చి సరస్సులో కలుస్తున్న సోడియం కార్బోనేట్, సోడియం బై కార్బోనేట్ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది. కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
టాంజానియాలో భూకంపం
-
మరో సాహసానికి సై
కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమవుతున్న గురుకుల విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ : కిలిమంజారో... పదిహేడు వేల అడుగుల ఎత్తు... తక్కువ ఉష్ణోగ్రతలు... బలమైన గాలులు... ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం ఇది. అన్నింటికీ మించి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతాల శ్రేణి. ఆకాశాన్ని ముద్డాడుతున్నట్టుండే ఈ పర్వత శిఖరాన్ని చూడటమే గగనం. అలాంటిది అధిరోహించడమంటే..! పెద్ద సాహసమే కదా! కానీ... దీన్ని సవాలుగా తీసుకున్నారు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యార్థులు. టాంజానియాలోని కిలిమంజారో శిఖరాన్ని చేరి... మన జెండాను రెపరెపలాడించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరెస్టును ఎక్కి చరిత్ర సృష్టించిన గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ స్ఫూర్తితో... మౌంట్ రెనోక్‌ను అధిరోహించిన 32 మంది బృందంలోని వారితో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)కు చెందిన విద్యార్థినులు కూడా ఈసారి జతకలిశారు. ప్రధానంగా మెదక్ జిల్లాకు చెందిన కేజీబీవీ విద్యార్థినులకు ఇందులో భాగస్వాములను చేసేందుకు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ బృందం భువనగిరిలో ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకుంది. అయితే బృందంలో సభ్యులెంతమంది ఉంటారన్నది వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఎప్పుడు వెళ్లేదీ ప్రకటిస్తారు. విభిన్న పర్వత శ్రేణి... ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం కిలిమంజాలరో. దాదాపు 17 వేల అడుగుల (4,900 మీటర్ల) ఎత్తులో ఉంది. దీనిలోనే మవెంజి, షిరా, కిబో అగ్ని పర్వతాలున్నాయి. ‘తెల్లపర్వతం’గా కూడా దీన్ని పిలుస్తారు. మొత్తం 7 పర్వతారోహణ మార్గాలున్నాయి. తక్కువ ఉష్ణోగ్రత, అప్పుడప్పుడు వీచే బలమైన గాలులు దీనిని ప్రమాదకరంగా మార్చే అవకాశాలున్నాయి. వారికి సమస్య కాకపోవచ్చు... పర్వతారోహణ ఇష్టపడే విద్యార్థులకు ఇది సాహస యాత్రే. కేజీబీవీకి చెందిన విద్యార్థినులతో పాటు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులను తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రతిపాదన. గతంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు, మౌంట్ రెనోక్లు అధిరోహించినప్పుడు వారితో నేనూ వెళ్లా. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున... పగటి పూట అమిత వేడి, రాత్రిపూట చల్లగా ఉంటుంది. రెనోక్ ఎక్కిన విద్యార్థులకు ఈ పర్వతారోహణ సమస్య కాకపోవచ్చు. - శేఖర్‌బాబు, పర్వతారోహకుడు, శిక్షకుడు -
'సోలార్ మమ్మాస్' తో మోదీ భేటీ
ప్రధాని నరేంద్రమోదీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా టాంజానియాలోని 'సోలార్ మమ్మాస్' తో భేటీ అయ్యారు. దారాస్ సలాస్ లోని అధ్యక్షభవనం సందర్శించిన అనంతరం ఆయన సౌర శక్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై అక్కడ శిక్షణ పొందిన మహిళలతో చర్చిచారు. టాంజానియా పర్యటనలో భాగంగా సోలార్ మామాస్ తో భేటీ అయిన నరేంద్ర మోదీ... వారి శిక్షణా కార్యక్రమాల్లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరు దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళలు శిక్షణ పొందుతున్న శిబిరంలో సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై ఆరా తీశారు. భారత్ సహాయ సహకారాలతో సౌర విద్యుత్ ఉత్పత్తిపై 'సోలార్ మామాస్' శిక్షణ తీసుకుంటారు. ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన సోలార్ ఇంజనీర్లకు అక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ శిక్షణ పొందుతున్న ఆఫ్రికన్ మహిళలను పలుకరించిన మోదీ... వారి నైపుణ్యాలు, సౌకర్యాలు వంటి అనేక విషయాలను గురించి వివరాలు తెలుసుకున్నారు. మోదీ సమావేశంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలు వారు తయారు చేసిన సోలార్ వస్తువులను మోదీకి చూపించారు. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారికి టాంజానియా లోని ప్రత్యేక కేంద్రంలో రాజస్థాన్ బేర్ ఫూట్ కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. -
ఉమ్మడి పోరుతోనే ఉగ్ర వినాశనం
-
ఉమ్మడి పోరుతోనే ఉగ్ర వినాశనం
- నైరోబీలో ప్రధాని మోదీ - 20 వేలమందితో కిక్కిరిసిన స్టేడియం నైరోబీ : ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటని, మానవత్వాన్ని విశ్వసించే శక్తులన్నీ కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెన్యా రాజధాని నైరోబీలోని కాసరాని స్టేడియంలో ఆదివారం రాత్రి 20 వేల మంది భారతీయుల్ని, భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాదాపు గంట పాటు ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ, మోదీ నినాదాలతో స్టేడియం మార్మోగింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్ ప్రగతిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 7.6 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తోంది. మేం ఇక్కడితో ఆగిపోం. ముందుకు వెళ్తాం. 8 శాతం వృద్ధి రేటుకు చేరుకుంటాం. ప్రపంచం ఎదుర్కోంటున్న రెండు ప్రధాన సమస్యలు ఉగ్రవాదం, గ్లోబల్ వార్మింగ్‌లు. వీటిని ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం కలిసికట్టుగా ముందుకు రావాలి. వేగంగా ముందుకొస్తే... త్వరగా ఉగ్రవాదం అంతమవుతుంది. వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం చూపాల్సిన సమయం వచ్చినప్పుడు భారత్ మార్గం చూపుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో చిన్న రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన వ్యక్తి ప్రధానిగా ఏం చేయగలరని విమర్శకులు ప్రశ్నించారు. నా సామర్థ్యంపై అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. విదేశీ వ్యవహారాల్లో నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదంటూ విమర్శించారు. అవి నిజం కూడా.. ప్రధాన మంత్రి అయ్యాకే నేను పార్లమెంట్‌ను చూశాను. గత రెండేళ్ల పాలనలో భారతదేశం మంచి పాలన చూసింది.. గతంలో వలే కాకుండా పథకాలు సమర్థంగా అమలయ్యాయి. గత రెండేళ్లలో దేశంలోని చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. అందుకే తాగునీటి కోసం రైళ్లను నడిపాం. స్పష్టంగా దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు. మంచి పాలనకు, పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మేం ప్రోత్సాహం అందించాం. 125 కోట్ల మంది ప్రజలు ముందుకెళ్లానని తీర్మానించుకున్నట్లు నేను గుర్తించాను. ఇది నిజమైన ప్రజా శక్తి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇతర రేటింగ్ సంస్థలు భారత్‌ను మంచి భవిష్యత్తు ఉన్న దేశంగా పేర్కొంటున్నాయి. ఇదంతా అకస్మాత్తుగా జరగలేదు. గత రెండేళ్లలో ఒక దాని వెంట ఒకటి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది’ అని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా కూడా పాల్గొన్నారు. టాంజానియాతో ఐదు ఒప్పందాలు దారెస్సలాం : టాంజానియాతో సంబంధాలు మరింత బలోపేతంతో పాటు, ఆ దేశాభివృద్ధికి అవసరమైన పూర్తి సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ టాంజానియా పర్యటన సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. టాంజానియా అభివృద్ధిలో భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించిన ప్రధాని... ఆ దేశాధ్యక్షుడు జాన్ పాంబే మగుఫులితో కలసి రక్షణ, భద్రతా సహకారం, సముద్ర రవాణా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృత పరచుకోవాలని నిర్ణయించారు. జాంజిబార్ నీటి సరఫరా వ్యవస్థకు రూ. 617 కోట్ల రుణ సాయంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి, జాంజిబార్‌లో వృత్తి విద్య శిక్ష ణ కేంద్రం ఏర్పాటు, దౌత్య, అధికారిక పాస్‌పోర్ట్ ఉంటే వీసా నిబంధనలో వెసులుబాటుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు దేశాలు వ్యవసాయం, ఆహార భద్రత వంటి అంశాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని మోదీ అన్నారు. పప్పుదినుసుల్ని టాంజానియా నుంచి భారత్‌కు ఎగుమతి చేసే అంశంపైనా చర్చించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, టాంజానియా అధ్యక్షుడితో కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉత్సాహంగా కన్పిం చారు. తర్వాత మోదీ కెన్యాకు వెళ్లారు. -
'వివస్త్రను చేయలేదు.. వీధుల్లో పరుగెత్తించలేదు'
బెంగళూరు: బెంగళూరులో టాంజానియాకు చెందిన విద్యార్థినిని వివస్త్రను చేశారని వచ్చిన వార్తలను కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కొట్టిపారేశారు. అసలు ఆమెను వివస్త్రను చేయలేదని, వీధుల వెంట పరుగెత్తించలేదని చెప్పారు. బాధితురాలి పేరును కూడా ఆయన పత్రికా సమావేశంలో వెల్లడించారు. అయితే, మీరిలా బహిరంగంగా ఆ విద్యార్థిని పేరును వెల్లడించడం తప్పని అనిపించడం లేదా అని మీడియా ప్రశ్నించగా.. తానేమి అబద్ధం చెప్పడం లేదని అన్నారు. నిజాలే చెప్తున్నానని, ఇవన్నీ కూడా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్నవేనని తెలిపారు. 'నేను చెప్పింది ఆమె పేరే. నేను నిజాలు ఎలా దాచగలను? ఆవిషయాలన్ని కూడా ఫిర్యాదులో ఉన్నాయి' అని ఆయన చెప్పారు. కొంతమంది పేర్కొంటున్నట్లు అది వివక్ష పూరిత దాడి కాదని, అది కేవలం ఒక రోడ్డు ప్రమాదంపట్ల అక్కడ ఉన్న జనం స్పందించిన తీరు కాస్తంత హింసాత్మకంగా మారిందని అన్నారు. భావోద్వేగానికి లోనవడంవల్లే అక్కడ దాడి జరిగిందని చెప్పారు. 'బెంగళూరులో మొత్తం 12వేలమంది విదేశీ విద్యార్థినులున్నారు. వారందరి రక్షణకు మేం పూర్తి హామీ ఇస్తున్నాం' అని హోంమంత్రి చెప్పారు. హోమంత్రి ప్రకటనకు ముందు తమ దేశ విద్యార్థినిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని టాంజానియా రాయభారి డిమాండ్ చేశారు. బెంగళూరులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో వ్యక్తిని టాంజానియాకు చెందిన యువతి, ఆమె స్నేహితులు అని అనుకొని పొరబడి కొందరు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆ యువతిని వివస్త్రను చేశారని, వీధుల్లో పరుగెత్తించారని కూడా వార్తలు రావడంతో పెద్ద సంచలనంగా మారి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
బెంగళూరులో తలదించుకునే ఘటన
బెంగళూరు: బెంగళూరులో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన యువతిపై దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆ యువతిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీధుల్లో పరుగెత్తించడంతోపాటు ఆమె కారును కూడా తగులబెట్టారు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో యాక్సిడెంట్ చేసినవారికోసం వెతుకుతున్నారు. అదే సమయంలో టాంజానియా మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు. -
భర్తను పంచుకుంటేనే మంచిదట!
బహుభార్యత్వం.. అంటే ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడటం తప్పని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా చేసిన పరిశోధనలో మాత్రం.. కొన్ని పరిస్థితులలో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందట! ప్రపంచంలో చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా ఇది మహిళల పట్ల వివక్షేనంటాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు ఉత్తర టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలాకాకుండా ఒక భర్త ఒకే భార్యతో ఉంటున్న కుటుంబాలపై పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాల్లోనే తగినతం ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారట. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద కూడా బాగుందని, మామూలు వాళ్ల కంటే పెద్ద కమతాలలో వీళ్లు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా, 3 ఆవులు, ఒక ఎకరం భూమి ఉన్నవాళ్ల కంటే.. 180 ఆవులు, బోలెడంత భూమితో పాటు కొందరు భార్యలు కూడా ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మోనిక్ బోర్గెరాఫ్ మల్డర్ చెప్పారు. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోకుండానే బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల మహిళలకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఎంతమంది భాగస్వాములు ఉండొచ్చన్నది సమస్య కాదని, తాము కోరుకున్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. టాంజానియా లాంటి దేశాల్లో ఆహారభద్రత చాలా సమస్యగా ఉంది. ఇక్కడ పౌష్టికాహారం అందక చిన్నవయసులోనే పిల్లలు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాసాయ్ లాంటి తెగలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. -
జంతువుల మధ్యే జలకాలాటలు
జంతువుల మధ్య జలకాలాడాలనుందా? కాఫీ తాగుతూ ఏనుగులతో కబుర్లాడాలనుందా? అయితే టాంజానియాలోని స్వాలా అభయారణ్యానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడే ఇలాంటి ప్రత్యేకతలున్నాయి మరి. ఈ అభయారణ్యంలో ఇలా స్విమ్మింగ్‌పూల్‌లో సేద తీరుతూ.. ఆ పక్కనే ఉన్న హోటల్లో ఇష్టమైన ఆహారాన్ని తింటూ అటుగా వచ్చిపోయే జంతువులను చూడొచ్చు. అన్నట్టు.. అవి మన దగ్గరకు వచ్చేస్తాయన్న భయం అక్కర్లేదండోయ్. ఎందుకంటే స్విమ్మింగ్‌పూల్‌తోపాటు మనం ఉండే చోటు చుట్టూ పెద్ద కందకం ఉంటుంది. దానిని దాటుకుని అవి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా జంతువుల మధ్య హ్యాపీగా గడపొచ్చన్నమాట. బావుంది కదూ..! -
చేతికి లక్ష, తలకు రెండు లక్షలు..మొత్తంగా..
డొడోమా: అక్కడ మానవ ప్రాణాలకు అసలు విలువ లేదు. కానీ మానవుడి ఆవయవాలకు మాత్రం ఎంతో విలువుంది. ఒక చేతికి దాదాపు లక్ష రూపాయలు. తలకు రెండు లక్షలు. మొత్తం చర్మానికి దాదాపు ఆరు లక్షలు, మొత్తంగా శరీరానికి కోటీ ముప్పై లక్షల రూపాయలు. ఇందులో బాధితులకు నయా పైసా రాదు. వీటిని సొమ్ము చేసుకునేవాడికి వెళుతుంది. వీటిని తెగనరికి తెచ్చేవాడికి కొంత పర్సంటేజీ దక్కుతుంది. కిడ్నీలను తస్కరించి అమ్ముకునే వ్యాపారంకన్నా దారుణమైన ఈ వ్యాపారం తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో యధేశ్చగా జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి మానవ అవయవాలను కొనుక్కుంటోంది ఎవరో కాదు. రాజకీయ నాయకులు. బడా వ్యాపారవేత్తలు. ఎందుకంటే మూఢ నమ్మకం. ఎన్నికల్లో గెలవాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా ఈ అవయవాల చూర్ణం, స్థానిక మొక్కల మిశ్రమంతో తయారు చేసిన కషాయాన్ని తాగడం ఒక్కటే మార్గమన్న మౌఢ్యం. ఈ మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తున్నవారు క్షుద్ర వైద్యులు. అల్బినో అనే జన్యుపరమైన లోపాలతో పుట్టిన వారి అవయవాల్లో అద్భుతమైన అతీంద్రీయ శక్తులు ఉంటాయనే పూర్వకాల నమ్మకాలను ఉపయోగించుకొని ఈ పిశాచ వైద్యులు ఇంతకు తెగబడుతున్నారు. వారు ప్రతి మానవ ప్రాణి జోలికి వెళ్లకపోవడం కొంత నయమనుకోవాలేమో! వైద్య పరిభాషలో మెలానిన్ అనే వర్ణద్రవ్య లోపం వల్ల అల్బినోలు పుడతారు. వారి శరీరానికి, కళ్లకు, శరీరంపై వెంట్రుకలకు రంగు ఉండదు. శరీరం కూడా పాండురోగం సోకినట్టు తెల్లగా ఉంటుంది. వీరి జుట్టుపై నుండే వెంట్రుకలకు (మొలిచేదే తక్కువ), చేతుల గోళ్లకు అతీంద్రీయ శక్తులు ఉంటాయన్నది టాంజానియాలాంటి తూర్పు ఆఫ్రికా దేశాల్లో పూర్వికుల విశ్వాసం. తమ వద్దకు కోరికలు ఈడేరేందుకు వచ్చే విశ్వాసకులకు వీరి వెంట్రుకలను, గోళ్లను ఉపయోగించి క్షుద్ర పూజలు చేయడం, అర్థంపర్థంలేని కషాయాలు తాగించడం అక్కడి క్షుద్ర వైద్యుల నైజం. హఠాత్తుగా టాంజానియాలో అల్బినోల ప్రతి అవయవాన్ని క్షుద్ర వైద్యానికి ఉపయోగించడం 2006లో మొదలైంది. క్షుద్ర వైద్యుల మధ్య పోటీ పెరిగి ఒక్కో అవయవానికి ఒక్కో అతీంద్రీయ శక్తి ఉందంటూ అల్బినోల అవయవాలకు రేటు పెంచుతూ వచ్చారు. మరి రేటునుబట్టి అవయవాలను ఎవరు తీసుకరావాలి? అందుకోసం అడ్డంగా ఏ అవయవాన్నైనా తెగనరికే తలారుల ముఠాలను నియమించుకున్నారు. ఈ ముఠాలను స్థానికంగా ఎంగ్యాంగ్ అని పిలుస్తారు. 2013, జనవరి 31వ తేదీన పెండో సెంగెరెమా అనే బాలుడి ఎడమ చేయి నరుక్కెళ్లారు (ఇప్పుడు ఆ బాలుడికి 15 ఏళ్లు). అడ్డొచ్చిన ఆ బాలుడి 95 ఏళ్ల తాతయ్యను కూడా నరికేశారు. 2008లో మిరియాము స్టఫోర్డ్ అనే మహిళ కుడి చేతిని మొండిపోయిన పొడవైన కత్తితో తెగనరికారు. కత్తి మొండి వల్ల రెండో చేయి పూర్తిగా తెగకపోవడంతో దాన్ని వదిలేసి తెగిన చేతిని తీసుకెళ్లారు. రెండు కృత్రిమ అవయవాలతో ఆమె ఇప్పటికీ బతికే ఉన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు 156 మంది అల్బినోలు బలయ్యారని టాంజానియా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ బాధితులు వేల మందే ఉంటారని అనధికార లెక్కలు చెబుతున్నాయి. లేక్ విక్టోరియా పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంకా పెరిగాయని ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడిన ‘మెయిల్ ఆన్ లైన్’ జర్నలిస్టులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అక్కడ అల్బినోలను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. అల్బినోలుగా పుట్టినవారిని పురిటిలోనే చంపుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలా చేయని వారు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అల్బినో బిడ్డలను తీసుకొని మారుమూల ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు వారి తల్లిదండ్రులు. ప్రపంచవ్యాప్తంగా సరాసరి తీసుకుంటే ప్రతి 20 వేల మందిలో ఒకరు అల్బినోలుగా జన్మించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ప్రపంచంలోనే అల్బినోలు టాంజానియాలో ఎక్కువ మంది ఉన్నారని, అక్కడ ప్రతి 1400 మందిలో ఒకరి అల్బినోలేనని ఐరాస పేర్కొంది. టాంజానియా మొత్తం జనాభా దాదాపు ఐదు కోట్లు. అందులో క్రైస్తవులు, ముస్లింలే ఎక్కువ. మూఢ విశ్వాసకులకు మాత్రం ఎవరూ అతీతులుకారు. వారిలో 93 శాతం మంది ఈ మూఢనమ్మకాన్ని విశ్వసిస్తారు. ఇంతకాలం ఈ క్షుద్ర వైద్యాన్ని నిషేధించడటానికి నిరాకరిస్తూ వచ్చిన టాంజానియా ప్రభుత్వం చివరకు ఐక్యరాజ్య సమితి ఒత్తిడితో 2015 జనవరి మొదటి వారంలో నిషేధించింది. -
టాంజానియా నైసర్గిక స్వరూపం
ప్రపంచ వీక్షణం వైశాల్యం: 9,47,303 చదరపు కిలోమీటర్లు, జనాభా: 4,75,000,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: డొడొమా, ప్రభుత్వం: యూనిటరీ ప్రెసిడెన్షియల్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, భాషలు: స్వాహిలీ, ఇంగ్లిష్, కరెన్సీ: టాంజానియా షిల్లింగ్, మతాలు: క్రైస్తవులు 40%, ముస్లిములు 23%, హిందువులు 2%, ట్రైబల్ తెగలు 23%. వాతావరణం: వేడి, ఉక్కపోత వాతావరణం-19-31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, స్వాతంత్య్రం: 1961, డిసెంబర్ 9 పంటలు: మొక్కజొన్న, పత్తి, కాఫీ, సిసల్, లవంగాలు, కొబ్బరి, పొగాకు, కసావా, పరిశ్రమలు: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, సిమెంటు, చమురు శుద్ధి, ఎగుమతులు: పత్తి, కాఫీ, లవంగాలు, కొబ్బరి ఉత్పత్తులు, వజ్రాలు, సిసర్, సరిహద్దులు: కెన్యా, ఉగండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూమహాసముద్రం. చరిత్ర: జర్మనీ రాజులు క్రీ.శ. 1880లో టాంజానియాను ఆక్రమించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 1964 వరకు బ్రిటిష్ వాళ్లే ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పటికి ఈ ప్రాంతం పేరు టాంగన్యికా. దీనికే జాంజిబార్ అనే పేరు కూడా ఉండేది. 800 కిలోమీటర్ల హిందూ మహాసముద్ర తీరం పామాయిల్ చెట్లతో నిండి ఉంటుంది. విక్టోరియా, టాంగాన్యికా, మలావి, రుక్వా, ఇయాసీ, నాట్రాన్... సరస్సులు దేశంలో నెలవై ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అద్భుతమైన కొండలు ఈ దేశంలో ఉన్నాయి. వీటిని కిలిమంజారో కొండలు అంటారు. ప్రపంచంలోనే పొడవైన నది నైలు, దానితోపాటు జైరే నదులు ఈ దేశంలో పారుతున్నాయి. అలాగే అతిపెద్ద అగ్ని పర్వతం బద్దలైన పెద్దగొయ్యి కూడా ఈ దేశంలోనే ఉన్నాయి. విక్టోరియా సరస్సు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు. 12వ శతాబ్దంలో ఇక్కడ బానిసల వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. అరబ్బులు తమ పనులకోసం ఈ ప్రాంతం నుండే బానిసలను కొనుక్కొని వెళ్లేవారు. దేశంలో వందల, వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలు ఎన్నెన్నో ఈ దేశంలో బయటపడ్డాయి. పరిపాలనా పద్ధతులు: పరిపాలనా పరంగా దేశాన్ని మొత్తం 30 రీజియన్లు గా విభజించారు. 25 రీజియన్లు దేశంలో ఉండగా మిగిలిన ఐదు హిందూమహాసముద్రంలో ఉన్న జాంజిబార్ దీవిలో ఉన్నాయి. ఈ రీజియన్లను 169 జిల్లాలుగా విభజించారు. దేశం మొత్తానికి రాష్ట్రపతి ఉంటాడు. అలాగే జాతీయ శాసనసభ కూడా ఉంటుంది. ప్రధానమంత్రి కూడా ఉంటాడు. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి- ఒకప్పటి రాజధాని నగరం దార్ ఎస్ సలామ్, ప్రస్తుత రాజధాని డొడొమా, ఇంకా ఆరుష, గీటా, బుకోబా, కిగోమా, మోషి, బబాటె, ముసోమా, ఎంబేయా, మొరోగోరో, మౌంట్వవారా, ఎంవాంజా, కిబాహ, సుంబవంగ, సోంగియా, షిన్యాంగా, బరియాది, సింగిడా, తబోరా, టాంగా, జాంజిబార్ సిటీ మొదలైనవి. ప్రజలు-సంస్కృతి-సంప్రదాయాలు: దేశజనాభాలో 95 శాతం ప్రజలు బాంటు మూలం కలిగిన వారే. అయితే దేశం మొత్తంలో 126 తెగల ప్రజలు ఉన్నారు. వీటిలో సుకుమ తెగ అత్యధిక జనాభా కలిగి ఉంది. వీరు ఉత్తరాన ఉన్న విక్టోరియా సరస్సు ప్రాంతంలో ఉంటారు. ప్రజల్లో అధికభాగం వ్యవసాయం చేస్తారు. హద్జాపి అనే తెగవాళ్ళు కేవలం వేటాడి జీవనం కొనసాగిస్తారు. మసాయి తెగవాళ్లు ఎక్కువగా జంతుపోషణ చేస్తారు. ఏ కుటుంబంలో జంతువులు అధికంగా ఉంటే ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. 50 శాతం మంది పిల్లలు పాఠశాలలకు వెళతారు. ప్రజలు స్వాహిలి, ఇంగ్లిష్ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. అయితే అనేక తెగలు ఉన్నందున వారివారి స్వీయ భాషలు ఉన్నాయి. ఇలాంటివి 100కు పైగా భాషలు ఉన్నాయి. మహిళలు స్కర్టులు, నైటీలాంటి దుస్తులు ధరిస్తారు. తలకు రుమాలు చుట్టుకుంటారు. ఎక్కువగా వ్యవసాయపనులు చేస్తారు. పురుషులు ప్యాంటు, షర్టు ధరిస్తారు. టాంజానియా ప్రజలు కొబ్బరిపాలు ఎక్కువగా తాగుతారు. వరి అన్నం, ఉగాలి, చపాతి తింటారు. చూడదగిన ప్రదేశాలు 1. రాతినగరం: ఈ రాతి నగరం జాంజిబార్ ద్వీపంలో ఉంది. పూర్వకాలంలో అరేబియన్లు ఇక్కడ నిర్మించుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఇరుకైన సందులు ఈ నగరానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. దాదాపు అన్ని ఇళ్లను రాళ్ళతోనే నిర్మించారు. ఈ ఇళ్ళను 19వ శతాబ్దంలో కట్టారు. ఆ కాలం లో హిందూమహా సముద్రంలో స్వాహిలి తెగవాళ్ళు ఇక్కడి నుండే వ్యాపారం చేసేవారు. దాంతో ఇది అప్పట్లో స్వాహిలి నగరంగా పేరుగాంచింది. ఆ కాలంనాటి కట్టడాలు నేటికీ సురక్షితంగా ఉన్నాయి. కొన్ని భవనాలు నేడు మ్యూజియంలుగా మారి ఉన్నాయి. ఈ నగరంలో రెండు పురాతన చర్చిలు కూడా ఉన్నాయి. క్రీక్ వీధిలో నడుస్తుంటే రెండువైపులా రాతి ఇళ్ళు సహజరూపంలో కనిపిస్తాయి. ఈ నగరంలో సెంట్రల్ దరజాని మార్కెట్, బీట్ఎల్ అమని, సిటీహల్, ఆంగ్లికన్ కాథడ్రల్, ఫోరోధూని గార్డెన్లు, పీపుల్స్ పాలెస్, ఓల్డ్ ఫోర్ట్, పర్షియన్బాత్ ఇలా ఎన్నో అద్భుత కట్టడాలను చూడవచ్చు. 2. దార్ ఎస్ సలామ్: ఈ నగరం ఒకప్పుడు చేపలు పట్టి జీవించే బెస్తవారి పల్లెటూరు. ఇప్పుడు టాంజానియా దేశానికి రాజధానిగా మారిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాలకు నేడు ఈ నగరం సముద్ర మార్గ ప్రదేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలో ఎంతో బిజీగా ఉండే ఓడరేవు ఇక్కడే ఉంది. మొత్తం దేశంలో ఈ నగరమే అతిపెద్దది. ఇక్కడ జనాభా 43 లక్షలపైగా ఉంది. ఓడరేవు చుట్టూ ఉండే నగరం పాతనగరం. నగరానికి ఉత్తరం వైపున వివిధ దేశాల ఎంబసీలు, ప్రభుత్వ కార్యాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ నగరం ఒక పెద్ద వ్యాపార కేంద్రం కావడం వల్ల అనేక దేశాల నుండి ఇక్కడికి వ్యాపారం కోసం ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. దాంతో ఈ నగరంలో ఉన్న విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ నగరానికి పూర్వపు పేరు ఎంజిజిమా, నగరంలో ఉన్న 35 అంతస్తుల రెండు భవనాలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి. ఇవి జంట టవర్లుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ నగరంలో అయిదు మ్యూజియంలు ఉన్నాయి. వీటిల్లో విలేజి మ్యూజియం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ 16 తెగలకు చెందిన పూరి గుడిసె నివాసాలు ఉన్నాయి. హిందూమహా సముద్రతీరంలో ఉన్న కారణంగా సముద్రతీరం బీచ్‌లు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. ఎంససాని, కిగంబోని బీచ్‌లు చూడదగ్గవి. ఈ నగరంలో ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 3 . కిలిమంజారో పర్వతం: టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ పర్వతాన్ని సంవత్సరంలో ఏ రోజైనా ఎక్కవచ్చు. ఇక్కడ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. కిలిమంజారో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ పర్వతం ఒక మిలియన్ సంవత్సరాల క్రితం ఉప్పొంగిన అగ్నిపర్వతం కారణంగా ఏర్పడింది. ఈ పర్వతం మూడంచెలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని షీరా అని, రెండోదాన్ని కీబో అని, మూడోదాన్ని మావెంజి అంటారు. అత్యధిక ఎత్తై ప్రదేశాన్ని ఉహురు శిఖరం అంటారు. ఈ ప్రాంతమంతా కిలిమంజారో జాతీయ పార్కుగా అభివృద్ధి చేయబడి ఉంది. ఇక్కడ అడవిదున్నలు, చిరుతలు, కోతులు, ఏనుగులు, ఇంకా ఎన్నో రకాల పక్షులు మనకు దర్శనమిస్తాయి. రాజధాని దార్ఎస్సలామ్ నుండి నేరుగా కిలిమంజారో వెళ్ళవచ్చు. 4. ఎన్ గొరొంగోరో సంరక్షణా ప్రాంతం: ఇది సెరంగేటి పర్వతం మరియు మాన్యారా సరస్సు మధ్య ప్రాంతంలో ఉంది. ఇది ఎన్గోరొంగోరో క్రేటర్‌కు ప్రసిద్ధి. ఇక్కడ వన్యప్రాణులు అత్యధికం. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన గొయ్యి చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓల్డువాయి జార్జ్ అనే ప్రాంతం ఒక పురాతత్వ ప్రదేశం. ఇక్కడ మానవ పరిణామంలో మొదటి మానవుడిగా చెప్పబడే పుర్రె, ఇతర శరీర ఎముకలు ఉన్నాయి. ఎన్ గొరొంగోరో గొయ్యి ప్రపంచంలోనే పెద్ద గొయ్యి, ఇది దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు ఇతర జంతువులను వేటాడడం మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఇక్కడే దాదాపు ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయి. ఇలాంటి వాటిఆధారంగానే శాస్త్రవేత్తలు మానవుడు 2 మిలియన్ సంవత్సరాల క్రితమే ఉన్నాడని నిర్ధారణ చేయగలిగారు. ప్రకృతి-పర్యావరణం: టాంజానియా దేశంలో మొత్తం 16 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్గోరోంగోరో కన్సర్వేషన్ ప్రాంతం, గోంబే స్ట్రీమ్ జాతీయపార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో 130 రకాల ఉభయచరాలు, 275 రకాల పాములు ఉన్నాయి. ఎన్నో రకాల అడవి జంతువులు ఈ దేశంలో ఉన్నాయి. -
కసాయి పాలకుడు
దక్షిణాఫ్రికా ఖండపు తూర్పుభాగంలోని సూడాన్, కాంగో, టాంజానియా, కెన్యా, ఇథియోపియాల నడుమ ఉన్న చిన్న దేశం ఉగాండా. ఆ దేశానికి 1962లో బ్రిటిష్‌వారి నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతలోనే 1971లో ఆ స్వాతంత్య్రం చేజారిపోయింది! అయితే దాన్ని చేజిక్కించుకున్నవాడు ఎవరో పరాయిదేశ పాలకుడు కాదు. వాళ్ల మనిషే. పేరు ఇడీ అమీన్! అప్పటికి ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే. అతడి ప్రభుత్వంలో అమీన్ ఒక సైనికాధికారి. ఒబోటే, అమీన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులంటే ఇద్దరూ కలిసి బంగారం స్మగ్లింగ్ చేసేవారు. కాంగో నుంచి ఏనుగు దంతాలను, కాఫీ గింజలను పెద్ద ఎత్తున అక్రమంగా తెప్పించుకుని వ్యాపారం చేసేవారు. వసూళ్లను పంచుకునేవారు. ఆ క్రమంలో 1971 జనవరి 25న ఒబొటే సింగపూర్‌లో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అదే అదనుగా అమీన్ సైనిక తిరుగుబాటు లేవనెత్తాడు. ఒబొటే ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఉగాండా అధ్యక్షుడిగా, సైనికదళాల ముఖ్య అధికారిగా ఉగాండా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి 1979 ఏప్రిల్ 13న టాంజానియా సేనల తిరుగుదాడికి జడిసి దేశాన్ని వదిలి పారిపోయేవరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలనను ఉంగాండా ప్రజలకు తొమ్మిదేళ్లపాటు నరకం చూపించాడు ఇడీ అమీన్. అమీన్ అధికారంలో వచ్చీ రావడంతోనే, అంతకుముందు ఒబొటే ఖైదు చేయించిన రాజకీయ నాయకులందరినీ విడుదల చేయించి వారిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఒబొటే మద్దతుదారులందరినీ వెంటాడి, వేటాడి చంపేందుకు ‘కిల్లర్ స్క్వాడ్స్’ని ఏర్పాటు చేశాడు. పాత్రికేయులు, న్యాయవాదులు, విద్యార్థులు, సీనియర్ అధికారులు... వారూ వీరు అని లేకుండా తన ను విమర్శించిన వారందరినీ హత్య చేయించాడు. 1972లో ‘ఆర్థిక యుద్ధం’ పేరుతో ఉగాండాలోని ఆసియా సంతతి వాళ్లందరినీ దేశం నుంచి వెళ్లగొట్టాడు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని తెలిసినా అతడు లెక్క చేయలేదు. చివరికి ‘ఉగాండా కసాయి’గా పేరుమోశాడు. అమీన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కనీసం 3 లక్షల మంది పౌరులు అతడి వివక్షకు, వైషమ్యాలకు బలయ్యారు. 1976లో ఎంటెబ్బేకు బయల్దేరిన ఫ్రెంచి విమానాన్ని హైజాక్ చేయించాడు. 1978 అక్టోబరులో టాంజానియా ఆక్రమణకు తన సొంత సేనల్ని ఉసిగొల్పాడు. అదే అతడి అంతానికి కారణమయింది. అమీన్‌కు వ్యతిరేకంగా ఉగాండా జాతీయవాదులు టాంజానియా సేనలకు సహకరించడంతో వారు ఉగాండా సేనలపై పైచేయి సాధించారు. వాళ్లకు చిక్కకుండా అమీన్ మొదట లిబియా పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా చేరుకున్నాడు. అలా రెండు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలో గడిపి, ఆరోగ్యం క్షీణించి, కోమాలోకి జారుకుని 2003 ఆగస్టు 16న మరణించాడు. ఉగాండా ప్రభుత్వం అతడి మృతదేహాన్ని అడిగేలోపే సౌదీ అరేబియా ఖననం చేయించింది. విచిత్రం ఏమిటంటే అమీన్ దురాగతాలపై ఈనాటికీ ఏ దేశమూ విచారణ జరిపించకపోవడం! ఇడీ అమీన్‌ను సమర్థించేవారు కఠోరమైన అతడి బాల్యమే అతడిని అంతటి క్రూర పాలకునిగా మార్చిందని అంటారు. అమీన్ జన్మదినం ఎక్కడా నమోదు కాలేదు. సంవత్సరం మాత్రం 1925 అంటారు. ఉగాండాలోని ఉత్తర నైలు ప్రావిన్సులో అతడు జన్మించాడు. 1940 నుంచి 1970 వరకు సైన్యంలో పనిచేశాడు. ప్రభుత్వాన్ని పడగొట్టి, అధ్యక్షుడు అయ్యాడు. అమీన్ తల్లి మూలికా వైద్యురాలు. దైవభక్తి పరాయణురాలు. తండ్రి తన తల్లిని వదిలిపెట్టి వెళ్లడంతో ఆ కోపం, అసహనం, దుఃఖం అమీన్‌ని చెడ్డ పిల్లవాడిగా మార్చాయని అతడిని సమర్థించేవారు చెబుతారు. అమీన్ పెద్దగా చదువుకోలేదు. చిన్న వయసులోనే బ్రిటిష్ సైన్యంలోని ‘బ్లాక్ ఆఫ్రికన్’ విభాగంలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలం అక్కడే వంటవాడిగా పనిచేశాడు. అమీన్ పొడగరి. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండేవాడు. బాక్సింగ్, స్విమ్మింగ్ ఛాంపియన్ కూడా. సైన్యంలో త్వరత్వరగా ఎదగడానికి సైనిక విచారణల్లో అమానుషంగా ప్రవర్తించేవాడు. అలా తన ‘శక్తి సామర్థ్యాలను’ చాటుకొని అక్రమ విధానాల్లో పైకి వచ్చినవాడు ఇడీ అమీన్. చరిత్ర క్షమించని నరహంతకులలో ఇడీ అమీన్ ఒకరు.