అగ్నికి ఆహుతైన ట్యాంకర్, వాహనాలు
దార్ ఎస్ సలామ్ (టాంజానియా): తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ దుర్ఘటనలో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం మొరోగొరో పట్టణంలో ఆయిల్‌ను వెలికితీయడానికి కొందరు వ్యక్తులు ఓ ఆయిల్ ట్యాంకర్ చుట్టూ చేరారు. ఆ ట్యాంకర్ అప్పటికే శిథిలావస్థలో ఉండడంతో పేలుడుకు గురైంది. ఈ ఘటనలో 62 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారని స్థానిక పోలీస్ కమిషనర్ స్టీవెన్ కాబ్వే తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి అక్రమంగా ఆయిల్‌ను దొంగిలించడం ఈ దేశంలో సాధారణంగా జరిగే విషయమే. 2013లో సైతం ఇలాంటి పేలుడులో 29 మంది మృతిచెందారు. ట్యాంకర్లనుంచి ఆయిల్‌ను తీసేటపుడు జరిగే పేలుళ్ల గురించి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోడ్డు భద్రతా నిపుణుడు హెన్రీ బంటు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment