
లింగాపురం: నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళుతున్న సమయంలోవైఎస్సార్‌సీపీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. సుధాకర్ రెడ్డి పొలానికి వెళుతున్న సమయంలో మాటువేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. ఈ హత్యకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనేవైఎస్సార్‌సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment