lingapuram
-
లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
కర్నూలు: జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆయన సోమవారం ఉదయం బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి అయిదోరోజు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌భాషా కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్ షో చేపడతారు. -
బాబు గద్దెనెక్కాక వరుస కరువులే
ప్రజలంతా బాబు దిగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నారు: వైఎస్ జగన్ ♦ రూ. 5 వేల కోట్లతో నిధి పెడతానని ఎన్నికల ముందు చంద్రబాబు కబుర్లు చెప్పారు ♦ ఇప్పుడు మద్దతు ధర అడిగితే ఉల్లి రైతులపై కేసులు ♦ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టదా? ♦ మోసగాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తామని అర్థమయ్యేలా చెప్పండి భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత రాష్ట్రానికి తెచ్చింది వరుసగా కరువే... కరువు. ఒకవైపు రైతులు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు బాధలు పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పుణ్యాన రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తున్నారు. వృద్ధిరేటులో దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని ఉపన్యాసాలిస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో నిధి పెడతామని మేం చెప్తే... మా కంటే ఎక్కువ చెబితే ఓట్లు వస్తాయని రూ.5 వేల కోట్లతో నిధి పెడతానని కబుర్లు చెప్పారు. ఇవాళ ఆదుకోమని ఉల్లి రైతులు రోడ్డు ఎక్కితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలు సోనా ధాన్యం బస్తా రూ.1,200కు అమ్ముకునే పరిస్థితి. మిర్చి ధర, పంట దిగుబడి తగ్గి రైతులు రోదిస్తున్నారు. టమోటోలు రోడ్డు మీద పోస్తున్నారు. అయినా పట్టించుకోని ఇలాంటి ముఖ్యమం త్రి ఎప్పుడు దిగిపోతాడా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. రైతులను ఆదుకోకపోతే డిపాజిట్లు కూడా పోతాయనే భయం రావాలి. అప్పటివరకూ అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇలాంటి దుష్టపాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి... అడుగులో అడుగు వేయండి. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నియోజకవర్గం లో నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన వేల్పనూరు నుంచి బయలుదేరి చిన్నదేవుళా పురం, నారాయణపురం చేరుకున్నారు. అక్కడ పొలంలో మిర్చి రైతులతో ముచ్చటిం చారు. అక్కడి నుంచి సంతజూటూరు మీదు గా లింగాపురం, బీసీ పాలెంకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠపురం మీదుగా ఈర్నపాడుకు చేరుకున్నారు. నాలుగో రోజు భరోసా యాత్ర ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మొత్తం 11.30 గంటలపాటు దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... మనందరం రైతులం. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నవాళ్లం. రాష్ట్రంలో దాదాపుగా 65 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి... రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే కూలీలకు పనులు దొరుకుతాయి... గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ మూడేళ్లలో మీకు ఏమి మేలు జరిగిందని అడుగుతున్నా? ఆయనవల్ల మేలేమీ జరగకపోగా... ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా కరువే.. కరువు. మూడేళ్ల కిందట చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చునేందుకు... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి... ఏ టీవీ ఆన్ చేసినా ఇవే మాటలు, ఏ గోడ మీద రాతలు చూసినా ఇవే రాతలు. చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు... రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను మోసం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 32 నెలలైంది... నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి చొప్పున నాకు రూ.64 వేలు బాకీ ఉన్నాడన్నా... అని మొన్న విజయనగరం యువభేరిలో ఒక యువకుడు అడిగాడు. కనీసం ఆ పిల్లాడు మాటలైనా విని చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. బుద్ధి, సిగ్గు అన్నది ఏ మాత్రం ఉన్నా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రీయింబర్స్‌మెంట్‌ను జోక్‌గా మార్చేశారు పేదరికం పోవాలంటే కుటుంబంనుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని పేద విద్యార్థులను ఉచితంగా చదివించేందుకు నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని ప్రతి పేద విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. ఇవాళ ఇంజనీరింగ్‌లో లక్ష రూపాయలు, మెడికల్ కాలేజీల్లో రూ.11 లక్షలు ఫీజులుంటే... చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగతా ఫీజు కట్టేందుకు ఇంట్లో ఉన్న ఆస్తులు, పొలాలు అమ్మాల్సి వస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఒక జోక్‌గా మార్చేశారు. ఇక ఇళ్ల సంగతి సరేసరి. కొత్త ఇళ్లు కాదు కదా.. గతంలో కట్టిన గోడలకు కూడా బిల్లులివ్వడంలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయలేదు. అందరినీ మోసం చేశారు. ఇలాంటి మానవత్వంలేని ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి. అడుగులో అడుగు వేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని అర్థమయ్యేలా చెప్పాలి. కమీషన్ల కోసమే కేబినెట్...! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం గా ఉంది. రబీలో పంటలు వేసిన రైతులకు వ్యవసాయ రుణాలు రూ.24 వేల కోట్లు, టర్మ్ రుణాల కింద మరో రూ.9,800 కోట్లు ఇవ్వాలి. కానీ కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా రు. అయినా చంద్రబాబు కేబినెట్ మీటింగు ల్లో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఏ రైతు నుంచి ఎంత భూమి గుంజుకుం దాం? ఎంత కమీషన్ తీసుకుని ఎవరికి ఇద్దామనే ఆలోచిస్తున్నారు. రైతుల రుణా లకు సంబంధించి బ్యాంకులు ఇచ్చింది పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా? అని అడుగుతున్నా. రైతుల పరిస్థి తి ఎంత దారుణంగా ఉదంటే... ఉల్లి కేజీ 2 రూపాయలకు కూడా అమ్ముకోలేక పొలంలోనే వదిలేసి వ్యవసాయాన్ని నిలిపి వేస్తున్నారు. టమోటా, మిరప, ధాన్యం పరిస్థితి అంతే. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు సోనా బస్తా రూ.1,200కు కూడా కొనే నాథుడు దొరకడం లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నాలు చేస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. చంద్రబాబు పుణ్యా న రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి. కానీ వృద్ధిరేటులో రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని చంద్ర బాబు ఉపన్యాసాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసు కుంటే... కేవలం నలుగురంటే నలుగురికే నష్టపరిహారం ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా చనిపోతేనే మళ్లీ కొత్త పింఛను ఇస్తామంటున్నారు. -
ఆయనొచ్చాక మూడేళ్లుగా కరువే కరువు
-
మూడేళ్లుగా కరువే కరువు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా లింగాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి, గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి వస్తుంది చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా ఆయనవల్ల మేలు జరగకపోగా వరుసగా ఇప్పటికి మూడేళ్లు కరువే కరువు చంద్రబాబు సీఎం అవ్వడం కోసం ఆ రోజుల్లో.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతులను వదల్లేదు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్లనూ వదల్లేదు ఏ గోడమీద రాతలు చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చెప్పేవారు డ్వాక్రా సంఘాల అప్పులన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేవారు రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చదువుకున్న పిల్లలను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యి 32 నెలలైంది.. ఆయన నాకు 64వేలు బాకీ అని ఓ యువకుడు అడిగారు తాను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశాం రబీ పంటలు వేశాం. కానీ రైతులు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నారు పంట రుణాలు 24వేల కోట్లు, టెర్మ లోన్స్ మరో 9800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు చంద్రబాబు పుణ్యమాని కేవలం 4900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు మరి ఈ ముఖ్యమంత్రి బ్యాంకులను నిలదీయాల్సింది పోయి, క్యాబినెట్ మీటింగులో రైతుల గురించి మాట్లాడలేదు బయటకొచ్చాక బ్యాంకులిచ్చింది సంతృప్తికరంగా ఉందని చెప్పారు ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నా రైతులు ఉల్లిపంట వేసి.. కిలో 2 రూపాయలు కూడా గిట్టక పొలంలోనే వదిలేశారు గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నా చేస్తుంటే వాళ్లమీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు ఉల్లి, టమోటా, మిర్చి, చివరకు ధాన్యం పరిస్థితి కూడా అంతే కర్నూలు సోనా అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం కానీ ఆ ధాన్యం బస్తా 1250-1300 కూడా కొనే నాథుడు దొరకడం లేదు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి రైతులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు రాష్ట్రం జీడీపీ గ్రోత్రేటులో దేశం కన్నా ముందు పరిగెడుతోందని చెబుతారు ఈ పాలనను సాగనంపేందుకు మీ అందరూ చేయి చేయి కలపాలి అడుగులో అడుగు వేయాలి.. చంద్రబాబు లాంటి మోసకారులు, అబద్ధాలు ఆడేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తుందని అర్థం కావాలి అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నా -
లింగాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
-
మా బతుకుల్లో వెలుగెప్పుడు?
అది లింగాపురం పంచాయతీ... మండల కేంద్రమైన కోటవురట్లకు కూతవేటు (కిలోమీటర్) దూరంలో ఉంది. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఈ పంచాయతీకి దశాబ్దాల చరిత్ర ఉంది. పాలకులు మారుతున్నారే తప్ప ఈ గ్రామ ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. 2500కు పైగా జనాభా ఉన్న గ్రామంలో శ్లాబ్ ఇళ్లే కాదు.. పూరి గుడిసెలు కూడా లెక్కకు మించి ఉన్నాయి. సరైన రోడ్లు లేవు.. మేజర్ డ్రెయిన్లు కాదు కదా కనీసం కచ్చా డ్రెయిన్లు కూడా లేవు. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు ఇంకా బహిరంగ ప్రదేశాలనే ఆశ్రయిస్తున్నారు. సరైన రక్షిత నీరు లేదు.. గ్రామంలో సరిగా పనిచేయని బోర్లే ప్రజలకు దిక్కు. శాసనమండలి సమావేశాలు, అధికారులతో సమీక్షలు, కార్యకర్తల సమావేశాల్లో నిత్యం తలమునకలయ్యే ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు శనివారం ‘సాక్షి’ తరపున వీఐపీ విలేకరిగా మారారు. పలుచోట్ల పర్యటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. లింగాపురం గ్రామంతా తిరిగాను..ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాను. పింఛన్లు తీసేశారని.. హౌసింగ్ పేమెంట్స్ జరగడం లేదని.. నీలం సాయం అందలేదని.. రుణ మాఫీలు జరగడం లేదని.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు లేవు.. డ్రెయిన్లు లేవు. ఈ గ్రామస్తులెదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అధికారులతో మాట్లాడతా. పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా.. -దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ నాకు పింఛన్ ఆపేశారు బాబయ్యా.. ఎలా బతకాలో అద్దం కావట్లేదు. ఆపీసర్లనడిగితే... నీకు ఐదెకరాల భూముందని పింఛన్ ఆపేశామని చెబుతున్నారు. నాకు సెంటు భూమి కూడా లేదు. ఇదెక్కడి నాయం బాబయ్యా. నాకు పింఛన్ వచ్చేలా చూడయ్యా.. నీకు పున్నెముంటాది -చిటికల శ్రీరాములు ప్రజాప్రతినిధులు గమనించాలే గానీ సమస్యలు కోకొల్లలు. వారు ప్రజలతో మాట్లాడగలిగితే... వారి కష్టసుఖాలు అర్ధం చేసుకోగలిగితే ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి. ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు శనివారం ఆ ప్రయత్నమే చేశారు. ‘సాక్షి’ తరపున వీఐపీ విలేకరిగా వ్యవహరించారు. కోటవురట్ల మండలం లింగాపురం పంచాయతీలో పర్యటించారు. ఎమ్మెల్సీ రాజు: ఏమ్మా ఎలా ఉన్నావ్? నీ పేరేంటి? ఏంటి నీ సమస్య ? అల్లూరి శేషమ్మ: నా పేరు శేషమ్మ. ఏలి ముద్ర పడడం లేదని పించేను ఆపేశారు బాబయ్యా. మొన్నటి వరకు రెండొందలొచ్చేది.. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం లేదు. ఎమ్మెల్సీ రాజు:ఆఫీసర్లనడిగావా? ఏం చెప్పారు? అల్లూరి శేషమ్మ: చాలా చార్లు అడిగాను.. నీ ఏలిముద్రలు పడడం లేదు.. మేమేమి చే యలేమంతున్నారు. కాగితం కూడా పెట్టుకున్నాను.. చూత్తామంటున్నారే తప్ప ఇవ్వడం లేదయ్యా. ఎమ్మెల్సీ రాజు:ఏందయ్యా ఎలాగున్నావ్..ఏంటీ నీ సమస్య? చిటికల శ్రీరాములు: నాకు పింఛన్ ఆపేశారు బాబయ్యా.. ఎలా బతకాలో అద్దం కావట్లేదు. ఎమ్మెల్సీ రాజు: ఎందుకాపేశారు... ఆఫీసర్లేమైనా చెప్పారా? చిటికల శ్రీరాములు: ఐదెకరాలుందంటున్నారు. భూమి ఉందని పింఛన్ ఆపేశామని చెబుతున్నారు. నాకు సెంటు భూమి కూడా లేదు. ఇదెక్కడి నాయం బాబయ్యా. నాకు పింఛన్ వచ్చేలా చూడయ్యా.. నీకు పున్నెముంటాది. ఎమ్మెల్సీ రాజు: కార్యదర్శి గారూ.. ఏంటీ పింఛన్ల పరిస్థితి? పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం: గ్రామం లో 622 పింఛన్లు ఉన్నాయ్ సార్. గ్రామ కమిటీ సిఫార్సు మేరకు 19 పింఛన్లు తొలగించారు. మరో 22 పింఛన్లను బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోక ఆపేశారు. ఎమ్మెల్సీ రాజు: వీరంతా నిరుపేదలండీ.. పింఛన్ తీసేస్తే ఎలా బతుకుతారు? సుబ్రహ్మణ్యం: తొలగించిన పింఛన్లలో అర్హుల కో సం రీసర్వే చేసి నివేదిస్తున్నాం. వేలిముద్రలు పడని వారి తరపున గ్రామ కార్యదర్శి వేలిముద్రలు తీసి పంపమన్నారు.. చేస్తున్నాం. ఎమ్మెల్సీ రాజు: ఏమయ్యా ఏం సాగు చేస్తున్నావ్? పంటల పరిస్థితి ఎలా ఉంది? సింగంపల్లి కొండ: రెండకరాల్లో చెరకు పంట వేశా.. మొన్నొచ్చిన గాలి తుపానుకి పడిపోయింది. టన్నుకు 2 వేలు కూడా రాలేదు. పెట్టుబడి కూడా దక్కలేదు. ఎమ్మెల్సీ రాజు: అధికారులెవరైనా వచ్చారా? ఎంత నష్టం జరిగిందో రాసుకున్నారా? సింగంపల్లి కొండ: రాసుకున్నారు బాబయ్యా.. నీలం తుపాను సాయం కూడా ఇంకా అందలేదయ్యా.. ఇక ఈ తుపాను సాయం ఎప్పుడొస్తుందో ఏమో మరి. ఎమ్మెల్సీ రాజు: మీరు వేసే పంటలకు గిట్టుబాటు వస్తుందా? సిద్దాబత్తుల బాబ్జి: నేను చెరకు సాగు చేస్తున్నా. టన్నుకు రూ.2,200 కూడా రావడంలేదు. పెట్టుబడి ఏకంగా రెండు వేలై పోతుంది. ఇకేం మిగులుతుందయ్యా. కనీసం టన్నుకు మూడు వేలిస్తే గానీ సరిపోదు. ఎమ్మెల్సీ రాజు: మరి వరి పరిస్థితి ఏంటి? సిద్దాబత్తుల బాబ్జి: వరేద్దామంటే నీళ్లు లేవు. తాండవ ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మాకు ఇది తప్ప మరో పని చేతకాదు. ఎమ్మెల్సీ రాజు: ఏమ్మా.. ఏం చదువుతున్నావ్? చింతల భవాని: నర్సీపట్నంలోని ఏబీఎం కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ రావడంలేదు. ఎమ్మెల్సీ రాజు: మరి స్కాలర్షిప్ వస్తుందా? చింతల భవాని: రూ.3,500లు స్కాలర్షిప్ వస్తోంది. ఆ మొత్తం కాలేజోళ్లే ఫీజుల కోసం తీసేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ రాజు: ఏమైనా రుణ మాఫీ సొమ్ములేమైనా వచ్చాయా? గజ్జలపు సూరయ్యమ్మ, వరాలమ్మ: మాది శ్రీ సాయిలక్ష్మి సంఘం. పొదుపు నెలకు యాబై రూపాయలు చేసుకుంటున్నాం. మూడులచ్చల యాబైయేలు తీసుకున్నాం. ఇంకా లచ్చ రూపాయలు కట్టాలి. ఆ బాబు చెప్పారు కదా కట్టొద్దని.. ఆర్నెల్లుగా కట్టడం మానీసేం. ఎమ్మెల్సీ రాజు: బ్యాంకోళ్లు మరి ఇప్పుడేమంటున్నారు.. గజ్జలపు సూరయ్యమ్మ, వరాలమ్మ: రుణ మాఫీ అవదంటున్నారు. బ్యాంకోళ్లు బకాయింతా ఒకేసారి కత్తేయమంటున్నారు. పైగా పొదుపు సొమ్ము తీసేసుకుంటున్నారు. అసలు పోయిం ది.. వడ్డీ పోయింది. మేం చేయలేమని ముందే చెబితే మా మానాన మేమే కట్టేవాల్లం. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎమ్మెల్సీ రాజు: సర్పంచ్ గారూ.. ఏం చేస్తున్నారు? సర్పంచ్ సుర్ల పోలమ్మ: ఏం చేత్తామయ్యా. మా పంచాయతీలో రోడ్లు లేవు.. కాలువల్లేవు. వేద్దామంటే డబ్బుల్లేవు. ఎమ్మెల్సీ రాజు: ఇలా అయితే ప్రజలకేం సమాధానం చెబుతావమ్మా? సుర్ల పోలమ్మ: మండల పరిషత్‌లో అడుగుతున్నాం.. ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఏదడిగినా డబ్బులేవంటున్నారు. -
సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు
గుంటూరు జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున సాగర్ కుడి కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి. దాంతో కాలువులోని నీరు సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది. దాంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. త్వరలో చేతికి వస్తుందనుకొన్న పంట ఇలా నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా కుడి కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.