బాబు గద్దెనెక్కాక వరుస కరువులే | Ys Jagan mohan reddy comments on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు గద్దెనెక్కాక వరుస కరువులే

Published Mon, Jan 9 2017 1:03 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

Ys Jagan mohan reddy comments on chandrababu

ప్రజలంతా బాబు దిగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నారు: వైఎస్‌ జగన్‌

రూ. 5 వేల కోట్లతో నిధి పెడతానని ఎన్నికల ముందు చంద్రబాబు కబుర్లు చెప్పారు
ఇప్పుడు మద్దతు ధర అడిగితే ఉల్లి రైతులపై కేసులు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టదా?
మోసగాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తామని అర్థమయ్యేలా చెప్పండి

Ys jagan

భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత రాష్ట్రానికి తెచ్చింది వరుసగా కరువే... కరువు. ఒకవైపు రైతులు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు బాధలు పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పుణ్యాన రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తున్నారు. వృద్ధిరేటులో దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని ఉపన్యాసాలిస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో నిధి పెడతామని మేం చెప్తే... మా కంటే ఎక్కువ చెబితే ఓట్లు వస్తాయని రూ.5 వేల కోట్లతో నిధి పెడతానని కబుర్లు చెప్పారు.

ఇవాళ ఆదుకోమని ఉల్లి రైతులు రోడ్డు ఎక్కితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలు సోనా ధాన్యం బస్తా రూ.1,200కు అమ్ముకునే పరిస్థితి. మిర్చి ధర, పంట దిగుబడి తగ్గి రైతులు రోదిస్తున్నారు. టమోటోలు రోడ్డు మీద పోస్తున్నారు. అయినా పట్టించుకోని ఇలాంటి ముఖ్యమం త్రి ఎప్పుడు దిగిపోతాడా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. రైతులను ఆదుకోకపోతే డిపాజిట్లు కూడా పోతాయనే భయం రావాలి. అప్పటివరకూ అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇలాంటి దుష్టపాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి... అడుగులో అడుగు వేయండి. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నియోజకవర్గం లో నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన వేల్పనూరు నుంచి బయలుదేరి చిన్నదేవుళా పురం, నారాయణపురం చేరుకున్నారు. అక్కడ పొలంలో మిర్చి రైతులతో ముచ్చటిం చారు. అక్కడి నుంచి సంతజూటూరు మీదు గా లింగాపురం, బీసీ పాలెంకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠపురం మీదుగా ఈర్నపాడుకు చేరుకున్నారు. నాలుగో రోజు భరోసా యాత్ర ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మొత్తం 11.30 గంటలపాటు దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే....

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది...
మనందరం రైతులం. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నవాళ్లం. రాష్ట్రంలో దాదాపుగా 65 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి... రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే కూలీలకు పనులు దొరుకుతాయి... గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ మూడేళ్లలో మీకు ఏమి మేలు జరిగిందని అడుగుతున్నా? ఆయనవల్ల మేలేమీ జరగకపోగా... ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా కరువే.. కరువు.

మూడేళ్ల కిందట చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చునేందుకు... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి... ఏ టీవీ ఆన్‌ చేసినా ఇవే మాటలు, ఏ గోడ మీద రాతలు చూసినా ఇవే రాతలు. చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు... రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను మోసం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 32 నెలలైంది... నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి చొప్పున నాకు రూ.64 వేలు బాకీ ఉన్నాడన్నా... అని మొన్న విజయనగరం యువభేరిలో ఒక యువకుడు అడిగాడు. కనీసం ఆ పిల్లాడు మాటలైనా విని చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. బుద్ధి, సిగ్గు అన్నది ఏ మాత్రం ఉన్నా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

రీయింబర్స్‌మెంట్‌ను జోక్‌గా మార్చేశారు
పేదరికం పోవాలంటే కుటుంబంనుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని పేద విద్యార్థులను ఉచితంగా చదివించేందుకు నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని ప్రతి పేద విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేవారు. ఇవాళ ఇంజనీరింగ్‌లో లక్ష రూపాయలు, మెడికల్‌ కాలేజీల్లో రూ.11 లక్షలు ఫీజులుంటే... చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగతా ఫీజు కట్టేందుకు ఇంట్లో ఉన్న ఆస్తులు, పొలాలు అమ్మాల్సి వస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అన్నది ఒక జోక్‌గా మార్చేశారు. ఇక ఇళ్ల సంగతి సరేసరి. కొత్త ఇళ్లు కాదు కదా.. గతంలో కట్టిన గోడలకు కూడా బిల్లులివ్వడంలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయలేదు. అందరినీ మోసం చేశారు. ఇలాంటి మానవత్వంలేని ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి. అడుగులో అడుగు వేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని అర్థమయ్యేలా చెప్పాలి.

కమీషన్ల కోసమే కేబినెట్‌...!
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం గా ఉంది. రబీలో పంటలు వేసిన రైతులకు వ్యవసాయ రుణాలు రూ.24 వేల కోట్లు, టర్మ్‌ రుణాల కింద మరో రూ.9,800 కోట్లు ఇవ్వాలి. కానీ కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా రు. అయినా చంద్రబాబు కేబినెట్‌ మీటింగు ల్లో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఏ రైతు నుంచి ఎంత భూమి గుంజుకుం దాం? ఎంత కమీషన్‌ తీసుకుని ఎవరికి ఇద్దామనే ఆలోచిస్తున్నారు. రైతుల రుణా లకు సంబంధించి బ్యాంకులు ఇచ్చింది పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా? అని అడుగుతున్నా. రైతుల పరిస్థి తి ఎంత దారుణంగా ఉదంటే... ఉల్లి కేజీ 2 రూపాయలకు కూడా అమ్ముకోలేక పొలంలోనే వదిలేసి వ్యవసాయాన్ని నిలిపి వేస్తున్నారు.

టమోటా, మిరప, ధాన్యం పరిస్థితి అంతే. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు సోనా బస్తా రూ.1,200కు కూడా కొనే నాథుడు దొరకడం లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నాలు చేస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. చంద్రబాబు పుణ్యా న రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి. కానీ వృద్ధిరేటులో రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని చంద్ర బాబు ఉపన్యాసాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసు కుంటే... కేవలం నలుగురంటే నలుగురికే నష్టపరిహారం ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా చనిపోతేనే మళ్లీ కొత్త పింఛను ఇస్తామంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement