raithu bharosa yatra
-
పరిపాలనకు బాబు యోగ్యుడేనా?
మూడేళ్లలో ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు: వైఎస్ జగన్ ♦ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను అత్తగారి సొత్తులా లాక్కుంటున్నారు ♦ కరువు మండలాలను పేరుకు ప్రకటిస్తున్నా మేలు సున్నా ♦ ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఏదీ? ♦ మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టించలేదు ♦ ఆరోగ్యశ్రీ, ఫీజుల పథకాలు నిర్వీర్యం ♦ వైఎస్ స్వప్నం బజారున పడే పరిస్థితి దాపురించింది ♦ కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ తొలి విడత ముగింపు రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు:‘‘రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన లెక్కలేనన్ని హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వ లేదు. పేదలకు ఒక్క ఎకరా భూమినైనా పంచలేదు. పైగా ఎస్సీ, ఎస్టీల భూములు ఆయన అత్తగారి సొత్తు అయినట్టు లాగేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు యోగ్యుడేనా?’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి, ధైర్యం చెప్పేందుకు జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మంగళ వారం ఆరో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వెంగళరెడ్డి పేట నుంచి బయలుదేరి బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదుగా మహానందికి చేరుకున్నారు. మహానందిలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం గాజులపల్లెకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో భారీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత ‘రైతు భరోసా యాత్ర’ మంగళవారం ముగిసింది. చివరి రోజు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. గాజులపల్లె బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... చంద్రబాబుతో పాటు వచ్చింది కరువే ‘‘ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనను చూసిన తర్వాత... అయ్యో ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మాకు దూరమయ్యిందే, ఆ పాలన మాకు కరువయ్యిందే అని జనం అనుకుం టున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జాడేలేదు. ఈ మూడేళ్లు చంద్రబాబుతో పాటు రాష్ట్రానికి వచ్చింది కరువు మాత్రమే. శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వాలంటే 844 అడుగులకు పైన నీళ్లు ఉండాలి. 844 అడుగులపైన ఆగస్టు 16వ తేదీ నుంచి ఉన్నాయి. అయినా ఇప్పటిదాకా సాగునీరు ఇవ్వలేకపోయారు. మనకు తెలుగుగంగకు రబీ పంటకు నీరు ఇవ్వబోమని చెబుతున్నారు. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతీ సంవత్సరమూ రబీకి నీళ్లు అందాయి. ఇప్పుడు వరుసగా మూడేళ్లపాటు రబీకి నీళ్లు ఇవ్వబోమని పాలకులు సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. కేబినెట్ భేటీల్లో దుర్మార్గపు ఆలోచనలు మంత్రివర్గ సమావేశాల్లో రైతుల కష్టాలపై చర్చించరు. పేదవాడికి జరగాల్సిన మేలు గురించి మాట్లాడరు. రైతుల భూములను ఎలా లాక్కోవాలి? లాక్కున్న భూములను పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు, సింగపూర్ కంపెనీలకు ఇచ్చి కమీషన్లు ఎలా కొల్లగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనలను కేబినెట్ భేటీల్లో చేస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో 23 లక్షల మంది పేదలకు అక్షరాలా 31.25 లక్షల ఎకరాలను పంచిపెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎస్సీ, ఎస్టీల భూములను తన అత్తగారి సొత్తులా భావిస్తున్నారు. పేదల భూములు, అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు వాటిని ఎలా లాక్కోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 31.25 లక్షల ఎకరాలను పేదలకు పంచగా, చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో ఒక్క ఎకరా కూడా ఇచ్చిన పాపానపోలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, వైఎస్సార్ హయాంలో కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీపడ్డారు. చంద్రబాబు మాత్రం మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. కుయ్.. కుయ్.. కుయ్.. ఇప్పుడేది? చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితిని గమనిస్తే మరింత బాధేస్తోంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘108’ నంబర్‌కు ఫోన్ కొడితే చాలు కుయ్... కుయ్... కుయ్.. అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ ఇంటికొచ్చేది. ఇప్పుడు అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వైఎస్సార్ హయాంలో మూగ, చెవుడుతో బాధపడుతున్న చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేదాకా రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఉచితంగా చేసేవారు. ఇవాళ మూగ, చెవుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయం అంటూ వెనక్కి పంపిస్తున్నారు. మూత్రపిండాలు ఫెయిలైన రోగులదీ, కేన్సర్ రోగులదీ అదే పరిస్థితి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వప్నం బజారున పడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో అన్నాడా? లేదా? రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడా? లేదా? డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా? లేదా? (అన్నాడని ప్రజలంతా బిగ్గరగా బదులిచ్చారు) హామీల అమలు కోసం ప్రజలంతా చంద్రబాబును గట్టిగా నిలదీయాలి. అప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమోనని ఆశిద్దాం. బాబు పచ్చి అబద్ధాలకోరు చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, తానే చేశానని అంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ముచ్చుమర్రి ప్రాజెక్టును చూశాం. వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యింది. మూడేళ్ల నుంచి మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తన కలలోకి వచ్చిందని, దాని కోసం చాలా కష్టపడ్డానని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి పాలనకు యోగ్యుడేనా అని అడుగుతున్నా. చంద్రబాబు రేపు పులివెందులకు వెళుతున్నారు. రూ.700 కోట్ల పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. చంద్రబాబు తన మనఃసాక్షిని ప్రశ్నించుకోవాలి. అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చింది? ఈ ప్రాజెక్టును ప్రారంభించింది, పనులు చేసింది దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్లి పైడిపాలెం కూడా తన కలలోకి వచ్చిందని చంద్రబాబు చెబుతారేమో! ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. అందరూ అడుగులో అడుగు వేసి, చేతిలో చేయి వేసి నాతోపాటు కలిసి నడవాలని కోరుతున్నా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో రెండోవిడత రైతు భరోసా యాత్ర ఈ నెల 19 నుంచి ప్రారంభమవనుంది. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అలాగే శ్రీ కోదండరాముల వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. – మహానంది -
ఆరో రోజూ..రైతు భరోసా యాత్ర
-
లాక్కోడానికి అవేమైనా అత్తగారి సొమ్ములా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా మహానంది మండలం గాజులపల్లిలో ఆయన మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్‌గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువే కరువని జగన్ అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ హయాంలోప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదన్నారు. కేబినెట్ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే విషయంపైనే మాట్లాడుతున్నారని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని జగన్ విమర్శించారు. 108, ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని, కాక్లియర్ ఇంప్లాట్ల కోసం మూడేసి సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడితే, చంద్రబాబు దాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని కర్నూలు వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
మహానంది : కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మంగళవారం మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన జగన్ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే. -
పసుపు పంటను పరిశీలించిన వైఎస్ జగన్
-
పసుపు పంటను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు : రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగళవారం మహానంది జిల్లా శ్రీనగరంలో పసుపు, అరటి పంటలను పరిశీలించారు. మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు, అరటి పంటకు గిట్టుబాటు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మహానంది చేరుకుంటారు. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది. -
వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్ జగన్ యాత్ర
-
వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్ జగన్ యాత్ర
కర్నూలు : జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరోరోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన మహానంది మండలం వెంగళరెడ్డి పేట నుంచి యాత్రను ప్రారంభించారు. రోడ్ షో బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదగా మహానంది చేరుకుంటుంది. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది. -
‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’
-
లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
కర్నూలు: జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆయన సోమవారం ఉదయం బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి అయిదోరోజు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌భాషా కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్ షో చేపడతారు. -
బాబు గద్దెనెక్కాక వరుస కరువులే
ప్రజలంతా బాబు దిగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నారు: వైఎస్ జగన్ ♦ రూ. 5 వేల కోట్లతో నిధి పెడతానని ఎన్నికల ముందు చంద్రబాబు కబుర్లు చెప్పారు ♦ ఇప్పుడు మద్దతు ధర అడిగితే ఉల్లి రైతులపై కేసులు ♦ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టదా? ♦ మోసగాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తామని అర్థమయ్యేలా చెప్పండి భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత రాష్ట్రానికి తెచ్చింది వరుసగా కరువే... కరువు. ఒకవైపు రైతులు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు బాధలు పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పుణ్యాన రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తున్నారు. వృద్ధిరేటులో దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని ఉపన్యాసాలిస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో నిధి పెడతామని మేం చెప్తే... మా కంటే ఎక్కువ చెబితే ఓట్లు వస్తాయని రూ.5 వేల కోట్లతో నిధి పెడతానని కబుర్లు చెప్పారు. ఇవాళ ఆదుకోమని ఉల్లి రైతులు రోడ్డు ఎక్కితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలు సోనా ధాన్యం బస్తా రూ.1,200కు అమ్ముకునే పరిస్థితి. మిర్చి ధర, పంట దిగుబడి తగ్గి రైతులు రోదిస్తున్నారు. టమోటోలు రోడ్డు మీద పోస్తున్నారు. అయినా పట్టించుకోని ఇలాంటి ముఖ్యమం త్రి ఎప్పుడు దిగిపోతాడా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. రైతులను ఆదుకోకపోతే డిపాజిట్లు కూడా పోతాయనే భయం రావాలి. అప్పటివరకూ అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇలాంటి దుష్టపాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి... అడుగులో అడుగు వేయండి. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నియోజకవర్గం లో నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన వేల్పనూరు నుంచి బయలుదేరి చిన్నదేవుళా పురం, నారాయణపురం చేరుకున్నారు. అక్కడ పొలంలో మిర్చి రైతులతో ముచ్చటిం చారు. అక్కడి నుంచి సంతజూటూరు మీదు గా లింగాపురం, బీసీ పాలెంకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠపురం మీదుగా ఈర్నపాడుకు చేరుకున్నారు. నాలుగో రోజు భరోసా యాత్ర ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మొత్తం 11.30 గంటలపాటు దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... మనందరం రైతులం. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నవాళ్లం. రాష్ట్రంలో దాదాపుగా 65 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి... రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే కూలీలకు పనులు దొరుకుతాయి... గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ మూడేళ్లలో మీకు ఏమి మేలు జరిగిందని అడుగుతున్నా? ఆయనవల్ల మేలేమీ జరగకపోగా... ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా కరువే.. కరువు. మూడేళ్ల కిందట చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చునేందుకు... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి... ఏ టీవీ ఆన్ చేసినా ఇవే మాటలు, ఏ గోడ మీద రాతలు చూసినా ఇవే రాతలు. చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు... రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను మోసం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 32 నెలలైంది... నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి చొప్పున నాకు రూ.64 వేలు బాకీ ఉన్నాడన్నా... అని మొన్న విజయనగరం యువభేరిలో ఒక యువకుడు అడిగాడు. కనీసం ఆ పిల్లాడు మాటలైనా విని చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. బుద్ధి, సిగ్గు అన్నది ఏ మాత్రం ఉన్నా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రీయింబర్స్‌మెంట్‌ను జోక్‌గా మార్చేశారు పేదరికం పోవాలంటే కుటుంబంనుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని పేద విద్యార్థులను ఉచితంగా చదివించేందుకు నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని ప్రతి పేద విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. ఇవాళ ఇంజనీరింగ్‌లో లక్ష రూపాయలు, మెడికల్ కాలేజీల్లో రూ.11 లక్షలు ఫీజులుంటే... చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగతా ఫీజు కట్టేందుకు ఇంట్లో ఉన్న ఆస్తులు, పొలాలు అమ్మాల్సి వస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఒక జోక్‌గా మార్చేశారు. ఇక ఇళ్ల సంగతి సరేసరి. కొత్త ఇళ్లు కాదు కదా.. గతంలో కట్టిన గోడలకు కూడా బిల్లులివ్వడంలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయలేదు. అందరినీ మోసం చేశారు. ఇలాంటి మానవత్వంలేని ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి. అడుగులో అడుగు వేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని అర్థమయ్యేలా చెప్పాలి. కమీషన్ల కోసమే కేబినెట్...! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం గా ఉంది. రబీలో పంటలు వేసిన రైతులకు వ్యవసాయ రుణాలు రూ.24 వేల కోట్లు, టర్మ్ రుణాల కింద మరో రూ.9,800 కోట్లు ఇవ్వాలి. కానీ కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా రు. అయినా చంద్రబాబు కేబినెట్ మీటింగు ల్లో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఏ రైతు నుంచి ఎంత భూమి గుంజుకుం దాం? ఎంత కమీషన్ తీసుకుని ఎవరికి ఇద్దామనే ఆలోచిస్తున్నారు. రైతుల రుణా లకు సంబంధించి బ్యాంకులు ఇచ్చింది పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా? అని అడుగుతున్నా. రైతుల పరిస్థి తి ఎంత దారుణంగా ఉదంటే... ఉల్లి కేజీ 2 రూపాయలకు కూడా అమ్ముకోలేక పొలంలోనే వదిలేసి వ్యవసాయాన్ని నిలిపి వేస్తున్నారు. టమోటా, మిరప, ధాన్యం పరిస్థితి అంతే. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు సోనా బస్తా రూ.1,200కు కూడా కొనే నాథుడు దొరకడం లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నాలు చేస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. చంద్రబాబు పుణ్యా న రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి. కానీ వృద్ధిరేటులో రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని చంద్ర బాబు ఉపన్యాసాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసు కుంటే... కేవలం నలుగురంటే నలుగురికే నష్టపరిహారం ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా చనిపోతేనే మళ్లీ కొత్త పింఛను ఇస్తామంటున్నారు. -
ఆయనొచ్చాక మూడేళ్లుగా కరువే కరువు
-
మూడేళ్లుగా కరువే కరువు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా లింగాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి, గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి వస్తుంది చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా ఆయనవల్ల మేలు జరగకపోగా వరుసగా ఇప్పటికి మూడేళ్లు కరువే కరువు చంద్రబాబు సీఎం అవ్వడం కోసం ఆ రోజుల్లో.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతులను వదల్లేదు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్లనూ వదల్లేదు ఏ గోడమీద రాతలు చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చెప్పేవారు డ్వాక్రా సంఘాల అప్పులన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేవారు రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చదువుకున్న పిల్లలను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యి 32 నెలలైంది.. ఆయన నాకు 64వేలు బాకీ అని ఓ యువకుడు అడిగారు తాను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశాం రబీ పంటలు వేశాం. కానీ రైతులు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నారు పంట రుణాలు 24వేల కోట్లు, టెర్మ లోన్స్ మరో 9800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు చంద్రబాబు పుణ్యమాని కేవలం 4900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు మరి ఈ ముఖ్యమంత్రి బ్యాంకులను నిలదీయాల్సింది పోయి, క్యాబినెట్ మీటింగులో రైతుల గురించి మాట్లాడలేదు బయటకొచ్చాక బ్యాంకులిచ్చింది సంతృప్తికరంగా ఉందని చెప్పారు ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నా రైతులు ఉల్లిపంట వేసి.. కిలో 2 రూపాయలు కూడా గిట్టక పొలంలోనే వదిలేశారు గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నా చేస్తుంటే వాళ్లమీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు ఉల్లి, టమోటా, మిర్చి, చివరకు ధాన్యం పరిస్థితి కూడా అంతే కర్నూలు సోనా అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం కానీ ఆ ధాన్యం బస్తా 1250-1300 కూడా కొనే నాథుడు దొరకడం లేదు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి రైతులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు రాష్ట్రం జీడీపీ గ్రోత్రేటులో దేశం కన్నా ముందు పరిగెడుతోందని చెబుతారు ఈ పాలనను సాగనంపేందుకు మీ అందరూ చేయి చేయి కలపాలి అడుగులో అడుగు వేయాలి.. చంద్రబాబు లాంటి మోసకారులు, అబద్ధాలు ఆడేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తుందని అర్థం కావాలి అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నా -
దిగులు గుండెకు..ఆత్మీయ అండ
-
వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్.. బోయరేవులు చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బ్యాంకులో రూ. 30వేలు అప్పు చేసిన చాకలి వెంకటేశ్వర్లు.. ప్రైవేటుగా వడ్డీ వ్యాపారి వద్ద రూ. మూడు లక్షల 70వేలు అప్పు చేశారు. పంట చేతికి అందకపోవడం, ఈ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆయన తనువు చాలించారు. రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా లింగాపురం చేరుకుంటారు. -
వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
కర్నూలు : జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ఈ యాత్ర మూడోరోజుకు చేరింది. ఆయన ఈ సందర్భంగా వేల్పనూరులో మాట్లాడుతూ రైతులు, నిరుద్యోగులు, మహిళలను చంద్రబాబు నాయుడు మోసగించారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు రుణమాఫీ మాటే మరిచిపోయారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇక బుడ్డా శేషారెడ్డి కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. బుడ్డా శేషారెడ్డికి అన్నివిధాలుగా అండగా ఉంటా. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. (కాగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కర్నూలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.) -
వేల్పనూరు నుంచి మూడోరోజు రైతు భరోసా యాత్ర
కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది. వైఎస్ జగన్ ఈరోజు ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. గ్రామం నుంచి రోడ్ షో గా అబ్దుల్లాపురం, వెలుగోడు మీదగా బోయరేవులు చేరుకుంటారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా రోడ్ షో లింగాపురం చేరుకుంటుంది. -
40 మంది మరణిస్తే.. నలుగురికే పరిహారమా?
కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం నలుగురికి మాత్రమే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రైతు భరోసా యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చి, అందులో భాగంగా ఆత్మకూరుకు వచ్చి మీ అందరి ప్రేమాభిమానాల మధ్య నిలుచున్నా ఇదే కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇంతవరకు కర్నూలు జిల్లాలో ఎంతమందికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా కేవలం నలుగురికి మాత్రమే ఆ ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు, రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి లేదు రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీలలో చెప్పేవారు, గోడల మీద రాసేవారు రైతన్నలను మోసం చేశారు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా మోసం చేశాడు చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్నికలయ్యాయి.. చంద్రబాబు సీఎం జాబ్ తీసుకుని కుర్చీలో కూర్చున్నారు రైతన్నల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయా? రైతులను, పిల్లలను కూడా చంద్రబాబు మోసం చేశారు చంద్రబాబు చెప్పారు కాబట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు కట్టలేదు రైతులకు ఇంతకుముందు లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ మాత్రమే పడేది లక్ష నుంచి మూడు లక్షల వరకు కేవలం పావలా వడ్డీ పడేది ఇప్పుడు బ్యాంకులు రైతుల నుంచి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నాయి ఈవాళ రైతులు రుణాలు కట్టకుండా పోయినందుకు రుణాలు రెన్యువల్ కాలేదు, ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేదు రబీ లెక్కలు చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులన్నీ కలిపి రైతులకు 24వేల కోట్ల పంట రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, 9800 కోట్ల టెర్మ్ లోన్స్ ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇచ్చింది కేవలం 4900 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు బ్యాంకుల దగ్గరకు రైతులు వెళ్లే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు దొరక్క రబీ వేసుకోడానికి దిక్కులేక బయట 2, 3 రూపాయల వడ్డీకి తీసుకుంటున్నారు రబీ మొత్తానికి 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ ఈసారి వేసింది కేవలం 11.9 లక్షల హెక్టార్లు మాత్రమే అంటే 48 శాతం కూడా పంటలు వేయలేకపోయారు ఇంతటి దారుణంగా రైతులు బతుకుతుంటే, చంద్రబాబు కేబినెట్ మీటింగులలో రైతులకు ఏం చేయాలో పట్టించుకోరు, పేదలు ఎలా ఉన్నాడో పట్టించుకోరు ఆరోగ్యశ్రీ పథకం విఫలమై నెలల తరబడి నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు కట్టక ఆ పథకం నీరసించిపోయింది డయాలసిస్ చేయించుకోవాల్సిన పేషెంట్లను ఏడాది తర్వాత రమ్మని ఆస్పత్రులు చెబుతున్నాయి చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జోక్‌గా తయారుచేశారు పేదలు అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఆ పేదల కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి ఆలోచన చేశారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు లక్షకుపైగా ఉన్నాయి. మెడికల్ కాలేజిలో ఏడాదికి 11 లక్షలు చెబుతున్నారు. కానీ వీళ్లిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ముష్టి 35 వేలు ఆ రోజుల్లో వైఎస్ అయితే ప్రతి పైసా పూర్తిగా ఇచ్చేవారు కేబినెట్ సమావేశాల్లో కూర్చున్నప్పుడు రైతులకు, పేదలకు ఏం చేస్తున్నారో చంద్రబాబు ఆలోచించరు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు తోడుగా నిలబడ్డారు కేబినెట్ మీటింగులో చంద్రబాబు రైతుల నుంచి భూములు ఎలా లాక్కోవాలి, వాటిని కమీషన్లు తీసుకుని ఎవరికి అమ్మాలని మాత్రమే ఆలోచిస్తున్నారు నిన్న శ్రీశైలం డ్యాం ఇంజనీర్లను.. డ్యాంలో 844 అడుగుల పైన ఎన్నిరోజులున్నాయని అడిగా ఆగస్టు 16 నుంచి 844 పైనే ఉన్నాయని వాళ్లు చెప్పారు. కానీ వాటి నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు ఏ ప్రాజెక్టు చూసినా సగంలోనే ఆగిపోయాయి గాలేరు-నగరి, కేసీ కెనాల్ మరమ్మతులు అన్నీ సగంలోనే ఆగాయి రైతు భరోసా యాత్ర చేస్తే.. రైతులు ఎలా బతుకుతున్నారో తెలుస్తోంది ఇదే కర్నూలు జిల్లాలో ఉల్లి కిలో 2 రూపాయలకు అమ్మలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు టమోటా కిలో 2 రూపాయలకు అమ్ముకోలేక వదిలేస్తున్న దుస్థితి కర్నూలు జిల్లాలోనే ఉంది మిరప పంటకు 7వేల ధర పలుకుతోందని, అది పెట్టుబడులకు కూడా చాలదని రైతులు వాపోతున్నారు రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు రైతులు పడుతున్న బాధలు అర్థం కావాలని ప్రయత్నిస్తున్నా ఈవాళ ఇదే చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి రావాలంటే ఆయన గాజు మేడల నుంచి బయటకొచ్చి, సామాన్యులతో తిరిగితే ఆయనను రాళ్లతో కొడతారని అర్థమవుతుంది ఇదే చంద్రబాబుకు ఒక్క విషయం గట్టిగా చెబుతాను ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు డబ్బుల ఆశ చూపించి కొనుగోలు చేశారు ఇదే జిల్లా నుంచి ఐదుగురిని కొనుగోలు చేశారు చంద్రబాబు గారూ, రేపు మీరు గెలవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొంటే చాలదు.. ప్రతి పేదవాడికి మంచి చేస్తే, ప్రతి పేదవాడి ఇంట్లో నీ ఫొటో ఉండేలా చేసుకో, అప్పుడు గెలుస్తావని చెబుతున్నా చంద్రబాబు నాయుడి నైజం ఈవాళ ఎంత డబ్బు సంపాదించాం, ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం, రాజకీయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించాం అని చూస్తున్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పేవారు అలాంటి గొప్ప నాయకుడు పాలించిన ఆంధ్ర రాష్ట్రంలో ఈవాళ ఇలాంటి దిక్కుమాలిన నాయకుడు పాలిస్తున్నాడు రైతుల కష్టాలు చంద్రబాబుకు రాబోయే రోజుల్లో మరింత అర్థమయ్యేలా రైతన్నలతోనే చెప్పిస్తాం రుణమాఫీలో రైతులు, డ్వాక్రా మహిళలు ఎంత నష్టపోయారో, ఎంత మోసపోయారో చెప్పిస్తాం చదువుకున్న ప్రతి పిల్లవాడి చేతికి మైకిచ్చి, ఎన్నికలకు ముందు, తర్వాత చంద్రబాబు ఏమన్నారో చెప్పిస్తాం మనమంతా ఒక్కతాటిమీద నిలబడి చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి, పేరు పేరునా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా మీ అందరి చల్లని ఆశీస్సులకు పేరుపేరునా కృతజ్ఞతలు -
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
-
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
దోర్నాల: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయ్యాక...రాష్ట్రంలో వరుసగా కరువులొచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ నిధులు ఏ మూలకు చాలవని, ఆ నిధులతో ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. హెడ్ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకూ ప్రారంభించనే లేదని, రైతులపై కాకుండా చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందని, డబ్బు...డబ్బు...డబ్బు... తప్ప చంద్రబాబుకు ఏమీ అవసరం లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మూడేళ్ల పాలన పూర్తయిందని, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, అ తర్వాత కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారు రాజీనామా చేయాలని లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లాక్కోవడం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ 42 లక్షల ఇళ్లు నిర్మిస్తే...చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అలాగే వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాలని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని ఆయన కోరారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. -
4నుంచి వైఎస్ జగన్ రైతుభరోసా యాత్ర
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో భరోసా నింపడమే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు పూర్తిగా సాగు సంక్షోభంలో ముగినిపోయాయని, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో వృద్ధి రేటు బాగుందని చెప్పి కేంద్ర నిధులు కూడా రాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకంతో వ్యవసాయ రంగం కుదేలవుతోందని నాగిరెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ పథకం పనులను వైస్ రాజశేఖరరెడ్డే తొంభై శాతం పనులు పూర్తి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. -
4నుంచి వైఎస్ జగన్ రైతుభరోసా యాత్ర
-
అబద్ధాలతోనే నడుస్తున్న ప్రభుత్వం
రైతు భరోసాయాత్రలో బాబుపై మండిపడ్డ వైఎస్ జగన్ సాక్షి, కడప: ‘‘ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడచూసినా ప్రచారం కోసం పాకులాడటం.. తర్వాత మాట తప్పడం ఆయనకు నైజంగా మారింది. ముఖ్యమంత్రిగా అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దకుడాల, తాటిమాకులపల్లె, ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి తదితర గ్రామాల్లో మహిళలు, వృద్ధులు పింఛన్లతోపాటు డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలుచేయలేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు పంట రుణాలు కూడా సక్రమంగా మాఫీ చేయలేదనడంతో ఘాటుగా స్పందించారు. రుణమాఫీ, డ్వాక్రామాఫీ జరగలేదని.. చివరకు పండుటాకులకు అందించే పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు కావాల్సినంత దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఉన్నారు. రెండు కుటుంబాలకు పరామర్శ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక.. ఉన్న పొలాలను అమ్ముతున్నా అప్పులు తీరక.. మానసిక వేదనతో బలవన్మరణం చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. ముందుగా లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామానికి వెళ్లి రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను , అనంతరం చక్రాయపేట మండలంలోని ముద్దప్పగారిపల్లెకు చెందిన రైతు శుద్ధమల్ల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. -
చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ దాడులు'
అనంతపురం: టీడీపీ దాడులపై ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ దాడుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ధర్నా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో నేడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైఎస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు. చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. -
చంద్రబాబుకు చెప్పులు కాదు చీపుర్లు చూపించండి
అనంతపురం: ప్రజలను మోసం చేస్తున్న, అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు ఆదివారం ఓబులదేవరచెర్వులో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మోసం చేసినా, జేబులు కొట్టినా 420 కేసులు పెడతారని, మోసం చేసి సీఎం పదవిలో కూర్చున్న చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలని ప్రశ్నించారు. 'మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయకూడదట, అడగకూడదట. ఆయన మాత్రం మోసం చేయొచ్చంట. ఏమైనా చేయొచ్చంట. అలాంటి వ్యక్తికి జ్ఞానోదయం కావాలంటే ఏం చేయాలి? చంద్రబాబుకు చెప్పులు చూపించడం ఇష్టంలేదట. ఈ సారి చెప్పులు కాదు.. చీపుర్లు చూపించండి. చంద్రబాబు సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపేవరకు ఉద్యమిద్దాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలి' అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంజాద్ బాషా, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. -
రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల కుయుక్తులను ప్రజలు ఖాతరు చేయడం లేదు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. ప్రతీ పల్లెలో వైఎస్ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ నాయకుల పన్నాగం పారకపోవడంతో కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్ర ఐదో రోజు కదిరి నుంచి ప్రారంభమైంది. -
వైఎస్ పట్టా ఇచ్చారు.. బాబు భూమి లాక్కున్నారు
వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా, కారుచౌకగా తమ భూములను లాక్కొందని తమ పరిస్థితి ఏంటంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే... వైఎస్ చేతుల మీదుగా పట్టా తీసుకున్నా మాకు 15 ఎకరాలు ఉంది. నలుగురు అన్నదమ్ములున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎకరాల చొప్పున భూమి వచ్చింది. 50 సంవత్సరాల నుంచి మా మామగారి కాలం నుంచి ఈ భూముల్లో సాగు చేస్తున్నాం. ఈ భూములకు సంబంధించి పత్రాలు, పన్నులు చెల్లించిన పేపర్లు ఉన్నాయి. అప్పులు చేసుకుని బోర్లు వేశాం, కరెంట్ వేశాం. దివంగత వైఎస్ఆర్ కాలంలో మాకు పట్టాలు ఇచ్చారు. వైఎస్ఆర్ నుంచి నేనే స్వయంగా పట్టా తీసుకున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు పంటలు పండుతాయి. మాకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం తీసేసుకున్నారు. మేం ఇవ్వమన్నా అధికారులు నోటీసులు పంపుతున్నారు. సోలార్ ప్రాజెక్టులో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. సెంటు భూమి లేదు. మేం ఎట్లా బతికేది? పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదు. అడిగితే ఇస్తామని సంవత్సరం నుంచి చెబుతున్నారు. చంద్రబాబు గారు దయచేసి మా కన్నీళ్లు తుడవండి, మా పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. -అమ్మాజాన్ పరిహారం కూడా ఇవ్వలేదు నాకు నాలుగు ఎకరాలు సాగుభూమి ఉంది. ఇవ్వనన్నా భూములను బలవంతంగా లాక్కున్నారు. వరి, వేరుశెనగ పంటలు పండిస్తాం. బోరు, పైపులైన్లు ఉన్నాయి. మాకు ఈ భూమే ఆదరవు. ఇది తప్ప వేరే ఏమీ లేవు. మా భూము లాక్కొని మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారు. తక్కువ ధరలకు భూములు తీసుకున్నారు. పరిహారం కూడా ఇవ్వలేదు. మేం బతికేది ఎట్లా? -హైదర్ అలీ మామిడిచెట్లకు పరిహారం ఇవ్వరట మా నాయన 10 ఎకరాలు సంపాదించాడు. కేరళ, ముంబై వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఐదు బోర్లు వేసుకున్నాం. బోర్లు ఉన్నాయి. నీళ్లు వస్తున్నాయి. మామిడి చెట్లు పెంచాం. పంటకు వస్తున్నాయి. బోర్లకు డబ్బులు ఇస్తామన్నారు. మామిడి చెట్లకు ఇవ్వమని చెప్పారు. ఇష్టంలేకున్నా భూములు తీసుకున్నారు. నోటీసులు ఇచ్చారు. కానీ పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పడు నా పరిస్థితి ఏమిటి? -బాబు జాన్ -
నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా?
రాయలసీమలో సాగునీటి వసతి ఉండి.. పంటలు పండటమే కష్టమని, అలాంటిది కాస్తో కూస్తో నీటి వసతి ఉండి.. పంటలు పండే భూములనే సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు భరోసాయత్రలో భాగంగా నాలుగో రోజు ఆయన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పీ కుంట గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఇలా భూములు లాక్కున్నా.. కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇక్కడివాళ్లకు సోలార్ పవర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇవ్వలేదేమని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... సోలార్ ప్లాంటు పెట్టడం కోసం భారీ మొత్తంలో భూములను ఎన్టీపీసీకి ప్రభుత్వం ధారాదత్తం చేసింది. 7500 ఎకరాల్లో 750 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు పెడతామని, ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు సోలార్ పవర్ ప్రాజెక్టు ఇక్కడే ఉంటే.. ఇక్కడివాళ్లకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? అలాంటప్పుడు ప్రాజెక్టుకు భూములు ఎందుకు ఇవ్వాలి ఆ భూములకు ఒకవైపు పెద్దపల్లి రిజర్వాయర్, మరోవైపు వెలిగొండ రిజర్వాయర్ ఉన్నాయి. భూమి మధ్యలో నుంచి హంద్రీనీవా కాలువ పోతూ ఉంటుంది సీమలో పంటలు పండని పరిస్థితిలో.. కాస్తో కూస్తో పండే భూములే అవి అక్కడే ఆ భూములే ఇవ్వడంలో అర్థమేముంది ప్రభుత్వానికి రవ్వంతైనా తెలివి ఉందా ఈ భూముల్లో దాదాపు 2220 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్నాయి వీటిని భూములు లేని పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు పేదవాడి భూములంటే చంద్రబాబు ఆయన అత్తగారి సొత్తనుకుంటారు 153 ఎకరాల పట్టాభూమికి రూ. 3.25 లక్షలు ఇస్తారు ఎసైన్డ్ భూములకు కేవలం రూ. 2.10 లక్షలు ఇస్తే సరిపోతుందంటారు పేదవాళ్లంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం.. వాళ్ల భూములు భూములు కావా పేదలు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ ఇవ్వాలి లేదా సమానంగానైనా ఇవ్వాలి 1250 ఎకరాలను సాగుదారు రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నారు వాటికి పన్నులు కడుతున్నారు, బోర్లు వేశారు, కరెంటు బిల్లులు కడుతున్నారు వాళ్ల పేరుతో పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి నీళ్లున్నచోట సోలార్ ప్రాజెక్టు పెట్టడం ఏంటి వీళ్లకు ఆ లక్ష రూపాయలలో రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు సర్వేలు, నోటీసులు అంటారు.. ఇంకొకటి అంటారు గానీ పరిహారం మాత్రం ఇవ్వరు ఎన్టీపీసీ వాళ్లు భూమలు మొత్తాన్ని చదును చేసేసి.. అక్కడ సోలార్ ప్యానళ్లు కూడా పెట్టేశారు ఇప్పుడు పక్క రైతులు ఆ భూములు మీవేనని చెబితే పరిహారం ఇస్తామంటారు చంద్రబాబుకు ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అని అడుగుతున్నా అసైన్డ్ భూములు కొనుక్కున్న , సాగుదారు రైతుల తరఫున అడుగుతున్నా ఇచ్చే 3.25 లక్షలే తక్కువ.. కనీసం దాన్నే అందరికీ అయినా వర్తింపజేయాలి రైతుల తరఫున పోరాడతాం, వారికి తోడుగా, బాసటగా ఉంటాం అనంతరం ఎన్పీ కుంటలో సోలార్ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన వైఎస్ జగన్ ను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. -
కదిరి నుంచి ప్రారంభమైన జగన్ రైతు భరోసా యాత్ర
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజు శనివారం ఉదయం కదిరిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి ఎన్పీ కుంట దిశగా సాగిపోయారు. ఎన్పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో జగన్ సమావేశం కానున్నారు. -
యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. బస్టాండ్ సెంటర్లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు. -
తాడిపత్రిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం పెద్ద ఒడుగూరు మండలం పెద్దమేడిమాకులపల్లి నుంచి ఆయన రోడ్డు షో ప్రారంభమైంది. లక్ష్మింపల్లిలో ప్రజలు తమ అభిమాన నేత జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ వారికి అభివాదం చేశారు. అనంతరం జగన్ కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి యాడికి మండలం నగురూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. -
ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
-
ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం ముగిసింది. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటించారు. మొత్తం 28 మంది, రైతు చేనేత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో గ్రామాగ్రామాన వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. -
రామాంజనేయులు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
ఆరో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
-
ఆరో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆర్డీటీ గెస్ట్‌హౌస్ నుంచి వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. సిండికేట్ నగర్, రాచానపల్లిలో వైఎస్ జగన్‌కు అక్కడి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తొలుత కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆ తరువాత కోనాపురం గ్రామంలో రైతు నరేంద్ర కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. అనంతరం పాతపాలెంలో రైతు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
ఐదోరోజు రైతు భరోసా యాత్ర
-
మారుతి ప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
అనంతలో ఐదవ రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
అనంతలో ఐదవ రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. -
వైఎస్ జగన్ మూడో రోజు రైతు భరోసా యాత్ర
-
చంద్రబాబూ ఇదేం దగా..?
-
చంద్రబాబూ ఇదేం దగా..?
రైతు భరోసా యాత్రలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం.. * అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి * అవ్వా తాతల జీవితాలతోనూ ఆడుకున్నారు * బాబు సీఎం అయ్యారు కానీ నిరుద్యోగులకు జాబు రాలేదు * ఆయన వచ్చాక ధర్మవరంలోనే 16 మంది చేనేతల ఆత్మహత్య * ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయమైతే మేలు రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా మోసం, దగాలతో కొనసాగుతోంది. ఎన్నికల తరువాత ఈ 20 నెలలుగా ఆయన రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, చేనేతలు, చదువుకునే పిల్లలు, చివరకు అవ్వా తాతలను సైతం వద లకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు.’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, ఆయన అందరినీ మోసం చేశారనే సత్యం ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన నాల్గో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం కూడా ధర్మవరంలో కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు ఎదురుగా చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. గంటకు పైగా చేనేతలతో గడిపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ‘చేనేత కార్మికులకు చంద్రబాబు చేసింది సున్నా... వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం చేసిందే లేదు. ఎవరి జీవితాలూ బాగోలేవు. అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత పడుతున్న కష్టాలేమిటనేది చేనేతలను చూస్తే అర్థమౌతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలోనే 16 మంది ఆత్మహత్య చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఇలా జరిగి ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు చేనేత కార్మికులు తమ బాధలను వివరించినపుడు జగన్ స్పందిస్తూ..‘చంద్రబాబుకు అర్థమయ్యే విధంగా సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి చెప్పగలిగాం. ఆయనలో మార్పు వచ్చి మంచి చేస్తాడని ఆశిద్దాం. మార్పు రాని పక్షంలో దేవుడు కచ్చితంగా ఆయనకు మొట్టికాయలు వేస్తాడు. ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుందని కూడా చెబుతున్నా. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మన పరిపాలన వచ్చే రోజులు వస్తాయ’ని అన్నారు. మోసం చేసే క్రమంలో బాబు వయోవృద్ధులైన అవ్వాతాతలను కూడా వదలలేదని, పింఛన్లు తక్కువ మందికిచ్చి ఎక్కువ మందికి కత్తిరించేశారని విమర్శించారు. రేషన్ బియ్యం ఇవ్వాలని అవ్వాతాతలు అడిగితే ‘మీ వేలి ముద్రలు మిషన్‌లో సరిగ్గా పడ్డంలేదు’ అంటూ బియ్యాన్ని కూడా కట్ చేశారన్నారు. ‘ఎన్నికల ముందు ఏ హామీలిచ్చాను.. ఇపుడు పరిపాలన ఎలా చేస్తున్నాను.. అనేది చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని తనను తాను ప్రశ్నించుకోవాలి’ అని జగన్ సూచించారు. ఇకనైనా బాబుకు జ్ఞానోదయం కావాలి చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇళ్లకు తాము వెళ్లినప్పుడు ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయలేదనే విషయం తెలిసిందన్నారు. ఒక్కరికంటే ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. చేనేతలకు ఒక్క ఇంటిని కానీ, ఒక్క షెడ్డును కానీ నిర్మించి ఇవ్వలేదన్నారు. వారందరికీ ‘ఆర్టిసాన్కార్డు’ ఉన్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా రుణాలివ్వలేదని తెలిపారు. ఈ ఇబ్బందులను చంద్రబాబుకు గట్టిగా వినిపించే విధంగా ఇక్కడి నుంచి మాట్లాడాలని చేనేతలను జగన్ కోరారు. మీరు పడుతున్న కష్టాల గురించి మీరే చెప్పండి అంటూ చేనేతలను ఆయన స్టేజీ మీదకు ఆహ్వానించారు. వీటిని విన్న తర్వాత నైనా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావాలని జగన్ ఆకాంక్షించారు. ఐదు కుటుంబాలకు పరామర్శ ధర్మవరం: ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా మన సర్కారు రాగానే అందరి సమస్యలూ తీరుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు, చేనేత భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం ధర్మవరంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలొచ్చాయని కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవించాలని, త్వరలో మంచిరోజులు రానున్నాయని ధైర్యం చెప్పారు. బాబు ఆ హామీలు ఇచ్చారా.. లేదా? ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, గోడ మీద రాతలు, అడ్వర్టయిజ్మెంట్లు చూసినా, చంద్రబాబు ప్రసంగాలు విన్నా ఒకటే హామీల వర్షం కురిసేది. ఏ గ్రామానికి వెళ్లినా ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి మరీ రాసిన రాతలు మనం చూశాం. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. గట్టిగా రెండు చేతులెత్తి చెప్పండి. చంద్రబాబు ఆ హామీలు ఇచ్చారా..లేదా? రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేవా...కాదా? చెప్పండి (ప్రజలంతా చేతులు పెకైత్తి... అవును, అవును అంటూ ప్రతి స్పందించారు). ఏ టీవీ ఆన్ చేసినా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ప్రకటనలు వినిపించాయా...లేవా? జాబు కావాలంటే బాబు రావాలని అన్నారా లేదా? ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారా.. లేదా? చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.. అవునా? కాదా? చేనేతలందరికీ లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారా..లేదా? ప్రతి చేనేత కార్మికునికి ఒక ఇల్లు, ఒక షెడ్డు కట్టిస్తానన్నారు.. అవునా? కాదా? (అని జగన్ ప్రశ్నించినప్పుడు చేనేత కార్మికుల నుంచి అవును..అవును అనే సమాధానం వచ్చింది.) మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా..వీటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా’ అని జగన్ మళ్లీ ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల నుంచి లేదు..లేదు..అంటూ గట్టిగా కేకలు వినిపించాయి. -
వైఎస్ జగన్‌ను కలిసిన చేనేత సంఘం నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం చేనేత సంఘం నేతలు కలిశారు. చేనేత రంగాన్ని పరిరక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే చేనేతలకు రుణమాఫీ వర్తించే చేయాలని, ముడి సరుకులు 50 శాతం సబ్సిడీకి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ధర్మవరంలో పవర్లుమ్స్ ఉత్పత్తులను నియంత్రించాలని చేనేత సంఘం నేతలు కోరారు. కాగా చేనేత కార్మికుడు మల్లికార్జున కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం శాంతినగర్‌లో చేనేత కార్మికురాలు లక్ష్మీదేవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డిపెట్టండి
-
బంగారం వేలం వేసేశారు
-
వడ్డీలకు వడ్డీలు కడుతున్నాం
-
'జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు'
-
'మీటింగుకు వెళ్తే కార్డులు కట్'
-
'జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు'
అన్నదాతలు, చేనేత కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటలు ఆడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రెండోరోజు రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన ధర్మవరంలో గురువారం మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో జరుగుతున్న పాలన, ఎన్నికలకు ముందు బాబు చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఆయన రైతులను, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చేనేతలను, పిల్లలను వదలకుండా అన్ని వర్గాలను మోసం చేశారో అందరికీ కనిపిస్తున్న సత్యం ఎన్నికలు జరిగేరోజున ఏ టీవీ ఆన్ చేసినా, చంద్రబాబు చేసిన ప్రసంగాలు వినిపించేవి. ప్రకటనలు కనిపించేవి. ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి ప్రకటించేవాళ్లు బ్యాంకులో బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలనేవాళ్లు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పేవారు జాబు కావాలంటే బాబు సీఎం కావాలని చెప్పేవాళ్లు తర్వాత తాను సీఎం అయ్యారు. ఆ తర్వాత ఈవాళ పరిస్థితి చూస్తున్నాం ఉన్నజాబులు ఊడబీకుతున్నారు రెండువేల నిరుద్యోగ భృతి ఏమైనా వస్తోందా? ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం, గుడిసెలు లేకుండా చేస్తాం అన్నారు మీ అందరికీ కనీసం ఒక్క ఇల్లయినా కట్టించారా? చివరకు అన్నదాతలను కూడా వదల్లేదు పెన్షన్లు ఇస్తామన్నారు.. ఇచ్చేది కొద్దిమందికి, కత్తిరించేది ఎక్కువమందికి అయిపోయింది అన్నదాతల జీవితాలతో ఆయన ఎలా చెలగాటం ఆడుతున్నారంటే.. బియ్యం కూడా కటింగ్ చేస్తున్నారు బాబు పరిపాలన అంతా మోసం, దగాగా ఉంది చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తామని, ప్రతి కార్మికుడికీ ఇల్లు, షెడ్ కట్టిస్తామని చెప్పారు ఒక్కరికి కూడా కట్టించిన పాపాన పోలేదు ప్రతి చేనేత కుటుంబానికి లక్షన్నర వడ్డీ లేకుండా ఇస్తామన్నారు రుణాలు మాఫీ చేస్తామన్నారు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదు, కొత్త రుణాలు రాలేదు సీఎం చంద్రబాబు అయిన ఈ 20 నెలల్లో ఇదే ధర్మవరంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు బహుశా దేశచరిత్రలోనే ఎక్కడా ఇలా జరిగి ఉండదు వాళ్ల కుటుంబాలకు చేసింది సున్నా.. రూపాయి ఇవ్వలేదు, రుణాలు మాఫీ చేయలేదు ఒక్క బ్యాంకు కూడా వాళ్లకు రుణాలు ఇవ్వలేదు అందరి బతుకుల్లో బాధలే కనిపిస్తున్నాయి కందిపప్పు కిలో 150-180 వరకు ఉంటోంది.. ఏం కొనేట్టు లేవు, తినేట్టు లేవు ఇంటికి పోతే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి, బజారుకు పోతే కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగి, ఇప్పటికైనా వీళ్లకు అండగా నిలవాలి ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఈవాళ పరిపాలన ఏం చేస్తున్నారో గుండెల మీద చేతులు వేసుకుని తనను తాను పరిశీలించుకోవాలి లేకపోతే చంద్రబాబు పురుగులు పడిపోతాడని చెబుతున్నా మన బాధలేంటో చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగాం ఇప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.. మార్పు రాకపోతే దేవుడు ఉతికి ఆరేస్తాడు, బంగాళాఖాతంలో ముంచేస్తాడు మన పాలన వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డిపెట్టండి మీటింగుకు వెళ్తే కార్డులు కట్ జగన్ సమావేశానికి వెళ్తే బియ్యం కార్డులు తీసేస్తామని బెదిరిస్తున్నారు. రావాలని చాలామందికి ఉన్నా, ఇలా బెదిరించడంతో రాలేకపోతున్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, పింఛన్లు ఇవ్వడం లేదు. బ్యాంకులకు పోతే జగన్ పార్టీ వైపు వెళ్తున్నావని రుణాలు కూడా ఇవ్వట్లేదు. 600 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణం కాదు కదా.. వడ్డీలకు వడ్డీలు పెంచి బ్యాంకులో రుణాలు ఎక్కువ కట్టించుకున్నారు. చంద్రబాబు చెప్పారు గానీ, అవి తమవరకు రాలేదని, అందువల్ల మొత్తం వడ్డీ కట్టాల్సిందేనని బలవంతపెడుతున్నారు. ఆ వడ్డీలు కట్టలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -చేనేత కార్మికురాలు వడ్డీలకు వడ్డీలు కడుతున్నాం నేను చేనేత కార్మికురాలిని, డ్వాక్రా గ్రూపులో కూడా లేవు. ఇంతకుముందు పావలావడ్డీ పడేది. 70 వేల రూపాయల రుణం ఉంది. దానికి వడ్డీకి వడ్డీలు కడుతూనే ఉన్నాం గానీ, మాఫీ మాట లేనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరికీ దరిద్రం పట్టుకుంది. బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వడం లేదు. మనిషికి 3 వేలు ఇచ్చేవాళ్లు, ఇప్పుడు అవి కూడా మా సంఘానికి పడలేదు. ఇన్నాళ్లబట్టి ఎవరికీ చెప్పలేక ఊరికే ఉన్నాం. ముడిసరుకుల రేటు ఇంతకుముందు కంటే పెరిగింది. 3,500 వరకు పెట్టాల్సి వస్తోంది. ఒక మగ్గానికి 50 వేల పెట్టుబడి అవుతుంది. ఇంత పెట్టి చీరలు నేస్తే, ఎక్కువ ధరలకు కొనేవాళ్లు లేరు. చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం. రైతులతో పాటు చేనేత కార్మికులదీ ఇదే పరిస్థితి. -మీనాక్షి, మరో నేత కార్మికురాలు బంగారం వేలం వేసేశారు ఆర్టిజాన్ కార్డు ఉన్నా, బంగారం కుదువపెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాను. కానీ రుణమాఫీతో ఆ బంగారం బయటకు రాకపోగా.. వేలం వేసేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. వేలం పోగా, నేనే ఇంకా వడ్డీ బాకీ ఉన్నానని.. అది కట్టాలని బ్యాంకు వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చేనేత లోన్ పెట్టుకుంటే 20 బ్యాంకుల చుట్టూ తిరిగినా ఇంకా పెండింగ్ పెట్టారు. డబ్బు అన్నా కట్టాలని.. లేకపోతే వార్డు టీడీపీ నాయకుడితో మాట చెప్పిస్తే రుణం ఇస్తారన్నారు. -గోపాల్, చేనేత కార్మికుడు, ధర్మవరం -
రెండో రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర గురువారం రెండో రోజు కొనసాగనుంది. ధర్మవరం నియోజవర్గంలోని కొత్తపేట, శాంతినగర్, శివనగర్ లలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న ఏడుగురు చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు. -
రమాదేవి,రమేష్ కుటుంబానికి జగన్ పరామర్శ
-
వైఎస్ జగన్ 'రైతు భరోసా యాత్ర' ప్రారంభం
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి చేపట్టిన నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర' ప్రారంభమైంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 డిసెంబర్ 31 నాటికి అనంతపురం జిల్లాలో 146 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ యాత్ర ప్రారంభించారు. ధర్మవరంలోని వైఎస్ఆర్ కాలనీలోని రమేష్, రమాదేవి దంపతుల కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల రమేష్ దంపతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు ఎమ్మెల్యే చాంద్ బాషా, శంకర్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి ఘన స్వాగం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొడికొండ చెక్‌పోస్టు మీదుగా ధర్మవరం పట్టణానికి చేరుకున్నారు. భరోసా యాత్రను ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మూడు విడతల్లో 42 కుటుంబాలను పరామర్శించారు. నాలుగో విడత 'భరోసా యాత్ర'ను బుధవారం నుంచి 7 రోజులపాటు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొనసాగించనున్నారు. -
అనంతలో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
అనంతలో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర సోమవారం ముగిసింది. అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి, వారికి అండగా ఉంటామని ఓదార్చారు. రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లాలో వారం రోజుల్లో వైఎస్ జగన్ 725 కిలో మీటర్ల మేర పర్యటించినట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘరాం, శంకర్ నారాయణ చెప్పారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. 17 మంది అన్నదాతల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 42 రైతు కుటుంబాలకు భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. -
కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నాచేస్తాం
-
కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నా: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్ర ఏడో రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన ఏమన్నారంటే.. కేంద్రం, చంద్రబాబు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తాం రాహుల్ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది వైఎస్ఆర్సీపీనే చంద్రబాబు పాలన మోసపూరితం రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన పేరుతో యువతను మోసం చేశారు రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పోస్టుమార్టం రిపోర్టు ఉన్నా చాలామందికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇవ్వడంలేదు పబ్లిసిటీ వచ్చేచోట మాత్రమే చంద్రబాబు పరిహారం ఇస్తారా? ఏరైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా పార్టీలతో సంబంధం లేకుండా 5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశా మంగళగిరిలో ఇదే అంశంపై రెండు రోజుల దీక్ష కూడా చేశా -
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
-
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
అనంతపురం : రైతుల సమస్యలపై అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. నేడు ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గుదిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఉజ్జనిపురంలో రైతు మల్లప్ప, అలుపనపల్లిలో రైతు రామిరెడ్డి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించనున్నారు. -
అండగా ఉంటా!
- ఆరోరోజు రెండు కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా - ప్రజల బాగోగులు తెలుసుకుంటూ....సమస్యలు ఆలకిస్తూ సాగిన యాత్ర - కదిరేపల్లిలో పట్టురైతుల సమస్యలు తెలుసుకున్న జగన్ - జగన్‌తో సమస్యలు విన్నవించిన కూలీలు..ఉద్యోగులు...నిరుద్యోగులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎవ్వరూ అధైర్యపడొద్దని...వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇస్తూ రైతు భరోసా యాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోరోజు భరోసా యాత్ర మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి నివాసం నుంచి మొదలైంది. మడకశిర నుంచి నేరుగా కదిరేపల్లికి చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు సెయింట్‌యాన్స్ పాఠశాల విద్యార్థులంతా రోడ్డుపైకి వచ్చారు. జగన్ రాగానే విద్యార్థులు, సిస్టర్లు జగన్‌కు పుష్పగుచ్చాలు అందించారు. పిల్లలందరినీ జగన్ ప్రేమ ముద్దాడి దీవించారు. తర్వాత లక్ష్మీనరసప్ప అనే పట్టు రైతు పొలంలోకి వెళ్లారు. జగన్ వస్తున్నారని పలువురు పట్టురైతులు అక్కడికి చేరుకుని సమస్యలను జగన్‌కు వివరించారు. పట్టుగూళ్ల తయారీ, పెట్టుబడి, ప్రభుత్వ తోడ్పాటు, కష్టనష్టాలపై జగన్ ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వంతో పోరడుతామని చెప్పారు. తర్వాత ఉగ్రేపల్లికి చేరుకున్నారు. అక్కడ మహిళలు భారీగా తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి ఉపాధ్యాయుల సమస్యలపై జగన్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత బూదిపల్లి, జంబులగుండ మీదుగా మోపురుగుండు చేరుకున్నారు. ఇక్కడ పింఛన్ రావడం లేదని వృద్ధులు జగన్‌కు వివరించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. పోరాడదాం, ధైర్యంగా ఉండండి’ అని జగన్ భరోసా ఇచ్చారు. ఉపాధిపనులు ఉండటం లేదని మహిళా కూలీలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. బతకలేక వలసపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. తర్వాత దేవరహట్టి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రంగప్ప కుటుంబానికి భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి ఎస్. రాయవరం మీదుగా మందలపల్లికి చేరుకున్నారు. ఇక్కడ జగన్‌ను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. యువకులతో కరచాలనం చేశారు. మహిళలనూ దీవించారు. ‘వృద్ధులు రాగానే...బాగున్నావా అవ్వా? పేరేంటి తాతా?’ అని పలకరించారు. అక్కడి నుండి ఎస్ఎస్ గుండ్లు చేరుకున్నారు. ఇక్కడి గ్రామస్తులు డప్పువాయిద్యాలతో జగన్‌కు స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి నుండి నేరుగా గుడిబండ సమీపంలోని ఫాంహౌస్‌కు చేరుకుని రాత్రికి బస చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే చాంద్‌బాషా, రాష్ట్రకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రులు నర్సేగౌడ, షాకీర్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, కోటి సూర్యప్రకాశ్‌బాబు, వైసీ గోవర్దన్‌రెడ్డి, రవిశేఖరరెడ్డి, శివకుమార్, చవ్వారాజశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నేటి భరోసా యాత్ర ఇలా రైతుభరోసా యాత్ర 7వరోజు వివరాలను వైఎస్సార్సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ సంయుక్తంగా వెల్లడించారు. రొళ్ల మండలంలోని ఉజ్జయినీపురంలో ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత ఇదే మండలంలో అలుపనపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబానికి భరోసా ఇస్తారు. దీంతో మూడో విడత యాత్ర ముగుస్తుందని వారు తెలిపారు. -
ఆరో రోజు రైతు భరోసాయాత్ర
-
అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసాయాత్ర ఆరవ రోజు ముగిసింది. మడకశిర నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారిని ఓదార్చారు. పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని, రైతుల తరఫున పోరాడుతానని వైఎస్ జగన్ తెలిపారు. దేవరహట్టిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధలు తాళలేక ఎస్ ఎస్ గుండ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబాన్ని కలిసిన ఆయన వారికి దైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ను అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కలిశారు. -
'వైఎస్ జగన్ వల్లే ప్రభుత్వం అంగీకరించింది'
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు ఆదివారం మడకశిర నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్‌ను దిన్నేహట్టిలో జేఏసీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ ఒత్తిడితోనే వేతనాలను పెంచేందుకు ఏపీ సర్కార్ అంగీకరించిందని జేఏసీ నేతలు అభినందించారు. వైఎస్ జగన్ సమక్షంలో మున్సిపల్ జేఏసీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. మున్సిపల్ జేఏసీ నేతలు వైఎస్ జగన్‌కు శాలువా కప్పి నంది చిత్రపటాన్ని బహూకరించారు. -
ఐదవరోజు రైతు భరోసాయాత్ర
-
'ఆ నిధులు కరెంట్ బిల్లులకూ సరిపోవు'
మడకశిర : హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసాయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. మడకశిరలో జరిగిన బహిరంగసభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్టాటకలో బోయ వర్గంవారు ఎస్టీలుగా ఉన్నారని, కానీ ఏపీలో మాత్రం బీసీలుగా ఉండిపోయారన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగే తొలి అసెంబ్లీ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవంటూ ఆయన ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తానన్నారు. రైతులు, మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీని గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తానన్న బాబు ఒక్క ఇల్లయినా కట్టించి ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచారని, గతంలో రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.600 వస్తోందని తెలిపారు. చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా సరే హామీలు సాధించుకుందామని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'
అనంతపురం : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేనన్న విషయం ప్రజలందరికీ తెలుసునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సు:ఖశాంతులతో ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 'పి.కొత్తపల్లి గ్రామంలో రైతు లక్ష్మన్న మరణించి ఏడాది అవుతుంది. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ పరామర్శించలేదు. ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. లక్ష్మన్నకు రూ.1.19 లక్షల అప్పుంది. రూ.19 వేలు మాఫీ అయింది. రూ.20 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయం లక్ష్మన్న కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు. వడ్డీకి సైతం సరిపోని విధంగా రుణమాఫీ అమలు చేస్తున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులపై 14 శాతం అపరాధ రుసుం పడుతోంది. రైతులు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టులో చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. హంద్రీ-నీవా ప్రాజెక్టు తానే పూర్తి చేశానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను వంచించారు. ఒక్క కొత్త ఇళ్లు కట్టలేదు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. కరవు తట్టుకోలేక అనంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెంగళూరుకు వలస వెళ్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ వచ్చినచోట మాత్రమే పరిహారం చెల్లిస్తారు. రాహుల్ గాంధీ ఎప్పుడు దేశంలో ఉంటారో...ఎప్పుడు విదేశాల్లో ఉంటారో తెలియదు' అని అన్నారు. -
'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'
-
లక్ష్మన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదో రోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో భరోసా యాత్ర చేరుకుంది. గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. రుణాలు మాఫీ కాలేదని , కొత్త రుణాలు ఇవ్వడంలేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా జగన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మడకశిర నియోజక వర్గం తిరుమల దేవరపల్లి లో ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత హనుమంతరాయునిపాళెంలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
లక్ష్మన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!
-
నాలుగో రోజు రైతు భరోసా యాత్ర
-
నాలుగో రోజు ముగిసిన జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో రోజు రైతు భరోసా యాత్ర ముగిసింది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటించారు. ఆత్మహత్యకు పాల్పడిన పలు రైతు కుటుంబాలను పరామర్శించారు. వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గౌనిమేకలపల్లి చేరుకుని రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను ఓదార్చారు. కొత్తపల్లికి చేరుకుని రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. రైతు భరోసా యాత్రంలో భాగంగా ఐదో రోజు శనివారం వైఎస్ జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రేపు పలు కుటుంబాలను పరామర్శించనున్నారు. -
మూడో రోజు రైతు భరోసా యాత్ర
-
'అవసరమైతే దండ.. లేకుంటే బండ వేస్తారు'
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవసరముంటే వాడుకుంటాదని, లేదంటే పక్కన పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే రోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. అవసరమైనపుడు దండ వేయడం, లేకుంటే బండ వేయడం రాహుల్‌కే చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి బొట్టుదాకా ఇందిరా గాంధీ కుటుంబం కోసం కష్టపడ్డారు వైఎస్ఆర్ బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు గొప్పవాడన్నారు కాంగ్రెస్‌లో కొనసాగినంత వరకు వైఎస్ జగన్‌ను మంచి వాడన్నారు వైఎస్ఆర్ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేస్తే నన్ను చెడ్డవాడన్నారు కాంగ్రెస్ చంద్రబాబుతో కలసి నాపై కేసులు పెట్టింది అవసరమైనపుడు దండ వేయడం, అవసరం లేకుంటే బండ వేయడం రాహుల్‌కే చెల్లింది రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి ఇప్పుడు అన్యాయం జరిగిందని రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సాధనకు అనేక పోరాటాలు చేశాం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైజాగ్‌లో ధర్నా, తణుకు, మంగళగిరిలో దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం రాహుల్‌కు గుర్తు రాలేదా? రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి దేశానికి తెలియజేసేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాను 4 నెలల రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నా అనంతపురం జిల్లా రైతుల దుస్థితిని దేశం తెలుసుకునేలా చేశాం దీన్ని తెలుసుకునే రాహుల్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలు అనేక బాధలు పడుతున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు అనంతపురం జిల్లాలో 70 మంది రైతులు, 20 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ఉపాధి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు రైతులు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటు రైతులకు వేరుశనగ విత్తనాలు సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వముంది అనంతపురం జిల్లా రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాల్సి ఉంటే కేవలం లక్షన్నర క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు ఆ విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు టీడీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు -
లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గ పరిధిలోని వైటి రెడ్డిపల్లి, గోనిమాకులపల్లిలో యాత్ర నిర్వహిస్తున్నారు. వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఆయన గౌనిమేకలపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం కొత్తపల్లిలో రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. -
నాలుగు రోజుల్లో తేల్చండి
-
నాలుగోరోజు వైఎస్ జగన్ రైతుభరోసాయాత్ర
-
నాలుగు రోజుల్లో తేల్చండి
లేకుంటే ఆపై రాష్ట్ర బంద్.. మున్సిపల్ సమ్మెపై ఏపీ సర్కార్‌కు జగన్ హెచ్చరిక ♦14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా బాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు ♦ పుట్టపర్తిలో సమ్మెచేస్తూ మృతి చెందిన కార్మికునికి పరిహారం ఎందుకివ్వరు? ♦నేడు జరిగే కలెక్టరేట్ ముట్టడికి వైఎస్సార్సీపీ పూర్తిగా సహకరిస్తుంది ♦రైతు భరోసాయాత్రలో సమస్యలు విన్నవించిన మున్సిపల్ కార్మికులు ♦కార్మికులకు పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి (రైతుభరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘సింగపూర్ వాళ్లు వస్తే రాజమండ్రిలో రెడ్‌కార్పెట్ పరిచిన పెద్దమనిషి.. 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేస్తున్న మున్సిపల్ కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవడంలేదు. చంద్రబాబుకు నాలుగు రోజులు టైమ్ ఇస్తున్నాం. ఈలోపు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మున్సిపాలిటీలను స్తంభిం పచేస్తాం... రాష్ర్ట బంద్‌కు పిలుపునిస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అనంతపురం జిల్లాలో మూడోవిడత రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్మోహన్రెడ్డిని మూడోరోజు గురువారం కంబదూరు మండలం తిమ్మాపురం క్రాస్ వద్ద మున్సిపల్ కార్మికులు, కార్మిక సంఘం నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పని చేస్తేకాని పొట్ట గడవని స్థితిలో ఉన్న మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా సీఎం చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అరకొర జీతాలతో బతకడం కష్టంగా ఉంది, జీతాలు పెంచమని కోరుతుంటే ఉక్కుపాదంతో అణచివేస్తామంటున్నారు. అసలు చంద్రబాబు మనిషేనా? ఎన్నికలకు ముందు ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నవారిని, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని, ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చింది చంద్రబాబు కాదా? అప్పుడు వీళ్ల ఓట్లతో అవసరం ఉంది కాబట్టి మాయ మాటలు చెప్పారు. ఇప్పుడు రోడ్డుపై నిలబెట్టారు. ఎప్పుడు ఉద్యోగాల్లోంచి తీసేస్తారో తెలియని పరిస్థితుల్లో వారందరి జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం’’ అంటూ జగన్ మండిపడ్డారు. ఉద్యోగులకు పెంచిన 43 శాతం ఫిట్మెంట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి, కాంట్రాక్ట్ సిబ్బందికి వర్తించదా? అని ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి కూరగాయలు ఏమైనా తక్కువ ధరకు ఇస్తారా? లేకపోతే పెట్రోల్ ఏమైనా తక్కువ రేటుకు పోస్తారా? డీజిల్ తక్కువ రేటుకు ఇస్తారా? అని నిలదీశారు. ‘‘తెలంగాణలో కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వం అడిగిన మేరకు వేతనాలు పెంచేందుకు దిగివచ్చింది. ఇక్కడ వేతనాలు పెంచినా ప్రభుత్వంపై రూ.200-300కోట్ల భారం మాత్రమే పడుతుంది. దీనికోసం కార్మికులను రోడ్డున పడేశారు. సమ్మెతో పట్టణాల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ప్రజలు రోగాలబారిన పడతారని ప్రభుత్వానికి ఏమాత్రం జాగ్రత్త లేదు. మునిసిపల్ కార్మికులను చర్చలకు పిలవలేదు’’ అని దుయ్యబట్టారు. పుట్టపర్తిలో సమ్మెచేస్తూ మరణించిన కార్మికుడికి రూ.ఐదు లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కార్మికులు నేడు చేస్తున్న కలెక్టరేట్ల ముట్టడిలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొంటాయని చెప్పారు. మద్దతిస్తే ప్రభుత్వం దిగివస్తుంది.. రెగ్యులర్, కాంట్రాక్టు మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 14రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్మికులు జగన్‌కు వినతిపత్రం ఇచ్చిన సందర్భంగా విన్నవించారు. పదో పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 29-32శాతం ఫిట్మెంట్ ఇవ్వొచ్చని... కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 13వేల రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని సిఫార్సు చేశారని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జగన్ ప్రత్యక్షంగా మద్దతు తెలిపి బంద్‌కు పిలుపునిచ్చినపుడు ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు కూడా అలాంటి సహకారం అందించాలని కార్మికసంఘం నేతలు కోరారు. పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు నెలకు రూ.1,623 మాత్రమే వేతనం ఇస్తున్నారని, వీరికి కూడా సరిపడా జీతం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు జగన్ మద్దతు తెలిపారు. జగన్‌కు సమస్యలు విన్నవించిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీఐటీయూ నాయకులు గోపాల్, ఐఎఫ్టీయూ నాయకులు ఉపేంద్ర, వైఎస్సార్టీయూసీ నేత ఆదినారాయణరెడ్డి ఉన్నారు. మూడోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పొగ్రాం కోర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయ తిప్పేస్వామి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్, జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు యాత్ర మొదలుపెట్టాక పిలిచి చెక్ ఇచ్చారు ‘సార్... మీరు శెట్టూరు నుంచి భరోసా యాత్ర ప్రారంభించగానే మమ్మల్ని పిలిచి రూ.3.50 లక్షల చెక్ ఇచ్చార’ని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న తిమ్మాపురం గ్రామ రైతు నారాయణప్ప పెద్ద కుమారుడు మారెన్న జగన్మోహన్రెడ్డికి తెలిపారు. తాను వచ్చినందుకైనా వారికి పరిహారం అందడంపట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. మూడో విడత రైతు భరోసాలో భాగంగా గురువారం ఏపీలోని కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలంలో నారాయణప్ప, వంటారెడ్డిపల్లి రైతు రామాంజనేయులు కుటుంబాల ను జగన్ పరామర్శించారు. రుణమాఫీ ఎంత వర్తించింది? ప్రైవేటు అప్పులు ఎంత ఉన్నాయి? అని నారాయణప్ప భార్య లక్ష్మీదేవిని అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌కు దరఖాస్తు చేసినా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు పింఛన్లు పెంచినట్టే పెంచి ఉన్నవి తీసేశారు. మీలాంటి వారందరితో హైకోర్టులో పిటిషన్ వేయిస్తాం. మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’’ అని జగన్ భరోసానిచ్చారు. ఇక ‘‘నా భర్త చనిపోతే సాయం చేయడానికి వచ్చిన అధికారులను టీడీపీ నాయకులు భయపెడుతున్నారు. మీరు మా పార్టీ కార్యకర్తలు కాదు కదా! మీకు సాయం ఎందుకు చేయాలంటున్నారు. ’’ అంటూ రామాంజనేయులు భార్య గంగమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పార్టీ శ్రేణులు అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని జగన్ భరోసా ఇచ్చారు. -
నారాయణప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ఆయన కల్యాణదుర్గం, పెనుకొండ నియోజక వర్గాల్లో ఆయన పర్యటించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన ఒంటాపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తర్వాత పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుని అక్కడ చేసుకున్న లక్ష్మీదేవి, పెద్ద పాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు. -
నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్జగన్
-
మూడోరోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ఉదయం కల్యాణదుర్గం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆయన కల్యాణదుర్గం, పెనుకొండ నియోజక వర్గాల్లో ఆయన పర్యటించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. కాసేపట్లో కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఒంటాపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్నిపరామర్శిస్తారు. తర్వాత పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుని అక్కడ చేసుకున్న లక్ష్మీదేవి, పెద్ద పాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు. కాగా యాత్ర ప్రారంభనికి ముందు ఉపాధ్యాయ సంఘాల నేతలు వైఎస్ జగన్ ను కలిశారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు జగన్ ను కోరారు. హెల్త్ కార్డులు జారీ చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని సంఘాల నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. -
రెండో రోజూ రైతు భరోసా యాత్ర
-
ఈరన్న కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
-
ఈరన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆయన బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈరన్న కుటుంబసభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్...వారికి అండగా ఉంటానన్నారు. అనంతరం వైఎస్ జగన్ ముదిగల్లు బయల్దేరారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న బోయ నారాయణప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. తర్వాత మల్లిపల్లి, తూర్పుకోడిపల్లి మీదగా వర్లి చేరుకుంటారు. అక్కడ హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాత్రికి కల్యాణదుర్గంలో ఆయన బస చేస్తారు. అంతకు ముందుగా వైఎస్ జగన్ కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమి పూజ చేశారు. -
ఈరన్నకుటుంబానికి వైఎస్జగన్ పరామర్శ
-
కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమిపూజ
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుకుటుంబాలకు ఆదుకునేందుకు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన కళ్యాణ దుర్గం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అంతకముందు కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు. నేరుగా బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ముదిగల్లు చేరుకుంటారు. అక్కడ బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం వర్ణి లో హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. -
'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు'
-
'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు'
చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శెట్టూరులో బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... రుణమాఫీపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తే.. రైతులంతా సుఖ శాంతులతో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు సన్మానాలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేట్లున్నారు చంద్రబాబు చెప్పిన అబద్ధాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గతంలో వడ్డీలేని రుణం వస్తే, ఇప్పుడు రైతులు 14 శాతం అపరాధ వడ్డీ కడుతున్నారు రుణాలు రెన్యువల్ కాక, రైతులు పంటబీమా కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారు రూ. 2 వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణమాఫీ విషయంలో అందరినీ మోసం చేస్తున్నారు పుష్కరాల్లో సినిమా తీసేందుకు 29 మందిని బలి తీసుకున్నారు పబ్లిసిటీ కోసం బాబు ఏమైనా చేస్తారు గతంలో 200 రూపాయల వరకు వచ్చే కరెంటు బిల్లు కాస్తా ఇప్పుడు చంద్రబాబు పుణ్యమాని 800 రూపాయలు వస్తోంది జూన్ 30 నాటికి వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటివరకు సహకార బ్యాంకుల నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా.. ఆయన మెడలు వంచైనా గుర్తుచేస్తూనే ఉంటాం. -
నేటి నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత ‘రైతు భరోసా యా త్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. రుణాల మాఫీ జరగక, కొత్త అప్పులు పుట్టక, వ్యవసాయం చేసుకోలేక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరాశా నిసృ్పహల్లో ఉన్న రైతుల బలవన్మరణాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో.. రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. తాజాగా మంగళవారం నుంచి కల్యాణదుర్గం నియోజకవర్గంలో మూడో విడత యాత్రను ప్రారంభించనున్నారు. జగన్ తొలి రోజు పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం పత్రికలకు విడుదల చేశారు. శెట్టూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం ఆయన కైరేవు గ్రామానికి వెళతారు. -
21 నుంచి ‘అనంత’లో జగన్ రైతు భరోసా యాత్ర
-
21 నుంచి ‘అనంత’లో జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: గడచిన ఏడాది కాలంలో అప్పులబాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మొదలుపెట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో విడత పర్యటనను ఈ నెల 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారని పార్టీ పోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వైఎస్ జగన్ రెండు విడతలుగా అనంతపురం జిల్లాలోనే రైతు భరోసా యాత్ర నిర్వహించడం తెలిసిందే. -
అండగా ఉంటాం ఆత్మహత్యలొద్దు
-
మాఫీ పేరుతో మోసం
రైతు భరోసా యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం సాక్షి, కడప: ‘‘రైతులకు రుణమాఫీ కాలేదు.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం డ్వాక్రా మహిళలకూ రుణాలు మాఫీ కాలేదు. ఉద్యోగం రాక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. కనీసం పండుటాకులైన అవ్వ, తాతలందరికీ పింఛన్ అందట్లేదు. అధికారంలోకి రాకముందు ప్రజలకు అన్నీ ఇస్తామని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఏదీ చేయడు. నమ్మించి బాగా మోసం చేస్తాడు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం బోనాలలో ఆదివారం రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకెన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పంగనామాలు పెట్టి కూర్చొన్నారని ఎద్దేవా చేశారు. ఏమి చేయకున్నా.. గడిచిన ఏడాదిలో ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసగించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వచ్చే నెల 3, 4 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య సమర దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా అండగా ఉండాలని, అందరి తరఫున తాను పోరాడతానని స్పష్టం చేశారు. గంగాధర్ చనిపోయి మూడు నెలలైనా అతీగతీ లేదు.. ‘‘బోనాలకు చెందిన రైతు మన్యం గంగాధర అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మూడు నెలలైనా ఆయన ఇంటికి ఒక్కరూ వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. పంచాయతీ కార్యదర్శి వచ్చి రాసుకుని వెళ్లారట. ఇప్పటివరకు పైసా పరిహారమందలేదు. ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలిచ్చి ఆదుకుంటామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందేతప్ప.. అలా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్ వస్తున్నారని ఒక్క అనంతపురంలో మాత్రం కాస్తో.. కూస్తో ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులో రూ.1.50 లక్షలు అప్పులవారికి పంచడం, మిగిలిన రూ.3.50 లక్షలను బ్యాంకులో జాయింట్ అకౌంటుద్వారా ఉంచడం.. తర్వాత ఏ ఆరు నెలలకో, ఎనిమిది నెలలకో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద పండుగకో.. పబ్బానికో కొంతఇచ్చి సరిపుచ్చుతున్నారు. ఆ బాధిత కుటుంబసభ్యులకు ఆ మొత్తం అందిస్తే కదా.. వారు ఏదైనా చేసుకుని బతికేది..’’ అంటూ జగన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్ టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌తోనే ముందుకు నడుస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీతోనే నడిపిస్తారని, రైతులకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పబ్లిసిటీ వస్తుందంటే ఎక్కడికైనా వస్తారన్నారు. పబ్లిసిటీ ఉండదని తెలిస్తే సమీప ప్రాంతాలకూ రారన్నారు. ప్రతి రైతును, అక్కా చెల్లెమ్మలను, అలాగే ఉద్యోగం పేరిట, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నిరుద్యోగులను మాటలతో గారడీ చేసిన చంద్రబాబును జనం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళలైతే కనీసం రూ.10 వేలను కూడా కంతుల రూపంలో ఇస్తామని ప్రకటించిన బాబు తీరుపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడిపారు. లింగాల మండలం బోనాల, అంకేవానిపల్లె, కామసముద్రం, పులివెందుల, ఆర్.తుమ్మలపల్లె, సంతకొవ్వూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.బి.అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. ధైర్యంగా ఉండండి రైతు కుటుంబాలకు జగన్ భరోసా పులివెందుల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాల, కామసముద్రం, పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెలో అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదివారం జగన్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలన్నారు. అందరివీ కన్నులు చెమర్చే బాధలే తొలుత నాగభూషణం శ్రేష్ఠి కుటుంబీకులను పరామర్శించగా వారు తమ ఇబ్బందులను పూసగుచ్చినట్లు చెప్పారు. చీనీ పంట సాగుకోసం వివిధ పద్దతుల్లో రూ.30లక్షల వరకూ అప్పులయ్యాయని తెలిపారు.అవి తీరే మార్గం లేక నాగభూషణం ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. రుణమాఫీ తమకు ఉపకరించలేదన్నారు. అదే విధంగా కోరా రామచంద్రా రెడ్డి కుటుంబీకులు రుణమాఫీని నమ్ముకొని దారుణంగా దెబ్బతిన్నామని జగన్ వద్ద బోరుమన్నారు. ప్రభుత్వం మోసం చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జగన్ గంగాధర్ కుటుంబీ కులను కలిశారు. వారు ఆయన వద్ద తమ ఆవేదనను వెళ్లగక్కారు. నాలుగెకరాల్లో వేసిన చీనీ తోటల కోసం అప్పుల పాలయ్యామన్నారు.రుణ మాఫీ కాలేదని బయట అప్పు దాదాపు రూ.18 లక్షలు ఉందనీ తెలిపారు. తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. -
రైతు రామచంద్రారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కడప: వైఎస్సార్ జిల్లాలోని ఆర్.తుమ్మలపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్.. అన్నివిధాలా అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అంతకుముందు లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వ్యవసాయంతో నష్టపోయి .. అప్పులు తీరే మార్గంలేక.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తున్నారు. -
'ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు'
-
'ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు'
కడప: సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
అధైర్యపడొద్దు..అండగా ఉంటా
వేముల : మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప ఎంపీవైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు. మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు. యురేనియం ప్రాజెక్టులో రఘురాం కార్మికునిగా పనిచేస్తున్నాడని..అతని మృతితో కుటుంబం జీవనాధారం కోల్పోయిందని.. ప్రాజెక్టులో ఉద్యోగం వచ్చేలా చూడాలని బంధువులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ రఘురాం కుటుంబాన్ని ఆదుకొనేందుకు అన్ని విధాలా ముందుంటానని.. ప్రాజెక్టులో మృతుడి భార్య భారతికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తూ ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. మరొకరు పక్షవాతంతో బాధపడుతూ ఉద్యోగం కోల్పోయారని.. ఇప్పటి కీ ఆ కుటుంబాలకు యురేనియం ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వలేదని.. వారికి ప్రాజెక్టులో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని స్థానికులు, తోటి కార్మికులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మబ్బుచింతలపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు బొజ్జా నాగమల్లారెడ్డి, బొజ్జా శివశంకర్‌రెడ్డిలు ఇళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆ పార్టీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి,జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం ముద్దనూరు : శాసనసభ ప్రతిపక్షనేత,వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి శనివారం తెల్లవారుజామున ముద్దనూరు రైల్వేస్టేషన్లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వైయస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డితో కలిసి ముద్దనూరు రైల్వేస్టేషన్లో దిగి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. వైయస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. నేడు పులివెందులలో రైతు భరోసా యాత్ర పులివెందుల : వ్యవసాయ జూదంలో ఓడిపోయి.. అప్పులు తీరే మార్గంలేక.. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆదుకోక.. దిక్కుతోచని స్థితిలో బలవ న్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదివారం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుటుంబాన్ని , లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన నాగభూషణంశ్రేష్టి కుటుంబాలన పరామర్శించనున్నారు. -
అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర విజయవంతం
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర విజయవంతమైందని వైఎస్ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 14 రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తలశిల రఘురాం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో హత్యకు గురైన ముగ్గురు వైఎస్ఆర్ సీపీ నేతల కుటుంబాలను కూడా వైఎస్ జగన్ పరామర్శించినట్లు చెప్పారు. రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ 8 రోజుల్లో 1150 కిలోమీటర్ల ప్రయాణించారని, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలో వైఎస్ జగన్ పర్యటించినట్లు చెప్పారు. -
’రీయింబర్స్మెంట్ రూపాయి కూడా ఇవ్వలేదు’
-
’ముసలితనం వల్ల మతిమరుపొచ్చింటుంది’
-
సెక్యురిటీ లేకుండా తిరగగలరా?
కాదలూరు: బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కాదలూరులో రైతులు, మహిళలతో వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీ కాకపోవడంతో రైతులపై అదనపు వడ్డీ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా ఏ ఒక్కరికీ అందలేదని తెలిపారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రైతులు, మహిళలు ఆనందంగా ఉన్నారని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. సెక్యురిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లో తిరగగలరా అని జగన్ ప్రశ్నించారు. సెక్యురిటీ లేకుండా చంద్రబాబు గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారని, తిడతారని చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. -
సెక్యురిటీ లేకుండా తిరగగలరా?
-
డి.హీరేహాళ్ నుంచి వైఎస్ జగన్ భరోసా యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ నుంచి ఆయన యాత్ర ప్రారంభించారు. కాదలూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాగా నేటితో రెండో విడత భరోసా యాత్ర ముగియనుంది. -
ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటా
బొమ్మనహాళ్ : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం ఆయన బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గోగినేని నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లి హప్పమ్మ, భార్య చంద్రమ్మ, కూతురు దివ్య రూప, కుమారుడు ఈశ్వర్‌కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారావు కుటుంబ సభ్యులు, జగన్ మధ్య సంభాషణ ఇలాసాగింది. వైఎస్ జగన్ : నరసింహారావు ఎలా చనిపోయాడమ్మా? చంద్రమ్మ (రైతు భార్య): ఊరి బయట చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. జగన్ : సొంత పొలం ఎంతుంది తల్లీ? చంద్రమ్మ: సొంత పొలం లేదు సార్. కౌలుకు చేశాం. జగన్ : ఎన్ని ఎకరాలు సాగు చేశారు? చంద్రమ్మ: పదెకరాలు జగన్: ఏయే పంటలు సాగు చేశారమ్మా? చంద్రమ్మ : పత్తి పంట వేశాం. దిగుబడి సరిగా రాక నష్టపోయాం. జగన్ : బ్యాంకులో అప్పులేమైనా ఉన్నాయా తల్లీ? చంద్రమ్మ : పొలముంటే కదా సార్ అప్పు ఇచ్చేది?! జగన్: రుణ అర్హత కార్డు లేదా? చంద్రమ్మ : కౌలు చేస్తున్నట్లు గుర్తింపు పత్రాలు ఇక్కడ ఎవరూ రాసివ్వరు సార్. అందుకే రుణ అర్హత కార్డు లేదు. జగన్ : అప్పు ఎంతుందమ్మా? చంద్రమ్మ : దాదాపు రూ.3 లక్షలు సార్. జగన్: ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదా? చంద్రమ్మ : లేదండీ.. రెవెన్యూ అధికారులు అప్పులున్నట్లు ఆధారాలు కానీ, ప్రాంసరీ నోట్లు కానీ చూపమన్నారు. అప్పు ఇచ్చిన వారు ఆత్మహత్య కేసు తమపై వస్తుందని ప్రాంసరీ నోట్లను చూపడానికి ముందుకు రాలేదు. జగన్: బంగారంపై లోను ఉందా? ఎంత బంగారముంది తల్లీ? చంద్రమ్మ : 10 తులాల బంగారం ఉండేది. ఎక్కడ తాకట్టు పెట్టారో తెలియదు సార్. బ్యాంకులలో విచారిస్తే తెలియదన్నారు. బళ్లారిలో మార్వాడీల దగ్గర పెట్టి ఉండొచ్చు. ఆధారాలేమీ లేవు. జగన్: డ్వాక్రా రుణాలేమైనా ఉన్నాయా? చంద్రమ్మ: డ్వాక్రా సంఘంలో మా అత్త ఉండేది. వయసు మీరిపోయిందని తొలగిం చారు. నన్ను సంఘంలో చేర్చుకోలేదు. జగన్ : ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు ఏమై నా వచ్చాయా? చంద్రమ్మ : అలాంటివేమీ రాలేదు సార్. జగన్: కౌలు రైతుగా ఈ కుటుంబానికి సహా యం అందడానికి ఈశ్వర్‌కుమార్(మృతుడి కుమారుడు)ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి ప్రయత్నం చేయండన్నా(నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో చెప్పారు.) చంద్రమ్మ: ఏదైనాపొలం ఇప్పించండి సార్! జగన్: మన ప్రభుత్వం వస్తే రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుంటాం. జగన్: నీ పేరేంటి బాబూ? ఈశ్వర్‌కుమార్ సార్. జగన్: ఏమి చదువుకున్నావ్? ఈశ్వర్‌కుమార్ (మృతుడి కుమారుడు): ఐటీఐ ఎలక్ట్రికల్. ఏ ఉద్యోగమూ రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నా. హరేసముద్రం వద్ద ఉన్న శాతవాహన ఫ్యాక్టరీలో ఏమైనా ఉద్యోగం ఇప్పించండి సార్. ఇక్కడైతే అమ్మా నాన్నమ్మలకు తోడుగా ఉంటా. జగన్: రామచంద్రారెడ్డన్న(మాజీ ఎమ్మెల్యే) ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తారు. అన్నను కలవండి.. తప్పకుండా సహాయం చేస్తారు. -
అప్పులు తీర్చలేకే ఆత్మహత్య చేసుకున్నారు
డీ.హీరేహాళ్ : ‘పంటల సాగు కోసం అప్పులు చేశాం. వర్షాల్లేక పంటలు పండలేదు. అప్పులు తీర్చేమార్గం లేకే ఆత్మహత్య చేసుకున్నార’ని మండలంలోని పులకుర్తి గ్రామానికి చెందిన రాముడు తల్లి లింగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రాముడు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్, రాముడు కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ ఇలా... వైఎస్ జగన్ : భూమి ఎంతుందవ్వా..? లింగమ్మ : సొంత భూమి రెండెకరాలు ఉంది. పదెకరాలు కౌలుకు చేసేవాళ్లం. జగన్ : ఎంత అప్పు తీసుకున్నారు? లింగమ్మ : పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు. దీంతో బ్యాంకులో అప్పు తీసుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పులు చేశాం. జగన్ : ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? లింగమ్మ : పంటల సాగు కోసం అప్పులు చేశాం. వర్షాలు లేక, పంటలు పండక తీవ్ర నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి అవకాశం లేక మనస్తాపం చెందాడు. ఉన్న భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని భార్యతో చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ గొడవపడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పిల్లలను నా పాలిట వేసి వెళ్లిపోయారు నాయనా..(కన్నీటి పర్యంతమవుతూ..) జగన్ : అవ్వా ఏడ్వొద్దు. నిన్ను చూసి పిల్లలు కూడా ఏడుస్తారు . లింగమ్మ : పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. జగన్ : ఎంత మంది పిల్లలు? లింగమ్మ : ముగ్గురు సార్ జగన్ : ఏమి పేర్లు? పిల్లలు : నందిని, శివకుమార్, కీర్తి జగన్ : డ్వాక్రా రుణాలు ఉన్నాయా? లింగమ్మ : తీసుకోలేదు . జగన్ : నీ భర్త ఎప్పుడు మృతిచెందాడు అవ్వా? లింగమ్మ : కోడలు, కొడుకు మృతిచెందిన వారం రోజులకే నా భర్త కూడా బెంగతో చనిపోయాడు. జగన్ : నీకు ఎంత మంది కుమారులు? లింగమ్మ : ముగ్గురు జగన్ : (లింగమ్మ కుమారుడు హనుమంతునుద్దేశించి..) నీకు ఎంత మంది పిల్లలు? హనుమంతు : నలుగురు కుమార్తెలు జగన్ : కొడుకు కోసమా ఇంత మంది? హనుమంతు : అవును సార్.. జగన్ : పిల్లలను చదివించేందుకు రామచంద్రారెడ్డన్న సహాయపడతారు. ఆయన సహకారం తీసుకోండి. లింగమ్మ : పింఛన్ కూడా ఇవ్వడం లేదు సార్.. జగన్ : రామచంద్రారెడ్డన్న తహశీల్దార్‌తో మాట్లాడి.. పింఛన్, రేషన్ కార్డు వచ్చేలా సాయపడతారు. జగన్ : మీవాళ్లు చనిపోయినప్పుడు ఎవరైనా వచ్చి సాయమందించారా? లింగమ్మ : ఎవరూ రాలేదు సార్. జగన్ : పిల్లలను బాగా చదివించండి లింగమ్మ : చదివిస్తాం సార్. -
వైఎస్ జగన్ ఏడో రోజు రైతు భరోసా యాత్ర
-
గుండె గుండెన..వేదన
► కలత నిద్రలోనూ రైతులకు కలవరింతలే ► రుణమాఫీ పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ► తీరు మారని సర్కారుపై ధ్వజం ► ఎర్రని ఎండలోనూ బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా ► జగన్ యాత్రకు గ్రామగ్రామాన విశేష స్పందన ( సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రజలు ప్రతిచోటా సమస్యలను ఏకరువు పెట్టారు. కన్నీళ్లతో ఎదురవుతున్న మహిళలు, బరువైన గుండెలతో బావురుమంటోన్న అన్నదాతల గోడు విని జగన్ చలించిపోయారు. కలత నిద్రలోకి జారుకుంటున్న తమను అప్పుల కలవరింతలే భయపెడుతున్నాయని అన్నదాతలు వాపోయారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినందుకు 47 మంది వృద్ధులకు పింఛన్లు ఆపేశారంటూ యర్రగుంట గ్రామస్తులు అధికార పార్టీ నిర్వాకాలను ఎండగట్టారు. నెలవారీ ఇచ్చే సబ్సిడీ సాయం మూడు నెలలుగా నిలిచిపోయిందని ఉరవకొండ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన ఆదర్శ రైతులు, విద్యా వలంటీర్లు, బిల్లులందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఇన్ పుట్ సబ్సిడీ అందని రైతులు.. ఇలా ప్రతిఒక్కరూ వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన అందరి కన్నీళ్లను తుడుస్తూ ముందుకు సాగారు. కష్టాలు కలకాలం ఉండవని ధైర్యం చెప్పారు. భవిష్యత్తు మనదేనన్న భరోసా నింపారు. ఆదివారం యాత్ర సాగిందిలా... ఉదయం 10 గంటలకు బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ నుంచి ఏడో రోజూ భరోసా యాత్ర ప్రారంభమైంది. దేవగిరి గ్రామం చేరుకుని.. ఆత్మహత్య చేసుకున్న రైతు నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. ‘అధైర్య పడొద్దు...పార్టీ అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మలాపురం చేరుకుని రచ్చబండ దగ్గరున్న వృద్ధులు, రైతులను పలకరించారు. ఈ సందర్భంగా రుక్మిణమ్మ అనే మహిళా రైతు పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించింది. రూ.46 వేల రుణమాఫీ అయినట్లు ప్రభుత్వం పత్రం ఇచ్చినప్పటికీ ఆంధ్రాబ్యాంకు అధికారులు మాత్రం కుదరదంటున్నారని తిమ్మలాపురం రైతు పాటిల్ యువరాజు వాపోయాడు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పత్రాన్ని కూడా జగన్‌కు చూపాడు. తర్వాత జగన్ ఐదు నెలల కిందట కరెంటు షాక్‌తో మృతిచెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామలింగప్ప కొడుకు మారెన్న కుటుంబాన్ని పరామర్శించారు. ట్రాన్స్కోపై కేసు ఫైల్ చేసి.. న్యాయం జరిగేలా చూస్తామని మారెన్న భార్య లక్ష్మికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి పులకుర్తి చేరుకున్నారు. రైతు బోయ రాముడు కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటలకు డీ.హీరేహాళ్ చేరుకుని ముస్లిం మహిళల సమస్యలు విన్నారు. అనంతరం ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న రైతు తలారి ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. భార్యాపిల్లలకు ధైర్యం చెప్పారు. ఆదివారం నాటి యాత్రలో వైఎస్ జగన్‌తో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కదిరి ఎమ్మెల్మే చాంద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ, రాయదుర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల ర ఘురాం, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఉపేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, జిల్లా నేతలు షేక్షా, బాలప్పయాదవ్, అనంతపురం నగర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, బొమ్మనహాళ్ మండల నేతలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, యోగేశ్రెడ్డి, మాజీ ఎంపీపీ లాల్సాబ్ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న రెండో విడత భరోసా యాత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతు భరోసాయాత్ర సోమవారంతో ముగియనుంది. ఉదయం తొమ్మిది గంటలకు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ నుంచి యాత్ర మొదలవుతుంది. కాదలూరు చేరుకుంటుంది. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. -
లెటరు వచ్చింది... మాఫీ మాత్రం కాలే!
⇒భరోసాయాత్రలో జగన్ ముందు రైతన్నల ఆవేదన ⇒చంద్రబాబు సర్కారు మోసాలపై 4,5 తేదీల్లో దీక్షలు చేస్తున్నట్టు జగన్ ప్రకటన ⇒భారీగా తరలిరావాలని ప్రజలకు పిలుపు ⇒ఏడోరోజు యాత్రలో వుూడు రైతు కుటుంబాలకు భరోసా (అనంతపురం జిల్లా తిమ్మలాపురంలో మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి) (అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘మీ రుణం మాఫీ అయిందని ముఖ్యవుంత్రి చంద్రబాబు సంతకంతో మా ఇంటికి లెటరు వచ్చిందన్న. అది తీసుకెళ్లి బ్యాంకు దగ్గరకు వెళ్తిని. నీ రుణం ఏం మాఫీ కాలె... హైదరాబాద్‌కు పోరుు సీఎంను కలవవుంటున్నారన్న. ఇంటికి లెటరైతే వచ్చె కానీ రుణం మాత్రం అట్టనే ఉండె...’’ అంటూ డి.హీరేహాళ్ మండలం తిమ్మలాపురానికి చెందిన రైతు పాటిల్ యువరాజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుని బారువుమన్నారు. రుణమాఫీ కాకపోవడంతో పంటల బీవూ కానీ,పెట్టుబడి రాయితీ కానీ రావడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. రెండో విడత రైతు భరోసా యాత్ర ఏడో రోజైన ఆదివారం అనంతపురం జిల్లా రాయుదుర్గం నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాలేదని వాపోయారు. ఎన్నికల ముందు వ్యవసాయు రుణాలు, బంగారు రుణాలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు మోసాలను ప్రజలకు వివరించేందుకు వచ్చే నెల 4,5 తేదీల్లో దీక్షలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ దీక్షలకు ప్రజలందరూ భారీగా తరలిరావాలని భరోసా యాత్ర సాగిన ప్రతీ గ్రావుంలో ప్రజలను కోరారు. ‘‘నేను దీక్షలు చేస్తానని ప్రకటించగానే... చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా వుహిళలకు రూ.3 వేలు ఇస్తున్నట్టు చెబుతోంది. అక్కచెల్లెమ్మలను వుళ్లీ మోసం చేసేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోంది’’ అని విమర్శించారు. చంద్రబాబు మోసాలు మాకు అర్థమయ్యాయన్నా... ఆయనిచ్చే వుూడు వేలు తీసుకునే మీ దీక్షలకు వస్తామని మహిళలు జగన్‌తో చెప్పారు. దీక్షలకు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడతావుని ప్రజలు స్పష్టం చేశారు. పింఛన్లను నిలిపేస్తున్నారు...! గతంలో వచ్చే పింఛన్లను కూడా నిలిపివేస్తున్నారని ఆదివారం భరోసా సాగిన ప్రతీ గ్రావుంలోనూ వృద్ధులు, వితంతువులు జగన్ ముందు వాపోయూరు. ‘‘నేను, వూ ఆయన శంకరయ్య ఇద్దరు ముసలోళ్లమే. ఇంతకుముదు ఒకటే పింఛను ఇస్తుండ్రి. ఇప్పుడు అది కూడా తీసేసిరి. నాకు, మా ఆయనకు ఇద్దరికీ ఇప్పుడు పింఛన్లు రావడంలే’’ అని డి. హీరేహాళ్‌కు చెందిన వృద్ధురాలు శంకరమ్మ వాపోరుుంది. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని ఈ సందర్భంగా వృద్ధులకు జగన్ భరోసానిస్తూ యూత్ర సాగించారు. ఏడో రోజు రైతు భరోసా యూత్రలో రాయుదుర్గం నియోజకవర్గంలోని దేవగిరిలో గోగినేని నరసింహరావు, పులకుర్తి గ్రావుంలో బోయు రాముడు, డి. హీరేహాళ్‌లో తలారి ఈరన్న కుటుంబాలకు ఆయున భరోసానిచ్చారు. మూడు కుటుంబాలవారిని పరామర్శించిన జగన్ ఏడోరోజు భరోసా యాత్రలో భాగంగా జగన్ , ఆత్మహత్యలకు పాల్పడిన మూడు రైతు కుటుంబాల వారిని ఆదివారం నాడు పరామర్శించారు. డీ.హీ రేహాళ్ మండలం పులపర్తిగ్రామానికి చెందిన బోయ రాముడు (34) భార్య సుగుణమ్మను ఓదార్చారు. అలాగే బొమ్మన హాల్ మండలం దేవగిరికి చెందిన గోగినేని నరసింహారావు (52) భార్య చంద్రమ్మను, డీ.హీరేహాళ్ గ్రామానికి చెందిన తలారి ఈరన్న (52) కుటుంబీకులను పరామర్శించారు. వారి ఇక్కట్లను తెలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రవుంలో ఎంపీ మిథున్‌రెడ్డి, వూజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాష, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయుణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జీ ఉష, పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రైతు విభాగం రాష్ర్ట కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి మోహన్ రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు బోయు వుల్లికార్జున, ఎస్టీసెల్ కార్యదర్శి భోజరాజ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఈరన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
డి.హీరేహళ్లో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
అనంతపురం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డి.హీరేహళ్లో ఘనస్వాగతం లభించింది. ఏడవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డి.హీరేహళ్లో ఆత్మహత్య చేసుకున్న ఈరన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అన్నివిధాల తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అంతకు ముందు దేవగిరి క్రాస్ వద్ద వ్యవసాయకూలీలు వైఎస్ జగన్‌ను కలిశారు. అక్కడ కొద్దిసేపు ఆగి జగన్ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేవగిరిలో నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. నాగులాపురంలో మారన్న, పూలకుర్తిలో రాముడు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. -
రాముడు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
నరసింహారావు కుటుంబానికి జగన్ పరామర్శ
-
నరసింహారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం ఉద్దేహల్ నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆరంభమైంది. దేవగిరి క్రాస్ వద్ద వైఎస్ జగన్ వ్యవసాయ కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవగరిలో ఆత్మహత్య చేసుకున్న రైతు నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిమ్మలాపురం, నాగలాపురం గ్రామాల్లో వైఎస్ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగులాపురంలో కరెంట్ షాక్‌తో మరణించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మారన్న కుటుంబాన్ని పరామర్శించారు. పూలకూర్తిలో రైతు రాముడి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చారు. -
నరసింహారావు కుటుంబానికి జగన్ పరామర్శ
-
'అనంత' లో వైఎస్ జగన్ ఏడో రోజు రైతు భరోసా యాత్ర
అనంత:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఈరోజు జగన్ రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. దేవగిరి, పూలకుర్తి, డి. హీరోహిల్ గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
వినతుల వెల్లువ
► రైతుభరోసా యాత్రలో అడుగడుగునా బడుగుల గోడు ► అండగా నిలబడి ఉద్యమిస్తామన్న వైఎస్ జగన్ ► ప్రభుత్వం ఒంటెత్తు పోకడలను పదేపదే ఎండగట్టిన ప్రతిపక్ష నేత ► రాయదుర్గం సెగ్మెంటులో భరోసా యాత్రకు విశేష స్పందన ► కణేకల్లులో ఆత్మహత్య చేసుకున్న రైతు శర్మాస్ కుటుంబానికి పరామర్శ (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అభిమాన నేతను కలిసేందుకు గంటలకొద్దీ రోడ్లపై నిలబడిన వివిధ గ్రామాల ప్రజలు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ వద్ద ఏకరువు పెట్టారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు వాపోయారు. ఈ తరుణంలో సమస్యల పరిష్కారానికి చేయూతనందించాలని విన్నవించారు. గ్రామగ్రామాన వృద్ధులు, మహిళల సాదకబాదకాలను సావదానంగా విన్న వైఎస్ జగన్.. ఉద్యమపంథాలో వాటిని పరిష్కరించుకుందామని చెప్పారు. ఆయన అడుగడుగునా ఆగి బడుగుల వినతిపత్రాలు స్వీకరించారు. వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు. యాత్ర సాగిందిలా... ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లోని నిమ్మకల్లు, సొల్లాపురం, హనుమాన్పురం, మాల్యం, కణేకల్లు, గోనెహాల్క్రాస్, యర్రగుంట, శ్రీధరఘట్ట గ్రామాల మీదుగా వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర సాగింది. ప్రతిగ్రామంలోనూ పెద్దఎత్తున రైతులు ఎదురొచ్చి బాణాసంచా కాల్చి స్వాగతించారు. ఉదయం 10.30 గంటలకు నిమ్మకల్లు చేరిన జగన్‌కు అక్కడి మహిళలు హారతులు పట్టారు. ఆర్టీసీ కార్మికులు బస్సులు నిలిపేసి వైఎస్ జగన్‌ను కలిసి కతజ్ఞతలు తెలిపారు. సొల్లాపురం రైతులు, డ్వాక్రా మహిళలు పూలదండలతో స్వాగతించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బాషా, హుసేనమ్మ.. జగన్‌ను కలిసి ఎనిమిది నెలలుగా వేతనాలు, బిల్లులు అందడం లేదని వినతిపత్రం అందజేశారు. మాల్యం గ్రామం చేరుకున్న జగన్ అక్కడ రోడ్డు పక్కనున్న లాలూనాయక్ కొడుకు జగన్మోహన్రెడ్డిని ముద్దాడి ఆటోగ్రాఫ్ అందించారు. కణేకల్లు వంతెన సమీపంలో ఎండలో నిలబడ్డ మహిళా కూలీలతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. పనుల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి వచ్చామని, ఇక్కడా పనుల్లేవని మహిళలు కేశమ్మ, మల్లమ్మ వివరించారు. ‘పనుల కోసం కరువు జిల్లాకొస్తిరా తల్లీ’ అంటూ వారి నుంచి సెలవు తీసుకున్నారు. కణేకల్లులో ధాన్యం రాశిని ఆరుబయట ఎండబెట్టిన మహిళా రైతు రత్నమ్మను పలకరించారు. వరి ధాన్యానికి ఉన్న ధర, పెట్టుబడి, దిగుబడిపై ప్రశ్నించారు. ఎరువుల ధరలు బాగా పెరిగాయని, వడ్ల(ధాన్యం) ధర మాత్రం రూ.400 తగ్గిందని రైతులు వివరించారు. కణేకల్లు మండల విద్యా వలంటీర్లు కలిసి 2014 అక్టోబరు నుంచి 2015 ఏప్రిల్ వరకూ ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదని వివరించారు. శర్మాస్ కుటుంబానికి పరామర్శ కణేకల్లులో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు గంగవరం శర్మాస్ ఇంటికెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని శర్మాస్ భార్యాపిల్లలకు భరోసా కల్పించారు. అనంతరం గనిగెర గ్రామానికి చేరుకున్నారు. ఎంపీటీసీ సభ్యుడు పాటిక నాగిరెడ్డి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. సీఎం హోదాలో మరోసారి రావాలని నాగిరెడ్డి భార్య రామాంజిమ్మ కోరింది. అక్కడి నుంచి ఉద్దేహాల్ వైపు యాత్ర కొనసాగింది. గోనేహాల్ క్రాస్, శ్రీధరఘట్ట, ఉద్దేహాల్ గ్రామాల్లో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వందలాది మంది రైతులు మోటార్‌బైక్‌లపై జగన్ కాన్వాయ్‌ను అనుసరించారు. ఉద్దేహాల్‌లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించిన ప్రతిపక్షనేత.. ప్రభుత్వ పోకడలపై పెద్దఎత్తున ధ్వజమెత్తారు. ఆరో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ, పార్టీ నేతలు పామిడి వీరాంజనేయులు, సీహెచ్ దిలీప్‌రెడ్డి, వరికూటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేటి జగన్ రైతు భరోసా యాత్ర షెడ్యూల్ ఇలా... అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతుభరోసా యాత్ర ఆదివారం ఏడో రోజుకు చేరుకుంటుంది. రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం.. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ నుంచి బయలుదేరి దేవగిరి గ్రామానికి చేరుకుంటారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గోగినేని నరసింహారావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి డీ. హీరేహాళ్ మండలం పులకుర్తికి చేరుకుంటారు. అక్కడ అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు బోయ రాముడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మండల కేంద్రమైన డీ.హీరేహాళ్ చేరుకుని.. కౌలురైతు తలారి ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
వైఎస్ జగన్ ఆరో రోజు రైతు భరోసా యాత్ర
-
'చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారు'
-
చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారు: వైఎస్ జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు శనివారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉజ్జహల్లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. గ్రామాల్లో పేదలు పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జహల్ సభలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్‌తో మొరపెట్టుకున్నారు. -
'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు'
అనంతపురం:రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో శనివారం ఆరో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కనేకల్ లో ధాన్యాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వరిపంట సాగు చేసే రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు జగన్ కు విన్నవించారు. ధాన్యానికి ప్రభుత్వం రూ. 1360 మద్దతు ధర ప్రకటించినా.. కనేకల్ లో మాత్రం రూ. 1300 లోపే ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. ఎరువుల ధరలు అమాంత పెరిగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం పెట్టుబడులు సైతం గిట్టుబాటు కావకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అనంతలో వైఎస్ జగన్ ఆరో రోజు భరోసా యాత్ర
-
అనంతలో వైఎస్ జగన్ ఆరో రోజు భరోసా యాత్ర
అనంతపురం:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర కొనసాగుతోంది. ఉరవకొండ నుంచి ఆరంభమయ్యే భరోసా యాత్ర కనేకల్ వరకూ కొనసాగనుంది. కనేకల్ లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ రైతు శర్మాస్ కుటాంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. -
ధైర్యంగా ఉండండి
వన్నప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ ఉరవకొండ : ‘కష్టాలున్నాయని అధైర్యపడొద్దు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. పిల్లలను బాగా చదివించాల’ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాతపేటకు చెందిన రైతు అందెల వన్నప్ప భార్య సుశీలమ్మకు సూచించారు. రెండోవిడత రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వన్నప్ప భార్య సుశీలమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది. వైఎస్ జగన్ : ఏం తల్లీ బాగున్నారా? సుశీలమ్మ: వూకు దిక్కు లేకుండా పోరుుంది సార్. జగన్ : పిల్లలు ఎంతమంది తల్లీ? సుశీలమ్మ: ఒక కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు. జగన్ : ఎన్నెకరాల పొలముంది? సుశీలమ్మ : రెండెకరాల సొంత పొలముంది. కౌకుంట్లలో పదెకరాలు గుత్తకు తీసుకున్నాం. జగన్ : పిల్లలు స్కూల్‌కు వెళుతున్నారా? సుశీలమ్మ : వెళ్తున్నార్ సార్. కొడుకు 6వ క్లాసు, పాప 3వ క్లాసు. జగన్: అప్పెంత ఉందమ్మా? సుశీలమ్మ : బయుట రూ.3లక్షల వరకు ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్‌లో నా బంగారు చైను పెట్టి రూ.50 వేలు తీసుకొచ్చాం. జగన్ : ధైర్యంగా ఉండండి. పిల్లలను బాగా చదివించమ్మా.. సుశీలమ్మ: అలాగే సార్. కూలికెళితే గానీ పూట గడవదయ్యా.. వజ్రకరూరు : ‘కూలికెళితే గానీ పూట గడవడం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం సార్’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన రైతు ఓబుళేసు భార్య ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం వైఎస్ జగన్ ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబుళేసు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్, ఓబుళమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది. జగన్ : నీ భర్త ఎలా చనిపోయాడమ్మా ? ఓబుళమ్మ : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. జగన్: ఎంత భూమి ఉంది తల్లీ? ఓబుళమ్మ: రెండు ఎకరాల 40 సెంట్లు ఉంది సార్. దీంతో పాటు 5 ఎకరాల వరకు కౌలుకు సాగు చేశాం. జగన్ : డాక్రా రుణం తీసుకున్నారా? ఓబుళమ్మ : లేదన్నా... జగన్: బంగారు రుణాలు ఏమైనా తీసుకున్నారా తల్లీ? ఓబుళమ్మ : తినడానికే తిండి లేదు సార్. స్టోరు బియ్యమే దిక్కు. బంగారు ఎలా తెచ్చుకుంటాం సార్?! జగన్ : ప్రభుత్వ సాయం అందిందా.. ఎవరైనా పరామర్శించారా తల్లీ? ఓబుళమ్మ: ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. ప్రభుత్వసాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాం. జగన్ : పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఓబుళమ్మ : ఒకబ్బాయి 5వ తరగతి, ఇంకో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నారు సార్. -
ఉసురు ఖాయం
► ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పింఛన్ ఆపుతారా? ► ముసలోళ్ల ఉసురు తగలక తప్పదు ► వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్... ► త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం ► భరోసా యాత్రలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్ ► ఉరవకొండ నియోజకవర్గంలో కొనసాగిన ఐదో రోజు యాత్ర ► సీఎంపై చేనేత కార్మికుల శాపనార్థాలు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఫ్యాన్‌కు ఓటేసినానని నా పింఛను నిలిపేసిరి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురమూ ముసలోళ్లమే. మూడు నెలలుగా అందరికీ పింఛన్ ఆపేశారు. ఇదేమన్నా నాయంగా ఉందాని అడిగితే కసురుకుంటున్నారు బాబూ’ అంటూ కాళ్లు తడబడుతుంటే, గద్గత స్వరంతో పెద్దాయన చెప్పిన మాటలు విన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఏం బాధ పడకు తాతా.. న్యాయం, ధర్మం వదిలేసి నిస్సిగ్గుగా అరాచకాలు చేస్తోన్న టీడీపీ నేతలపై గట్టిగా పోరాడదాం. అన్ని నియోజకవర్గాల్లో పింఛను రాని వృద్ధులను వెంటబెట్టుకుని కలెక్టరేట్‌ను ముట్టడిద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మేమన్నా పాకిస్తాన్లో ఉన్నామా అంటూ కడిగేద్దాం’ అని ధైర్యం చెప్పారు. రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఉరవకొండలో స్థానిక శాసనసభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన చేనేత కార్మికుల ముఖాముఖి నిర్వహించారు. ఎర్రగొండ గ్రామానికి చెందిన వృద్ధుడు వన్నూరప్ప వేదిక పెకైక్కి మైకందుకుని తన గోడు వెళ్లబోసుకున్నాడు. పోయిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసినామని టీడీపీ నాయకులు గ్రామంలో మొత్తం 47 మందికి పింఛన్లను ఆపేశారని ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ తనయుడు శివ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబుకు ముసలోళ్ల ఉసురు తగులుతుందిలే. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్.నువ్వేం బెంగపడక’ంటూ జగన్ నచ్చజెప్పారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, రైతులు సీఎం పీఠం ఎక్కాక చంద్రబాబు విస్మరించిన ఎన్నికల హామీలను లేవనెత్తుతూ ఆయనకు శాపనార్థాలు పెట్టారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలు కట్టే ప్రసక్తిలేదనీ, మోసం చేసిన బాబు వాటిని మాఫీ చేయాలని డిమాండు చేశారు. భగభగ మండే ఎండలోనే.... శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భానుడు ప్రతాపాన్ని చూపాడు. అయినా వెనుకంజ వేయకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండ, పందికుంట, వెంకటంపల్లి గ్రామాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ఉరవకొండలోని రైతు అందెల వన్నయ్య ఇంటికెళ్లి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా చేనేత కార్మికుల కాలనీకి చేరుకున్నారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావదానంగా విన్నారు. ఈ సందర్భంగా చేనేత సంఘం నేతలు చెంగల మహేశ్, చందా వెంకటస్వామి, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ చేనేతలు పడుతున్న ఇక్కట్లు, ప్రభుత్వం అవలంబిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని వివరించారు. చేనేత కార్మికులకు మూడు నెలలుగా నిలిపేసిన రూ.600 సబ్సిడీని పునరుద్ధరించాలని కోరారు. పట్టు, జరీ, నూలు వంటి ముడి సరుకు ధరలు తగ్గేలా చూడాలన్నారు. ముక్కుపుడక కూడా కుదవ పెట్టి అప్పులు తీర్చామని, బాబు మాటలు నమ్మి మోసపోయామని వరలక్ష్మి అనే మహిళ వాపోయింది. చంద్రబాబుకు ఈ మధ్యనే మతిమరుపు వ్యాధి వచ్చిందనీ, ఆ దేవుడు కరుణిస్తేగానీ అది నయం కాదని చమత్కరించిన జగన్.. చేనేత కార్మికుల్లో భరోసా నింపారు. అన్నా...నీకు రుణపడి ఉంటాం.. ఉరవకొండ నుంచి పందికుంట బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నేతలు ఆదినారాయణరెడ్డి, మీసాల రంగన్నతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ డి. శ్రీనివాసరెడ్డి, కొండయ్య, వెంకటేశ్వర్లు, సర్వానాయక్‌లు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ‘అన్నా.. నీకు రుణపడి ఉంటాం.మీరు మద్దతు తెలిపి ప్రకటన చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింద’ని అన్నారు. అనంతరం వైఎస్ జగన్ తట్రకల్లు మీదుగా పందికుంట చేరుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓబులేసు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి వెంకటంపల్లి పెద్దతండా చేరుకుని గోవిందనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత వెంకటంపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జోరున కురిసే వర్షంలోనూ వెంకటంపల్లి, జయరాంపురం గ్రామస్తులు వైఎస్ జగన్ కోసం ఎదురు చూశారు. ఉరవకొండ నుంచి వెంకటంపల్లి వరకూ అభిమానులు ఎండావానలను లెక్క చేయకుండా వెన్నంటే ఉండటం గమనార్హం. జయరాంపురం, షేక్షానుపల్లి గ్రామాల్లోనూ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. స్వాగతం పలికారు. జగన్ వెంట మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు. నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా.. అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతుభరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంటుంది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం.. ఉరవకొండ పట్టణం నుంచి బయలుదేరి వివిధ గ్రామాల మీదుగా కణేకల్లుకు చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గంగవరం శర్మాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
ఉరవకొండలో వైఎస్ జగన్ భరోసా యాత్ర
-
రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. వజ్రకరూరు మండలం పందికుంట ఓబులేసు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఉరవకొండ మండలం వెంకటపల్లి పెదతండాలో ఆత్మహత్య చేసుకున్న గోవింద్ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. యువకులు ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడుతున్నారు. -
'తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు'
-
ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా?
ఉరవకొండ: అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూ.3వేలు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు.. ఆ మూడు వేలు మేం కట్టుకోలేమా అని ఓ మహిళ ఎద్దేవా చేసింది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం ఉరవకొండలో డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండకు చెందిన మల్లేశ్వరి అనే మహిళ మాట్లాడుతూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టొద్దు...నేను అధికారంలోకి వచ్చాక అన్ని మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడని, అయితే ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ఏ రుణాన్ని మాఫీ చేయలేదన్నారు. తీసుకున్న రుణం కట్టకపోతే ఇళ్లకు వస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, తమ ఆస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తన గోడు వెలిబుచ్చింది. తాను రూ. యాభై వేలు రుణం తీసుకుంటే.. మూడు వేలే ఇస్తామనడం ఎంత వరకూ సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీసింది. మరో కార్మికుడు రాజు మాట్లాడుతూ.. తమ కుటుంబం తీసుకున్న ఓ ఒక్క రుణం కూడా మాఫీ కాలేదని చెప్పాడు. తాము రుణమాఫీ ఆశించి భంగపడ్డామని, అంతేకాకుండా కష్టపడి జమ చేసుకున్న తమ అకౌంట్లో ఉన్న రూ.70 వేల రూపాయిలను కూడా బ్యాంకు వారు జప్తు చేసుకున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు రాజు ఓ నివేదికను అందజేశాడు.తమ సమస్యలపై పోరాటం చేయాలని జగన్ కు విన్నవించాడు. -
ఆ మూడు వేలు మేము కట్టుకోలేమా?
-
'తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు'
అనంతపురం : రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ఉరవకొండలో చేనేత, రైతు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుది ఎన్నికలకు ముందు ఒక మాట..తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు ఎవరికీ చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. ఎన్నికలయిన తర్వాత చంద్రబాబు అందరినీ మరిచిపోయారని వైఎస్ జగన్ అన్నారు. ఏం చేశారని చంద్రబాబును అడిగితే... రుణమాఫీ కావడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారు. చేనేత కార్మికులు ఎగిరి గంతేస్తున్నారు. నాకు శాలువాలు కప్పుతున్నారు. సన్మానాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు ఇంత మోసం చేస్తున్నారు. అబద్దాలు ఆడుతున్నారు అంటే అయ్యయ్యో ప్రజలే మోసం చేసుకుంటున్నారు అని' చంద్రబాబు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. చివరకు అవ్వా...తాతాల పింఛన్లతో కూడా చంద్రబాబు ఆడుకుంటున్నారని, ఉళ్లో 100మంది ఉంటే 20మందికి పింఛన్లు ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకోలేక, మరో ఆధారం లేని వాళ్లు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు ఇళ్లు కట్టిస్తాం, మగ్గాలు ఇస్తాం, 50 శాతం సబ్సిడీ ఇస్తామని వాగ్దానాలు చేసి చంద్రబాబు అవన్ని ఇప్పుడు విస్మరించారన్నారు. అనంతపురం జిల్లాలో 11మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు...ఇప్పుడు ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలతోపాటు అందర్ని వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
వన్నప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. ఉదయం ఉరవకొండ నియోజక వర్గంలో యాత్రను ప్రారంభించారు. పట్టణంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు అందెల వన్నప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య పాల్పడిన రైతు ఓబులేసు (అలియాస్ పెన్నోబిలేసు) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా వెంకటాంపల్లి పెద్దతండాకు వెళ్లి రైతు కొర్ర గోవింద నాయక్ (అలియాస్ నాగు నాయక్) కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర రాయదుర్గం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. -
వన్నెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
డ్వాక్రా వ్యవస్థను నాశనం చేశారు
-
తప్పుడు హామీలతో బాబు దగా
-
తప్పుడు హామీలతో బాబు దగా
ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీలిచ్చి మోసం చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. రెండోవిడత రైతుభరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గుంతకల్లు మండలం తివ్మూపురంలో మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు.డ్వాక్రా రుణాలన్నీ వూఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలను మూడు విడతల్లో రూ.3 వేల చొప్పున ఇస్తానంటున్న మాటలపై వారు మండిపడ్డారు. మహిళలతో సాగిన మాటామంతీ ఇలా.... జగన్: నీ పేరు ఏమిటమ్మా? వెంకటలక్ష్మీ: నా పేరు వెంకటలక్ష్మీ. మాది తివ్మూపురం గ్రామం. జగన్: ఎంత రుణం తీసుకున్నావమ్మా? వెంకటలక్ష్మీ: 5 లక్షలు తీసుకున్నాను. రుణవూఫీ అని చెప్పినదానికి మేం రుణం కట్టలేదు. చంద్రబాబు నాయుుడుని తోలుకుని వచ్చి కట్టించుకోండి అని బ్యాంకోళ్లు అంటున్నారు. మేవుు చెప్పల్యా అంటున్నారు. బ్యాంకు మేనేజరు బుక్కు ఇసిరి పారేస్తాది. ఆయున ఎవరు...రావుయ్యు. ఆడోళ్లు గొడవ పెట్టుకోవద్దు అని అంటున్నాడు. అన్ని అవతారాలు చేస్తున్నారు. వాళ్లు జీవితంలో బాగుపడరు. జగన్: నీ పేరేంటమ్మా? నువ్వు ఎంత రుణం తీసుకున్నావు? ఉవు: నా పేరు ఉవు అన్న. రూ.5 లక్షలు ఉంది. వుుందే కట్టేసినాం. పొలం పెట్టి రూ.70 వేల రుణం తీసుకున్నాం. వూఫీ కాలేదు. పొదుపు గ్రూపు వాళ్లు ఇంతకు వుుందు బ్యాంకుకు పోతే మేడమ్, ఎవ్మూ అని పిలిచేవారు. ఇప్పుడు ఒవ్యూ....బయుటకు పో అంటున్నారు. దీనికి చంధ్రబాబే కారణం. వూ రుణాలు వూఫీ చేయువుంటే చేయుడు కానీ...సింగపూర్ చేస్తాడంట ఆయుప్ప. జగన్: నీ పేరు ఏంటమ్మా? నీకు ఏం సవుస్యలు ఉన్నారుు తల్లి? కవులవ్ము: నాకు రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకున్నాను. పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు అదిగో చందవూవు...ఇదిగో చందవూవు అని చెబుతుంటారు. అట్టే చంద్రబాబు కూడా తప్పుడు వూటలు చెప్పినాడు. వుూడు కంతులు వుూడు వేలు కట్టనందుకు ఇప్పుడు నాకు బ్యాంకోళ్లు రుణం కావాలంటే ఇవ్వడం లేదు. జగన్: నీ పేరు ఏంటమ్మా? నీకు ఏమైనా రుణం ఉందా? చంద్రకళ: ఆ ఉంది అన్న. బ్యాంకుల్లో రూ.3.9 లక్షల రుణం ఉంది. రుణవూఫీ అవుతాదని 6 నెలలు కట్టలేదు. దీనికి రూ.50 వేలు వడ్డీ అరుు్యంది. ఆయున రూ. 3 వేలు ఇస్తే ఏం లాభం? వడ్డీకి కూడా సరిపోదుకదన్న. జగన్: బంగారు రుణాలు ఎవరికైనా ఉన్నాయూ? ఆక్షన్ నోటీసులు వస్తున్నాయూ? పెద్దక్క: 2 తులాల బంగారం తాకట్టు పెట్టాను. రూ.35 వేల రుణం తీసుకున్నా. వూకున్న 4.80 ఎకరాల పొలం పెట్టి రూ.50 వేలు తీసుకున్నాం. జగన్: రుణం మాఫీ ఏమైనా అరుు్యందా? పెద్దక్క: ఏం కాలేదు సార్. బంగారం పెట్టినందుకు వేలం వేస్తావుని నోటీసులు వచ్చినారుు. అందుకే అప్పోసప్పో చేసి రుణం కట్టినాం. జగన్: పెద్దమ్మా... నీ పేరు ఏంది? ఏం సవుస్య ఉంది? భీవుక్క: నా పేరు భీవుక్క. నాకు పెన్షన్ రావడం లేదు. నా మొగుడు చచ్చిపోయూ. పింఛను వూత్రం ఇవ్వడం లేదు. జగన్: పింఛన్ల కోసం ధర్నా చేద్దాం పెద్దమ్మా. -
డ్వాక్రా వ్యవస్థను నాశనం చేశారు
* చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ * నాలుగోరోజు రైతు భరోసా * యాత్రలో రెండు రైతు కుటుంబాలకు పరామర్శ అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతుల వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారు. తానలా అనలేదనీ, కేవలం రూ.10 వేలే ఇస్తానని చెప్పానని బుకాయిస్తున్నారు. గోబెల్స్ తరహాలో అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదివేలు కూడా ముష్టి వేసినట్టు ఏడాదికి రూ.3 వేలచొప్పున మూడు విడతలుగా ఇస్తారంట. అది వడ్డీకి కూడా సరిపోదు. వడ్డీలేని రుణాలు పొందే డ్వాక్రా మహిళలు చంద్రబాబు పుణ్యమా అని ఇప్పుడు రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల వ్యవస్థను బాబు నాశనం చేశారు’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజైన గురువారం గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. నియోజకవర్గంలోని నల్లదాసరపల్లి, తిమ్మారంలో ఆత్మహత్య చేసుకున్న ఉసేనప్ప, పుల్లయ్య కుటుంబాలకు ఆయున భరోసానిచ్చారు. అక్కడి నుంచి వజ్రకరూరు మీదుగా ఉరవకొండకు చేరుకున్నారు. ఒక్క హామీ నెరవేర్చలేదు... డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పావలావడ్డీకే రుణాలు ఇచ్చి లక్షాధికారులుగా చేయాలని దివంగత నేత వైఎస్ఆర్ ఆశిస్తే... ఇప్పుడు చంద్రబాబు రుణవూఫీ చేయకపోవడంవల్ల ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిమ్మాపురం గ్రామంలో మహిళలతో ఏర్పాటు చేసిన మాటామంతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాము తెచ్చుకున్న డ్వాక్రా రుణా ల్లో బాబు ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని మహిళలు మండిపడ్డారు. ఈ వుహిళల ఆవేదన వినైనా చంద్రబాబుకు ఎన్నికల మందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలని జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే విధంగా ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు. ఎన్నికల వుుందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి నిజాయితీగా బతకాలని హితవు పలికారు. లేదంటే అమలుచేయలేని హామీలు ఇచ్చి మోసం చేశానని అంగీకరించాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై మండిపడ్డ డ్వాక్రా మహిళలు షలీంబాను: మాది గుంతకల్లు. 5వ వార్డులో ఉంటాను. 5 లక్షల రుణం తీసుకున్నాను. ఇంకా 2.5 లక్షల రుణం ఉంది. తప్పుడు మాటల వల్ల మేం ఆరు నెలలు రుణం కట్టలే. ఇప్పుడు దీనికి వడ్డీ 85 వేలు అయింది. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలే. ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవాలె. జగన్: చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు ఇస్తానంటున్నాడుగా? షలీంబాను: మాకు ఏడాదికి 3 వేలు ఇచ్చేది ఏంది? మేమే కావాలంటే రూ.10 వేలు ఇస్తాము. సరైన సీఎం అయితే మా ముందుకు వచ్చి మాట్లాడాలె. లక్ష్మీనారాయణమ్మ: మాకు 2 ఎకరాల పొలం ఉంది. దీని కింద రూ.14 వేల రుణం తీసుకున్నాం. ఈ రుణం మాఫీకాలే. డ్వాక్రా రుణం రూ. 5 లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ అవుతుందని రుణాలు కట్టలేదు. 3 నెలలు కట్టలేదు. దీనికి రూ.45 వేలు వడ్డీ అయింది. జగన్: రూ. 5లక్షలకు మూడు నెలలు కట్టకపోతే రూ.45 వేల వడ్డీ అయిందా? లక్ష్మీనారాయణమ్మ: అవును సార్. గ్రూపులో కొద్దివుంది ఈ వడ్డీలు కట్టలేం. యూడి నుంచి తెచ్చి కట్టాలా అని వెళ్లిపోయినారు. జగన్: గ్రూపు నుంచే వెళ్లిపోయారా? లక్ష్మీనారాయణమ్మ: అవును సార్. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పావలావడ్డీ వస్తుండే. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని దేవునిలాగా పూజిస్తాం సార్. జగన్: నీపేరు ఏంటమ్మా? మీది ఏ గ్రూపు, ఎంత రుణం తీసుకున్నావు? లక్ష్మి: నా పేరు లక్ష్మి. మాది గుంతకల్లు. శ్రీలక్ష్మీ గ్రూపు ద్వారా రూ.3 లక్షలరుణం తీసుకున్నాం. చంద్రబాబు మాటలు నమ్మి కట్టలేదు. తర్వాత లోనుకోసం బ్యాంకుకుపోతే పాసుబుక్కులు పక్కకు పెడుతున్నారు. అందుకే నగ, నట్ర తాకట్టు పెట్టి రుణాలు కట్టాం. అయినా ఇప్పుడు కొత్త లోన్లు ఇవ్వమంటున్నారు. చంద్రబాబు విదేశాల మీద మోజుతో ఇక్కడి ప్రజలను మర్చిపోతున్నారు. అటువంటి ఆయన మనకు అవసరమా? జగన్: ఏమ్మా నీ పేరు ఏంటి? లీలావతి: నా పేరు లీలావతి అన్నా. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు అబద్దాలు చెప్పినాడు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. ఎవరికైనా ఒక్క రూపాయైనా మాఫీ చేసినాడా? గొలుసులు కుదవ బెట్టుకుని నల్లదారాలు వేసుకుని ఉంటున్నాము. మేము ఏం తిని బతకాలి? ఉద్యోగం రాలేదని నా కొడుకు ఇంటిమొకం రాకుండా ఉన్నాడు. జగన్: ఎంత లోను తీసుకున్నావమ్మా? లీలావతి: లక్షరూపాయలు తీసుకున్నాను. రూ.30 వేలు కట్టినాము. ఇంకా బంగారం లోను రూ. 70 వేలు ఉంది. మాఫీకాలేదు. జగన్: డ్వాక్రా సంఘంలో ఏమైనా లోను తీసుకున్నావా తల్లీ? లీలావతి: 3 లక్షలు తీసుకునింటిమి. చంద్రబాబు బాధ తాళలేక కట్టేసినాం. రూపాయి కూడా మాఫీ కాలేదు..! రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లిలో కురుబ మశేనప్ప, ఎన్.తిమ్మాపురంలో కసాపురం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. 3.67 ఎకరాల భూమిలో బోర్లకు, వ్యవసాయానికి రూ.4 లక్షలు అప్పుచేశామని, రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. అప్పుల బాధ భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని, ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. ఇద్దరికీ చెరో రూ.50వేలు సాయం అందించారు. -
తిమ్మాపురంలో వైఎస్ జగన్ భరోసా యాత్ర
-
పాస్‌బుక్‌లు విసిరి పారేస్తున్నారు
-
హుస్సేన్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
పాస్‌బుక్‌లు విసిరి పారేస్తున్నారు..
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన గురువారం తిమ్మాపురంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు. అనంతరం రైతు, డ్వాక్రా సంఘాలతో వైఎస్ జగన్ ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా మహిళలు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. తమకు రుణాలు మాఫీ కావటం లేదని రైతులు, డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని, డ్వాక్రా మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు జనాల చెవుల్లో పువ్వులు పెట్టారని అన్నారు. ఏమీ తెలియని వారికి ఏ విషయం అయినా చెప్పవచ్చని, అన్ని తెలిసిన కూడా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు విదేశాలపై ఉన్న మోజు ఏపీపై లేదని ఆయన విమర్శించారు. కాగా రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఎక్కడా చేయలేదని, ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, మహిళలకు కొత్త రుణం కూడా మంజూరు చేయలేదన్నారు. రుణాల కోసం బ్యాంక్‌లకు వెళితే అధికారులు పాస్‌బుక్‌లు విసిరి పారేస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. అంతకు ముందు నల్లదాసరిపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. తాగునీటి కోసం అల్లాడిపోతున్నామని, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని నల్లదాసరిపల్లి గ్రామస్తులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
హుస్సేన్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర నాలుగోరోజు గురువారం వైఎస్ జగన్ గుంతకల్లు మండలంలో పర్యటించారు. వైఎస్ జగన్ కు గుంతకల్లులో కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభమైన యాత్ర నల్లదాసరపల్లికి చేరుకుంది. నల్లదాసరిపల్లి గ్రామంలోని హుస్సేన్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. మంచిరోజులు వస్తాయి. అప్పటివరకూ దైర్యంగా ఉండండని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం తిమ్మాపురం గ్రామానికి వెళ్లి రైతు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం డ్వాక్రా సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఉరవకొండ నియోజక వర్గంలో యాత్ర కొనసాగనుంది. -
నాలుగోరోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
-
నాలుగోరోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగో రోజు కొనసాగించనున్నారు. గురువారం ఆయన జిల్లాలోని నారదాపురపల్లి, తిమ్మాపురం లలో పర్యటించనున్నారు. నారదాపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ హుస్సేనప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తిమ్మాపురంలో ఆత్మహత్య చేసుకున్న పుల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ తరువాత అదే గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. -
కుంగిపోవద్దు
► కష్టాలు కలకాలం ఉండవు ► వాటిని ధైర్యంగా ఎదుర్కొందాం ► గుంతకల్లు అసెంబ్లీ సెగ్మెంటులో బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ ► గుత్తి నుంచి గుంతకల్లు వరకు పోటెత్తిన అభిమానులు ► మండే ఎండను సైతం లెక్క చేయక అడుగడుగునా స్వాగతం (గుంతకల్లు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘కష్టాలు కలకాలం ఉండవు. వాటిని తల్చుకుని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి. నేను అన్నివిధాలా అండగా ఉంటా. త్వరలోనే మంచి రోజులొస్తాయ’ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు మండలాల్లో నాలుగు కుటుంబాలను పరామర్శించారు. యాత్ర సాగిందిలా... మంగళవారం రాత్రి గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత వీకే సుధీర్‌రెడ్డి ఇంట్లో బస చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 8.30 గంటలకు తన దగ్గరకు వచ్చిన పార్టీ గుంతకల్లు నియోజకవర్గం నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్లందరినీ పలకరించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించారు. సరిగ్గా 9.30 గంటలకు రైతు భరోసా యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గుత్తి ఆర్టీసీ బస్టాండులోకి వెళ్లి సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులను కలిసి..సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత జూనియర్ కళాశాల సెంటర్ మీదుగా లచ్చానుపల్లి బయలుదేరారు. స్వస్థతశాలలో ప్రార్థనలు ముగించుకుని ఎదురొస్తోన్న మహిళల అభ్యర్థన మేరకు ఆగి.. కొద్దిసేపు వారితో సంభాషించారు. స్వస్థతశాలలో ప్రార్థనలు వైఎస్ జగన్ లచ్చానుపల్లి దారిలోని స్వస్థతశాలలో మహిమ సువార్త మహాసభలకు హాజరయ్యారు. ఫాదర్ అద్భుతరావు నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ప్రార్థనలకు హాజరైన వారికి అభివాదం చేశారు. అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ‘అక్కా..చెల్లెమ్మా’ అంటూ ఎదురొచ్చిన మహిళలను పలకరించి.. వారి సాధక బాధకాలపై ఆరా తీశారు. లచ్చానుపల్లి పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు జగన్‌ను చూసి పరుగు పరుగున కాన్వాయ్ దగ్గరకు చేరారు. ‘ఏమ్మా డ్వాక్రా రుణాలు తీరాయా? ఏమవ్వా...పింఛను వస్తోందా’ అని అడిగారు. వచ్చే నెల 5,6 తేదీల్లో పింఛన్లు, డ్వాక్రా రుణాలపై పోరాటం చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం దీక్ష చేపట్టనున్నామని చెప్పారు. స్థానికంగా ఏమైనా ఇబ్బందులుంటే గుంతకల్లు వెళ్లి వెంకట్రామిరెడ్డి అన్నను (పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త) కలవాలని గ్రామస్తులకు సూచించారు. కరెంటు షాక్‌తో తన భర్త పెద్దన్న చనిపోయినా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మూడు నెలలుగా వృద్ధాప్య పింఛను అందడం లేదని, రేపు మాపంటూ అధికారులు తిప్పించుకుంటున్నారని మేకల చెన్నంనాయుడు అనే వృద్ధుడు వాపోయాడు. వీరిద్దరికీ ధైర్యం చెప్పి సమస్య పరిష్కరించాలని వెంకట్రామిరెడ్డికి సూచించారు. ఉదయం 11 గంటలకు లచ్చానుపల్లికి చేరుకుని.. 2014 ఆగస్టు 9న ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్.. రోడ్డుకి ఇరువైపులా తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్ని పలకరించారు. దారి పొడవునా స్వాగతం వైఎస్ జగన్ లచ్చానుపల్లి నుంచి వైటీ చెరువుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఓబులాపురం అడ్డరోడ్డు దగ్గర పెద్దఎత్తున అభిమానులు, రైతులు తప్పెట్లతో స్వాగతం పలికారు. పొలాల్లో నీళ్లు పెడుతున్న కూలీలు పరుగున వచ్చి జగన్‌తో కరచాలన ం చేసేందుకు ప్రయత్నించారు. కొంగనపల్లి, పాత కొత్తచెరువు గ్రామస్తులు కూడా ఘన స్వాగతం పలికారు. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో 2014 జూన్ 30న ఆత్మహత్య చేసుకున్న రైతు కూరాకుల సుధాకర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. సాయంత్రం నాలుగుకు గుండాల గ్రామానికి చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆత్మహత్య చేసుకున్న రైతు నెట్టెప్ప కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత గ్రామ పెద్ద తోట జంపయ్య ఇంటికెళ్లి ఆయన యోగక్షేమాలపై ఆరా తీశారు. అనంతరం గుంతకల్లు చేరుకున్నారు. మిల్లుకాలనీకి చెందిన బండ్ల సారాబీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైనాన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రమాదానికి కారణమైన వాహన యజమానిపై ప్రయివేటు కేసు వేసి.. నష్టపరిహారం రాబడదామని ఆమెను ఓదార్చారు. గుంతకల్లుశివారులోని అంబేద్కర్‌నగర్‌లో అరగంటకు పైగా మహిళలు, వృద్ధులతో మాట్లాడారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వెల్లువెత్తిన అభిమానం గుంతకల్లులో వైఎస్ జగన్‌పై అభిమానం వెల్లువెత్తింది. తండోపతండాలుగా తరలివచ్చిన అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి జగన్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. వాల్మీకి నగర్, 12వ వార్డుల్లో అరగంటకు పైగా ఆగిన జగన్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పాత శివాలయం సమీపంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీలర్ చాకలి మధుబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొత్తమ్మీద గుత్తి నుంచి గుంతకల్లు వరకూ భరోసా యాత్ర దిగ్విజయంగా సాగింది. పెద్దఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్‌ను అనుసరించారు. ఆయన రాత్రి 9.15 గంటలకు పార్టీ నేత వెంకట్రామిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. మూడో రోజు భరోసా యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు. నేటి రైతు భరోసా యాత్ర ఇలా... అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాల్గో రోజు రైతు భరోసాయాత్ర గురువారం ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నల్లదాసరపల్లికి చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కురుబ ఉసేనప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం తిమ్మాపురం గ్రామానికి వెళ్లి... రైతు కసాపురం పుల్లయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం డ్వాక్రా సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
బాబు మాటలు నమ్మి మోసపోయాం
సాక్షి నెట్వర్క్: ఇదీ అనంతపురం జిల్లాలో రైతుల వ్యథాభరిత జీవితాలు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో పెల్లుబుకిన ఆవేదన ఇదీ.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు తమ కష్టాలను జగన్‌తో చెప్పుకుని భోరుమంటున్నారు. ‘‘చంద్రబాబు ఏం చెబుతారో, ఏం చేస్తారో తెలియదు? ఆయన ధోరణి ఆయనదే? రాష్ట్రంలో రూ.87వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా తొలి విడతగా కేవలం 12 వేల కోట్లే విడుదల చేశారు. ఆ మొత్తంతో వడ్డీ కూడా మాఫీ కాలేదు. ఆయన పాలనలో ఈ ఐదేళ్లూ కష్టాలు తప్పవు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యల జోలికి వెళ్లవద్దు. మీకు నేనున్నా. మనకూ మంచి రోజులు వస్తాయి. అప్పటివరకూ ధైర్యంగా ఉండండి’’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు. రెతు భరోసాయాత్ర మూడో రోజైన బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. మొదటగా గుత్తి మండలం లచ్చానుపల్లికి చెందిన రైతు కె.శ్రీకాంత్‌రెడ్డి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. రైతు భార్య కె.లక్ష్మి, తండ్రి లింగారెడ్డి, తల్లి లక్ష్మిదేవితో వివరాలడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం గుంతకల్లు మండలం వైటీచెరువు గ్రామానికి చెందిన రైతు కురాకుల సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత గుండాల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బండారు నెట్టెప్ప కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. శాసనసభలో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తానని ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పత్రాన్ని జగన్ తీసుకున్నారు. నెట్టెప్ప కుటుంబానికి రూ.50వేలు సాయం అందించారు. చివరగా బుధవారం రాత్రి ఆయన పాత గుంతకల్లుకు చెందిన రేషన్‌డీలర్ మధుబాబు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పింఛన్లకోసం కలెక్టరేట్లను ముట్టడిద్దాం: జగన్ అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు సర్కారు మానవత్వంలేకుండా వ్యవహరిస్తోంది... పండు ముదుసళ్లకు ఇచ్చే పింఛన్లలోనూ కోతలు పెడుతుంది... ఎవరైనా చనిపోతే, టీడీపీ కార్యకర్తలు చెప్పినవారికే కొత్త పింఛన్లు ఇస్తున్నారు... ఈ అన్యాయాన్ని సహించవద్దు... అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కలెక్టరేట్లను ముట్టడిద్దాం... ప్రభుత్వాన్ని స్తంభింపచేద్దామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పాతకొత్తచెరువు గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛను ఇవ్వడంలేదని జగన్ వద్ద వాపోయినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. తన భర్త పెద్దన్న విద్యుత్ షాక్ కొట్టి చనిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని లచ్చానుపల్లికి చెందిన పెద్దక్క తన గోడు వెల్లబోసుకున్నారు. తనకు యూక్సిడెంట్ జరిగి నడుములు విరిగినా నష్టపరిహారం అందలేదని గుంతకల్లులోని మిల్కాలనీకి చెందిన బండ్ల సారాబీ వాపోయారు. ఈ విషయాలపై ప్రైవేటు కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు ఇప్పటివరకూ మాఫీ కాలేదని లచ్చానుపల్లిలో మహిళాకూలీలు జగన్‌కు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఈ సమస్యల పరిష్కారం కోసమే వచ్చేనెల గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేయనున్నట్లు జగన్ వారికి చెప్పారు. వైఎస్ జగన్‌తో రైతు కుటుంబాల ఆవేదన ఒకటిన్నర ఎకరా పొలంలో 12 బోర్లు వేయించినా నీళ్లు పడలేదు. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రెన్యూవల్ చేసుకోకపోవడంతో పంట బీమా కూడా దక్కలేదు. అప్పులు ఎక్కువై నా భర్త సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లల చదువు విషయమే పెద్ద బెంగగా ఉంది. - రామాంజినమ్మ, వైటీచెరువు, గుంతకల్లు మండలం నాకు ఆరెకరాల పొలం ఉంది. పత్తి, ఆముదం, వేరుశనగ సాగు చేశాం. బ్యాంకులో లక్ష, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3.5 లక్షలు అప్పులు చేసి వ్యవసాయం చేశాం. పంటలు సరిగా పండకపోవడంతో అప్పుల బాధ తాళలేక నా కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. - లింగారెడ్డి, లచ్చానుపల్లి, గుత్తి మండలం చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. అప్పుల బాధ భరించలేకే నా తండ్రి నెట్టెప్ప ప్రాణం తీసుకున్నారు. గుంతకల్లులోని కెనరా బ్యాంకులో నా తండ్రి పేరిట రూ.53 వేలు, అమ్మ పక్కీరమ్మ పేరిట రూ.55వేలు రుణం తీసుకున్నాం. నాన్న పేరిట రూ.7400లు, అమ్మ పేరిట రూ.7800లు రుణం మాత్రమే మాఫీ అయ్యింది. కుటుంబం గడవడానికి ఉపాధిహామీ పనులకు వెళ్తున్నా. - శ్రీనివాసులు, గుండాల, గుంతకల్లు మండలం టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి నా అన్నను వేధించారు. రేషన్‌షాపు రద్దు చేయించారు. రెండుసార్లు స్టే తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఒత్తిళ్లు తాళలేక మా అన్న మధుబాబు మార్చి 19న ఆత్మహత్య చేసుకున్నారు. - గీతాంజలి, పాత గుంతకల్లు