జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరోరోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన మహానంది మండలం వెంగళరెడ్డి పేట నుంచి యాత్రను ప్రారంభించారు. రోడ్ షో బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదగా మహానంది చేరుకుంటుంది. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది.