
రైతు రామచంద్రారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్ జిల్లాలోని ఆర్.తుమ్మలపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
కడప: వైఎస్సార్ జిల్లాలోని ఆర్.తుమ్మలపల్లిలో రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదివారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్.. అన్నివిధాలా అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
అంతకుముందు లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వ్యవసాయంతో నష్టపోయి .. అప్పులు తీరే మార్గంలేక.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తున్నారు.