- రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది
- రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి, గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి వస్తుంది
- చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది
- ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా
- ఆయనవల్ల మేలు జరగకపోగా వరుసగా ఇప్పటికి మూడేళ్లు కరువే కరువు
- చంద్రబాబు సీఎం అవ్వడం కోసం ఆ రోజుల్లో.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు
- రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు
- రైతులను వదల్లేదు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్లనూ వదల్లేదు
- ఏ గోడమీద రాతలు చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చెప్పేవారు
- డ్వాక్రా సంఘాల అప్పులన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేవారు
- రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు
- జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు
- చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు
- రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చదువుకున్న పిల్లలను మోసం చేశారు
- చంద్రబాబు సీఎం అయ్యి 32 నెలలైంది.. ఆయన నాకు 64వేలు బాకీ అని ఓ యువకుడు అడిగారు
- తాను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు
- కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశాం
- రబీ పంటలు వేశాం. కానీ రైతులు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నారు
- పంట రుణాలు 24వేల కోట్లు, టెర్మ లోన్స్ మరో 9800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు చంద్రబాబు పుణ్యమాని కేవలం 4900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు
- మరి ఈ ముఖ్యమంత్రి బ్యాంకులను నిలదీయాల్సింది పోయి, క్యాబినెట్ మీటింగులో రైతుల గురించి మాట్లాడలేదు
- బయటకొచ్చాక బ్యాంకులిచ్చింది సంతృప్తికరంగా ఉందని చెప్పారు
- ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నా
- రైతులు ఉల్లిపంట వేసి.. కిలో 2 రూపాయలు కూడా గిట్టక పొలంలోనే వదిలేశారు
- గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నా చేస్తుంటే వాళ్లమీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు
- ఉల్లి, టమోటా, మిర్చి, చివరకు ధాన్యం పరిస్థితి కూడా అంతే
- కర్నూలు సోనా అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం
- కానీ ఆ ధాన్యం బస్తా 1250-1300 కూడా కొనే నాథుడు దొరకడం లేదు
- ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి
- రైతులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు
- రాష్ట్రం జీడీపీ గ్రోత్‌రేటులో దేశం కన్నా ముందు పరిగెడుతోందని చెబుతారు
- ఈ పాలనను సాగనంపేందుకు మీ అందరూ చేయి చేయి కలపాలి
- అడుగులో అడుగు వేయాలి.. చంద్రబాబు లాంటి మోసకారులు, అబద్ధాలు ఆడేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తుందని అర్థం కావాలి
- అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నా