
రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల కుయుక్తులను ప్రజలు ఖాతరు చేయడం లేదు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు.
ప్రతీ పల్లెలో వైఎస్ జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ నాయకుల పన్నాగం పారకపోవడంతో కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్ర ఐదో రోజు కదిరి నుంచి ప్రారంభమైంది.