అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదో రోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో భరోసా యాత్ర చేరుకుంది. గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. రుణాలు మాఫీ కాలేదని , కొత్త రుణాలు ఇవ్వడంలేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా జగన్ కు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మడకశిర నియోజక వర్గం తిరుమల దేవరపల్లి లో ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత హనుమంతరాయునిపాళెంలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.