
ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం ముగిసింది.
ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటించారు. మొత్తం 28 మంది, రైతు చేనేత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో గ్రామాగ్రామాన వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు.