
'వైఎస్ జగన్ వల్లే ప్రభుత్వం అంగీకరించింది'
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు ఆదివారం మడకశిర నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ను దిన్నేహట్టిలో జేఏసీ నేతలు కలిశారు.
వైఎస్ జగన్ ఒత్తిడితోనే వేతనాలను పెంచేందుకు ఏపీ సర్కార్ అంగీకరించిందని జేఏసీ నేతలు అభినందించారు. వైఎస్ జగన్ సమక్షంలో మున్సిపల్ జేఏసీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. మున్సిపల్ జేఏసీ నేతలు వైఎస్ జగన్కు శాలువా కప్పి నంది చిత్రపటాన్ని బహూకరించారు.