
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
కర్నూలు : జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ఈ యాత్ర మూడోరోజుకు చేరింది. ఆయన ఈ సందర్భంగా వేల్పనూరులో మాట్లాడుతూ రైతులు, నిరుద్యోగులు, మహిళలను చంద్రబాబు నాయుడు మోసగించారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు రుణమాఫీ మాటే మరిచిపోయారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇక బుడ్డా శేషారెడ్డి కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. బుడ్డా శేషారెడ్డికి అన్నివిధాలుగా అండగా ఉంటా. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు.
(కాగా గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కర్నూలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.)