కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నా: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్ర ఏడో రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన ఏమన్నారంటే..
- కేంద్రం, చంద్రబాబు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తాం
- రాహుల్ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు
- ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది వైఎస్ఆర్సీపీనే
- చంద్రబాబు పాలన మోసపూరితం
- రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు
- ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన పేరుతో యువతను మోసం చేశారు
- రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- పోస్టుమార్టం రిపోర్టు ఉన్నా చాలామందికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడంలేదు
- పబ్లిసిటీ వచ్చేచోట మాత్రమే చంద్రబాబు పరిహారం ఇస్తారా?
- ఏరైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా పార్టీలతో సంబంధం లేకుండా 5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే
- ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశా
- మంగళగిరిలో ఇదే అంశంపై రెండు రోజుల దీక్ష కూడా చేశా