
ఈరన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండోరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆయన బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈరన్న కుటుంబసభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్...వారికి అండగా ఉంటానన్నారు.
అనంతరం వైఎస్ జగన్ ముదిగల్లు బయల్దేరారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న బోయ నారాయణప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. తర్వాత మల్లిపల్లి, తూర్పుకోడిపల్లి మీదగా వర్లి చేరుకుంటారు. అక్కడ హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. రాత్రికి కల్యాణదుర్గంలో ఆయన బస చేస్తారు. అంతకు ముందుగా వైఎస్ జగన్ కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమి పూజ చేశారు.