
మూడోరోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ఉదయం కల్యాణదుర్గం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆయన కల్యాణదుర్గం, పెనుకొండ నియోజక వర్గాల్లో ఆయన పర్యటించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. కాసేపట్లో కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
అనంతరం ఒంటాపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్నిపరామర్శిస్తారు. తర్వాత పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుని అక్కడ చేసుకున్న లక్ష్మీదేవి, పెద్ద పాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు.
కాగా యాత్ర ప్రారంభనికి ముందు ఉపాధ్యాయ సంఘాల నేతలు వైఎస్ జగన్ ను కలిశారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు జగన్ ను కోరారు. హెల్త్ కార్డులు జారీ చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని సంఘాల నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.