
కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమిపూజ
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుకుటుంబాలకు ఆదుకునేందుకు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన కళ్యాణ దుర్గం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అంతకముందు కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు. నేరుగా బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ముదిగల్లు చేరుకుంటారు. అక్కడ బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం వర్ణి లో హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.