అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కొనసాగుతోంది
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా గురువారం ఆయన కల్యాణదుర్గం, పెనుకొండ నియోజక వర్గాల్లో ఆయన పర్యటించి నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన ఒంటాపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తర్వాత పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుని అక్కడ చేసుకున్న లక్ష్మీదేవి, పెద్ద పాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు.