
అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసాయాత్ర ఆరవ రోజు ముగిసింది. మడకశిర నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారిని ఓదార్చారు. పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని, రైతుల తరఫున పోరాడుతానని వైఎస్ జగన్ తెలిపారు.
దేవరహట్టిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధలు తాళలేక ఎస్ ఎస్ గుండ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబాన్ని కలిసిన ఆయన వారికి దైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ను అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కలిశారు.