నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా? | why should irrigated land be given to solar power plant, asks ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా?

Published Sat, Jun 4 2016 12:50 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా? - Sakshi

నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా?

రాయలసీమలో సాగునీటి వసతి ఉండి.. పంటలు పండటమే కష్టమని, అలాంటిది కాస్తో కూస్తో నీటి వసతి ఉండి.. పంటలు పండే భూములనే సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాయలసీమలో సాగునీటి వసతి ఉండి.. పంటలు పండటమే కష్టమని, అలాంటిది కాస్తో కూస్తో నీటి వసతి ఉండి.. పంటలు పండే భూములనే సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు భరోసాయత్రలో భాగంగా నాలుగో రోజు ఆయన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్‌పీ కుంట గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఇలా భూములు లాక్కున్నా.. కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇక్కడివాళ్లకు సోలార్ పవర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇవ్వలేదేమని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

  • సోలార్ ప్లాంటు పెట్టడం కోసం భారీ మొత్తంలో భూములను ఎన్టీపీసీకి ప్రభుత్వం ధారాదత్తం చేసింది.
  • 7500 ఎకరాల్లో 750 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు పెడతామని, ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు
  • ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు
  • సోలార్ పవర్ ప్రాజెక్టు ఇక్కడే ఉంటే.. ఇక్కడివాళ్లకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు?
  • అలాంటప్పుడు ప్రాజెక్టుకు భూములు ఎందుకు ఇవ్వాలి
  • ఆ భూములకు ఒకవైపు పెద్దపల్లి రిజర్వాయర్, మరోవైపు వెలిగొండ రిజర్వాయర్ ఉన్నాయి.
  • భూమి మధ్యలో నుంచి హంద్రీనీవా కాలువ పోతూ ఉంటుంది
  • సీమలో పంటలు పండని పరిస్థితిలో.. కాస్తో కూస్తో పండే భూములే అవి
  • అక్కడే ఆ భూములే ఇవ్వడంలో అర్థమేముంది
  • ప్రభుత్వానికి రవ్వంతైనా తెలివి ఉందా
  • ఈ భూముల్లో దాదాపు 2220 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్నాయి
  • వీటిని భూములు లేని పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు
  • పేదవాడి భూములంటే చంద్రబాబు ఆయన అత్తగారి సొత్తనుకుంటారు
  • 153 ఎకరాల పట్టాభూమికి రూ. 3.25 లక్షలు ఇస్తారు
  • ఎసైన్డ్ భూములకు కేవలం రూ. 2.10 లక్షలు ఇస్తే సరిపోతుందంటారు
  • పేదవాళ్లంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం.. వాళ్ల భూములు భూములు కావా
  • పేదలు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ ఇవ్వాలి లేదా సమానంగానైనా ఇవ్వాలి
  • 1250 ఎకరాలను సాగుదారు రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నారు
  • వాటికి పన్నులు కడుతున్నారు, బోర్లు వేశారు, కరెంటు బిల్లులు కడుతున్నారు
  • వాళ్ల పేరుతో పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి నీళ్లున్నచోట సోలార్ ప్రాజెక్టు పెట్టడం ఏంటి
  • వీళ్లకు ఆ లక్ష రూపాయలలో రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
  • సర్వేలు, నోటీసులు అంటారు.. ఇంకొకటి అంటారు గానీ పరిహారం మాత్రం ఇవ్వరు
  • ఎన్టీపీసీ వాళ్లు భూమలు మొత్తాన్ని చదును చేసేసి.. అక్కడ సోలార్ ప్యానళ్లు కూడా పెట్టేశారు
  • ఇప్పుడు పక్క రైతులు ఆ భూములు మీవేనని చెబితే పరిహారం ఇస్తామంటారు
  • చంద్రబాబుకు ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అని అడుగుతున్నా
  • అసైన్డ్ భూములు కొనుక్కున్న , సాగుదారు రైతుల తరఫున అడుగుతున్నా
  • ఇచ్చే 3.25 లక్షలే తక్కువ.. కనీసం దాన్నే అందరికీ అయినా వర్తింపజేయాలి
  • రైతుల తరఫున పోరాడతాం, వారికి తోడుగా, బాసటగా ఉంటాం
  • అనంతరం  ఎన్పీ కుంటలో సోలార్ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన వైఎస్ జగన్ ను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement