
చంద్రబాబుకు చెప్పులు కాదు చీపుర్లు చూపించండి
అనంతపురం: ప్రజలను మోసం చేస్తున్న, అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు ఆదివారం ఓబులదేవరచెర్వులో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మోసం చేసినా, జేబులు కొట్టినా 420 కేసులు పెడతారని, మోసం చేసి సీఎం పదవిలో కూర్చున్న చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలని ప్రశ్నించారు.
'మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయకూడదట, అడగకూడదట. ఆయన మాత్రం మోసం చేయొచ్చంట. ఏమైనా చేయొచ్చంట. అలాంటి వ్యక్తికి జ్ఞానోదయం కావాలంటే ఏం చేయాలి? చంద్రబాబుకు చెప్పులు చూపించడం ఇష్టంలేదట. ఈ సారి చెప్పులు కాదు.. చీపుర్లు చూపించండి. చంద్రబాబు సర్కార్ను బంగాళాఖాతంలో కలిపేవరకు ఉద్యమిద్దాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలి' అని వైఎస్ జగన్ అన్నారు.