
నరసింహారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రం ఆదివారం నాటికి ఏడో రోజుకు చేరింది.
ఈ రోజు ఉదయం ఉద్దేహల్ నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆరంభమైంది. దేవగిరి క్రాస్ వద్ద వైఎస్ జగన్ వ్యవసాయ కూలీలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవగరిలో ఆత్మహత్య చేసుకున్న రైతు నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిమ్మలాపురం, నాగలాపురం గ్రామాల్లో వైఎస్ జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగులాపురంలో కరెంట్ షాక్తో మరణించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మారన్న కుటుంబాన్ని పరామర్శించారు. పూలకూర్తిలో రైతు రాముడి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చారు.