
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
అనంతపురం : రైతుల సమస్యలపై అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. నేడు ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గుదిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఉజ్జనిపురంలో రైతు మల్లప్ప, అలుపనపల్లిలో రైతు రామిరెడ్డి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించనున్నారు.