madakashira
-
AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి
సాక్షి, సత్యసాయి: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని మిని టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద శనివారం తెల్లవారుజామున లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. -
మడకశిరలో మిస్సింగ్.. కర్ణాటకలో బాలుడి మృతదేహం
శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అదృశ్యమైన బాలుడు చేతన్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని కర్ణాటక అటవీ ప్రాంతంలో గుర్తించారు.వివరాల ప్రకారం.. మడకశిర నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్నటి నుంచి చేతన్ కనిపించకపోవడంతో బాలుడు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో చేతన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో, చేతన్ పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
మడకశిర సమన్వయకర్తగా ఓ సామాన్యుడికి ఛాన్స్
-
గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్
‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తండ్రి 75వ జయంతిని(ఆగస్ట్ 15) పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ ఈ భారీ విరాళాన్ని అందించారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని రఘువీరా రెడ్డి ఎందుకు ప్రకటించాల్సి అవసరమేంటి అనుకుంటున్నారా? ఈ కేజీయఫ్ డైరెక్టర్ ఎవరో కాదు.. రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి సొంత కుమారుడే. ప్రశాంత్ నీల్ పుట్టిపెరిగింది బెంగళూరులో అయినా.. అతని స్వంత గ్రామం మాత్రం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్‌నీల్ తండ్రి మరణించారు. నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అందుకే ప్రశాంత్ నీత్ తరచు ఈ గ్రామానికి వస్తుంటాడు. (చదవండి: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సామ్రాట్ భార్య) తండ్రి 75వ జయంతి సందర్భంగా సోమవారం తండ్రి సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించిన ప్రశాంత్.. అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రశాంత్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘. నాకు, నీలకంఠాపురం గ్రామం ప్రజలకు ఇది గర్వించే క్షణం. నా సోదరుడి కుమారుడు ప్రశాంత్ నీల్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి సరిగ్గా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగష్టు 15న జన్మించారు’అని రఘువీరా ట్వీట్ చేశారు. A proud&happy moment for me and to the villagers of Neelakantapuram as my nephew @prashanth_neel for his heart warming contribution of 50lakhs towards the construction of LV Prasad Eye Hospital in our Neelakantapuram on the 75th birth anniversary(15/08/1947)of his father Subhash. pic.twitter.com/UbAVtZWGnu — Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 15, 2022 -
KGF ప్రశాంత్ నీల్.. మన బంగారమే
కేజీఎఫ్.. కేజీఎఫ్.. కొద్దిరోజులుగా ఎవరినోట విన్నా ఇదే మాట. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కి మన బాక్సాఫీస్ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. అసలు అప్పటివరకూ ప్రాచుర్యంలోనే లేని శాండిల్‌వుడ్ (కన్నడ సినీ పరిశ్రమ)నే కాకుండా యావత్తు దేశ సినీ ఖ్యాతిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతటి ఖ్యాతి గడించిన ఈ ప్రశాంత్ నీల్ ఎవరంటే...అచ్చంగా మనోడే. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. తన మూడో సినిమాతోనే ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రశాంత్‌నీల్ వెండితెర ప్రయాణం, జీవన గమన విశేషాలపై ప్రత్యేక కథనం. మడకశిర(అనంతపురం): ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. వెండితెర ప్రయాణమిలా.. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఉగ్రమ్‌తో విశ్వరూపం 2014లో ‘ఉగ్రమ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ చిత్ర దర్శకుడిగా తన సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ‘ఉగ్రమ్’ సినీ చిత్రీకరణకు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌కు వెళ్లిన ప్రశాంత్ నీల్.. అక్కడి పరిస్థితులు చూసి ఓ లైన్ రాసుకుని కోలార్ బంగారు గనుల ఇతివృత్తం ఆధారంగా 2018లో కేజీఎఫ్–1 సినిమా తీశారు. 2022లో కేజీఎఫ్–2 సినిమా తెరకెక్కించారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్–2 అందరి అంచనాలను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఒక్కసారిగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎవరు? ఎక్కడి వాడు? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఆరా తీయడం మొదలైంది. నీల్ అంటే నీలకంఠాపురం.. రెండు రోజుల క్రితం వరకూ ప్రశాంత నీల్ మడకశిరవాసి అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ కుమారుడు ప్రశాంత్‌నీల్ అని తెలుసుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్వగ్రామంపై ఉన్న గౌరవంతో నీలకంఠాపురం స్ఫురించేలా ప్రశాంత్ తన ఇంటిపేరును నీల్ అని పెట్టుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ను ఆయన తెరకెక్కించనున్నారు. నీలకంఠాపురంలోని ప్రశాంత్‌నీల్ తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంది మా కుమారుడు సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే గొప్ప ఖ్యాతి గడించడం ఎంతో ఆనందంగా ఉంది. కష్టానికి ఫలితం దక్కింది. ప్రపంచస్థాయిలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తల్లిగా ఎంతో అనుభూతి పొందా. – భారతి, ప్రశాంత్‌నీల్ తల్లి నీలకంఠాపురానికి గుర్తింపు సినిమా డైరెక్టర్‌గా ప్రశాంత్‌నీల్ సాధించిన విజయం నీలకంఠాపురానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏడాదికోసారి నీలకంఠాపురానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఈ గ్రామమంటే అతనికి ఎంతో ఇష్టం. ఈ నెల 14న వచ్చి తన తండ్రి సమాధికి నివాళులర్పించి వెళ్లాడు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలన్నదే నీలకంఠాపురం ప్రజల ఆకాంక్ష. – చిన్న రంగేగౌడ్, ప్రశాంత్‌నీల్ పినతండ్రి, నీలకంఠాపురం, మడకశిర మండలం చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? -
ఎమ్మెల్యేకి కరోనా: సీఎం జగన్ పరామర్శ
మడకశిర : అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కరోనా పాజిటివ్ రావడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి డాక్టర్లతో కూడా ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ స్వామిదినేష్తో కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కరోనా పాజిటివ్ నూజివీడు: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు నెలలుగా ప్రజాహిత కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న ఎమ్మెల్యే ప్రతాప్ రెండు రోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎమ్మెల్యే ప్రతాప్ చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎవరైనా అత్యవసరమైతే ఫోన్లో తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరికైనా పనులుంటే పట్టణంలోని తన కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారన్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రంలో కొన్ని ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల అమలుతో పరిమిత సంఖ్యలో వివాహాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గంలోని అమలాపురంలో టీడీపీ నేత కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తన కూతురు వివాహాన్ని భారీ జన సందోహం మధ్య జరిపించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్నపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
అనంతపురం జిల్లా మడకశిరలో వంటావార్పు
-
దొనకొండలో ప్రత్యేక సెజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ, ఇతర పరిశ్రమల కోసం కొత్తగా 30 లక్షల చదరపు అడుగులు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె. రోజా, ఏపీఐఐసీ ఎండీ రజత్ భార్గవ, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, విమానయాన రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రజత్ భార్గవ వివరించారు. దొనకొండలో ఇప్పటికే బ్రిటీష్ కాలం నాటి విమానాశ్రయం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా మడకశిరలో ఆటో మొబైల్, దాని అనుబంధ పరికరాల తయారీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే విధంగా మల్టీ ప్రొడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిన్న మధ్య తరహా కంపెనీలు నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్లగ్ అండ్ ప్లే కేంద్రాలను ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా హిందూపురం, విశాఖ జిల్లా అచ్యుతాపురం, నెల్లూరు జిల్లా నాయుడుపేట, చిత్తూరు జిల్లా ఈఎంఎసీ–2, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో మరిన్ని ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ బోర్డు తీర్మానించింది. -
టీడీపీ దాష్టికం; ఏజెంట్ గుడిసెకు నిప్పు
సాక్షి, అనంతపురం : మడకశిర నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరాపురం మండలం హుదుగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ గుడిసెకు నిప్పంటించి రాక్షసానందం పొందారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న మహిళ శశికళను స్థానికులు రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా మద్దనకుంటలో కూడా టీడీపీ నేతలు దళితులపై దౌర్జన్యానికి దిగడంతో ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు మడకశిర వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. మా గెలుపును జీర్ణించుకోలేకే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవబోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని తిప్వేస్వామి అన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటామని.. వారి హింసా రాజకీయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. మీకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించారు. -
జనసంద్రంగా వైఎస్ జగన్ మడకశిర సభ
-
బాబూ... హామీలు గుర్తున్నాయా?
సాక్షి,మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి బుధవారం మడకశిరకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2016 డిసెంబర్ 2వ తేదీ మడకశిరకు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చారు. కానీ వాటిని ఇంతవరకూ నెరవేర్చలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఆయన పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మడకశిర ప్రాంతంలో ఓట్లడిగే అర్హత లేదంటున్నారు. హంద్రీ – నీవా కాలువ: మడకశిర నియోజకవర్గానికి హంద్రీ – నీవా పథకం ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంద్రీ – నీవా ద్వారా సాగునీరు అందిస్తామని హడావుడి చేసిన స్థానిక టీడీపీ నాయకులు చివరకు చేతులెత్తేశారు. పారిశ్రామిక వాడ: మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1,600 ఎకరాలు సేకరించారు. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం కూడా అందించలేదు. దీంతో రైతులు, నిరుద్యోగులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ: మడకశిరలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తానని, అందుకోసం నిధులు పెద్దఎత్తున అందిస్తానని ప్రకటించారు. ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. కార్యరూపం దాల్చని రింగ్ రోడ్డు: మడకశిరలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.45 కోట్ల నిధులను మంజూరు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ రింగ్ రోడ్డు పూర్తి కాకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏర్పాటు కాని డిగ్రీ కళాశాలలు: అమరాపురం, గుడిబండలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ చేయలేదు. దీంతో ఈ రెండు మండలాల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నారు. 100 పడకల ఆస్పత్రి: మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి 50 పడకలైతే 100 పడకలకు పెంచుతామని చెప్పారు. నిన్నమొన్నటి వరకూ పట్టించుకోకుండా నెలరోజుల క్రితం 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ జీఓ జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోలేదు. పర్యాటక కేంద్రాలు: నియోజకవర్గంలోని రత్నగిరి, హేమావతి, భక్తరహళ్లి, జిల్లేడుగుంటలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. కానీ వాటి గురించి పట్టించుకోలేదు. రాళ్లపల్లి రిజర్వాయర్: గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద హంద్రీ – నీవా రిజర్వాయర్ నిర్మించి నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపుతామన్నారు. ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీలు నెరవేర్చి మడకశిరకు రావాలి 2016లో చంద్రబాబు మడకశిరకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఇంతవరకూ అవి నెరవేరలేదు. వాటిని నెరవేర్చిన తర్వాతే ఆయన మళ్లీ మడకశిరకు రావాలి. హామీలను నెరవేర్చని సీఎంను మడకశిర ప్రజలు నిలదీయాలి. – లక్ష్మీనారాయణ, హరేసముద్రం, మడకశిర చంద్రబాబు మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మడకశిర ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా పారిశ్రామికవాడ ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను ముంచేశారు. మళ్లీ మడకశిరకు వచ్చి ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారు. – మంజునాథ్, జిల్లేడుగుంట, మడకశిర -
మడకశిరలో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, మడకశిర: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మడకశిరకు వస్తున్న సీఎం చంద్రబాబుకు ఆ పార్టీలోని ప్రముఖ నాయకులు బిగ్‌షాక్ ఇచ్చారు. అమరాపురం మండలం హల్కూ రు గ్రామానికి చెందిన తెలుగు యువత జిల్లా కార్యదర్శి కాంతరాజు మంగళవారం మడకశిరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వైఎస్.జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న ట్లు తెలిపారు. అదేవిధంగా అగళి మండలానికి చెం దిన ప్రముఖ టీడీపీ నేత వెంకటస్వామి కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. బుధవారం చంద్రబాబు వస్తుంటే మంగళవారం వీళ్లిచ్చిన షాక్ నుంచి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థి ఈరన్న కోలు కోలేకున్నారు. ఎందుకంటే కాంతరాజు, వెంకటస్వామి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకులు. కాంతరాజు నియోజకవర్గంలో 70వేల మంది ఓటర్లున్న వక్కలిగ సామాజికవర్గానికి చెందినవారు. వక్కలిగ సంఘం గౌరవ అధ్యక్షుడిగానూ పని చేస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ ఆయనకు మంచి పట్టుంది. ముఖ్యంగా యువతలో మంచి పలుకుబడి ఉంది. అగళి మండలానికి చెందిన వెంకటస్వామి దళిత నాయకుడు. 1983 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎ మ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పలుసార్లు ముఖ్యమంత్రి ని కలిసి కోరినా ఫలితం లేదు. అయినప్పటికీ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ పార్టీలో గౌరవం లభించలేదు. ఆ ఆవేదనతోనే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కొత్తగా వచ్చిన నాయకులు టీడీపీని సర్వనాశనం చేస్తున్నారు: కాంతరాజు హల్కూరు కాంతరాజు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుం చి వచ్చిన కొంతమంది కాంట్రాక్ట్ పనుల కోసం టీ డీపీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 1983 నుంచి ఉన్న నాయకులకు తీవ్ర అన్యాయం జరగుతోందన్నారు. కొత్తగా వచ్చిన వారిపై టీడీపీలో భా రీ అసంతృప్తి ఉందన్నారు. చాలామంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనకు పార్టీలో గౌరవం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరతానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలోనే కష్టాలు అనుభవించా : వెంకటస్వామి వెంకటస్వామి టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తాను పార్టీలో సీనియర్ నాయకుడిని అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వంలోనే కష్టాలు అనుభవించానని ఆవేదన చెందారు. తాను సర్పంచుగా, ఎంపీటీసీగా ప్రజలకు న్యాయం చేయలేకపోయానని విచారం వెలిబుచ్చారు. కొత్తగా వచ్చిన నేతలు పార్టీకి చీడ పురుగులుగా మారారని ఆరోపించారు. తాను 1983 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చినా గౌరవం లభించలేదన్నారు. అనుచరులతో చర్చించి త్వరలోనే 1,000 మందితో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశం టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖ నాయకులు కాంతరాజు, వెంకటస్వామి వెంటనే మాజీ ఎమ్మె ల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామితో సమావేశమై ఆ పార్టీలో చేరే విషయమై చర్చించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం,మడకశిర: పట్టణంలోని మధుగిరి సర్కిల్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో చికెన్ సెంటర్, ఉడ్‌వర్క్ షాపులు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన సర్పరాజ్ కొన్నేళ్ల నుంచి మధుగిరి సర్కిల్ సమీపంలో చికెన్‌సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చికెన్‌సెంటర్ పక్కనే పట్టణానికి చెందిన గంగరాజు ఉడ్‌వర్క్ షాపు నిర్వహించేవాడు. అర్ధరాత్రి సమయంలో ఉన్నఫళంగా మంటలు వ్యాపించి షాపులు రెండు దగ్ధమయ్యాయి. దీంతో చికెన్ సెంటర్లోని కోళ్లు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉడ్‌వర్క్ షాపులో కూడా విలువైన వస్తువులు, కట్టెలు కాలి బూడిదయ్యాయి. ఘటనలో చికెన్ సెంటర్ నిర్వాహకుడికి రూ.3 లక్షలు, ఉడ్‌వర్క్‌షాపు నిర్వాహకుడికి రూ.15 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా క్షక్షగట్టి కావాలనే ఎవరైనా షాపులకు నిప్పు పెట్టారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. -
ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణం
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ మోపురుగుండు తిప్పేస్వామితో స్పీకర్ కోడెల ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ కోడెల బుధవారం తిప్పేస్వామితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగిన ఈరన్న పదవి సుప్రీంకోర్టు తీర్పు మేరకు రద్దవడంతో తిప్పేస్వామికి అవకాశం లభించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చినట్లు రుజువవడంతో ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం, ఈరన్న తర్వాత స్థానంలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేయడం తెలిసిందే. ఆ మేరకు ఈరన్న ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దయింది. అయితే రద్దయిన సభ్యత్వానికి ఈరన్న రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈరన్న ఇచ్చిన రాజీనామా లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారోననే చర్చ జరిగింది. దీనిపై ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పును గౌరవిస్తూ తిప్పేస్వామితో ప్రమాణస్వీకారం చేయించాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం స్పీకర్‌ను కోరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ బుధవారం తిప్పేస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎట్టకేలకు న్యాయం జరిగింది.. అనంతరం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తన గెలుపే తొలి మెట్టు అవుతుందని పేర్కొన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు పాలనకు పతనం ప్రారంభమైందన్నారు. మూడేళ్లక్రితం రావాల్సిన తీర్పు ఆలస్యంగా వచ్చినా తనకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పుద్వారా న్యాయం గెలిచినట్లైందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మార్గంలో నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు తీరుకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామిని నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చినా స్పీకర్ స్పందించకుండా అధికారపార్టీ ఎమ్మెల్యేను కొనసాగించడంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వైఎస్సార్సీపీ విజయంగా భావిస్తున్నామన్నారు. విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల్ని చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ అసెంబ్లీ స్థాయిలో చేయాల్సిన నిర్ణయాన్ని కోర్టుల దగ్గరకు వెళ్తే గానీ న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి నర్సెగౌడ్, బీసీ సెల్ రాష్ట్ర అ«ధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రీం తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిది’
సాక్షి, అమరావతి : అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందనీ, అలాంటి వారిని ఎమ్మెల్యేగా తెచ్చి అసెంబ్లీని మలినం చేసిందని మండిపడ్డారు. కోర్టు తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని తెలిపారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్‌కి కోర్టు స్పష్టంగా చెప్పినా.. సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్‌కి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేర చరిత్ర కలిగిన ఈరన్నను కాపాడాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే.. ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటంగా సురేష్ అభివర్ణించారు. (ఎమ్మెల్యే ఈరన్న పిటీషన్ కొట్టివేత) తీర్పుని గౌరవించండి.. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ.. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. స్పీకర్‌ని కలిసి కోర్టు తీర్పును గౌరవించాలని కోరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రాజ్యాంగాన్ని అపహస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పుడైనా న్యాయస్థానం తీర్పును గౌరవించి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. (ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి) ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తిప్పేస్వామి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు వెల్లడించింది. ఈరన్నపై ఏపీ, కర్ణాటకల్లో క్రిమినల్ కేసులున్నాయి. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆ విషయాలేవీ ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదు. దీనిపై నాలుగేళ్లుగా పోరాడాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించమని స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. కోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శికి అందించామని చెప్పారు. -
ఇక్కడికి ఎవరొచ్చినా వీఆర్కే
మడకశిర రూరల్: మడకశిర.. జిల్లాలోనే అత్యంత క్రైం రేటు తక్కువ ఉన్న ప్రాంతం. అయినప్పటికీ ఇక్కడ పనిచేసే సీఐలకు వేటు పడుతూనే ఉంది. ఏదో ఒక వ్యవహారంలో ఆరోపణలు రావడం వీఆర్లకు బదిలీ అవడం పరిపాటిగా మారిపోతోంది. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన ఆరోహణరావు, దేవానంద్‌లు వీఆర్‌కు బదిలీ అయిన విషయం విదితమే. రాయలసీయలో వివిధ సర్కిల్ సీఐలను బదిలీ చేస్తూ అదివారం ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగనే మడకశిర సీఐ శుభకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ 24న మడకశిర సీఐగా శుభకుమార్ బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వినూత్న తరహాలో చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత ఏడాది అక్టోబర్‌లో ‘మీకో దండం...ఎందుకీ గండం’ అంటూ వాహనచోదకులకు అవగాహన కల్పించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. హెల్మెట్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణించడం వల్ల కలిగే నష్టాలను వివరించి వాహనదారులను చైత్యపరిచారు. అటువంటి సీఐ 17 నెలలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఓ కేసు విషయంలో సీఐ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో శుభకుమార్పై బదిలీ వేటు పడినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పరిహారమడిగితే వేలాడదీశారు!
ఏపీ రైతుల పట్ల కర్ణాటక విద్యుత్ అధికారుల ఎదుటే కాంట్రాక్టర్ దుశ్చర్య మడకశిర: తగిన నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలంలో చేపట్టిన విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన ఇద్దరు రైతులను కర్ణాటక విద్యుత్ అధికారుల సమక్షంలోనే తీగలపై వేలాడదీసిన ఓ కాంట్రాక్టర్ దుశ్చర్య ఇది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది.ఇది కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఆ రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ – మధుగిరి మధ్య 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెళవాయి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులైన నబీరసూల్, వన్నూర్‌సాబ్ తమకు నష్టపరిహారం ఇవ్వాలని తమ భూముల్లో జరుగుతున్న విద్యుత్ లైన్ పనులను శనివారం అడ్డుకున్నారు. విద్యుత్ స్తంభాలకు వైర్లు కట్టి ట్రాక్టర్లతో లాగుతున్నపుడు వారు దాన్ని అడ్డుకున్నారు.ఆ వైర్లను గట్టిగా చేతుల్లో పట్టుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ దీన్ని గమనించినా వైర్లను అలాగే లాగారు. దీంతో రైతులిద్దరూ గాల్లో తేలాడారు. పది మీటర్ల ఎత్తుకు వెళ్లగానే నబీరసూల్ భయంతో దూకేయగా...20 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే వన్నూర్‌సాబ్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఇద్దరూ గాయపడ్డారు. నష్టపరిహారం ఇవ్వకుంటే తమకు దిక్కెవరని, ఏపీ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంత జరిగినా సదరు కాంట్రాక్టర్ దౌర్జన్యంగా పని పూర్తి చేశాడు. -
సంచలనం కలిగిస్తున్న వీడియో దృశ్యాలు!
-
అనంతలో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
అనంతపురం : రైతుల సమస్యలపై అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. నేడు ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గుదిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఉజ్జనిపురంలో రైతు మల్లప్ప, అలుపనపల్లిలో రైతు రామిరెడ్డి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించనున్నారు. -
మడకశిరలో విజయమ్మ పర్యటన
-
బాబు పాలన మొత్తం చీకటియుగం
అభివృద్ధి, సంక్షేమాలనే రెండు కళ్లుగా భావించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన కొనసాగిస్తే, చంద్రబాబు పాలన మాత్రం మొత్తం చీకటియుగంగా గడిచిందని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిర రోడ్‌షోకు అశేష సంఖ్యలో హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అప్పట్లో వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం రుణమాఫీ చేస్తానంటున్నారని, అసలు బెల్టుషాపులు గ్రామాల్లోకి వెళ్లాయంటే చంద్రబాబు చలవేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ''మీరు పాలనలో ఉన్నప్పుడు కరెంట్ బకాయిలన్నా మాఫీ చేశారా? రైతులకు నష్టపరిహారం ఇస్తే దానికోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్లాంతా సోమరిపోతులు అవుతారన్నారు. సమస్యల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తే గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్టు ఉద్యోగాలు తెచ్చింది చంద్రబాబు కాదా? కేసుల మీద స్టే తెచ్చుకొని బతుకుతున్న బాబు ఇంకొకరిపై ఆరోపణలు చేస్తారు. జగన్ బాబును మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా. వైఎస్ జగన్‌ను గెలిపించుకుందాం...వైఎస్ ఆశయాలు నెరవేర్చుకుందాం'' అని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.