AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి | Road Accident At Sri Satya Sai District | Sakshi
Sakshi News home page

AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి

Dec 21 2024 6:52 AM | Updated on Dec 21 2024 7:01 AM

Road Accident At Sri Satya Sai District

సాక్షి, సత్యసాయి: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని మిని టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద శనివారం తెల్లవారుజామున లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement