Lorry Accident
-
AP: లారీని ఢీకొన్న మినీ బస్సు.. పలువురు మృతి
సాక్షి, సత్యసాయి: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని మిని టెంపో బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద శనివారం తెల్లవారుజామున లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. -
దూసుకొచ్చిన మృత్యువు
చేవెళ్ల: రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నచిరువ్యాపారులను దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. లారీ రూపంలో వచ్చి వారిని చిదిమేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆగి ఉన్న బస్సును దాటి వెళ్తూ..: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు, నాంచేరి, ఖానాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 20 కుటుంబాల వారు నిత్యం ఆలూరు బస్ స్టేజీ వద్ద, రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కూరగాయలు విక్రయిస్తుండగా చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ఆలూరు స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును దాటి వెళ్లే క్రమంలో అదుపుతప్పి టీస్టాల్ స్టాండ్‌ను ఢీకొడుతూ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన నక్కలపల్లి రాములు (48), దామరగిద్ద కృష్ణ (19), నాంచేరికి చెందిన శ్యామల సుజాత (42) అక్కడిక్కడే మృతిచెందారు. అలాగే కూరగాయలు కొనేందుకు అక్కడకు వచ్చిన జమీల్ (25), బాలమణి, చల్ల మాల్యాద్రి, కూరగాయల విక్రేతలు ఆకుల పద్మమ్మ, నక్కలపల్లి రేణకతోపాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జమీల్ మృతిచెందాడు.అతను ఆలూరులోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. మిగతా క్షతగాత్రులను వారివారి బంధువులు మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.షాక్‌లో డ్రైవర్..: ఈ ఘటనలో లారీ చివరకు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అవగా డ్రైవర్ కాలు విరిగి క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీల సాయంతో అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో షాక్‌లో ఉన్న డ్రైవర్ తన వివరాలు చెప్పలేకపోయాడు.ప్రమాద తీవ్రతకు చెట్టు విరిగిపడటంతో చెట్టు కింద, లారీ ముందు భాగంలో ఎవరైనా ఇరుక్కుపోయారా? అనే విషయం వెంటనే తెలియరాక మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు తొలుత భావించారు. చివరకు చెట్టును తొలగించాక దాని కింద ఎవరూ లేరని నిర్ధారణ అయింది. ఆ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే అక్కడే కూరగాయలు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న మరో 30 మంది ప్రమాదం బారిన పడేవారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి..: ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది
-
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు, మరో లారీ డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్‌ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
తిరుపతి జిల్లాలో లారీ బీభత్సం
-
తిరుపతిలో ఘోర ప్రమాదం.. పలువురు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు.కాగా, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం భాకరపేట ఘాట్ రోడ్డు కంటైనర్ లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో కారు, బైక్‌ను లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: అనకాపల్లిలో బరితెగించిన టీడీపీ నాయకులు -
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ టెర్రర్.. ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు..
సాక్షి, ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ దుర్మరణం చెందారు. ఒకే స్పాట్లో కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అదే మార్గంలో వస్తున్న మరో కంటైనర్.. ప్రమాదానికి గురైన లారీ ఢీకొట్టింది. దీంతో, లారీ ముందున్న ఇద్దరు వ్యక్తులు(తండ్రి, కొడుకు) మృతిచెందారు.ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కంటైనర్‌ను స్పీడ్‌గా నడపడంతో సదరు కంటైనర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, సమాచారం అందుకున్న కంచికచర్ల హైవే మొబైల్ పోలీసులు కేసర వద్ద ఆ కంటైనర్‌ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మృతులు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు(65), అతని కుమారుడు సంకు రామరాజు(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మెదక్‌లో రోడ్డు ఘోర ప్రమాదం
మెదక్, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా ఢీ కొట్టింది. వెనుకలారీలో ఉన్న అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే...
తూర్పు గోదావరి: స్కూలుకని బయలుదేరిన కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. మండపేట సత్యశ్రీ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. స్థానిక సంఘం కాలనీకి చెందిన కోనె మహేష్ సత్యశ్రీ రోడ్డులోని ఎస్ఎస్వీవీ మున్సిపల్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరి ఉదయం కాలనీ నుంచి సైకిల్‌పై పాఠశాలకు బయలుదేరాడు. బైపాస్ రోడ్డు దాటి కోళ్ల ఫారాల మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడపడం, రోడ్డు బెర్ములు కిందికి కుంగిపోయి ఉండటం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. స్కూల్‌కు వెళుతున్న బాలుడు రోడ్డుపై మృతిచెంది ఉండటం దారిన వెళ్లే వారిని కలచివేసింది. మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి శ్రీనివాస్ భవన నిర్మాణ కారి్మకుడిగా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ కళ్లముందే విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ
వేలూరు: అర్ధరాత్రి సమయంలో గాడ నిద్రలో ఉండగా లారీ ఇంటిపైకి దూసుకెళ్లడంతో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి నుంచి కట్టల లోడ్డుతో లారీ శుక్రవారం రాత్రి బయలుదేరింది. సేతుపట్టు సమీపంలోని నంబేడు వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని అతివేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఇంటిలో గాఢనిద్రలో ఉన్నవారిపై గోడలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో మునియప్పన్, భార్య జయలక్ష్మి, కుమారుడు ఏయుమలై, కోడలు సుగన్య ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెద్ద శబ్దం రావడంతో సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సేతుపట్టు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
దైవ దర్శనం కోసం వెళ్తూ.. లారీ ఢీకొని బాలుడి దుర్మరణం..
మహబూబ్‌నగర్: దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రాయాపురం సమీపంలో లారీ రూపంలో బాలుడిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బింగిదొడ్డితండాకు చెందిన వీరేష్‌నాయక్, లక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్ (6)తో పాటుగా ఏడేళ్ల బాలిక పరిణికతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరుకుంద వీరన్న స్వామి దర్శనం కోసం బయలుదేరారు. వీరు రాయాపురం దాటి గట్టు వైపు వస్తుండగా, రాయాపురం స్టేజీ వద్ద ఉన్న భారత్‌మాల రోడ్డు నిర్మాణం క్యాంపులో సిమెంట్ బస్తాలను దింపి గద్వాల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో గౌతమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. వీరేష్‌నాయక్, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, పరిణిక స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని ఆపకుండా పరారయ్యాడు. చుట్టు పక్కల రైతులు విషయాన్ని గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నందికర్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరకున్నారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పరిస్థితి చేయిదాటకుండా కేటిదొడ్డి ఎస్ఐ వెంకటేష్, మల్దకల్ ఎస్ఐ కల్యాణ్, అయిజ ఎస్ఐ నరేష్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులకు నచ్చ చెప్పారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఉండవెల్లి వద్ద పట్టుబడ్డ లారీ.. రాయాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని హైదరాబాద్–కర్నూలు జాతీయ రహదారి ఉండవెల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి కారణమైన లారీ వివరాలను సేకరించి, జీపీఎస్ ఆధారంగా గద్వాల, ఎర్రవల్లి మీదుగా జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఉండవెల్లి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అన్నమయ్య: పట్టణ పరిధిలోని చిట్వేలి బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్‌కిరణ్(15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మండలంలోని ఎస్.కొత్తపల్లికి చెందిన రోజువారీ కూలీలైన తిరుమలేశు, రాజేశ్వరిలకు ముగ్గురు కుమారులు. తల్లిదండ్రులు తమ ముగ్గురు బిడ్డల్ని పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు ఉదయ్‌కిరణ్ పదో తరగతి చదవుతున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చిట్వేలి బైపాస్ రోడ్డు దాటుతుండగా రాజంపేట నుంచి రేణిగుంటవైపు వెళ్తున్న లాజిస్టిక్ లారీ ఢీకొంది. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కిల్లింగ్.. ఓవర్‌లోడ్!
ఆదిలాబాద్: జిల్లాలో ఇసుక, కంకర, విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న వాహన యజమానులు ఎ లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదా లకు కారణమవుతుండటంతో అమాయకులు ప్రా ణాలు కోల్పోతున్నారు. క్వారీల నుంచి ఇతర రాష్ట్రాలకు కంకరను తరలించే క్రమంలో గ్రామీణులు టి ప్పర్ చక్రాల కింద నలిగిపోతున్నారు. ఇటీవల కౌ టాల మండలం వైగాం సమీపంలో ఓవర్ లోడ్‌తో వి ద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, ట్రిపర్లు అధిక లోడుతో వరుసగా పదుల సంఖ్యల్లో పల్లెల మీదుగా దూసుకెళ్తున్నాయి. నిత్యం రాకపోకలు సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణితోపాటు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా ఇసుకు అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులతో.. 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే లోడ్‌తో తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 4న కౌటాల మండలం యాపలగూడలో ట్రిప్పర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించేందుకు వీలుంటుంది. కానీ 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది. కౌటాల మండలం ముత్తంపేట శివారులోని కంకర క్రషర్ల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా కంకర తరలిస్తున్నారు. వాగులు, నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలోనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేపడుతున్నాం ఓవర్ లోడుతో వెళ్తున్న కంక ర టిప్పర్లు, ఇసుక ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు తరలించే ట్రాకర్లను నిత్యం తనిఖీ చేస్తూనే ఉన్నాం. సంబంధిత అధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలను పాటించని వాహనాల యాజమానులకు జరిమానా విధిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. – జి.లక్ష్మి, ఆర్టీవో, ఆసిఫాబాద్ జాడలేని తనిఖీలు.. ఓవర్ లోడింగ్ వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల వరుస ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఓవర్ లోడింగ్ వాహనాల ను తనిఖీలు చేసి కనీస జరిమానాలు విధించకపోవడం గమనార్హం. -
భద్రాద్రి కొత్తగూడెం: ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. జూలూరుపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మూడు లారీలు, ఒక అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో లారీ డీజిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక, ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమదాలవలస మండలం మందడిలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి మృతి చెందారు. అమలాపురం గౌరమ్మకు తీవ్ర గాయాలు కాగా, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చదవండి: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందగా మృతుల సంఖ్య అయిదుకి చేరింది. మిగతా వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు అసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ప్రమాదాన్ని గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ జోన్‌గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని భరోసానిచ్చారు. చదవండి: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. ప్రమాద ఘటనలో క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అవ్వగా, ఆసుప్రతికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి! -
ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప పడిపూజకు వెళ్లి వస్తుండగా..
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. అయ్యప్పస్వాములు పడిపూజకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 33 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కాగా, దారుణ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన గ్యాస్ సిలిండర్ల లారీ
-
డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యి! గంటన్నర పాటు నరక యాతన
మంగపేట (ములుగు జిల్లా): నిండా కలప లోడుతో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న బాలురపై బోల్తా పడింది.. ఇద్దరు బాలురపై కలప దుంగలు పడగా.. మరో బాలుడు లారీ క్యాబిన్ కింద చిక్కు కుపోయాడు. సమీపంలోనే ఉన్నవారు పరుగెత్తు కొచ్చేటప్పటికి బాలురు బాధతో రోదిస్తున్నారు. కాసేపటికే లారీ క్యాబిన్ కింద చిక్కుకున్న బాలుడి తండ్రి అక్కడికి వచ్చాడు. బాలుడు తండ్రిని చూసి ‘డా డీ.. నొప్పిగా ఉంది.. నన్ను బయటికి తియ్యండి డాడీ..’అంటూ ఏడ్చాడు. కొడుకును బయటికి తీయలేక.. అతడి బాధను చూడలేక తండ్రి కన్నీళ్లు పెడుతూ విలవిల్లాడిపోయాడు. అక్కడికి వచ్చిన వారంతా అది చూసి కన్నీళ్లు పెట్టారు. గురువారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి పీహెచ్సీ ఎదుట ఈ ఘటన జరిగింది. మూల మలుపు వద్ద అదుపు తప్పి.. కలప లోడుతో మంగపేట వైపు నుంచి మణుగూరు వైపు వెళ్తున్న లారీ చుంచుపల్లి పీహెచ్సీ ముందు మలుపు వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గ్రామ బాలురు పోలెబోయిన సాయి, కల్తీ దిలీప్, చింతకుంటకు చెందిన కొమరం చందులపై బోల్తా పడింది. చందు, దిలీప్‌పై కలప దుంగలు పడగా.. సాయి లారీ క్యాబిన్ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కలప కింద ఉన్న ఇద్దరిని బయటికి తీశారు. ఈ ఇద్దరికీ కాళ్లు విరగడం, ఇతర గాయాలూ కావడంతో 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక సాయికి కుడికాలు, కుడిచేయి ఓ కర్రకు, లారీ క్యాబిన్‌కు మధ్య ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి లాగడం వీలుకాలేదు. పోలీసులు స్థానికుల సహకారంతో ప్రొక్లెయిన్, రెండు జేసీబీలను తెప్పించి బాలుడిని సుమారు గంటన్నర తర్వాత బయటికి తీశారు. బాలుడు బాధను తట్టుకోలేక ఏడవడం, అక్కడికి చేరుకున్న తన తండ్రి ఆదినారాయణను చూసి ‘డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యండి’అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య.. బాలుడిని వైద్యం కోసం తన వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం మూడు రోజులు పాటు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఓ లారీ వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయింది. కాగా, రేషన్ బియ్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో టన్నుల సంఖ్యలో రేషన్ బియ్యం నీటిపాలైంది. అయితే, లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. వరద ఉద్ధృతికి ఆ లారీ నీటిలో కొట్టుకుపోయింది. అయితే, మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. छत्तीसगढ़ के बीजापुर में पीडीएस का चावल ले जा रहा ट्रक उफनती नदी में बहा, देखें वीडियो#Bijapur #TruckFallInRiver #ViralVideo #Rainfall #weather #Chhattisgarh pic.twitter.com/8TSSynSmsV — Neo News Mathura (@Neo_NeoNews) July 10, 2022 ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. మూడు రోజులు స్కూల్స్ బంద్ -
ఆర్టీసీ బస్సు–లారీ ఢీ
చింతూరు/మోతుగూడెం: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందగా బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా 15 మంది గాయపడ్డారు. చింతూరు, మోతుగూడెం రహదారిలోని సుకుమామిడి సమీపంలో మలుపు వద్ద ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సీలేరు నుంచి విజయవాడ వెళ్తుండగా తెలంగాణ నుంచి ఒడిశాకు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన పల్లపు రాజు(26) లారీ క్యాబిన్, స్టీరింగ్ నడుమ ఇరుక్కుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు యాదగిరి, సత్తిబాబు తమ సిబ్బందితో కలసి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని శ్రమించి బయటకు తీశారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో 15 మందికి కూడా గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో 11 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చింతూరు తరలించిన పోలీసులు ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సూరజ్ ధనుంజయ్ గనోరే ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీవోను ఆదేశించారు. -
హైదరాబాద్: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా
సాక్షి, హైదరాబాద్: బ్రేకులు ఫెయిలై అతివేగంగా వచ్చిన హెరిటేజ్ పాల లారీ ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో అన్నా, చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం వనస్థలిపురంలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బి.సురేశ్‌కుమార్ (47), నల్లగొండ పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎం.విజయలక్ష్మి (43) అన్నాచెల్లెళ్లు. విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు సంబంధించిన ఎల్ఐసీ లోన్ కోసం మంగళవారం నగరానికి వచ్చారు. చెల్లెలిని సురేశ్‌కుమార్ తన బైకుపై నగరంలోని అమీర్‌పేట ఎల్ఐసీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. సురేశ్‌కుమార్, విజయలక్ష్మి (ఫైల్) ఈ క్రమంలో వనస్థలిపురం సుష్మా చౌరస్తాకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా బ్రేకులు ఫెయిలైన హెరిటేజ్ పాల లారీ వచ్చి సురేశ్‌కుమార్ బైకును ఢీకొట్టి మరో స్కూటీని ఢీకొని పాన్‌డబ్బా పైకి దూసికెళ్లింది. ఈ ప్రమాదంలో సురేశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరిలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. స్కూటీపై ఉన్న మరో వ్యక్తి మురళీమోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సురేశ్‌కుమార్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షేక్ బాషాను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. చదవండి: మమత భేటీకి టీఆర్ఎస్ దూరం! -
లారీ ఢీకొని విద్యార్థి దుర్మరణం
మదనపల్లె టౌన్ : సిమెంట్ లారీ బైక్‌ను ఢీకొని విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లెకు చెందిన దంపతులు ప్రహ్లాద, లక్ష్మీదేవీలు 20 ఏళ్లక్రితం మదనపల్లెకు బతుకుదెరువు నిమిత్తం వచ్చారు. కదిరిరోడ్డులోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్‌వద్ద సొంతంగా ఇంటిని నిర్మించుకుని పాడిపశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఒక్కగానొక్క కుమారుడు సి.ఉపేంద్ర (17) స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ గురువారం ఉదయం పాడిఆవులకు పచ్చగడ్డి కొనుగోలు చేసేందుకు నీరుగట్టువారిపల్లెకు బైక్‌లో బయలుదేరాడు. గడ్డి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో సిమెంట్‌లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్ఐ లోకేష్ ప్రమాదస్థలికి చేరుకుని విచారణ చేపట్టి పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ గుండెలు బాదుకోవడం చూపరుల హృదయాలను కలిచివేసింది. -
బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్, ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలోని విమానాల రన్‌వేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ తెలిపారు. -
రెండు లారీలు ఢీ : ఒకరు మృతి
ఓబులవారిపల్లె: మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీ కొనడంతో డ్రైవర్ సుగ్రీవ్ సింగ్ (25) మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు మంగంపేట ప్రైవేట్ కంపెనీకి చెందిన బెరైటీస్ ఖనిజం సరఫరా చేసే ఏపీ 39యూబీబీ109 నంబర్ గల లారీ మంగంపేట గుట్టపై నుంచి వేగంగా వస్తుండగా నంద్యాల నుంచి శ్రీసీటికి మొక్క జోన్న పప్పుదినుసులు తీసుకెళ్తున్న ఏపీ04టీయూ8489 నెంబర్ గల లారీ ఢీ కొంది. రెండు లారీల ముందు భాగం దెబ్బతింది. లారీలో సుగ్రీవ్ సింగ్ మృతదేహం ఇరుక్కు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. క్లినర్ జైతూకి చెవి వద్ద గాయం కాగా తిరుపతికి తరలించారు. మరో లారీ డ్రైవర్ పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం, ధూల్ పూర్, చద్యాన్‌కాపురా గ్రామానికి చెందిన సుగ్రీవ్‌సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్‌ప్రదా కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్య శివానితో రైల్వేకొడూరులో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో శివానీ, బంధువులు విలపించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వరులు తెలిపారు. -
నిద్రిస్తున్న మహిళపై వెళ్లిన లారీ.. ‘ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా అమ్మా’
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: పిల్లలకు భారంగా ఉండకూడదు.. నగరంలో ఏదైనా పనిచేసుకొని బతుకుదామని వచ్చిన ఆ దంపతులను విధి వెక్కిరించింది. ఉద్యోగంలో చేరిన 12 గంటలలోపే భార్యను మృత్యువు కబళించింది. నిద్రిస్తున్న మహిళపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నర్సింహ, ఎస్ఐ శ్రీలతరెడ్డి తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా అడ్డాకూల గ్రామానికి చెందిన దంపతులు వెంకటమ్మ(55), రామస్వామి నగరంలో వాచ్‌మెన్‌గా పనిచేసేందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం దుర్గానగర్ చౌరస్తాలోని ఓ వెంచర్లో వాచ్‌మెన్‌గా భార్యభర్తలు పనికి కుదిరారు. భోజనం చేసుకొని పనులు కొనసాగుతున్న ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. కరెంటు లేకపోవడం, దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఇంటికి సమీపంలో పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ ఇటుకలను ఆ ఇంటి వద్ద దించేందుకు వచ్చింది. డ్రైవర్ యాదగిరి.. రోడ్డుపై పడుకున్న వెంకటమ్మ, రామస్వాములను గమనించకుండా రివర్స్‌లో వచ్చాడు. ఆ సమయంలో వెంకటమ్మపైనుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వచ్చి గుండెలవిసేలా రోదించారు. ఇలా చావడానికే ఇక్కడకు వచ్చావా.. అమ్మా.. అని వారు రోదించడం కంటతడిపెట్టించింది. నష్టపరిహారం అందజేత... మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి యజమాని నష్టపరిహారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఏఐటియూసీ నాయకుడు వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నష్టపరిహారం రెండు లక్షలను అందజేశాడు. -
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో లారీ బీభత్సం
-
మేడ్చల్‌లో ఘోరం.. ఇంటి ముందు నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్‌రామ్, చందన్ కుమార్ సహరిగా గుర్తించారు. బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి
మడికొండ: చీకట్లోనే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కూలీలను క్వారీ గుంత మింగేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామశివారులోని లక్ష్మి గ్రానైట్ క్వారీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు(20), జార్ఖండ్ రాష్టానికి చెందిన మహ్మద్ హకీమ్(22)లు హెల్పర్లుగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన కొతల ముఖేశ్(23) లారీడ్రైవర్‌గా ఆరునెలల నుంచి లక్ష్మి గ్రానైట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత హకీమ్, చందులు క్వారీలోని వేస్ట్ మెటీరియల్‌ను టిప్పర్‌లో తరలిస్తుండగా అది అదుపుతప్పి క్వారీ గుంతలో బోల్తాపడింది. దీంతో మహ్మద్ హకీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన చందు, డ్రైవర్ ముఖేశ్‌లను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చందు చనిపోయాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ముఖేశ్ మృతిచెందాడు. చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిరిసిల్లా జిల్లా ప్రగతి నగర్‌కు చెందిన ప్రణయ్ గౌడ్(20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెప్పపాటులో ప్రమాదం.. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే
అప్పటివరకు తన కొంగుపట్టుకుని చెంగుచెంగున నడిచిన బిడ్డ ఒక్కసారిగా వెనకపడేసరికి ఆ తల్లి ఉలిక్కిపడింది. బిడ్డ ఏడని చూసేలోగానే రెప్పపాటులో లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ మాతృమూర్తికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఆరేళ్ల బాలుడిని నిర్ధాక్షిణ్యంగా బలితీసుకుంది. చిన్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే ఆ కన్నపేగు విలవిల్లాడిపోయింది. దిక్కులుపిక్కటిల్లేలా.. గుండెలవిసేలా.. రోదించింది. రాజుపాలెం మండలం నకరికల్లులో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరి గుండెలను పిండేసింది. సాక్షి, గుంటూరు: రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాకు చెందిన రమావత్ కొండానాయక్, దేవీబాయి దంపతులకు రాములునాయక్(6), లక్ష్మి ఇద్దరు కవల పిల్లలు. దేవీబాయి పుట్టిల్లు దాచేపల్లి మండలం భట్లుపాలెం తండాలో ఉంది. అక్కడ కార్తిక మాసం సందర్భంగా ఉత్సవాలు జరుగుతుండడంతో పిల్లలతో కలిసి బయలుదేరింది. వీరిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రమావత్ కొండానాయక్ నకరికల్లులోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై దించాడు. ఆవలి వైపునకు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండడంతో దేవీబాయి పిల్లలు రాములునాయక్, లక్ష్మితో కలిసి రోడ్డు దాటేందుకు యత్నించింది. రోడ్డు దాటి డివైడర్ ఎక్కే సమయంలో అమ్మ కొంగుపట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా వెనకపడ్డాడు. ఏమైందని చూసేలోపే పిడుగురాళ్లవైపు నుంచి వచ్చిన లారీ రాములునాయక్‌ను ఢీకొట్టింది. దీంతో బాలుడి శరీరం ఛిద్రమైంది. అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లెదుటే బిడ్డ దుర్మరణాన్ని చూసిన తల్లి గుండె తట్టుకోలేకపోయింది. పెద్దపెట్టున రోదించింది. రోడ్డు ఆవలవైపున ఉన్న తండ్రి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరను విలపించాడు. క్షణం క్రితం వరకూ తమతో నవ్వుతూ ఊసులు చెప్పిన అన్న రోడ్డుపై విగతజీవిగా పడిఉండడం చూసి చెల్లి లక్ష్మి తల్లడిల్లింది. కవలల్లో పెద్దవాడైన రాములునాయక్, తన చెల్లితో కలిసి తండాలో రెండోతరగతి చదువుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకొని తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. -
ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
సాక్షి, ఖమ్మం: లారీ డ్రైవర్ మద్యం మత్తు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యంగా లారీ నడపడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో వరంగల్– అశ్వారావుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఎనగందుల దేవయ్య అదే మండలంలోని పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంరూరల్ మండల పరిధిలోని సాయికృష్ణ నగర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి కుమారుడు ఠాగూర్(18), కుమార్తె పవిత్ర ఉన్నారు. వారిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ, మొదటి సంవత్సరాలు చదువుతున్నారు. చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే పిల్లలను కాలేజీలో దిగబెట్టడానికి వెళ్లి.. కళాశాలలో దిగబెట్టేందుకని పిల్లలిద్దరినీ తీసుకొని దేవయ్య శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలోని కరుణగిరి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ టైర్ ఠాగూర్ నడుముపై నుంచి వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. దేవయ్య, పవిత్రలపై నుంచి కూడా లారీ వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గామాలమ్మాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి లారీ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య పిండిప్రోలులో ఠాగూర్ అంత్యక్రియలు.. కాగా మృతుడు ఠాగూర్ అంత్యక్రియలు స్వగ్రామం పిండిప్రోలులో జరిగాయి. ఓ పక్క తండ్రీ కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉండగా ఠాగూర్ అంత్యక్రియలను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు బాధాతృప్త హృదయాలతో నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి తమను సంతోషంగా చూసుకుంటావని అనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా కొడకా అంటూ ఠాగూర్ తల్లి రోదిస్తుంటే అక్కడున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. -
గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం
సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబాన్ని చిదిమేసిన లారీ
గొల్లపల్లి (వెల్గటూర్): స్కూటీపై భార్య, ముగ్గురు పిల్లలతో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారి వాహనాన్ని లారీ డీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి (38) ఇళ్లకు మార్బుల్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య మనోజా, కొడుకులు ఆదిత్య(9), కన్నయ్య(1), కూతురు చిట్టి (1) ఉన్నారు. మనోజా తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. మూడు నెలల కార్యక్రమం కోసం కుటుంబాన్ని తీసుకుని స్కూటీపై అత్తగారి ఊరైన ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఐదుగురూ ఇంటికి బయల్దేరారు. ఊరు చేరేందుకు మరో ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్గటూరు మండలం పాశిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హరితహోటల్ వద్దకు రాగానే వెనకాలే వస్తున్న లారీ స్కూటీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. అందరూ రోడ్డుపై పడిపోయారు. లారీ వీరిపైనుంచి పోవడంతో చిట్టి, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతి నడుం పైనుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. మనోజా రెండు కాళ్లు విరిగాయి. ఆదిత్య రోడ్డుకు కొద్ది దూరంలో పడడం తో స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న తిరుపతి, మనోజాను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యను సీఐ తన వాహనంలో ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ తిరుపతి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం దొరకలేదని, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, గుంతలను తప్పించబోయే క్రమంలోనే వేగంగా వస్తున్న లారీ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును..లారీ ఢీకొట్టింది. దీంతో.. ఒక్కసారిగా తీవ్ర మంటలు వ్యాపించాయి. కాగా, సంఘటన స్థలంలోనే నలుగురు సజీవదహనయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 45 నిముషాల పాటు గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అజ్మీర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పెద్ద ఎత్తును ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
వాహన బీమాలకు 'నకిలీ' మకిలి
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్‌పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. దాదాపు 25% నకిలీ పాలసీలే.. రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్‌గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. – జితేంద్ర సాహూ, జనరల్ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ, ముంబై కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహన షోరూమ్‌లే కేంద్రంగా... రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే షోరూమ్‌ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అండదండలతో ఈ రాకెట్ బలోపేతమైంది. వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ షోరూమ్‌లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్ హ్యాండ్ షోరూమ్ సిబ్బందికి రూ.500వరకు కమీషన్ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. -
మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్.. ఆర్తనాదాలు
సాక్షి, శ్రీకాకుళం: స్థానిక యునైటేడ్ బ్రేవరీస్ పరిశ్రమ సమీపంలో (జాతీయ రహదారిపై) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. జే.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ సమీపంలో అగి ఉన్న లారీని విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. లారీ ముందు భాగం (ఎడమ వైపు) నుజ్జునుజు అయింది. లోపల నిద్రిస్తున్న లారీ ఓనర్ (డ్రైవర్) కురిమి స్వామి టైర్, డోర్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. లారీలో ఉన్న చిన్న గ్యాస్ స్టావ్ పేలి మంటలు వ్యాపించాయి. కురిమి స్వామి బయటకు రాలేక అర్తనాదాలు పెట్టాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పి బయటకు తీసే సరికి ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం స్వల్పంగా గాయపడ్డాడు. వీరిని 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జే.ఆర్.పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపారు. -
చేపల వలలు కొనేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు
జగిత్యాలక్రైం: చేపల వేటకు అవసరమైన వలల కోసం వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని మంచినీళ్ల బావివద్ద జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండ ల కేంద్రానికి చెందిన అర్ముల్ల పవన్ (21), అర్ముల్ల శ్రీకాంత్ (26), ఐలవేని నవీన్ (21) బుధవారం మధ్యాహ్నం చేపల వలలు కొనేందుకు బైక్‌పై జగిత్యాలకు బయల్దేరారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో పవన్, శ్రీకాంత్, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదా నికి కారణమని బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
-
దారుణం: మహిళపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి ,శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఎచ్చెర్ల మండలంలో చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి, అక్కడే రోడ్డు పైన పండ్లు అమ్ముకునే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద పడి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ శరీరం నుజ్జునుజ్జయింది. చదవండి: బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి ) -
మహిళపైకి దూసుకెళ్లిన లారీ
-
విజయనగరంలో లారీ బీభత్సం: ఇద్దరు మృతి
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ అతివేగంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. బైకును ఢీకొట్టిన లారీ సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారిని ఏఆర్ కానిస్టేబుల్ రాజు, లెక్చరర్ సంజీవ్‌గా పోలీసులు గుర్తించారు. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం -
లారీలు ఢీ: డ్రైవర్ కోసం మూడు గంటలు..
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రహ్మణపల్లి శివారులో గల నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళుతున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో మూడుగంటలు నరకయాతన పడ్డ బాధితుడిని 108అంబులెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీసి చికిత్స అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్-సంగారెడ్డి జాతీయ రహదారిపై సోమవారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జ కావడంతో డ్రైవర్ ఇందూరే విఠల్(20) అందులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే స్థానికులు ప్రమాదాన్ని గమనించి 108అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే పిట్లం అంబులెన్స్ సిబ్బంది సుభాష్, విజయ్‌కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించి, సెలైన్ బాటిల్ ఎక్కించారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కార్మికులు, జేసీబీ సహయంతో క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్‌ను బయటకు తీసేందుకు మూడు గంటల పాటు శ్రమించారు. అప్పటికే డ్రైవర్ కాలు రెండు చోట్ల విరగడంతో అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ సిబ్బంది క్యాబిన్‌లోనే డ్రైవర్‌కు వైద్య చికిత్సలు చేస్తూ బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రుడు విఠల్‌కు మెరుగై చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డుమీదకు వస్తున్న లారీ.. ఆగి ఉన్న బైక్‌తోపాటు మరికొన్ని వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యియి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మృత్యువులోనూ వీడని బంధం -
కరీంనగర్లో నడిరోడ్డుపై లారీ దగ్ధం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో నడిరోడ్డుపై మంగళవారం లారీ దగ్ధమయింది. లారీతో పాటు లారీలో ఉన్న కాంక్రిట్ మిక్సర్ మిషన్ కాలిబూడిదయ్యింది. మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి-లింగాపూర్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ను సప్లై చేసే లారీలో కరీంనగర్ నుంచి లింగాపూర్‌కు కాంక్రీట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా పైన కరెంటు వైర్లు తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ బండిని ఆపి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మిక్సర్ కాలి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పడింది. లారీ క్యాబిన్‌తోపాటు టైర్లు కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మిక్సర్ కాలి బూడిద అయింది. లారీ పాక్షికంగా దెబ్బతింది. నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దారిలో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే లింగాపూర్‌లో చెక్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ లారీలో కాంక్రిట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. చదవండి: సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? ‘ఆ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతున్నాయి’ -
హనుమాన్ జంక్షన్లో లారీ బీభత్సం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని బాపులపాడు మండలంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్లో ఓ లారీ వేగంగా వచ్చి ఆగివున్న కారు, రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈదులుగూడెం గ్రామానికి చెందిన మహేష్(27) మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపినందువల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖలో లారీ బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ రద్దీ సమయంలో లారీ అదుపు తప్పి వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు. హనుమంతవాక జంక్షన్లో మధురవాడ వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది. -
మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం: నలుగురు మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తొర్రూరు మండల చీటాయపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుల తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వేప, తుమ్మ కర్రలను కొనుగోలు చేసిన ఓవ్యాపారి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే కర్రను తరలించాలనుకున్నారు. కొనుగోలు చేసిన కర్రను లోడ్ చేసి తరలిస్తుండగా స్థానికంగా ఉన్న ఎక్కలదాయమ్మ చెరుపు కట్టపై అదుపుతప్పి లారీ బోల్తా పడింది. కట్టెల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. క్యాబిన్లో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు కోసం ఆసుపత్రికి తరలించినటట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందినవారిని హర్యా, గోవింద్, మధు, దూతియాగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రమాదం జరగగా తెల్లవారుజామున మూడు గంటలకు మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అర్ధరాత్రి ఆర్తనాదాలు
ముండ్లమూరు: మండలంలోని శంకరాపురం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ యడ్లపల్లి సునీల్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పూరిమెట్లకు చెందిన పొగాకు రైతులు ఒగులూరి ఆంజనేయులు, తువ్వదొడ్డి చిన్నబ్బాయి, ఒగులూరి నరేష్, యడ్లపల్లి సునీల్ పొగాకు చెక్కులతో ట్రాక్టర్‌తో అర్ధరాత్రి వెల్లంపల్లికి బయల్దేరారు. మార్గంమధ్యలో దర్శి–అద్దంకి ప్రధాన రహదారిలో శంకరాపురం వద్దకు వెళ్లగానే డీజిల్ లేక ట్రాక్టర్ ఆగిపోయింది. శంకరాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రోడ్డు పక్కన ట్రాక్టర్‌ను ఆపుకుంటున్నారు. ఆ సమయంలో నంద్యాల నుంచి టమోటా లోడుతో అద్దంకి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సునీల్ ట్రాక్టర్ టాప్కు ఇంజిన్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. పొగాకు చెక్కులు ట్రాక్టర్‌పై పడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఒగులూరి ఆంజనేయులు ట్రాక్టర్ నుంచి పక్కకు దూకేశాడు. పైనే ఉన్న మరో ఇద్దరు ఒగులూరి నరేష్, తువ్వదొడ్డి చిన్నబ్బాయికి, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సునీల్‌ను బయటకు లాగేందుకు ఆంజనేయులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షతగాత్రులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం ధాటికి పెద్ద శబ్దం రావడంతో దగ్గర్లో ఉన్న శంకరాపురం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొన్న వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకొన్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఒంగోలు తరలించారు. ట్రాక్టర్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సునీల్‌ను బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో చెక్కులు తొలగించి డ్రైవర్‌ను పక్కకు తీశారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రాక్టర్‌ను, లారీని తొలగించారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య ఏసుదయమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు వెంబడే పడి ఉన్న టమోటాలను స్థానికులు ఎవరికి వారు ఇళ్లకు తీసుకెళ్లారు. -
కడచూపు కోసం వచ్చి కానరాని లోకాలకు
కేవీపల్లె (చిత్తూరు జిల్లా): రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బంధువును చివరిసారి చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికై మృత్యువాత పడింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ► చిత్తూరు జిల్లా కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేష్‌బాబు (19) శుక్రవారం చిత్తూరు – కడప జాతీయ రహదారిలో స్కూటర్‌పై వస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతి చెందాడు. ► మహేష్‌బాబు మృతదేహం పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉండటంతో కడచూపు చూడడానికి అతని తాత కొత్తగాండ్లపల్లెకు చెందిన ఆర్.వెంకటరమణ (65), ఆయన పెద్ద భార్య పార్వతమ్మ (60), చిన్నభార్య సుజాతమ్మ (58), కుమార్తె రెడ్డి గోవర్ధని (21), బంధువులైన ఆటో డ్రైవర్ దామోదర్ (35), కేవీపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన నీలావతి (34), ఆమె కుమార్తె పుష్పావతి (18) ఆటోలో పీలేరుకు వచ్చారు. ► మృతదేహాన్ని చూసి, తిరిగి శుక్రవారం రాత్రి ఆటోలో కొత్తగాండ్లపల్లెకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం వీరి ఆటోను ఢీకొంది. ► వెంకటరమణ, పార్వతమ్మ, సుజాతమ్మ, రెడ్డిగోవర్ధని అక్కడికక్కడే మృతి చెందారు. దామోదర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నీలావతి, పుష్పావతి చికిత్స పొందుతున్నారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరిగింది: ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఐషర్ (మినీ లారీ) ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎప్పుడు, ఎక్కడంటే : శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై ప్రమాదం. పర్యవసానం : అక్కడికక్కడే నలుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. -
రెండు లారీలు ఢీ..ఒకరు మృతి
-
మద్యం మత్తు మృత్యువైంది
వేదాద్రి (జగ్గయ్యపేట): మద్యం మత్తు మృత్యు రూపం దాల్చింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రెండు రైతు కుటుంబాలకు చెందిన 12 మందిని కాటేసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో లారీ డ్రైవర్ సహా మరో 12 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఏటా వ్యవసాయ పనులు చేపట్టే ముందు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా జమలాపురం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామాలకు చెందిన బంధువుల్ని నాలుగు రోజుల క్రితం గోపిరెడ్డి తన ఇంటికి ఆహ్వానించాడు. మొక్కు తీర్చుకునేందుకు 25 మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్టర్‌పై పెద్ద గోపవరం నుంచి బయలుదేరి మధిర మీదుగా వత్సవాయి మండలం తాళ్లూరు చెక్‌పోస్టు, పెనుగంచిప్రోలు మండలం మీదుగా వేదాద్రికి రాత్రి 10 గంటల సమయంలో చేరుకున్నారు. ఆ రాత్రి ఆలయ పరిసరాల్లో బసచేసి బుధవారం ఉదయం కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో అంతా కలిసి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోనే వండుకుని భోజనాలు చేశారు. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అదే ట్రాక్టర్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాద స్థలంలో మృతదేహాలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తదితరులు ఆ లారీ మృత్యు శకటమై.. వారంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ సరిగ్గా ఆలయం నుంచి అర కిలోమీటర్ దూరం ప్రయాణించే సరికి ఎదురుగా హేమాద్రి సిమెంట్స్ కర్మాగారం నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ట్రక్కులో ఉన్నవారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. పెద్దగోపవరానికి చెందిన వేమిరెడ్డి ఉదయశ్రీ (7), వేమిరెడ్డి పుల్లారెడ్డి (75), వేమిరెడ్డి పద్మావతి (50), వేమిరెడ్డి రాజేశ్వరి (27), జమలాపురానికి చెందిన వెదురు అప్పమ్మ (60), కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి (65), గూడూరు ఉపేంద్రరెడ్డి (14) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. వేమిరెడ్డి భారతమ్మ (65), లక్కిరెడ్డి తిరుపతమ్మ (70), గూడూరు రమణమ్మ (60) మార్గమధ్యంలో మరణించారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్దగోపరానికి చెందిన వేమిరెడ్డి కల్యాణి (16), వేమిరెడ్డి లక్ష్మి (9) మృత్యువాతపడ్డారు. గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులంతా బంధువులే.. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన బంధువులే. రైతు వేమిరెడ్డి గోపిరెడ్డి కుమార్తె ఉదయశ్రీ,, అతడి తాత పుల్లారెడ్డి, బామ్మ భారతమ్మ, నాయనమ్మ పద్మావతి మృత్యువాత పడగా.. మరో రైతు కుటుంబానికి చెందిన గూడూరు సూర్యనారాయణరెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. మృతుల్లో వారి మనుమడు ఉపేంద్రరెడ్డి కూడా ఉన్నాడు. మిగిలిన ఐదుగురూ ఈ రెండు కుటుంబాల వారికి బంధువులు. క్షతగాత్రుల వివరాలివీ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో గూడూరు శివనాగిరెడ్డి, అరుణ, నరసింహారెడ్డి, భార్గవి, వేమిరెడ్డి లావణ్య, భానుశ్రీ, శీలం లక్ష్మి, లక్కిరెడ్డి రవీంద్రారెడ్డి, ధనలక్ష్మి, ప్రియాంక, కాలపాని వీర్రాజు, ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ శివసుబ్రమణి ఉన్నారు. వీరిని 108, పోలీస్ వాహనాల్లో జగ్గయ్యపేట, ఖమ్మం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ట్రాక్టర్ నడిపిన రైతు గోపిరెడ్డి, గూడూరు తిరుమలరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. మద్యం మత్తులో లారీ నడపడం వల్లే.. లారీ డ్రైవర్ శివసుబ్రమణి అతిగా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హేమాద్రి సిమెంట్స్ కర్మాగారానికి బొగ్గును లారీలో తీసుకొచ్చిన అతడు.. కర్మాగారంలో సగం బొగ్గును అన్లోడ్ చేసిన తరువాత మిగిలిన బొగ్గుతో మద్యం మత్తులో లారీ నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. లారీని అడ్డదిడ్డంగా నడుపుతూ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లి గోతిలో దిగబడిపోగా.. డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇలా జరిగింది.. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టి.. దాని ట్రక్కును ఈడ్చుకుపోయింది. ఆ తరువాత రోడ్డు పక్కన గల కాలువలోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. ఎప్పుడు.. ఎక్కడ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యవసానం డ్రైవర్ పూటుగా మద్యం తాగి తానెటు వెళ్తున్నానో తెలియని స్థితిలో లారీ నడపటం వల్ల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ సహా మరో 12 మంది గాయపడ్డారు. -
మరణంలోనూ వీడని స్నేహం
కరీంనగర్, మంథని: ముగ్గురివీ పేద కుటుంబాలే.. ముగ్గురూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. పక్కపక్క గ్రామాల్లో ఉన్నప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేయగా, ఒకరు ఎంబీఏ చదివాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే ముగ్గురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి వేటలో పడ్డారు. అయితే లాక్‌డౌన్‌తో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత అండగా ఉండాలనుకున్నారు. నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే ఉంటూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. నెల రోజుల తర్వాత ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరిన స్నేహితులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. మంథని సమీపంలో జరిగిన ఈ ఘటన జూలపల్లి మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిలో మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో సోమవారం లారీ ఢీకొని ముగ్గురూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), , బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు ముగ్గురు విద్యావంతులు. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా నెల కిత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్వైజర్లుగా పనికి కుదిరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వారీలో పని ఆగిపోగా సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొ నడంతో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేశ్‌ను మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ మృతదేహా లు చిందరవందరగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు బయటపడ్డాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది. లారీ వేగంగా ద్వి చక్రవాహనాన్ని ఢీకొనగా భారీ శబ్దం రావడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు ప్రమాద సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లారీ రోడ్డు దిగి పత్తి చేసులోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. మ ంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‌యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్›లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూడు కుటుంబాల్లో విషాదం ఎలిగేడు(పెద్దపల్లి): మంథని సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు నిరుపేద కు టుంబాలకు చెందినవారే. వీరిలో ఇద్దరిది అబ్బాపూర్ కాగా మరొకరిది బాల్‌రాజ్‌పల్లి. ముగ్గురు యువకుల మృతితో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ నేపథ్యం.. మృతుల్లో అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి రజినీకాంత్(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజేశ్వరి కూలీపని, తండ్రి కొమురయ్య హమాలీ పని చేస్తూ కుమారుడిని చ దివించారు. అదే గ్రామానికి చెందిన మిట్ట మధుకర్(26)ఎంబీఏ చదివాడు. తల్లి ఆరవ్వ కూలీ పనిచేస్తుతండగా తండ్రి మల్లయ్య హమాలీ పని చేస్తూ ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించారు. అడప సురేశ్(24)డిగ్రీ చదివాడు. తల్లి లక్ష్మి, తండ్రి లచ్చయ్య కూలిపని చేస్తూ కుమారున్ని చదివించారు. కుటుంబా నికి భారం కాకూడదని ఎంతో కొంత ఆసరాగా ఉండాలని ముగ్గురు యువకులు ఇసుక క్వారీలో పనికి కుది రారు. పనులు సాగక ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. -
విద్యార్థి ఆయువు తీసిన ఆర్థిక కష్టాలు
వైఎస్సార్ జిల్లా, మార్టూరు: బతుకుదెరువు కోసం లారీ క్లీనర్‌గా మారిన ఇంటర్ విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక జాతీయ రహదారిపై ఇసుక దర్శి (ప్రకాశం జిల్లా) సమీపంలో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, హైవే అంబులెన్స్ సిబ్బంది కథనం ప్రకారం.. కడపలోని గౌస్ నగర్‌కు చెందిన వెంకట్ (18) ఇంటర్ చదువుతున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వెంకట్ సోమవారం రాత్రి కడప నుంచి విజయవాడ వెళ్లే టమాటా లారీలో క్లీనర్‌గా బయల్దేరాడు. స్థానిక ఇసుక దర్శి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న లారీకి ముందు వెళ్తున్న మరో లారీ అకస్మాత్తుగా ఆగింది. దీంతో వెనుక లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలుకాగా.. క్యాబిన్లో కూర్చున్న వెంకట్ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని లారీ నుంచి అతికష్టం మీద బయటకు తీస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
జడ్చర్ల వద్ద లారీ బీభత్సం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. పనసకాయల లోడ్ లారీ సర్వీస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి దుర్మరణం చెందారు. జడ్చర్ల మండలం కావేరమ్మపేట వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న బంగారయ్య(23), మల్లయ్య (28)తో పాటు రఫీయొద్దీన్(50) అనే వ్యక్తిపై లారీ పడి దుర్మరణం చెందారు. -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ
సాక్షి, గుంటూరు: చలమల – శ్రీరాంపురం తండా మధ్య జరిగిన లారీ ప్రమాదంలో గాయపడి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి.. వారిని ఓదార్చారు. తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు, వైఎస్సార్ బీమా పథకం నుంచి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి తన నిధుల నుంచి పదివేలు ప్రకటించారు. ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. (మృత్యు ఘోష) -
పది నిమిషాల్లోనే...
పదకొండు నెలల బిడ్డను విశాఖలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అంతలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తమ బిడ్డతో పాటు తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. అదుపుతప్పిన బైక్ లారీ కింది భాగంలోకి బలంగా దూసుకుపోవడంతో బిడ్డ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూసపాటిరేగ (భోగాపురం): ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మోటారుసైకిల్‌పై ఆస్పత్రికి వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. వారితో ఉన్న 11 నెలల బాలుడు తన్వీర్‌కు గాయమైంది. వివరాల్లోకి వెళ్తే...జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీనివాసరావు(30) తొమ్మిది నెలల కిందట అక్కివరం శ్రీనివాస హేచరీలో సూపర్వైజర్గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భార్య స్వాతి(29), 11 నెలల కుమారుడు తన్వీర్‌తో కలిసి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు బయలుదేరారు. సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జంక్షన్‌కు వచ్చేసరికి ముందుగా వెళ్తున్న లారీని బైక్‌తో బలంగా ఢీకొని లారీ కిందకు మోటారుసైకిల్‌తో పాటు దూసుకెళ్లాడు. శ్రీనివాసరావు వెనక్కి తూలడంతో తలకు బలంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది. 11 నెలల తన్వీర్ కిందకు పడడంతో తలకు స్వల్ప గాయమైంది. వెంటనే సమాచారం అందుకున్న భోగాపురం ఎస్ఐ శ్యామల సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన స్వాతిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ శ్యామల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదబుడ్డిడిలో విషాదం... జియ్యమ్మవలస: రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు మృత్యువాత పడడంతో పాటు భార్య స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో పెదబుడ్డిడిలో విషాదం నెలకొంది. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. రెండేళ్ల కిందటే వివాహమైన శ్రీనివాసరావు, స్వాతి దంపతులకు 11 నెలల బిడ్డ తన్వీర్ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తండ్రి మృతి చెందడం, తల్లి కోమాలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుని తండ్రి కొద్ది సంవత్సరాల కిందట మరణించగా తల్లి, నాన్నమ్మ, తమ్ముడితో కలిసి శ్రీనివాసరావు పెదబుడ్డిడిలో నివాసం ఉంటున్నాడు. నిరుపేద కుటుంబం కావడం, ఇంటికి శ్రీనివాసరావే ఆధారం కావడం ఇంతలోనే మృత్యువాత పడడంతో ఇక ఎలా జీవించేదని కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
-
కన్నవారికి గుండె కోత
ప్రకాశం, మార్కాపురం: సరదాగా గడపాల్సిన ఆదివారం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థి జీవితాన్ని కబళించింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పెద్ద వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని శివాజీనగర్ 6వ లైనులో నివాసం ఉండే దూదేకుల చిన్న జీజీర్ కుమారుడు కరీముల్లా (15) స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎన్సీసీ డ్రిల్‌కు వెళ్లి బయటకు వచ్చిన తరువాత స్నేహితుడి మోటార్ బైక్ తీసుకుని తర్లుపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వినుకొండ నుంచి రాగుల లోడుతో వస్తున్న లారీ పెద్ద వాటర్ ట్యాంక్ వద్దకు రాగానే లారీడ్రైవర్ తన వాహనాన్ని లెఫ్ట్ వైపు కట్ చేస్తుండగా అప్పుడే మోటార్ సైకిల్‌పై వస్తున్న కరీముల్లాకు తగలటంతో లారీ కింద పడి దుర్మరణం చెందాడు. వార్త విన్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మార్బుల్ రాళ్ల కూలీగా పని చేస్తున్న చిన్న జజీర్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కరీముల్లా ఆఖరి అబ్బాయి. బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కంటుండగా ఊహించని రీతిలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబంలో విషాదం నింపిందని కుటుంబ సభ్యులు రోదించారు. శివాజీనగర్ 6వ లైనులో ఉంటున్న కరీముల్లా ఆ ప్రాంతంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉదయం 6 గంటల వరకు తమతో ఉన్న కుమారుడు 9గంటల కల్లా మృతదేహంగా రోడ్డుపై పడి ఉండటాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. -
యువ దంపతుల దుర్మరణం..
వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో కలికిరి మండలం గుట్టపాళ్యెంకు చెందిన యువ దంపతులు షేక్ హారున్‌బాషా(30), షేక్ హసిరా బేగం(28) దుర్మరణం పాలయ్యారు. వారితో పాటు షేక్ హారున్ బాషా అత్త హజిరాబేగం (52), కారు డ్రైవర్ హర్షద్‌ఖాన్(37) మత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో గుట్టపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ప్రమాదంలో హారూన్‌బాషా, హసిరాల ఇద్దరు బిడ్డలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం. రాయచోటి/కలికిరి : అర్ధరాత్రి దాటాక వరుసగా జరుగుతున్న ప్రమాదాల జాబితాలో మరొకటి చేరింది. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి పూట రహదారిపై మితిమీరిన వేగంతో లారీ రావడం..మంచు వల్ల మార్గం సరిగా కనిపించకపోవడం ఫలితంగా ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. రాయచోటికి చెందిన పైపుల పరిశ్రమ యజమాని షేక్‌ఖాదర్ మోహిద్దీన్ తన భార్య హజిరాబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు, మనవళ్లతో కలిసి ఇన్నోవా వాహనంలో మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు వెళ్లారు. అమెరికాలో ఉండే చిన్న కుమార్తె, అల్లుడు ఈ మధ్యనే ప్రొద్దుటూరుకు వచ్చారు. వారిని చూసేందుకు వీరంతా వెళ్లారు. సాయంత్రం వరకు అందరూ ఆనందంగా గడిపారు. రాత్రి భోజనం చేసి 10.30 గంటల సమయంలో రాయచోటికి తిరుగు ప్రయాణమయ్యారు. కడప మీదుగా రాయచోటిలోని స్వగృహానికి మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే అశువులు బాశారు. చిన్నారులతో కలిసి 11 మంది ఇన్నోవాలో ప్రయాణిస్తున్నారు. మొహిద్దీన్ భార్య హజిరాబేగం(52)లతో పాటు కుమార్తె హసిరా(31) అల్లుడు హరూన్‌బాషా(35) ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ హర్షద్‌ఖాన్(37) కూడా దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన హరూన్ బాషా కలికిరి మండలం గుట్టపాలెంకు చెందిన వారు. ఈయన సదుం మండలంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. కుటుంబంతో పీలేరులో నివసిస్తున్నారు. హారున్‌బాషా దంపతుల మృత దేహాలు బుధవారం సాయంత్రం గుట్టపాలెం చేరాయి. గురు వారం అంత్య క్రియలు నిర్వహిస్తారు. అమ్మ ఒడిలో ఒకరు..అమ్మమ్మ ఒడిలో మరొకరు సురక్షితం సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన హరూన్‌బాషా, అతని భార్య హసిరాల పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం! వీరిరువురు అమ్మ ఒడిలో ఒకరు, అమ్మమ్మ ఒడిలో మరొకరు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. అమ్మ, అమ్మమ్మలు ఇరువురూ మృతి చెందగా వారి ఒడిలో ఉన్న చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వీరిని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడు డ్రైవర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
రోడ్డుపై నుంచి.. వంతెనలో..
గూడూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ రెప్పపాటులో డివైడర్ మధ్య వంతెనలోకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్‌కు నిద్ర ముంచుకురావడంతో కళ్లు మూతలు పడి.. తెరుచుకునే లోగా.. డివైడర్ల మధ్యలో వంతెన గోడలకు తగులుకుని వేలాడుతోంది. అయితే ఆ లారీలోని డ్రైవర్‌తో పాటు, క్లీనర్‌కూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ముప్పు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలకు చెందిన లారీ చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఆదిశంకర కళాశాల కూడలి ప్రాంతం వద్ద ఉన్న డివైడర్ వద్దకు చేరుకునే సరికి డ్రైవర్ నిద్ర ఆపుకోలేకపోయాడు. కళ్లు మూత పడడంతో అదుపుతప్పిన లారీ డివైడర్‌ను ఢీకొని వంతెన మధ్యలో తలకిందులుగా పడిపోయింది. వంతెన గోడలను తగులుకుని వేలాడుతూ కనిపించింది. అయితే అందులోని డ్రైవర్ రాజా, క్లీనర్ హుస్సేన్ లారీలోంచి దిగి బయట పడ్డారు. అయితే లారీ వంతెన లోపల పడిపోయి ఉంటే.. ప్రాణనష్టం జరిగేదని తెలుస్తోంది. వంతెనలో నీళ్లు ఉన్నాయి. లారీ ముందు భాగం అందులో మునిగిపోయి ఉండేది. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న గూడూరు రూరల్ ఎస్సై పుల్లారావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూవీడని బంధం
కశింకోట (అనకాపల్లి): మృత్యువులోను వీడని బంధం వారిది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెళ్లి అయినప్పటి నుంచి వారు ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. చివరగా కలిసి వస్తూనే రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమునాయుడు (62), భార్య పైడితల్లి (53) ప్రాణాలు కోల్పోయారు. పొలం నుంచి నడిచి ఆవు పాలు పిండి విక్రయానికి తీసుకు వస్తున్న వీరిని మృత్యువు కబలించింది. కాకినాడ నుంచి విశాఖ వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ దూసుకు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందా రు. వీరు పాడి పరిశ్రమ ద్వారా కుటుంబ జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారునికి వివాహం చేశారు. ఆయిల్ ట్యాంకర్‌ను తప్పించుకోలేక.. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి. వీరు పెళ్లి అయిన మొదలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లినా ప్రేమికుల్లా కలిసి వెళ్లే వారు. పొలానికి కూడా కలిసే వెళ్లి తిరిగి వచ్చే వారు. వీరికి ఒక పాడి ఆవు ఉంది. ఎప్పటిలాగే శుక్రవారం తెల్లవారుజామున సమీపంలోని మామిడివాక గెడ్డ పక్కన ఉన్న తమ పశువుల శాలకు వెళ్లి ఆవు పాలు పిండుకొని తిరిగి ఇంటికి నడిచి వస్తున్నారు. మార్గమధ్యలో మామిడివాక గెడ్డ వంతెన దాటిన తర్వాత వారిని ఆయిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబలించింది. దూసుకు వస్తున్న లారీని వారు చూసినప్పటికీ తప్పించుకోలేక పోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వారిని ఢీకొన్న లారీ పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకుపోయిందని వారు వివరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడకు చేరే సరికి డ్రైవర్ నిద్రలోకి జారుకొని ఉంటాడని, దీనివల్ల లారీ అదుపుతప్పి ప్రమాదానికి దారితీసి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. విషాదంలో కుటుంబాలు.. దంపతులు సోమునాయుడు, పైడితల్లి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. ఒకేసారి ఇద్దరు మృతి వారితోపాటు స్థానికులకు కలచి వేసింది. సంఘటన స్థలాన్ని అనకాపల్లి రూరల్ సీఐ నరసింహారావు సందర్శించారు. మృత దేహాలకు పోస్టుమా ర్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.హిమగిరి తెలిపారు. దంప తుల మృతదేహాలకు బంధువులు, కుటుంబ సభ్యులు ఒకేసారి అంత్యక్రియలు జరిపించారు. అదేచోట తరచూ ప్రమాదాలు ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. అలాగే లారీలు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు పోయి పల్లపు ప్రాంతంలో బోల్తా పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వంతెన నుంచి వాలు ఎక్కువగా దిగువకు ఉండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. దీన్ని సరిచేసి ప్రమాదాలు నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయా లని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థిని బలిగొన్న టిప్పర్
ఎస్కేయూ: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎంఏ సోషియాలజీ విద్యార్థి బాలకృష్ణ(22)ను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. తమ కళ్లెదుటే ఘోరం జరిగిపోవడంతో తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం ఎస్కేయూ వద్ద జాతీయరహదారిపై బైఠాయించారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ఎస్కేయూ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ (ఎన్ఎస్సీ) సంస్థ కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డుల ఏర్పాటులో తాత్సారం ప్రదర్శించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టిప్పర్ ఢీకొని ఎస్కేయూ విద్యార్థి బాలకృష్ణ దుర్మరణం చెందాడు. ఇందుకు నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత వహిస్తూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌చౌదరికి చెందిన టిప్పర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని నినదించారు. భగ్గుమన్న విద్యార్థులు వందలాదిమంది విద్యార్థులు ఎస్కేయూ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌పై బైఠాయించారు. విద్యార్థి బాలకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నాలుగు గంటలపాటు ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. 8 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళనను విరమించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కాంతి కిరణ్, అంకే శ్రీనివాసులు, హేమంత్‌కుమార్, ఎంఎస్ఎఫ్ నాయకులు తిరుపాల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. దామవాండ్లపల్లిలో విషాదం నల్లచెరువు: ‘అయ్యో ఎంత పని చేస్తివి దేవుడా.. కుమారుడిని ఉన్నత స్ధానంలో చూడాలనుకుంటిమే. ఇంతలోనే ఎంతపని చేస్తివయ్యా’ అంటూ బాలకృష్ణ తల్లిదండ్రులు రోదించిన తీరు కలచివేసింది. నల్లచెరువు మండలం దామవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, బయమ్మ దంపతుల చిన్నకుమారుడు బాలకృష్ణ ఆదివారం రాత్రి ఎస్కేయూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : లారీ డ్రైవర్ మితిమీరిన వేగానికి ఓ భవన నిర్మాణ కార్మికుడు బలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. గురువారం ఈ సంఘటన మదనపల్లె లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం..తంబళ్లపల్లె మండలం ఎరమద్దివారిపల్లెకు చెందిన టి.సహదేవ(42) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బెంగుళూరు రోడ్డులో ఉన్న నక్కల దిన్నె తాండాలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహదేవ గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లులో భవన నిర్మాణ పనులకు కోటవారిపల్లెకు చెందిన నరసింహులు(37)ను తీసుకుని తన మోటార్ సైకిల్లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్‌యార్డు సమీపాన ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ స్పీడు బ్రేకర్ల వద్ద బైక్‌పై నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ సహదేవ, నరసింహులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో సహదేవ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నరసింహులును అక్కడి ప్రజలు ఆటోలో హుటా హుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ, పిల్లలు తనుజ, జయశ్రీ తమ బంధువులతో అక్కడికి చేరుకుని ‘ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. వాల్మీకిపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎగువబూడిదవేడుకు చెందిన ఆవుల ద్వారకనాథ రెడ్డి (32) చింతపర్తి బాహుదానది బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుది తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు ఢీకొని మహిళ మృతి బంగారుపాళెం: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు బైపాస్‌రోడ్డుపై చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ కథనం.. చీకూరుపల్లెకు చెందిన లేట్ లక్ష్మయ్య భార్య లక్ష్మమ్మ(56)పొలం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లవారితే దుబాయ్ ప్రయాణం
సాక్షి, ధర్మారం(కరీంనగర్) : ధర్మారం మండలంలోని నందిమేడారం బైపాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి లారీ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందినట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామానికి చెందిన కుదిరే ప్రశాంత్ (23), తనుగుల మనోజ్ (21)లు బైక్‌పై మేడారం నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా లారీ ఢీకొని మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శాఖాపూర్ గ్రామంలో విషాదం వెల్గటూరు(ధర్మపురి): మండలానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి ధర్మారం మండలం మేడారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో శాఖాపూర్ విషాదం నెలకొంది. యువకుల అంత్యక్రియలు ఆదివారం నిర్వహించగా ఊరంతా నివాళి అర్పించింది. తనుగుల మల్లేశ్,పుష్ప అనే దంపతుల కుమారుడైన మనోజ్ కుదిరె తిరుపతి భూమక్కల కుమారుడైన ప్రశాంత్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. చేతికి అంది వచ్చిన కొడుకులు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లవారితే మనోజ్ దుబాయ్ విమానం ఎక్కేవాడు తనుగుల మనోజ్ కుదిరె ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు. మనోజ్ దుబాయ్ వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ధర్మారం మండలం వనపర్తిలో మనోజ్ అక్కను కలిసి, ప్రశాంత్ అక్క పెద్దపల్లిలో జరుపుకుంటున్న పోచమ్మ బోనాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. వీరితో గణేశ్ అనే మరో యువకుడు మరోబైక్‌పై బయల్దేరారు. పెద్దపల్లికి చేరకముందే ఇద్దరు స్నేహితులను మేడారం వద్ద లారీ బలితీసుకొంది. ఈ ప్రమాదంతో భయాందోళన చెందిన గణేశ్ గ్రామానికి చేరుకొని సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు. ఇరు కుటుంబాల్లో ఒక కొడుకు ఒక కూతురు కావడం గమనార్హం. నవయువకుల మృతి తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చింది. -
అయ్యో.. హారికా..!
సుల్తానాబాద్(పెద్దపల్లి): పది రోజుల్లో పెళ్లి.. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతిని మృత్యువు వెంటాడింది. పాడెపైకి చేరేలా చేసింది.. భాజాభజంత్రీతల మధ్య తల్లిదండ్రులు అత్తారింటికి సాగనంపాల్సి ఉండగా.. విధి చిన్నచూపు చూసింది.. చావుడప్పుల మధ్యల శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మారేడుకొండ తిరుపతి–పద్మ దంపతులకు కొడుకు, కూతురు హారిక ఉన్నారు. ఇటీవలే హారిక వివాహం నిశ్చయమైంది. ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన పెళ్లికి స్నేహితులను ఆహ్వానించేందుకు శనివారం సోదరుడు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఓదెల మండలం కొలనూర్‌కు వెళ్లింది. పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సుద్దాల శివారుకు రాగానే చెరువు మట్టి తరలించే లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. పది రోజుల్లో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
బచ్చన్నపేట : స్నేహితుని వివాహానికి బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండల మొండికుంట వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటరీ పని చేసే ప్రణీత్ ఆలియాస్ సన్నీ వివాహం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో జరుగుతోంది. పెండ్లికి వెళ్లేందుకు మిత్రులు రవికిరణ్‌రెడ్డి(24), ఎలిశెట్టి కర్ణాకర్(26) బైక్‌పై బయలుదేరారు. బైక్ మొండికుంట స్టేజీ వద్దకు చేరుకోగానే మహారాష్ట్రకు చెందిన లారీ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో స్నేహితులిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పది రోజుల్లో ఉద్యోగం వచ్చేది.. రవికిరణ్‌రెడ్డి తండ్రి మధుమోహన్‌రెడ్డి సేల్‌టాక్స్ కార్యాలయంలో పని చేస్తూ చనిపోయాడు. కూతురు, కుమారున్ని తల్లి తార జనగామలో టైలర్ షాపు పెట్టుకొని బట్టలు కుడుతూ చదివిస్తోంది. పది రోజుల్లో రవికిరణ్‌రెడ్డి తండ్రి జాబ్‌లో చేరేవాడని, ఇక తమ కష్టాలు తీరేవని తల్లి తార రోదిస్తూ తెలిపింది. ప్రస్తుతం కూతురు బీటెక్ చదువుతోంది. ఇంటికి ఇద్దరూ పెద్ద దిక్కులు పోయి కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చిందని పలువు రోదించారు. కొడుకు, భార్య అనాథ.. రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన కర్ణాకర్ వాయిస్ టుడే న్యూస్ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. మృతునికి రెండు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వారికి తొమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. మృతుని తండ్రి యాదగిరి, తల్లి కోమలకు వివాహానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అరగంట లోపు చనిపోయాడని సమాచారం వచ్చిందని భార్య అశ్విని రోదనలు మిన్నంటాయి. కళ్ల ముందే విగతజీవులుగా.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిందని వారి వెనకాలే వెళ్తున్న వరంగల్‌కు చెందిన మరో స్నేహితుడు సచిన్ చెబుతున్నాడు. ఆ లారీ వేగానికి తమ బైక్‌ను పక్కకు ఆపామని, కొంత దూరం వెళ్లి లారీ ప్రమాదం జరగడంతో ఆగిందని వివరించాడు. ఎస్సై రంజిత్‌రావు ఘటనా స్థలానికి ఎస్సై రంజిత్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి..
ఆనందపురం(భీమిలి): ఆనందపురం మండలం శిర్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొండపల్లి గ్రామానికి చెందిన కోన శ్రీనివాసరావు ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుటుంబంతో విజయనగరం కంటోన్మెంట్లో నివాసం ఉంటున్నాడు. సింహాచలంలోని బైరవకోనలో దైవ దర్శనానికి శ్రీనివాసరావుతో పాటు అతని భార్య రేణుకాదేవి, వదిన రమణ, తోడల్లుడు చిన రాంబాబు రెండు బైకులపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. అక్కడ దైవ దర్శనం అనంతరం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శిర్లపాలెం గ్రామం వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారు ముందు ఉన్న బస్సును ఓవర్ టేక్ చేసి శ్రీనివాసరావు నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు బైక్ వెనుక వైపు కూర్చున్న రేణుకాదేవి(37) కిందపడి పోగా వెనక వైపు నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ, కారు డ్రైవర్లను ఎస్ఐ శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి బాకురుపాలెం నుంచి శిర్లపాలెం మధ్య రెండు రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆనందపురం–పెందుర్తి రహదారి నుంచి విజయనగరం వెళ్లే ఈ మార్గంలో ఇటీవల వాహన రాకపోకలు ఎక్కువయ్యాయి. అలాగే బాకురుపాలెం, ముకుందపురం, శిర్లపాలెం, ముచ్చర్ల గ్రామాల వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఈ రూట్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అతివేగం ప్రాణం తీసింది
నూజివీడు: అతివేగం ఒకరి ప్రాణాలు బలిగొనగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ మృతిచెందగా, రెండో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గొల్లపల్లి, మీర్జాపురం గ్రామాల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు నేలబొగ్గు లోడుతో వెళ్తున్న లారీ, కొండపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనుకు రోడ్డు మెటీరియల్‌తో వెళ్తున్న టిప్పరు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందరి భాగం దెబ్బతినగా జగ్గయ్యపేట వెళ్తున్న లారీ డ్రైవర్ జడ వీరబాబు (36) అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్ డ్రైవర్ ముత్తు సురేష్ (32)కు గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిది జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఇంకొల్లు సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి..
నాయుడుపేట టౌన్: కుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిపత్రికలు పంపిణీ చేస్తూ ఆనందంగా ఉన్న సమయంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లిపత్రికలను పంచేందుకు బైక్‌పై వెళ్లిన పెళ్లి కుమారుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మృతుడి సమీప బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాయుడుపేట పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు పట్టణంలోని పోలీస్‌కాలనీ సమీపంలో ఏకేనగర్‌లో నివాసం ఉంటున్న బత్తుల రవీంద్ర(64) చెన్నైలో ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. అతని ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి కుదరడంతో ఈ నెల 16న బెంగళూరులో పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం రవీంద్ర తన బావమరిది చోడిబోయిన పృధ్వీరాజ్‌తో కలిసి బంధువులకు పెళ్లిపత్రికలు ఇచ్చేందుకు బైక్‌పై బయలుదేరారు. పలుచోట్ల పెళ్లిపత్రికలు ఇచ్చి నాయుడుపేటలో ఉన్న అతని బంధువు ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపల్లో ఇంటికి చేరుకునే సమయంలో నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో కిందపడిన రవీంద్ర తలపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతనితోపాటు ఉన్న పృధ్వీరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుృధ్వీరాజ్‌ను 108 అంబులెన్స్ సిబ్బంది సహకారంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సలు జరిపి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమై లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కుమారుడి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లికుమారుడి తండ్రి బత్తుల రవీంద్ర నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలుసుకుని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు కొందరు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. రవీంద్ర మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన అనంతరం నెల్లూరుకు తరలించారు. -
రెప్పపాటులో ఘోరం..
కొమరాడ: రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. శుభకార్యానికి వచ్చిన చిన్నారి లారీ ప్రమాదంలో కన్నుమూసింది. కళ్లముందే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన నరాల రాజు, మాధురి దంపతులు విశాఖలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో విక్రమపురంలోని బంధువుల ఇంటిలో జరగనున్న శుభకార్యంలో పాల్గొనేందుకు బుధవారం గ్రామానికి వచ్చారు. రెండో సంతానమైన హరిణిక (8) విక్రంపురం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా.. పార్వతీపురం నుంచి ఒడిశా వైపు అతివేగంగా వెళ్తున్న లారీ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో కళ్లముందే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొమరాడ ఎస్సై రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలెన్నో....? కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి.అతివేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు మీదకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గ్రామస్తులు నిలదీశారు. -
ఇద్దరిని కబళించిన లారీ
కె.అగ్రహారం (జగ్గయ్యపేట) : వరిగడ్డి లోడు ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ధర్మవరప్పాడు తండాకు చెందిన రూపావత్ లాలు (40), గుగులోతు బాలాజీ (31), బాణావత్ బాలనాగమ్మ తెలంగాణలోని నల్గొండ జిల్లా జాన్‌పాడులో వరి గడ్డి కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్‌పై వెళ్లారు. వరి గడ్డి కొనుగోలు చేసుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోని రెండవ మలుపు వద్దకు వచ్చేసరికి రామాంజనేయ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ జగ్గయ్యపేట నుంచి సిమెంట్ కర్మాగారానికి వెళ్తోంది. లారీ వేగంగా ట్రాక్టర్‌ను ఎదురుగా ఢీకొట్టటమే కాకుండా ట్రాక్టర్ ఇంజిన్‌పైకి ఎక్కింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ లాలు ఇంజిన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే కూర్చున్న బాలాజీ, నాగమ్మ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొందరు 108కు సమాచారమివ్వటంతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం వారిని విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలాజీ ఆదివారం ఉదయం మృతి చెందాడు. బాలనాగమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. ప్రమాద ప్రాంతంలో చేతికందే ఎత్తులో 11 కేవీ విద్యుత్ తీగలుండటం గమనార్హం. చిల్లకల్లు ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవారే.. మృతి చెందిన లాలు, బాలాజీ, బాలనాగమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. డ్రైవర్‌గా పని చేస్తున్న లాలు ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మరో మృతుడు బాలాజీ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మృతులకు భార్య, పిల్లలు ఉన్నారు. ధర్మవరప్పాడు తండాలోవిషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందటంతో పాటు మరొకరు తీవ్ర గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశువులకు వరి గడ్డి కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువాత పడటంతో గ్రామస్తులను సైతం కంట తడి పెట్టించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ కమిటీ కన్వీనర్ తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. పార్టీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు. -
రహదారి రక్తసిక్తం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం బాచేపల్లి చందర్‌నాయక్ గేట్ సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిపై లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 14 మంది హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు తుఫాన్ వాహనంలో బయలు దేరారు. వీరి వాహనం మార్గమధ్యలో చందర్‌నాయక్ తండా గేట్ వద్దకు రాగానే నిజాంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో తుఫాన్ వాహనం డ్రైవర్ షేక్ మన్నాన్(35), శిరిసింబే శివానీ(20)లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మన్నాన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వచ్చి బయటికి తీశారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. క్షతగాత్రుల్లో రజని(60), చిప్తి అనే 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. మిగతావారిలో అర్చన, సంధ్య, మహదేవి, ప్రథమేశ్, ప్రగతి, లత, స్వాతి, అశోక్‌తోపాటు మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరి ల్లింది. రోడ్డంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ సందర్శించారు. కల్హేర్ ఎస్ఐ ఎం.స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అయ్యో.. రామ
యాలాల: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు. అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఆటోలో ఎక్కారు. ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్ సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్, యాలాల ఎస్ఐ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
శివయ్యా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
దేవనకొండ: శ్రీశైల మల్లన్నంటే వారికి ఎనలేని భక్తి. ఏటా ఉగాది సమయంలో వందల కిలోమీటర్లు నడిచి శ్రీశైలానికి వెళ్తుంటారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. అయితే..మార్గమధ్యంలో వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని ఈదులదేవరబండ–కప్పట్రాళ్ల మధ్య చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా మండలంలోని ఎర్రగుడి ప్రాంతానికి చెందిన గడ్డం ఉలిగయ్య, గడ్డం పోతప్ప, గడ్డం శేఖతో పాటు మరి కొంతమంది రెండు రోజుల క్రితం పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఆస్పరి మండలం పుటకలమర్రి మోడల్ స్కూల్ వద్ద సేద తీరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి నడక ప్రారంభించారు. దేవనకొండ దాటి ఈదులదేవరబండ –కప్పట్రాళ్ల మధ్య వెళ్తుండగా బళ్లారి నుంచి నంద్యాల వెళ్తున్న లారీ (ఏపీ21టీఈ0099) వెనుక వైపు నుంచి భక్తుల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎర్రగుడి గ్రామానికి చెందిన గడ్డం ఉలిగయ్య(28), గడ్డం శేఖ(15), గడ్డం పోతప్ప(23) అక్కడికక్కడే మృతిచెందారు. గడ్డం గాదిలింగ, గడ్డం పోతులింగ, హాలహర్వి నాగరాజు, దేవేందర్‌రెడ్డి, గడ్డం బాలరాజు, గడ్డం పరశురాముడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు. పోతులింగ, నాగరాజు, దేవేందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ చిన్నపీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతులు గడ్డం ఉలిగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, గడ్డం పోతప్పకు ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. లారీలకు ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అతివేగంగా రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రూ.8 లక్షల డీజిల్ నేలపాలు
పీఎం పాలెం(భీమిలి): జాతీయ రహదారిపై మారికివలస కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు రూ.8లక్షలు విలువ చేసే డీజిల్ నేలపాలయింది. షీలానగర్‌కు చెందిన ట్యాంకర్ 18 వేల లీటర్ల డీజిల్‌తో ఆదివారం ఒడిశాకు బయలుదేరింది. జాతీయ రహదారి మారికవలస కూడలి వద్దకు వచ్చేసరికి కూడలిలో యూ టర్న్ తిరుగుతున్న భారీ కంటెయినర్ డీజిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టొంది. దీంతో ట్యాంకర్ బోల్తా కొట్టింది. ట్యాంకరుకు గల బ్లాకుల మూతలు తెరుచుకోవడంతో ఆయిల్ రోడ్డుపై ఏరులా పారింది. సందట్లో సడేమియా అన్నట్లు స్థానికులు రోడ్డుపై పారుతున్న డీజిల్‌ను చేతికి అందినంత డబ్బాలతో పట్టుకుపోయారు. నేల పాలైన ఆయిల్ విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని సిబ్బంది తెలిపారు. లారీ యజమాని సాధి సూరిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు రమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.సూర్యారావు తెలిపారు. -
రక్తపుటేరులు
రంగుల హోలీ సంబరాల్లో మునిగి ఆ మధుర జ్ఞాపకాలతో సొంతూరుకు పయనమైన యువకులపై మృత్యువు కర్కశంగా విరుచుకుపడింది. అతివేగమే ప్రాణం తీసింది. వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోవాకు వెళ్లిన తమ పిల్లలు వస్తున్నారని ఇళ్లలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయారు. విజయపుర జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది యువకులు మృత్యువాత పడ్డారు. సాక్షి, బళ్లారి: కర్ణాటకలో శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.« మూడు రోజుల కిందట ధార్వాడ నగరంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో 12 మంది మృతి చెందిన ఘటన మరవకముందే విజయపుర జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సంభవించింది. శుక్రవారం విజయపుర జిల్లా సింధగి తాలూకా, చిక్క సింధగి సమీపంలోకి జాతీయ రహదారి 218లో క్రూసర్–లారీ ఢీకొనడంతో ఘటన స్థలంలోనే 9 మంది మృతి చెందడంతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో పాటు ఆ ప్రాంతం రక్తమడుగుతో భీతావహంగా మారింది. మృతులు అందరూ కూలికార్మికులు కాగా గోవాలో హోలీ సంబరాలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కలబుర్గి జిల్లాకు చెందిన కట్టడ కూలి కార్మికులు గోవా నుంచి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో క్రూషర్లో ఉన్న వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. దీంతో అక్కడికక్కడే 9 మంది మృతి చెందడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కలకలం సృíష్టించింది. మృతులను సాగర్ (24), చాంద్‌బాషా (22), అజీం (21), అంబరీష్ (29), కే.కే.షాకీర్ (25), శ్రీనాథ్ (30), యూసఫ్ (27), గురు (21), మాబుసాబ్ (29)లుగా గుర్తించారు. హోలీ సంబరాలను ఆనందంగా చేసుకుని తిరిగి వస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో చిత్తాపురలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, కట్టుకున్న భర్త అకాల మృత్యువు చెందడంతో భార్య రోదనలు చిత్తాపురలో కలిచివేశాయి. సింధగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతివేగమే ప్రాణం తీసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
కన్నవారి కళ్ల ఎదుటే ఘోరం
దేవరాపల్లి(మాడుగుల) : మహా శివరాత్రి పర్వదినాన ఓ నిరుపేద కుటుంబంలో ఎనిమిదేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కన్నకూతురు కళ్ల ఎదుటే లారీ చక్రాల కింద పడి మరణించడాన్ని చూసిన కన్నవారు పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో నల్లబిల్లి జంక్షన్లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు జాహ్నవి(8) అనే బాలిక మృతి చెందింది. జాహ్నవి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. భార్య వరలక్ష్మి, కుమార్తె జాహ్నవి, కుమారుడు తనూలతో కలిసి గోపాలపట్నంలోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మమ్మ ఇల్లు అయిన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి సొంత ఆటోలో చేరుకున్నారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గోపాలపట్నం తన ఆటోలోనే తిరుగు పయనమయ్యారు. శివరాత్రి కావడంతో ఈ రోజు ఉండి మరుసటి రోజు వెళ్లాలని అమ్మమ్మ చెప్పగా జాహ్నవి మాత్రం తన పాఠశాలకు సెలవు లేదని స్కూల్ వెళ్లాలని చెప్పడంతో సోమవారం ఉదయం గోపాలపట్నం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ ఇంటి ముందు ఉన్న ఆటో ఎక్కేందుకు ఆటో ముందు నుంచి జాహ్నవి ప్రయత్నించగా అదే సమయంలో విజయనగరం జిల్లా వావిలపాడు సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ నుండి ఆనందపురం వైపు వస్తున్న భారీ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలిక లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటనలో తమ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు వరలక్ష్మి, సూర్యనారాయణలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డుపై జరిగిన ఈ ప్రమాద ఘటనను చూసిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కంటతడి పెట్టుకున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వేపాడ పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. -
రెండు లారీలు ఢీ,డ్రైవర్ సజీవదహనం
-
ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ
విజయనగరం ఫోర్ట్/ దత్తిరాజేరు/విజయనగరం టైన్ / బొండపల్లి: విజయనగరం పట్టణంలోని పనులు ముగించుకుని గమ్య స్థానాలకు చేరడం కోసం వారంతా ఆర్టీసీ తెలుగువెలుగు బస్సు ఎక్కారు. గంట, గంటన్నర సమయానికి ఇళ్లకు చేరుకుంటామని భావించారు. ఇంతలోనే లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. కళ్లు తెరిచి చూసే సరికి బస్సులో ఆర్తనాదాలతో అలజడి. కాళ్లు విరిగిపోయిన వారు కొందరైతే, చేతులు, వెన్నుపూస, తలకు గాయాలైన వారు మరికొందు. ఇలా 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి బొండపల్లి మండలం గొట్లాం గ్రామం వద్ద 26వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. బొండపల్లి ఎస్ఐ వర్మ, స్థానికులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఆర్టీసీ కాంపెక్సు నుంచి ప్రయాణికులతో సాలురు వెళ్తున్న తెలుగువెలుగు బస్సు 26వ జాతీయ రహదారిపై గొట్లాం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రత్నగిరి ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ ఎడమవైపు నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని స్థానికులు నాలుగు 108 అంబులెన్సులలో విజయనగరం జిల్లా కేంద్రాస్సత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది క్షతగాత్రులకు చికిత్స అందించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖ పట్నం కెజిహెచ్‌కు తరలించారు. బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు... బస్సును లారీ ఢీకొన్న సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఆర్. ప్రకాష్‌రావు, బి.వెంకటరావు, బి.సింహాచలం, ఎ. కృష్ణారావు, ఎన్.ఎర్రిబాబు, ఆర్.త్రినాథ్, పి.ప్రకాష్, కె.పద్మావతి, ఎం.రాజేష్, ఎస్.శివుడు, ఐ. దివాకర్‌రావు, ఎస్.చిన్నమ్మలు, కె.జయశ్రీ, ఎ.రామకృష్ణ, పి.చంద్రశేఖర్, ఎం.నాగేశ్వరరావు, సీహెచ్ ఈశ్వరరావు, కె.సురేష్, టి.దివాకర్, సీహెచ్ సత్యారావు, ఎం.రాజేశ్వరరావు, యు.అప్పలరాజులు ఉన్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరావు, చంద్రశేఖర్, ఎస్.చిన్నమ్మలు, శివుడులను కేజీహెచ్‌కు తరలించారు. చిన్నమ్మలు, శివుడులు భార్యభర్తలు. ప్రమాద సమాచారం అందుకున్న క్షతగాత్రుల బంధువులు జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. -
లక్ష్యం సాధించకనే..
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి(చిన్నమండెం) : చిన్నమండెం–రాయచోటి మార్గంలోని జల్లావాండ్లపల్లె సమీపంలో ఆదివారం ఉదయం రన్నింగ్ చేస్తున్న యువకులను లారీ ఢీకొన్న దుర్ఘటనలో తలారి ఆంజనేయులు (25) అక్కడిక్కడే మృతి చెందగా, టీ ప్రసాద్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని దేవగుడిపల్లె పంచాయతీ బాపూజీనగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు, ప్రసాద్ నిరుద్యోగులు. వీరు పోలీసు ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరుగులో శిక్షణ పొందుతున్నారు. త్వరలో జరగనున్న పోలీసు ఎంపికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు సూర్యోదయం ముందే రాయచోటి–మదనపల్లె మార్గంపై పరుగు (రన్నింగ్) తీసేవారు. రోజూలాగే ఆదివారం తెల్లవారుజామున రహదారికి ఒక వైపున పరుగు తీస్తున్న సమయంలో మదనపల్లె వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనాస్థలం చేరుకుని గాయాలతో ఉన్న ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సంఘటనపై చిన్నమండెం పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, డైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్ఐ నాగరాజు తెలిపారు. ఆంజనేయులు మృతితో బాపూజీ నగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరు నెలల కిందటే వివాహం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులుకు ఆరు నెలల కిందటే హరితతో వివాహమైంది. గతేడాది పోలీసు ఎంపికకు వెళ్లి, అర్హత సాధించలేకపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రానున్న పోలీసు ఎంపికలోనైనా ఉద్యోగం సాధించాలనే కసితో ప్రతిరోజు ఉదయం రోడ్డుపై పరుగు పెట్టేవాడని రోధిస్తూ తెలిపారు. ఉద్యోగం సాధించి వృద్ధాప్యం లో మాకు, భార్యకు తోడుగా ఉంటాడనుకున్న బిడ్డ లేడన్న మాటను తల్లిదండ్రులు జీర్ణించుకోలేక భోరు న విలిపించారు. రాత్రి తమందరితో కలిసి మట్లాడిన స్నేహితుడు ప్రమాదానికి గురై ఇక లేడన్న వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిపై ఎమ్మెల్యే విచారం రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు మృతి చెందడంపై రాయచోటి ఎమ్మెల్యే జీ శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో ఆంజనేయులు మృతదేహాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంఘటన పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ పీ దేవనాథరెడ్డి ఫోన్ ద్వారా మృతుని కు టుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని వ్య క్తం చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక వైఎస్సార్సీపీ నా యకుడు జయశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీచ్‌రోడ్డులో ఇసుక లారీ బీభత్సం
విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): బీచ్‌రోడ్డు నోవాటల్ డౌన్లో ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుకుని జీవీఎంసీ గోడను ధ్వంసం చేసి సమీపంలోని చిన్నపిల్లల పార్కు వరకు దూసుకుపోయింది. వేకువజామున కావడంతో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. మహారాణిపేట పోలీసులు, లారీ డ్రైవర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ లారీ శ్రీకాకుళం నుంచి విశాఖలో ఫిషింగ్ హార్బర్‌కు ఇసుకలోడుతో వస్తుంది. గురువారం వేకువజామున 4గంటల సమయంలో జిల్లా కోర్టు రోడ్డు నుంచి పందిమెట్ట మీదుగా నోవాటల్ డౌన్ దిగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ రాంబాబు లారీని అదుపు చేయలేక ఎదురుగా గల ఫుట్‌పాత్‌ను ఢీకొని, సందర్శకులు కూర్చునే గోడను ఢీకొట్టడంతో అవతల రోడ్డులోకి ఒరిగిపోయింది. దీంతో లారీ ముందు చక్రాలు, సాసీ విరిగిపోవడంతో అక్కడ కూలబడిపోయింది. లారీ ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్, ముగ్గురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వేకువజామున 4గంటల సమయంలో కావడంతో అంతగా జనసంచారం లేకపోవడంతో ప్రమాదతీవ్రత తగ్గింది. గతంలో ఇక్కడే 2016లో స్కూల్‌బస్సు ఒకటి డౌన్లో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నగరవాసులు మరిచిపోక ముందే మరో ప్రమాదం అదే ప్రదేశంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
ఇంటర్వ్యూకు వెళుతుండగా..
వారు ఇంజినీరింగ్‌విద్యార్థులు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునే పనిలో పడ్డారు. కాకినాడలో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు పయనమయ్యారు. అయితే గమ్యం చేరకుండానే మృత్యువు వారి ఆశలను చిదిమేసింది. లారీ రూపంలో వారిని కబళించింది. తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట కెనాల్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న విద్యార్థులు కాకినాడ వెళుతుండగా.. స్థానిక సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ సమీపంలో సామర్లకోట నుంచి బిక్కవోలు వైపు వెళుతున్న ఎరువుల లోడ్ లారీ ఎదురుగా వీరి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బీబీఏ చదువుతున్న ఎస్కే రభానీ(22) షేక్ అనీఫ్(22) అక్కడికక్కడే మృతి చెందారు. మోటారు సైకిల్‌ను ఢీ కొన్న లారీ అదుపు తప్పి గోదావరి కాలువలో బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనర్లు పరారయ్యారు. కాకినాడలో ఇంటర్వ్యూకు హాజరు కావడానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న బ్యాగులలోని ఐడీ కార్డుల ద్వారా వారు ఏలేరు ఆదిత్య కళాశాలలో చదువుతున్నట్టు గుర్తించారు. కెనాల్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు చెరకు క్రషింగ్ కోసం వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్. శ్రీనివాసు నాయక్ సంఘటన ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించి, కళాశాల యాజమాన్యం, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులకు హెల్మెట్ లేకపోవడం వల్లే తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు, బందువులు, స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని పోలీసుల నుంచి వివరాలు తెలుసుకొని వారివారి కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం (మైలవరం) : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. 30వ నెంబర్ జాతీయ రహదారిపై కొండపల్లి ఐడీఏ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ వస్తున్న కారు ఐడీఏ వద్ద ఉన్న జ్యోతి హోటల్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక భాగాన బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ రవితో పాటు కారులో ప్రయాణిస్తున్న పద్మ, వంశీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది గొల్లపూడి సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నెత్తురోడిన ముంబాయి రహదారి
కొన్ని గంటల్లో భోగి మంటలు వేసుకుని ఆనందంగా గడపాడాల్సిన ఆ కుటుంబాల్లో పెనువిషాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పండగ జరుపుకోవాలని ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి నెల్లూరుకు బయలుదేరిన ముగ్గురిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామీణ ప్రాంతాల్లో విషాదచాయలు అలముకున్నాయి. నెల్లూరు, సంగం: మరణంలోనూ ఆ ముగ్గురి స్నేహబంధం వీడలేదు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని ర్యాంపు వద్ద నెల్లూరు–ముం బాయి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పెరమన పంచాయతీ మజారా జంగాలదొరువుకు చెందిన సంకె వెంకటేశ్వర్లు (30) హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం శిరీషాను వివాహమాడి అక్కడే ఫిజియోథెరిపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది పాప ఉంది. భోగి పండగ కావడంతో ఆదివారం ఉదయం భార్య శిరీషా, కుమార్తెతో స్వగ్రామం జంగాలదొరువుకు వెంకటేశ్వర్లు వచ్చాడు. అక్కడి నుంచి బైక్‌లో దగదర్తి మండలం ఊచగుంటపాళెంకు చెందిన రాము (40), కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన నన్నే సాహెబ్ (40) నెల్లూరుకు బైక్‌లో బయలుదేరారు. ర్యాంపు వద్దకు వచ్చే సరికి లారీని బైక్ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, నన్నేసాహెబ్, రాము అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని రోదించారు. పండగ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన కుమారుడు వెంకటేశ్వర్లు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పండగ పూట ఆనందంగా గడపాల్సిన తమ కుటుంబంలో భగవంతుడు విషాదం మిగిల్చాడంటూ ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పుడే ఇంటి నుంచి బయలుదేరిన భర్త అంతలోనే మృతి చెందడంతో వెంకటేశ్వర్లు భార్య శిరీషా కుప్పకూలిపోయింది. తన బిడ్డకు తనకు దిక్కెవరూ అంటూ రోదించింది. శిరీషను ఓదార్చడం ఎవరితరం కాలేదు. జంగాలదొరువులో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న నెల్లూరురూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెంకు తరలించారు. ఎస్సై నాగార్జునరెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
చిన్న తప్పిదం.. పెద్ద ప్రమాదం
నెల్లూరు , బిట్రగుంట: ద్విచక్ర వాహనదారుడు చేసిన చిన్న తప్పిదం కారణంగా బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీ అదుపుతప్పి ఆర్టీసీ హైటెక్ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండూ వాహనాలు బోల్తాపడ్డాయి. బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. బస్సులో క్షతగాత్రులు ఇరుక్కుపోవడంతో 20 నిమిషాలపాటు ప్రమాద స్థలిలో గందరగోళం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ హైటెక్ బస్సు వెళుతోంది. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో బస్సు ముంగమూరు కూడలి సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో ముంగమూరు నుంచి కావలి వెళ్లేందుకు ఓ వ్యక్తి మోటార్‌బైక్‌పై అడ్డదిడ్డంగా రోడ్డు దాటేందుకు ప్రయతిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు నుంచి మామిడి రసంతో ఒడిశాలోని కుర్వా ప్రాంతానికి వెళుతున్న కంటైనర్ లారీ బైక్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పి హైటెక్ బస్సును ఢీకొంది. దీంతో బస్సు హైవేపై బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ కూడా హైవేపైనే బోల్తా పడింది. ఏరియా ఆస్పత్రికి తరలింపు బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అందులో 30 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. చాలామంది చేతులు, తలకు బలమైన గాయాలు తగిలాయి. ఒక మహిళా ప్రయాణికురాలి చేయి తెగి రోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న బిట్రగుంట, కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కావలి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గాయపడ్డ ప్రయాణికుల వివరాలు.. ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 35 మంది ప్రయాణికులుండాల్సి ఉండగా 30 మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరుకు చెందిన వారున్నారు. వారిలో కె.కోటేశ్వరమ్మ, కె.జీవన్‌కుమార్ అయ్యప్ప, పి.వేణుగోపాల్, ఎం.వెంకటరమణ, వై.చిట్టిబాబు, వై.బాబూరావు, బి.రామకృష్ణ, కె.భారతి, కె.సూర్యచంద్రరావు, బి.వేణుగోపాల్, సీహెచ్ శ్రీనివాసులు, రామచంద్రరావు, హజరత్‌రెడ్డి, కె.శ్రీలేఖ, శిరీష, పద్మ, రాము, వంశీ కుమార్, కుసుమ, గోపి, సూర్యావతి, శ్రీరాములు, విజయ, నరసమ్మ, శ్రీను, శాంతి, సీత, తదితరులు గాయపడ్డారు. ఇద్దరు బస్సు డ్రైవర్లు ఉడతా వెంకటేశ్వర్లు, కేవీ శేషయ్య, లారీ డ్రైవర్ ఎన్నం బాబూరావు, క్లీనర్లకు గాయాలయ్యాయి. ఆరుగురు ప్రయాణికులు ప్రథమ చికిత్స అనంతరం వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు డీజిల్ ట్యాంక్ పక్కన లారీ బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్యాంక్‌కు తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదతీవ్రతకు డీజిల్ ట్యాంక్ పగిలి ఉంటే మంటలు వ్యాపించి ఊహించని నష్టం వాటిల్లేది. స్పందించిన పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే కావలి రూరల్, బిట్ర గుంట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాని కి చేరుకున్నారు. రూరల్ సీఐ మురళీకృష్ణ, బిట్ర గుంట ఎస్సై నాగభూషణం, ఆయా స్టేషన్ల సిబ్బం దితో పాటు ట్రైనీ ఎస్సైలు, హైవే మొబైల్ సిబ్బం ది క్షతగాత్రులను నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రులకు తరలించారు. క్రేన్ సహాయంతో లారీ, బస్సును పక్కకు తీయించేందుకు చర్యలు చేపట్టారు. సుమా రు రెండు గంటలపాటు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కంటైనర్ లారీ నుంచి మామిడి రసం రోడ్డంతా పరుచుకోవడంతో వాహ నాలు జారిపడకుండా రోడ్డంతా కడిగించారు. కావలిఅర్బన్: బోగోలు మండలం ముంగమూరు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలివచ్చారు. తమవారిని చూసిన విలపించారు. సూపరింటెండెంట్ కె.సుబ్బారావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలందించారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
గుంటూరు, పామర్రు: మంచులో ప్రయాణం ప్రాణాల మీదకొస్తోంది. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. పామర్రు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. గాయాలతో బయటపడ్డారు. పోలీసులు అందించిన వివరాలు.. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో లారీ చల్లపల్లి నుంచి పామర్రుకు వస్తోంది. స్థానిక కోటి జగపతి ఎస్టేట్స్ వద్దకు రాగానే విపరీతమైన మంచుతో దారి కనిపించక అదుపు తప్పింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుకు కుడివైపు కూర్చున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ బెల్లంకొండ చలపతి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ నారాయణలతో పాటు ప్రయాణికులు రమేష్, రాజేశ్వరి గాయపడ్డారు. క్షత గాత్రులను 108లో గుడివాడ ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో లారీలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉండటం కారణంగానే భారీ పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రానైట్ లారీ ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఎల్కతుర్తి: మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ గ్రానైట్ లారీ మరో గ్రానైట్ లారీని ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరారం బస్‌స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ జీ కథనం ప్రకారం...కరీంనగర్ జిల్లా రేకూర్తికి చెందిన రొంటాల కిషన్(అలియాస్) కిషన్‌రెడ్డి(47), కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన క్లీనర్ ఎస్కె. అక్రమ్‌సందానీ(35) గ్రానైట్ లారీని కరీంనగర్ నుంచి కాకినాడకు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో గల సూరారం బస్‌స్టేజీ సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై మరో గ్రానైట్ లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడి నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ జీ, ఎస్సై శ్రీధర్‌లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కిషన్‌రెడ్డిని బయటకు తీసేక్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడని సీఐ వివరించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ముందు లారీలో ఉన్న డ్రైవర్ శ్రీరాంమూర్తి, క్లీనర్ రవికుమార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మృతుల కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతులు ఇద్దరికీ భార్య పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లారీ విఘ్నేశ్వర ట్రాన్స్‌పోర్టుకు చెందింది కాగా మరో లారీ శరభ క్వారీకి చెందిందని పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: లారీని నిర్లక్ష్యంగా నడిపి ప్రమా దం చేసిన డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకోగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యా యి. సోమవారం ఉదయం బయ్యనగూడెం నడిరోడ్డుపై జరిగిన ప్రమాదంతో స్థానికులు హతాసులయ్యారు. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వాడపల్లి సుబ్బలక్ష్మి (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్‌పై వెళుతున్న సింగంశెట్టి సత్యనారాయణ, కందుల బలరామకృష్ణకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా లారీని వేగంగా నడుపుతూ రోడ్డు పక్కన నడిచి వెళుతున్న సుబ్బలక్ష్మిని ఢీకొ ట్టాడు. అనంతరం బైక్‌పై ఎదురుగా వస్తున్న వ్యక్తులను ఢీకొన్నాడు. బైక్‌ను కొద్దిదూరం ఈడ్చుకుంటూ లారీని వెళ్లనిచ్చాడు. దీంతో సుబ్బలక్ష్మి తల ఛిద్రమై అక్కడికక్కడే కన్నుమూసింది. స్థానికులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. క్షతగాత్రులు సత్యనారాయణ, బలరామకృష్ణను జంగారెడ్డిగూడెం తరలించారు. సత్యనారాయణ కాలు, చేయిను వైద్యులు తొలగించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వాడపల్లి సు బ్బలక్ష్మి పొలానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. భర్త వెంకటేశ్వరరావుకు టీ తీసుకుని గ్రామానికి సమీపంలో ఉన్న పొలానికి నడిచి వెళుతుండగా మృత్యువు లారీ రూపంలో కబళించింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
అనంతపురం, మడకశిర: మండల పరిధిలోని వైబీహళ్ళి రోడ్డులో పత్తికుంట క్రాస్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో వైబీహళ్ళి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నాగరత్నమ్మ(35), రంగస్వామి(39) అక్కడిక్కడే మృతి చెందారు. సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ గోపియాదవ్ కథనం మేరకు... నాగరత్నమ్మ, రంగస్వామి ద్విచక్రవాహనంలో మడకశిరకు బయల్దేరారు. పత్తికుంట క్రాస్ రోడ్డు మలుపు వద్దకు వచ్చేసరికి అటువైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొంది. కింద పడిపోయిన భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ, ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి కుమారుడు అభిలేష్(4), రెండో తరగతి చదువుతున్న కుమార్తె చందన అనాథలయ్యారు. భార్యను మడకశిరలో దింపేందుకు వస్తూ.. రంగస్వామి భార్య నాగరత్నమ్మ రెండు సంవత్సరాల నుంచి పరిగిలోని ఇండియాన్ డిజైన్ కంపెనీలో పని చేస్తున్నారు. రోజూ ఆటోలో మడకశిరకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులో ఇంటికొచ్చేవారు. మంగళవారం ఆటో లేకపోవడంతో భర్త రంగస్వామి ఆమెను మడకశిరలో వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనం వేసుకొచ్చారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న కంపెనీ హెచ్ఆర్ సుజాత ఆసుపత్రిలో భార్యాభర్తల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంపెనీ తరపున మృతురాలికి వచ్చే రాయితీలను కుటుంబసభ్యులకు అందిస్తామని చెప్పారు. న్యాయవాది వైసీ గోవర్ధన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి గ్రామస్తులు సంతాపం తెలిపారు. -
హైవే టెర్రర్
వాకాటి సన్ని(22) స్థానిక చింతారెడ్డిపాళెంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సన్నీ, అతని స్నేహితులు చెంబేటి రాకేష్, కమతం ప్రభు చింతారెడ్డిపాళెం నుంచి నెల్లూరుకు సొంత పనిమీద బైక్‌పై బయలుదేరారు. చెంతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డును దాటుతుండగా చెన్నై వైపు నుంచి కావలి వైపునకు వెళుతున్న లారీ అతివేగంగా బైక్‌ను ఢీకొనడంతో సన్నీ కిందపడిపోయి తలకు తీవ్ర గాయమైంది. చికిత్సనిమిత్తం హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సన్నీ మృతిచెందాడు. నెల్లూరు(మినీబైపాస్): స్థానిక జాతీయ రహదారిలోని ఎన్టీఆర్నగర్ సర్కిల్, సింహపురి ఆస్పత్రి సర్కిల్ ప్రాంతాల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు రోడ్డు దాటాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా పరుగులు తీస్తుంటాయి. అంతే వేగంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. మితిమీరిన వేగానికి తోడు హైవేపై అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో వాహనచోదకులతోపాటు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఈ రెండు ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీటిలో చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులే ఉండడం గమనార్హం. డెత్ వే ఎన్టీఆర్నగర్, సింహపురి హాస్పిటల్ సర్కిళ్ల వద్ద జాతీయ రహదారి పక్కన ఇరువైపులా భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రతి 50 కిలోమీటర్లలో దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఇరువైపులా విశ్రాంతి ప్రదేశాలు ఏర్పాటు చేసినా నేషనల్ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఆ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని కారణం వ్యక్తిగత, రవాణా వస్తువులకు భద్రత కొరవడడంతో భారీ వాహనాలచోదకులు విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతున్నారు. కొన్నిచోట్ల రహదారి పక్కనే ఉన్న డాబాల వద్ద వాహనాలను ఆపేస్తున్నారు. అధికంగా నిలిచి ఉన్న వాహనాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి ప్రదేశంలో తప్ప వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలపకూడదనే నిబంధనను నీరుగారుస్తున్నారు. రాత్రి వేళలో కూడా ఈ ప్రాంతాల్లో వాహనాలను హైవేకు ఇరువైపులా ఇండికేషన్‌ను వేయకుండానే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీసీ కెమెరాలు లేవు ప్రధానంగా ప్రమాదానికి కారణమైన వాహనాలు అక్కడి నుంచి పరారవుతున్నాయి. కనీసం ఏవాహనం ఢీకొని మృతిచెందారో తెలియని పరిస్థితి నెలకొంది. సీసీ కెమెరాలు లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన మరణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఎక్కువగా ‘హిట్ అండ్ రన్’ కేసులే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు నివారించే దిశగా చర్యలు చేపట్టడం అవసరమని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదానికి కారణాలివే.. ♦ రోడ్డు క్రాసింగ్ సమీపంలో సరైన ప్రమాద సూచికలు తెలిపే ‘కాషన్ బోర్డులు’ లేకపోవడం ♦ రాత్రుల్లో సరైన లైటింగ్ వ్యవస్థ లేకపోవడం ♦ సబ్ వే నుంచి హైవేకు వచ్చే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ♦ పగలు కనబడే బోర్డులు కాకుండా, రేడియం స్టిక్కరింగ్ కాషన్ బోర్డులు లేకపోవడం ♦ రోడ్డు పక్కన, మధ్యలో డివైడర్లపై పెంచిన మొక్కలు పెరిగిపోవడం, ఈ మొక్కలు నిబంధనల ప్రకారం కొంత ఎత్తువరకు మాత్రమే పెంచాలి. ♦ హైవేఅథారిటీ వారి వద్ద సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం. ప్రమాదం జరిగినపుడు తక్షణం స్పందించకపోవడం, రికవరీ వాహనాలు లేకపోవడం. ♦ సీసీ కెమెరాలు లేకపోవడం. ♦ రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ లేకపోవడంతో పశువులు రోడ్డు మీదకు వచ్చేస్తుండడం ♦ రోడ్డు మార్జిన్లో భారీ వాహనాలను పార్కింగ్ చేయడం. -
లారీని ఢీకొన్న అంబులెన్స్.. ఇద్దరి మృతి
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇసుకగుంట సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అబ్దుల్‌గౌస్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ దక్షిణ బజారువీధికి చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు అనిల్ బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్బారావుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు. ఇటీవల సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అతన్ని భార్య పద్మావతి బెంగళూరులో ఉన్న కుమారుడి దగ్గరకు తీసుకెళ్లారు. కుమారుడు తన తండ్రిని కొలంబియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో స్వగ్రామానికి తిరిగి పంపించేందుకు బెంగళూరులోని మాండ్యా జిల్లా పాండూపూర్ ప్రాంతానికి చెందిన అంబులెన్స్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సుబ్బారావు(59), పద్మావతి(54), అనిల్(31), అంబులెన్స్ డ్రైవర్ గిరీష్(27), అతని స్నేహితుడు సందేష్(26) గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో ఉన్న వంతెన వద్ద శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని అంబులెన్స్ ఢీకొంది. సుబ్బారావు, అంబులెన్స్ డ్రైవర్ గిరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బారావు భార్య పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు. అనిల్, సందేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
లారీ ఢీ.. నుజ్జునుజ్జయిన ఓలా క్యాబ్
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌజ్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముందుగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్పైన తెల్లవారు జాము మూడు గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. AP02U6023 నెంబరు గల లారీ ముందుగా వెళ్తున్న హ్యుండాయ్ కారు (TS10UB1830)ను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుమన్నామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యు శకటాలు
కోస్తాంధ్ర నడిబొడ్డుగా, నవ్యాంధ్ర రాజధానిగా ఉన్న కృష్ణా జిల్లా గుండా నాలుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. రవాణా రంగానికి జీవనాడిగా ఉన్న ఈ హైవేలు.. ప్రమాదానికీ అంతే హేతువులవుతున్నాయి. వాహన చోదకులు వే బేలు ఉన్నచోట కాకుండా తమకు నచ్చిన చోట రోడ్డుపైనే లారీలు, ట్రాలీలు నిలుపుతున్నారు. వెనుక నుంచి వస్తున్న చిన్న వాహనాలు వీటిని ఢీకొని ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది. వీరిని హైవే అథారిటీ, పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. ఈ మృత్యు పరంపర మూలాలు, కేంద్రాలు, పరిష్కార మార్గాలపై ‘సాక్షి’ కథనం. సాక్షి, అమరావతిబ్యూరో : వాహన రాకపోకల క్రమమైన నియంత్రణతోపాటు ప్రమాదాల్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా జాతీయ రహదారుల్ని విస్తరించింది. ఆచరణలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఉద్దేశాలు నెరవేరడం లేదు. జిల్లా పరిధిలో చెన్నై–కోల్‌కతా, మచిలీపట్నం–హైదరాబాద్, పామర్రు–కత్తిపూడి, మచిలీపట్నం–తిరువూరుల జాతీయ రహదారులే ఇందుకు నిదర్శనం. హైవేలపై ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంటేనే రాకపోకలు వేగవంతంగా సాగుతాయి. కానీ జాతీయ రహదారులపై గల్లీ రోడ్ల కంటే దారుణంగా వాహనాలను నిలుపుతున్నారు. చెన్నై–కోల్‌కతా రహదారిలో ప్రసాదంపాడు నుంచి గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, బొమ్ములూరు వరకు ఇదే పరిస్థితి. అవే మృత్యు నెలవులు.. హోటళ్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లు, పెట్రోలు బంకుల వద్ద డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుండటంతో అక్కడే వాహనాలను రోడ్డుపైన నిలుపుతున్నారు. ఇవే ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. చిల్లకల్లు సైడ్ ట్రాక్ వద్ద భద్రత లేక చోరీలు జరుగుతుండటంతో వాహనాలు ఆపటం లేదు. గరికపాడు, అనుమంచిపల్లి శివారులో, అనుమంచిపల్లి క్రాసింగ్, షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు, చిల్లకల్లు, గౌరవరం, నవాబుపేట అడ్డురోడ్డు, మునగచర్ల అడ్డురోడ్డు హోటళ్ల వద్ద, నందిగామ, కంచికచర్ల మెయిన్‌రోడ్డు, బైపాస్ రోడ్లలో, అనాసాగరం అడ్డరోడ్డు, కీసర, కంచికచర్ల, పరిటాల, ఎంవీఆర్, అమృతసాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రాస్రోడ్ల వద్ద, మూలపాడు, కేతనకొండ, ఇబ్రహీంపట్నం ఆర్టీ చెక్‌పోస్టుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకునే నాథుడేడి? ట్రక్ వే బైలు ఉన్నచోట మినహా హైవేలపై వాహనాలను నిలుపరాదనేది నిబంధన. కానీ ఆచరణలో ఇది ఎక్కడ అమలు కావడం లేదు. హైవే అథారిటీ, పోలీసు శాఖకు చెందిన పెట్రోలింగ్ సిబ్బందికి ఈ పర్యవేక్షణ నిమిత్తం వాహనాలను సమకూర్చినా వారు సరిగ్గా తిరగడం లేదని జరుగుతున్న ప్రమాదాలే రుజువు చేస్తున్నాయి. పోలీ సు పెట్రోలింగ్ వారు జంతువులు, సరుకు అక్రమ రవాణా చేసే వారి నుంచి మామూళ్లు వసూలు చే సుకోవడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలున్నాయి. దుర్ఘటనలకు కేంద్ర బిందువులు భారీ వాహనాలను జాతీయ రహదారులపై నిలుపుతున్నందున వెనక నుంచి వచ్చే కార్లు వీటిని ఢీకొనడంతో ప్రమాదాలు సంభవిస్తున్నా యి. కనీసం రేడియం స్టిక్కర్లు కూడా సరిగ్గా ఉండక దగ్గరకు వచ్చే వరకూ ఆపి ఉన్న వాహనాలు కనపడక అధికశాతం అనర్ధాలు జరుగుతున్నాయి. వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి విజయవాడ–హైదరాబాద్, విజయవాడ–కోల్‌కతా మార్గంలో చిల్లకల్లు, మూలపాడు, ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో నిర్మించిన ట్రక్ లే బైలు వద్ద కనీస సౌకర్యాలు సరిగా లేవు. లేబేల ఉద్దేశమే విశ్రాంతి కోసం అయినప్పుడు.. అక్కడ మూ త్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి హాలు తప్పనిసరి. కాగా.. చాలాచోట్ల అవేమీ లేని కారణంగా వే బైలు వద్ద డ్రైవర్లు వాహనాలు నిలపట్లేదు. ఎనికేపాడులోనూ అంతే.. మూలపాడు వద్ద రెండు వైపులా ట్రక్ వే బైలు ఉన్నా ఇక్కడ వాహనాలు నిలపట్లేదు. -
ఆనందంలో విషాదం
ఆ నవ్వులు ఆరేళ్లకే ఆగిపోయాయి. ఆ సంతోషాలు అప్పుడే అయిపోయాయి. ఒక్కగానొక్క కొడుకు. ఆరేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆశలరూపం. ఊరంతా పండగ చేసుకుంటున్న వేళ లారీ రూపంలో దూసుకువచ్చిన మృత్యువుకు బలైపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతూ అందనంత దూరానికి వెళ్లిపోయాడు. ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల హేమంత్ కన్నుమూశాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: తులసమ్మ సంబరంలో భాగంగా గ్రామస్తులంతా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తున్నారు. వీరితోపాటే ఆనందంగా గెంతులేస్తూ వెళ్తున్న ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన లారీ కబళించింది. దీంతో లొద్దపుట్టి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఆదివారం స్థానికంగా పూజలందుకుంటున్న తులసమ్మ అమ్మవారి సంబరాన్ని చూసేందుకు అదే గ్రామానికి చెందిన పైలా యోగేష్, నిర్మల దంపతుల కుమారుడు హేమంత్(6) బయలు దేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తోటి స్నేహితులతో కలిసి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్‌పై నుంచి రోడ్డు అంచుల్లోకి వచ్చాడు. ఇదేక్రమంలో చెన్నై నుంచి బీహార్‌కు వెళ్తున్న కార్లు లోడు లారీ ఢీకొంది. దీంతో ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. అయితే లారీ డ్రైవర్ ఆపకుండా సుమారు రెండు కిలోమీటర్లు దూరం వెళ్లిపోయాడు. స్థానిక యువకులు ద్విచక్రవాహనంపై వెంబడించి బెల్లుపడ వద్ద లారీని ఆపివేయించి రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొనఊపిరితో ఉన్న బాలుడిని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి యోగేష్ శ్రీకాకుళంలో వలస కూలీగా పనిచేస్తుండగా, తల్లి నిర్మల స్థానికంగా కూలీ పనులు చేసుకుంటోంది. ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఏ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
గువ్వల చెరువు ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా, చింతకొమ్మదిన్నె/కోటిరెడ్డిసర్కిల్ : ఉదయాన్నే వివిధ పనుల మీద కడప నగరానికి ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. రాయచోటిలో ఏడు గంటలకు ఏపీ04 టీయూ 8316 నెంబరుగల ఆర్టీసీ హయ్యర్ నాన్‌స్టాప్ బస్సు 40 మంది ప్రయాణికులతో కదిలింది. ఈ బస్సు గువ్వలచెరువు ఘాట్ మీదుగా మరో అర గంటలో కడప నగరానికి చేరుకోవాల్సి ఉండింది. ఘాట్‌లోని చివరి మలుపు వద్ద ఆంజనేయస్వామి గుడి సమీపంలో మలుపు తిరుగుతుండగా వెనుకవైపు నుంచి లోడుతో వస్తున్న తమిళనాడుకు చెందిన టీఎన్03 ఏఎల్ 8362 నెంబరు గల లారీ బ్రేకులు పనిచేయక ముందు వెళుతున్న బస్సును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురై బోల్తాపడింది. లారీ డ్రైవర్ ఆందోళనకు గురై లారీ నుంచి దూకడంతో లారీ బస్సును ఈడ్చుకుంటూ వెళ్లింది. బస్సు ఒక్క ఉదుటున రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ రక్షణ గోడ వైపు వెళ్లింది. బస్సు బోల్తాపడిన సమయంలో బస్సులోని ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వెంటనే రాయచోటి నుంచి కడపకు వస్తున్న వాహనదారులు, కడప నుంచి రాయచోటికి వెళుతున్న ప్రయాణికులు వారి వాహనాలు నిలిపివేసి సహాయక చర్యలకు పూనుకున్నారు. అయితే బస్సు లోయలో పడకుండా రక్షణగా ఏర్పాటు చేసిన గోడను ఆనుకుని ఉన్న గ్రిల్స్ అడ్డుకట్ట వేయడంతో ప్రయాణికులకు గండం తప్పింది. బస్సు గనుక లోయలోపడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అక్కడున్న వాహనదారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చింతకొమ్మదిన్నె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 వాహనాన్ని పిలిపించి గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఎపి 26 ఎల్ 9779 నంబరు గల కారు బస్సుకు, రక్షణ గోడలకు మధ్య ఇరుక్కుపోయింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. బస్సు కారుపై పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేది. రిమ్స్‌లో వైద్య సేవలు బస్సు ప్రమాదంలో విశాలిని, జ్యోతి, శ్రీనివాసులు, సాంబశివారెడ్డి, చెట్టిబాబు, భాస్కర్‌నాయక్, అన్నయ్య, వెంకటదాసు, లారీ డ్రైవర్ సెల్వ కుమార్‌లకు బలమైన గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తరలించి రిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటశివ ఆధ్వర్యంలోని వైద్య బృందం బాధితులకు వైద్య చికిత్సలు అందించారు. వీరిలో లారీ డ్రైవర్ సెల్వకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు డాక్టర్ గిరిధర్ తెలిపారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్టీసీ ఆర్ఎం విజయరత్నం, సీఐ కన్యాకుమారి, టీఐ–3 శోభాదేవి, కంట్రోలర్ బజ్జొప్పలు పరామర్శించారు. కేసు నమోదు ఈ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కడప రూరల్ సీఐ నాయకుల నారాయణ, సీకే దిన్నె ఎస్ఐ హేమకుమార్, హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించడంలో తమవంతు సహకారాన్ని అందించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగాబస్సు కుదుపునకు గురైంది నా పేరు నరసింహులు. బళ్లారి వెళ్లేందుకు రాయచోటిలో బస్సు ఎక్కాను. ఘాట్‌లోని అన్ని మలుపులను దాటుకున్నాం. చివరి మలుపులో వెనుకవైపు నుంచి లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. బస్సులో ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. అస్సలు బతుకుతాం అనుకోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. – నరసింహులు, శిబ్యాల గ్రామస్తుడు, ప్రత్యక్ష సాక్షి -
నిశిరాత్రిలో పెను విషాదం
పశ్చిమగోదావరి: తణుకు మండలం తేతలి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉంగుటూరు నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చెరువుల్లో చేపలను పట్టేందుకు 11 మంది కూలీలు, డ్రైవర్‌తో కలిసి లారీలో వెళుతుండగా ముందుగా వెళుతున్న కాంక్రీటు మిక్సర్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రులు ఉంగుటూరు మండలానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
లారీని ఢీ కొట్టిన మరో లారీ
-
బంగారు కొండా.. నూరేళ్లు నిండాయా!
బంగారు కొండా.. నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా.. టై, బెల్ట్, బూట్లు వేసుకుని స్టడీ క్లాసులకు వెళ్లుతున్నానని చెప్పి... తిరిగిరాని లోకానికి వెళ్లితివే.. నేను ఎట్లా బతకాలి దేవుడా అంటూ ఆ తల్లి బోరున విలపించింది. కళ్లెదుట విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి ఆమె తల్లడిల్లిన తీరు చూపరులను కలచివేసింది. అనంతపురం, తాడిపత్రి టౌన్: పట్టణంలోని నంద్యాల రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు..సుంకులమ్మపాలెంలోని సంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న రమణ, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు నవీన్ (12)నంద్యాల రోడ్డులోని రుషీవ్యాలీ స్కూలులో ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిలుపై ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేవాడు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్టడీ క్లాసుకు వెళ్లి 8 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నంద్యాల రోడ్డులో కుడి వైపు నుంచి ఎడమ వైపునకు సైకిల్‌పై వస్తుండగా నంద్యాల వైపునకు వెళ్లుతున్న లారీ ఢీ కొంది. ఘటనలో విద్యార్థి తలకు తీవ్రగాయాల కావడంతో రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సైకిల్ కూడా దెబ్బతినింది. స్థానికులు వెంటనే పట్టణ పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ శ్రీధర్ ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నవీన్ మృతితో సుంకులమ్మపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెలలోమూడు ప్రమాదాలు నంద్యాల రోడ్డులో నెల రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడు లారీల కారణంగానే జరిగినవి కావడం గమనార్హం. అందులో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా లారీలు నిలబెడుతుండడంతో రోడ్డు దాటేవారికి రోడ్డుపై వచ్చే వాహనాలు కనపడక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
పండగవేళ.. ప్రమాదం
తూర్పుగోదావరి ,గండేపల్లి (జగ్గంపేట): సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో పండగపూట విషాదం నెలకొంది. రెప్పపాటులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లీకూతురు, మరోచోట ఓ మహిళ ఇలా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. లారీ ఢీకొని తల్లీకూతురు.. పండగకు సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చిన ఆ తల్లీకూతరు దుర్మరణం చెందారు. బంధువులతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ఆచంట అప్పలరాజు అనే మహిళతో పాటు శ్రీను, శెట్టిపల్లి నాగవీరదుర్గ(దేవి)(23), అమ్ము(4)లు ఈ నలుగురు గురువారం మోటార్ సైకిల్‌పై మండలంలోని తాళ్లూరులో బట్టల షాపునకు వచ్చారు. తిరుగుప్రయాణంలో జెడ్ రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకుని సొసైటీ కార్యాలయం సమీపంలో ఉన్న డివైడర్ వద్ద రోడ్డు దాటారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుకే వస్తున్న లారీ వీరిని ఢీకొని మోటార్ సైకిల్‌ను కొంతమేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగ వీర దుర్గ ఎడమవైపు శరీరం నడుమ నుంచి మోకాలి వరకు నుజ్జునుజ్జయ్యి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి అమ్ము కూడా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై పడిపోవడంతో శ్రీను, అప్పలరాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అప్పలరాజును జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి, శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవనోపాధి నిమిత్తం నాగ వీరదుర్గ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, ఇటీవల ఈమె పండగ నిమిత్తం లింగంపర్తి వచ్చినట్టు తెలిసింది. వీరందరూ సమీప బంధువులని చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై రాస్త్రారోకో.. తమకళ్లెదుటే ప్రమాదం జరగడంతో ఆగ్రహించిన స్థానికులు, ఇతర ప్రయాణికులు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు దీరి ట్రాఫిక్ నిలిచిపోయింది. డివైడర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మల్లేపల్లిలో మండలంలోని మల్లేపల్లికి చెందిన దిడ్డి సుబ్బలక్ష్మి (47) లారీ ఢీకొని మృతి చెందింది. శుక్రవారం ఉదయం గ్రామంలోని కొత్తూరు సెంటర్లో రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళుతున్న లారీ ఈమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈమె అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. గండేపల్లిలో..: గ్రామానికి చెందిన రాయుడు అన్నవరం (57) స్థానికంగా ఉన్న కాన్ చెరువులో పడి మృతిచెందాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన అన్నవరం ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: ఆగివున్న టాటా ఏస్ వాహనాన్ని మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కలసి చేర్యాల మండలం నాగపురి గ్రామంలో మృతి చెందిన తమ సమీప బంధువైన మల్లేశం అంత్యక్రియలకు టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. రిమ్మనగూడ స్టేజీ వద్దకు రాగానే మరో బంధువు దాచారం నుంచి వస్తున్నానని కబురు పెట్టడంతో పక్కనే వాహనాన్ని ఆపి వేచి చూడసాగారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న లారీ (ఏపీ 15టీవీ 9129) వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో టాటా ఏస్‌లో ఉన్న అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 21 మంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరో ముగ్గురికి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, భూపతిరెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. నిమ్స్ కు తరలించిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కరు మినహా.. అందరి పరిస్థితి విషమం! నిమ్స్‌కు తీసుకు వచ్చిన 21 మంది క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో రాములు (55), చంద్రమ్మ (40), భిక్షపతి (40), చంద్రయ్య (50), అమృతయ్య (55), చంద్రమ్మ (45), స్వామి (40), ఐలమ్మ (40), బాల నర్సయ్య (75), నర్సింహులు (65), భాగ్య (35), కమలమ్మ, పోశయ్య, మ రో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వై ద్యుల ద్వారా తెలిసింది. నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన హరీశ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం క్షతగాత్రుల సహాయకులకు రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలకు తక్షణమే పదివేల రూపాయల చొప్పున స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
ప్రాణం తీసిన వేగం
కలికిరి : మండలంలోని టేకలకోన బస్టాప్ వద్ద బుధవారం లారీని ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె–2 డిపోకు చెందిన నాన్‌స్టాప్ బస్సు ప్రయాణికులతో మదనపల్లె నుంచి తిరుపతి బయలుదేరింది. వేగంగా వెళుతూ కలికిరి, వాల్మీకిపురం మండలాల సరిహద్దు గ్రామం టేకలకోన వద్ద గూడూరు నుంచి బెంగళూరుకు సిలికాన్ ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ క్యాబిన్ దెబ్బతింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిజివేడు గ్రామానికి చెందిన లారీ డ్రైవరు పోలయ్య(50) క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతిచెందాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న సావిత్రిబాయి(46) బస్సు నుంచి లారీ చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. అదేవిధంగా మదనపల్లె పట్టణం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లికి చెందిన బస్సు డ్రైవరు రాము(30) తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను కోమాలో ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న చంద్రకళ(53), కృష్ణకుమారి(50), మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కలికిరి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, తిరుపతికి తరలించారు. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా బాలయ్యగారిపల్లి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన లారీ క్లీనర్ సురేష్‌కు రక్తగాయాలయ్యాయి. ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు వేగంగా వచ్చి ఢీకొందని, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని క్లీనర్ సురేష్ పోలీసులకు వివరించాడు. మృతురాలు సావిత్రిబాయి మదనపల్లె జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త గనేనాయక్ కడప జిల్లా జైలు డెప్యూటీ సూపరిం టెండెంట్‌గా పనిచేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఏఎస్పీ సుప్రజ, మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, వాల్మీకిపురం సీఐ సిద్ధతేజోమూర్తి పరిశీలించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన పోలయ్య మృతదేహాన్ని వెలికి తీయించి, ఆస్పత్రికి తరలించారు. లారీ, బస్సును జేసీబీతో పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
దూసుకొచ్చిన మృత్యుశకటం
నాదెండ్ల (చిలకలూరిపేట): సమయం రాత్రి రెండు గంటలు దాటింది.. రెండు పోర్షన్ల ఇంటిలో పది మంది నిద్రిస్తున్నారు.. ఇంతలో జాతీయ రహదారిపై ప్రయాణం చేయాల్సిన లారీ అదుపుతప్పి రెయిలింగ్‌ను దాటుకుని సర్వీస్ రోడ్డుపక్కన ఉన్న ఇంటిపైకి మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఇంటిని, ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగింది. అయితే ఇంటిగోడ కూలిపడటంతో ఓ యువతి మృతిచెందగా, ఆమె తల్లి, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన నాదెండ్ల మండలం, గణపవరం గ్రామం వద్ద సోమవారం రాత్రి (మంగళవారం తెల్లవారుజాము)న జరిగింది. ఎస్ఐ కె.చంద్రశేఖర్ కథనం మేరకు.. ఏపీ 07 టీఎన్ 0748 నంబరు లారీ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తోంది. గణపవరం వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని సర్వీసు రోడ్డును దాటి కిషోర్ గ్రానైట్ క్వారీలో ఉన్నఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. అయితే అక్కడ ఉన్న చెట్టు అడ్డురావటంతో నిలిచిపోయింది. లారీ ఢీకొట్టడంతో ఇంటి గోడ ఒకవైపు కూలి నిద్రిస్తున్న తల్లి రమణమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీత్రివేణిపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మీత్రివేణి తీవ్రంగా, రమణమ్మ, ఆమె తల్లి భూలక్ష్మి, రెండో పోర్షన్లో నివసిస్తున్న శ్రీకాంత్ గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది లక్ష్మీత్రివేణి, రమణమ్మను 108 హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించి లక్ష్మీత్రివేణి (19) మృతి చెందింది. ఎస్ఐ కె.చంద్రశేఖర్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రొక్లెన్ సాయంతో లారీని బయటకు తీయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఓ గ్రానైట్ ఉద్యోగి వాహనం నుజ్జునుజ్జయింది. లారీ కావూరు సమీపంలోని ఓ రైస్‌మిల్లు యజమానిగా గుర్తించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. క్వారీలో విషాదఛాయలు రమణమ్మ భర్త కొద్ది కాలం క్రితం మృతి చెందాడు. దీంతో రమణమ్మ తన కుమార్తె లక్ష్మీత్రివేణి, తల్లి భూలక్ష్మితో కలిసి నివసిస్తోంది. లక్ష్మీత్రివేణి ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ చదివి ఆ తరువాత స్పిన్నింగ్ మిల్లు పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. రాత్రి పది గంటల సమయంలో అందరం కలిసి భోజనం చేసి నిద్రపోయామని, అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో లారీ దూసుకొచ్చిందని భూలక్ష్మి తెలిపారు. లక్ష్మీత్రివేణి మృతదేహాన్ని జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు గణపవరం తరలిం చారు. కుటుంబ సభ్యుల రోదనలతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెట్టే వాళ్ల ప్రాణాలు కాపాడింది రెండు పోర్షన్ల ఇంటిలో లక్ష్మీత్రివేణి, ఆమె తల్లి, అమ్మమ్మ, మరో పోర్షన్లో స్పిన్నింగ్ మిల్లు కార్మికులు ఏడుకొండలు, అరుణ, పిచ్చమ్మ, శ్రీకాంత్, కార్తీక్, రమేష్, అనూష నివసిస్తున్నారు. లారీ ఢీకొన్న సమయంలో చెట్టు అడ్డురావడంతో రెండో పోర్షున్‌లో నివసిస్తున్న ఏడుగురు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగా, శ్రీకాంత్ స్వల్పంగా గాయపడ్డాడు. -
లిఫ్ట్ అడిగి.. మృత్యుఒడికి..
పశ్చిమ గోదావరి, తణుకు: తణుకు మండలం తేతలి వై.జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్యాంగ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తణుకు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెం దిన మట్టా సాయిరమేష్ తాడేపల్లిగూడెం నుంచి స్వగ్రామానికి మోటారుసైకిల్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో తేతలి వద్ద వల్లూరి శివ (22) లిఫ్ట్ అడగడంతో తన మోటారు సైకిల్ ఎక్కించుకున్నాడు. తేతలి వై.జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న శివ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న సాయిరమేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో మృతి చెందిన శివ ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తణుకు వచ్చే క్రమంలో సాయిరమేష్ వాహనం ఎక్కాడు. శివ దివ్యాంగుడు కావడంతో మానవతా దృక్పథంతో తన వాహనం ఎక్కించుకున్నట్టు సాయిరమేష్ చెబుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ హెడ్‌కానిస్టేబుల్ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌కు టమాటాల లోడుతో వెళుతున్న వాహనాన్ని స్థానికులు వెంబడించి ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఆపి పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ లారీ ఎక్కి వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తాడేపల్లిగూడెం వైపు పోనిచ్చాడు. దీంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంబడించి నారాయణపురం టోల్‌గేటు వద్ద నిలిపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఒక ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం
కోదాడఅర్బన్ : లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా.. భయాందోళనతో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ హఠాన్మరణం చెందాడు. ఈ వేర్వేరు ఘటనలు శనివారం కోదాడలో చోటుచేసుకున్నాయి. వివరాలు.. సూర్యాపేటకు చెందిన మయత్ రాజేందర్‌సింగ్(50) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన లారీని కిరాయి నిమిత్తం కోదాడకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో పట్టణంలోని సాలార్జంగ్పేట వద్దనున్న సర్వీసింగ్ సెంటర్లో లారీకి మరమ్మతులు చేయించుకున్నాడు. అతడు తన వాహనాన్ని రివర్స్ తీయడంతో రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో కోదాడ నుంచి సాలార్జంగ్పేటకు బైక్‌పై వెళుతున్న షేక్ ఆసిఫ్(25)ను ఆ లారీ వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆసిఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో లారీ డ్రైవర్ రాజేందర్‌సింగ్ తన వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్టాండ్‌లో కుప్పకూలి.. భయపడిన లారీడ్రైవర్ రాజేందర్‌సింగ్ చాలాõపటికి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడే కుర్చీలో కూర్చుని ప్రమాద విషయంపై మరొకరితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కంట్రోలర్ నర్సిరెడ్డి అతడి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తున్నట్లు గమనించాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు, 108కు సమాచారం అందించడంతో వారు బస్టాండ్‌కు చేరుకున్నారు. అప్పటికే రాజేందర్‌సింగ్ మృతి చెందాడు. దీంతో పోలీసులు అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైనలారీ డ్రైవర్ ఇతడేనని తెలి సింది. అతడి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. తన తండ్రికి గుండె సంబంధిత వ్యాధికి ఆపరేషన్లు జరిగినట్లు రాజేందర్‌సింగ్ కుమారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రమాద ఘటనపై ఆసిఫ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి, రాజేందర్‌సింగ్ మృతిపై అతడి కుమారుడు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సైదాలు కేసులు నమో దు చేశారు. ఒక ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. -
కబళించిన మృత్యువు
ద్వారకాతిరుమల: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. అయితే వీరిద్దరి పేర్లు రామకృష్ణ కావడం యాదృచ్ఛికం. పొట్టకూటి కోసం వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఒక గురువారం ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్‌పై వెళుతున్న అతడు పెళ్లిజనాలతో వస్తున్న లారీని మలుపులో తప్పించే క్రమంలో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట పంచాయతీ ఆరుపాటి దిబ్బలు గ్రామానికి చెందిన వల్లూరి రామకృష్ణ(45) నల్లజర్ల మండలం అయ్యవరంలో తాపీపని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోతవరానికి చెందిన మరో మేస్త్రి కత్తుల సోమరాజుతో కలసి రామకృష్ణ రాళ్లకుంటలోని ఒక స్థలాన్ని పరిశీలించి, తిరిగి అయ్యవరం వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఒక్కడే తన బైక్‌పై ద్వారకా తిరుమలకు వచ్చి పనులు ముగించుకుని, అయ్యవరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సంఘటనా స్థలమైన రాళ్లకుంట మలుపులోకి వచ్చేసరికి నిడదవోలు నుంచి ద్వారకాతిరుమలకు పెళ్లి జనాలతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ ఎడమ వైపునకు పడగా, రామకృష్ణ కుడివైపు లారీ వెనుక చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యాడు. సంఘటనా స్థలాన్ని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు, సిబ్బంది పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. రోడ్డు ప్రమాదంలో మిల్లు కార్మికుడు మృతి ఆకివీడు: ట్రాక్టర్ స్కూటర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో ఓ మిల్లు కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన స్థానిక అయి భీమవరం రోడ్డులో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మిల్లు కార్మికుడు ఎన్ని రామకృష్ణ(46)స్కూటర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇటుక లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుధాకరరెడ్డి తెలిపారు. -
ఫ్లై ఓవర్‌ను ఢీకొన్న లారీ
జె.పంగులూరు: ఫ్లై ఓవర్‌పై లారీ డివైడర్‌ను ఢీకొనడంతో క్లీనర్ దుర్మరణం చెందగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. విజయవాడ నుంచి కడపకు రిలయన్స్‌కు సంబంధించిన టవర్ సామగ్రితో లారీ బయల్దేరింది. ముప్పవరంలోని ఫ్లై ఓవర్‌పైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. డివైడర్‌ను లారీ బలంగా ఢీకొనడంతో రెండు బ్రిడ్జిల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో క్లీనర్ బండి వెంకటేశ్వర్లు (22) రెండు బ్రిడ్జిల మ«ధ్య జారి పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ బండి సుబ్బారాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్లీనర్, డ్రైవర్ స్వగ్రామం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం భద్రపల్లి గ్రామం. రేణింగవరం ఎస్ఐ అజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'కూలి'పోయారు
కూలీల జీవనం కూలిపోయింది. బతుకు కోసం పయనం కన్నీరే మిగిల్చింది. తమకు దిక్కెవరు దేవుడా..! అంటూ మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆదివారం చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరారు. 22 మంది క్షతగాత్రులు ఆస్పత్రిపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా కల్నరసంబట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కండీషన్ లేని లారీనే దీనికంతటికి కారణంగా తేలింది. కుప్పం రూరల్, కుప్పం: పొట్టకూటి కోసం కూలి కొచ్చిన 9 మంది తమిళనాడు వాసులు.. శని వారం రాత్రి కుప్పం మండలం నాయనూరు పెద్దవంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే ఊరికి చెందడం, అందరూ బంధువులు కావడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా నాట్రంపల్లె తాలూకా కల్లర్సంపట్టి గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం నాయనూరు గ్రామానికి శనివారం లారీలో వచ్చారు. అదే గ్రామానికి చెందిన దిలీప్ కూలీలను పనుల కోసం నాయనూరుకు తరలించాడు. కాయలు కోసిన తరువాత ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యా రు. ఈ క్రమంలో పెద్దవంక సమీపంలోని అనపబావి మలుపు లోయలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 22 మంది గాయపడ్డారు. కాగా రాత్రికి రాత్రే మృతదేహాలను కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, నాట్రంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మృతులందరిదీ ఒకే గ్రామం.. కల్లర్సంపట్టి గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు తప్పనిసరిగా కూలీపై ఆధారపడిన వారే. ఈ క్రమంలో మామిడి కాయలు కోసేందుకు ఆంధ్రాకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కుప్పం వంద పడకల ఆస్పత్రి వద్దకు ఆదివారం మృతుల బంధువులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమ వారి జాడకోసం అధికారులను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన జిల్లా అధికారగణం.. రోడ్డు ప్రమాదం సంఘటన సమాచారం తెలియడంతో ఆంధ్రా, తమిళనాడు అధికారులు వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ ప్రద్యు మ్న, ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీ చౌడేశ్వరితో పాటు రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అవసరమైన ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పంచనామా అనంతరం తమిళనాడు ప్రభుత్వ అంబులెన్స్‌లలో మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించారు. -
ప్రాణం తీసిన కునుకు
పూతలపట్టు: విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడంతో అలసిపోయిన డ్రైవర్ రెప్పపాటు కునుకు తీసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిలోని రంగంపేట క్రాస్ వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాన్ ఢీకొంది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. లారీ డ్రైవర్ టిఫిన్ తినేందుకు రంగంపేట క్రాస్ సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద లారీని ఆపాడు. చిత్తూరు సాగర్ బ్రాయిలర్‌కు చెందిన కోళ్ల వ్యాన్ మేఘ(25) శనివారం రాత్రంతా పలు చికెన్ సెంటర్లకు కోళ్లను సరఫరా చేశాడు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాతంలో చిత్తూరు బయలుదేరాడు. కోల్డ్ స్టోరేజ్ వద్ద నిలిపి ఉన్న లారీని ఢీకొన్నాడు. దీంతో డ్రైవర్ మేఘ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిత్తూరులోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న కోళ్ల డెలివరి చేసే శ్రీధర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని పాకాల సీఐ రామలింగయ్య, పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
బిడ్డ చిరునవ్వు చూడకుండానే..
ముత్యాలంపాడు(దాచేపల్లి): రెండు నెలల బాబు.. ఆ బోసి నవ్వులు తండ్రి కళ్ల ముందు కదిలాడుతున్నాయి.. ఎప్పుడెప్పుడు మళ్లీ చూస్తానా..? బిడ్డను గుండెలపై పెట్టుకుని ఎప్పుడు లాలిస్తానా ? అని బయలుదేరాడు.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించడంతో బిడ్డను చూడకుండానే అనంతలోకాల్లో కలిసిపోయాడు. గురువారం మండలంలోని ముత్యాలంపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తంగెడ గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు(25)కు మాచర్లలోని భవానీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు నెలల బాబు. భార్య బాలింత కావడంతో పుట్టింటి దగ్గర ఉంది. గురువారం తంగెడలో వ్యవసాయ పనులు చూసుకుని భార్య, బిడ్డను చూసేందుకు బియ్యం మూటతో బైక్‌పై బయలుదేరాడు. ముత్యాలంపాడుకు సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు లారీని వెంబడించి ఆపారు. నాగరాజు మృతి వార్త విని కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అద్దంకి వెంకటేశ్వర్లు తెలిపారు. పొస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
బతుకు పయనం ఆగిపోయింది.
రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు వారు. ఉపాధి కోసం ఊరు వదిలి వలసబాట పట్టారు. బట్టీ పనుల్లోకి వెళ్లి కడుపునింపుకొందామని భావించారు. రాత్రికి రాత్రే బయల్దేరారు. ఏదో విధంగా గమ్యం చేరాలనే ఆత్రుతతో సిమెంట్ తూరలలోడుతో వెళుతున్న లారీ ఎక్కారు. ప్రమాదకరమని తెలిసినా రవాణా చార్జీలు కలిసివస్తాయనే ఆశతో ఉన్న కాస్త జాగాలోనే కూర్చున్నారు. అసలే శ్రమజీవులు.. లారీపైన కూర్చున్న వారు కాస్త కనుకుతీశారు. ఇంతలో వీరు ప్రయాణిస్తున్న లారీ ముందువెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టడం. ఆ లారీలో ఉన్న సిమెంట్ తూరలకు కట్టిన తాడు తెగి.. వెనుక కూర్చున్నవారిపై పడడం.. అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. తూర్పుగానుగూడెం (రాజానగరం): ప్రమాదమని తెలిసినా చార్జీలు తక్కువ అవుతాయనే ఆశతో లారీపై ప్రయాణిస్తూ పొట్టకూటి కోసం గ్రామాంతరం వెళుతున్న రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. రాజానగరం మండలం, తూర్పుగానుగూడెం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటీ మండలం గెడ్డబురిడీపేటకు చెందిన బాగడి వరదరాజు(30), బాగడి వెంకటలక్ష్మి, బాగడి ప్రవీణ్‌కుమార్, అదే జిల్లాలోని పొండూరు మండలం గోకన్నపల్లికి చెందిన గరుగుపల్లి అశోక్ (8), మరో నలుగురితో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, సమీపంలోని కొత్తముప్పారానికి ఇటుక బట్టీ పనులు చేసేందుకు పయనమయ్యారు. ఒడిశాలోని ఖరక్ఫూర్ నుంచి విజయవాడకు భారీ సిమెంటు తూరలలోడుతో వెళుతున్న లారీని శ్రీకాకుళం వద్ద ఎక్కారు. ఈ ఎనిమిది మందిలో ఐదుగురు కేబిన్‌లో కూర్చుంటే మిగిలిన ముగ్గురు తూరలలోడు ఉన్న ప్రాంతంలో కూర్చున్నారు. రాత్రి సమయం కావడంతో నెమ్మదిగా పడుకునేందుకు ఖాళీ చేసుకుని నిద్రపోయారు. ఇదే సమయంలో తూర్పుగానుగూడెం వద్ద ముందువెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న లారీ ఢీ కొనడంతో ప్రమాదానికి గురయ్యారు. సాధారణ తాడుతో కట్టి ఉన్న ఆ తూరలు కదిలిపోయి తాళ్లు ఊడిపోవడంతో ఆదమరిచి నిద్రపోతున్న ఆ అభాగ్యులలో బాగడి వరదరాజు, గరుగుపల్లి అశోక్‌లు వాటి కింద నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటే ఉన్న ప్రవీణ్‌కుమార్ గాయాలతో బయటపడ్డాడు. అలాగే క్యాబిన్లో ఉన్న లారీ క్లీనర్ సీహెచ్ హరితోపాటు ఐదుగురు ప్రయాణికులు స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం వారి బంధవులకు అప్పగించారు. గాయపడిన ప్రవీణ్‌కుమార్‌కి ప్రాథమిక చికిత్స అందించగా, మిగిలిన వారు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరకుండానే వెళ్లిపోయారు. మృతుడి బంధువు జి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదుననుసరించి కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గుజరాత్లో విషాదం... 19 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 19మంది దుర్మరణం చెందారు. సిమెంట్, ఇటుకల లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీ భావ్‌నగర్- అహ్మదాబాద్ హైవే మార్గంలోని భవలాయి గ్రామ సమీపంలో బోల్తా పడింది. శనివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెత్తురోడిన నల్గొండ రహదారులు
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన బాణావత్ రూప్లా(37), దామరచర్ల మండలం కొండ్రపోలు శివారు మాన్‌తండాకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కిష్టాపురం వద్ద నెల్లూరు నుంచి హైదరబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రూప్లా అక్కడికక్కడే మృతిచెందగా, ఐదు కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకుపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సైదాబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి బస్సును స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శాంతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యాదగిరిగుట్ట (ఆలేరు) : చౌటుప్పల్ మండలం వెలిమినేడుకు చెందిన రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వరంగల్ నుంచి భువనగిరి వైపు శనివారం వేకువజామున వెళ్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడా.. లేక మరో లారీ ఎదురుగా ఢీ కొట్టిందా తెలియలేదు. భువనగిరి వైపు వస్తున్న లారీలో ఉన్న రమేష్ అందులో ఇరుక్కుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. దేవరకొండ : పట్టణానికి చెందిన శివకార్ ఈశ్వర్‌జి(50) తన భార్యతో కలిసి టీవీఎస్ మోటర్‌సైకిల్‌పై ఇంటి నుంచి మార్కండేస్వామి దేవాలయానికి వెళ్తున్న క్రమంలో భార్యను రోడ్డు పక్కన దింపాడు. అనంతరం స్థానిక భారత్ ఫిల్లింగ్ స్టేషన్లోకి పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా కొండమల్లేపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్‌జి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. గేదె కళేబరాన్ని ఢీకొని వ్యక్తి.. మేళ్లచెరువు (హుజూర్నగర్) : చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు (24) కొంతకాలంగా మేళ్లచెరువులో ఉంటూ స్థానిక మైహోం సిమెంట్ పరిశ్రమలో రైల్వేట్రాక్ పాయింట్ మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి తన దగ్గరి బంధువు అంబడిపూడి శ్రీనివాస్‌తో కలిసి కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి పునరావాసకేంద్రంలో ఓ వివాహానికి హాజరై తిరిగి మేళ్లచెరువు వస్తుండగా కందిబండ సమీపంలోని రోడ్డుమీద పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఇదే సమయంలో లారీ వెంకటేశ్వర్లు తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి కొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జయకర్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మరొకరు.. నాంపల్లి(మునుగోడు) : మండల పరిధిలోని దామెర గ్రామానికి అబ్బనబోయిన స్వామి (25), తన సోదరుడు అబ్బస్వామితో కలిసి శనివారం మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వస్తుండగా వడ్డెపల్లి శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న అబ్బస్వామికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, స్వామికి 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం
మల్కాజిగిరి: బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న దంప తులను లారీ ఢీకొనడంతో భర్తకు గా యాలు కాగా భార్య, కూతురు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తకోటకు చెందిన ప్రకాష్ మల్కాజిగిరి లాల్‌వాణీనగర్‌లో ఉంటున్నాడు. ఈనెల 11న భార్య ప్రణీత(30), కుమారుడు ధన్‌రాజ్(5), కుమార్తె మానస(2)తో కలిసి ఉప్పల్ ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం టీవీఎస్ మోపెడ్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా జెడ్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ప్రణీతను గాంధీ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రకాష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
రామవరప్పాడు (గన్నవరం) : లారీ ఢీ కొట్టడంతో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఎనికేపాడు టంకసాల కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. రామవరప్పాడులో రాయపురెడ్డి రమేష్, వనజ దంపతులు తమ ఇద్దరు సంతానంతో కలిసి నివాసం ఉంటున్నారు. రమేష్ స్థానికంగా ఇటుకలు, సిమెంట్ దుకాణం వ్యాపారం చేసుకుంటున్నాడు. కుమారై పూజిత కానూరులోని వీఆర్ సిద్దార్థ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు ధనుష్ ఇటీవలే తొమ్మిదవ తరగతి పూర్తి చేశాడు. ఎప్పటిలాగానే ఉదయం పూజితను కళాశాలలో దిగబెట్టేందుకు రమేష్ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బయలు దేరారు. టంకసాల కల్యాణ మండపం సమీపం నుంచి కానూరు డొంక రోడ్డులోకి వెళ్లేందుకు డివైడర్ గ్యాప్ వద్ద ఆపారు. అదే సమయంలో గన్నవరం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి నలిగిపోవడంతో తీవ్ర గాయాలై పూజిత అక్కడికక్కడే మరణించింది. తండ్రి రమేష్‌కు స్వల్ప గాయాలవ్వడంతో ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ సభ్యుల అనుమతితో పూజిత కార్నియాలను ఓ కంటి వైద్యశాల డాక్టర్లు సేకరించారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ ప్రమాదం గురించి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ మండలాధ్యక్షుడు దేవగిరి ఓంకార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యార్కారెడ్డి నాగిరెడ్డి, గ్రామ కన్వీనర్ సమ్మెట సాంబశివరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే పూజితకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయంటూ విలపిస్తున్న తల్లి వనజను ఓదార్చడం ఎవరితనం కాలేదు. జరిగిన ప్రమాదంలో భగవంతుడు తనను తీసుకెళ్లినా బాగుండేదంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపురులను కంటతడి పెట్టించింది. -
నలిగిన బతుకులు
రసూల్‌పురా: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండుప్రాణాలను బలిగొంది. నిద్రిస్తున్న దంపతులపై రివర్స్‌లో లారీని ఎక్కించడంతో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. బోయిన్పల్లి సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని సింగానిగూడెంకు చెందిన సత్యనారాయణ (55) నాగరాణి (50) దంపతులు బోయనపల్లి హర్షవర్థన్ కాలనీలో మాజీ డిప్యూటీ కలెక్టర్ సీతారాంరెడ్డి నివాసంలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి బాగ ఉక్కపోత ఉండడంతో ఇంటి ముందు రోడ్డుపై పడుకున్నారు.కాగా అర్థరాత్రి గడచిన తర్వాత సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్దకు కంకరను అన్లోడ్ చేసేందుకు వచ్చిన లారీ రివర్స్‌లో వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు బుధవారం ఉదయం బోయిన్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, లారీ సమాచారం కోసం కాలనీలోని సీసీ ఫుటేజీలను పరీశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
అత్తమ్మను చూసి తిరిగివస్తూ..
కాశీబుగ్గ: అత్తమ్మ ఆస్పత్రిలో ఉండటంతో ఆమెను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాల జంక్షన్‌గా పేరుపొందిన కోసంగిపురం జాతీయరహదారి కూడలి వద్ద ఈ విషాదకర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బహాడపల్లి పంచాయతీ నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన తిమ్మల పాపారావు(35).. అత్తయ్య కాశీబుగ్గలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను చూసేందుకు మందస నుంచి కాశీబుగ్గకు స్కూటీపై వెళ్లారు. ఆమెను పరామర్శించి మందస వస్తుండగా కోసంగిపురం కూడలి వద్ద సాయంత్రం 5గంటల సమయంలో జాతీయ రహదారి దాటుతుండగా పాపారావు ద్విచక్రవాహనాన్ని లారీ(ఏపీ 30 టీటీ 0479) వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పాపారావు తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ‘108’కు సమాచారం అందించారు. అప్పటికీ వాహనం రాకపోవడంతో.. హైవే పెట్రోలింగ్ వ్యానులో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్కూటీని ఢీకొట్టిన లారీని స్థానికంగా ఓ యువకుడు వెంబడిచి 1వ వార్డు మెగిలిపాడు వంతెన దాటుతుండగా పట్టుకున్నారు. ఇంతలో యువకుడిని పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్యం అందించినప్పటికీ తలకు తీవ్ర గాయమవడంతో అక్కడే మరణించారు. పాపారావు అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ట్రాఫిక్ ఏఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు కూలి పనిచేస్తూ కుటుంబానికి జీవిస్తున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని మూడేళ్ల క్రితం మరో వివాహం చేసుకున్నారు. రెండవ భార్యతో నల్లబొడ్లూరులో జీవిస్తున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో .. ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. -
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.గుమ్మడం క్రాస్ రోడ్డు వద్ద బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దురు అక్కడికక్కడే మృతి చెందగా.. సర్పంచ్ పద్మ తీవ్రంగా గాయపడింది. అటుగా వెళుతున్న కలెక్టర్ శ్వేతామహంతి సర్పంచ్‌ను తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
టీప్పర్ లారీ ఢీ కొట్టిన కాని..
-
నిర్లక్ష్యం ఖరీదు నలుగురి ప్రాణాలు
గిద్దలూరు: డ్రైవర్ నిర్లక్ష్యంగా తన సెల్‌కు రీచార్జి పెట్టుకుంటుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడంతో పాటు 41 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో తంబళ్లపల్లె క్రాస్ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాకు చెందిన సాథిలి, దేవగానిపల్లి, ఉప్పకుంటహల్లి గ్రామాల భక్తులు శివరాత్రి సందర్భంగా పలు ఆలయాలు దర్శించుకునేందుకు ఈ నెల 11వ తేదీన ఓ ట్రావెల్స్ నిర్వాహకుడి లారీలో బయల్దేరారు. కదిరి, తుమ్మలకొండ కోన, బ్రహ్మంగారి మఠం ఆలయాలు దర్శించుకుని శ్రీశైలం వెళ్తున్నారు. మార్గమధ్యంలో నల్లగుంట్ల సమీప మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ రాళ్లను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. 61 మంది ఉండటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా 41 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలో 10 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. మృతుల్లో సాథిలి గ్రామానికి చెందిన నల్లవోలు నారాయణమ్మ (48), తలారి నారాయణప్ప ఆదెమ్మ (58), దేవగానిపల్లెకు చెందిన వెంకట నరసయ్యప్ప (50), ఉప్పుకుంటహల్లికి చెందిన జూలెపల్లి మారప్ప (60) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో నరహల్ల మనిరత్నమ్మ, బి.జయమ్మ, పాపన్న అనసూయమ్మ, నాగరాజప్ప, తిప్పన్న, బాబన్నగారి మునికృష్ణ, కదిరపు రఘు ఉన్నారు. పోలీసుల సేవలు భేష్ అర్ధరాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. కొమరోలు ఎస్ఐ అబ్దుల్ రహమాన్ తక్షణమే సీఐ శ్రీరామ్‌కు విషయం చేరవేశాడు. ఆయన గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలతో పాటు సిబ్బందిని పిలిపించి సంఘటన స్థలంలోని క్షతగాత్రులను తమ వాహనాల్లోనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందింపజేశారు. అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు మినహా గాయపడిన అందరనీ సకాలంలో ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో ఇరుక్కున్న భక్తులను చాకచక్యంగా బయటకు తీసి వారికి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడటంతో స్థానికులు పోలీసులను అభినందించారు. స్వగ్రామాలకు క్షతగాత్రులు నల్లగుంట్ల వద్ద జరిగిన రోడు ప్రమాదంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించిన అనంతం స్వగ్రామాలకు చేర్చేందుకు పోలీసులు చొరవ తీసుకున్నారు. ఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి స్వల్పగాయాలైన వారిని, వారి బంధువులను ఎక్కించారు. మృతులకు ప్రత్యేకంగా అంబులెన్స్, తీవ్రంగా గాయపడిన వారిలో కొందరికి ఒక అంబులెన్స్ చొప్పున కేటాయించి వారి వారి గ్రామాలకు చేర్చేలా పోలీసు సిబ్బందిని పంపించారు. కేసు నమోదు డ్రైవర్, లారీ యజమానికిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీ అనంతపురం జిల్లా లేపాక్షికి చెందినదిగా గుర్తిం చామని చెప్పారు. టూరిస్టు నిర్వాహకుడు సహదేవప్పపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరంతా సహదేవప్పకు రూ.1,500 చొప్పున చెల్లించి దైవ దర్శనం కోసం వచ్చారని తెలిపారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్, భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. ఆయనతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్ఐలు కె.మల్లికార్జున, షేక్ అబ్ధుల్రహమాన్, శశికుమార్, నాగశ్రీను ఉన్నారు. జిల్లా అధికారులకు కృతజ్ఞతలు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో సపర్యలు చేసి ఓదార్చి ధైర్యం చెప్పిన జిల్లా అధికారులను కర్ణాటకలోని గుడిబండ తాలూకా పంచాయతీ అధ్యక్షుడు రామాంజి అభినందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆదెమ్మ తన అత్త అని, సమాచారం తెలియగానే తాను గిద్దలూరు వచ్చానని, ఇక్కడ తమ ప్రాంతానికి చెందిన క్షతగాత్రులకు పోలీసులు, వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. -
ప్రాణాలు తీసిన లారీ..
పొద్దునే టీ తాగేందుకు కొందరు.. టిఫిన్ చేసేందుకు మరికొందరు ఆ హోటల్ దగ్గరకు చేరారు. ఇంతలో ఓ లారీ వేగంగా అటుగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పుగోదావరి, తొండంగి (తుని): బెండపూడి జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి ట్రాలీ లారీ బుధవారం ఉదయం దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బెండపూడికి చెందిన దోనేపూడి వీరబ్బాయి హైస్కూల్ ఎదురుగా రాజమండ్రి వైపు వెళ్లే రోడ్డు పక్కన హోటల్ నిర్వహించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో విశాఖ వైపు నుంచి వస్తున్న ట్రాలీ లారీ డ్రైనేజీపై ఐరన్ గ్రిల్స్‌ను, ఆటోను, మోటర్ బైక్‌లను ఢీకొంటూ హోటల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో గ్రామానికి చెంది తుమ్మలపల్లి సత్తిబాబు(45) హోటల్ వద్దకు టీ తాగేందుకు వస్తుండగా.. అప్పటికే వీరబ్బాయి టీకొట్టు వద్ద టిఫిన్ కోసం మరికొంత మంది వేచి ఉన్నారు. దీంతో వీరిపైకి ట్రాలీ దూసుకు వచ్చింది. ఈ సంఘటనలో సత్తిబాబు అక్కడిక్కడే మృతిచెందగా బూసాల సాయి బాపిరాజు(15), యడ్లపల్లి శ్రీను, కత్తిపూడికి చెందిన దువ్వాడ జార్జ్, సాన్ని చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా బాపిరాజు రెండు కాళ్లు లారీ కింద ఇరుక్కుపోవడంతో తేటగుంట హైవే సిబ్బంది, పోలీసులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం గాయపడిన వారిని తుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి క్రేన్ల సహాయంతో ట్రాలీలారీని తొలగించారు. కాగా కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాపిరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమై ఉంటుందని స్థానికులు అంటున్నారు. బెంబేలెత్తిన జనం కొద్ది రోజుల క్రితం బెండపూడి గ్రామానికి చెందిన నలుగురు కత్తిపూడి జాతీయరహదారిపై లారీ ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన మరువక ముందే బుధవారం మరో సంఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాలీ లారీ ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన సత్తిబాబుకు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో మృతుడు బాపిరాజు పదోతరగతి వరకు చదువుకున్నాడు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఒకదానికొకటి మూడు లారీల ఢీ
గుడ్లూరు: మూడు లారీలు ఒక దానికొకటి ఢీకొనడంతో ఓ లారీ క్లీనర్ మృతి చెందగా ఇద్దరు డ్రైవర్లుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని చేవూరు వద్దకు వచ్చే సరికి వెనుకనే వస్తున్న మరో లారీ ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఢీకొట్టింది. అదే సమయంలో వెనుకనే వస్తున్న మరో లారీ మధ్యలో లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మధ్య లారీ డోరు ఊడి పోవడంతో క్లీనర్ రమేష్ (35) ఎగిరి రోడ్డుపై పడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడి. డ్రైవర్ శ్రీనివాసులు, వెనుక లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. క్లీనర్ రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి రమేష్‌ది విశాఖపట్నంలోని చిలకపేట గ్రామం. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్ఐ రమణయ్య, గుడ్లూరు పోలీసుస్టేషన్ రైటర్ డానియేలు పరిశీలించి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
లారీ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం
బనశంకరి: పాలికె చెత్త లారీ ఢీకొని ఆర్కిటెక్చర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఉప్పారపేటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు...రాజాజీ నగర నివాసి నరసరాజ్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె బీఎన్.సాహిత్య(24) హెసరఘట్ట సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆర్కిటెక్చర్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇక్కడి కన్నింగ్‌హ్యామ్ రోడ్డులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. మంగళవారం ఉదయం కంపెనీకి స్కూటర్లో బయలుదేరిన సాహిత్య రేస్‌కోర్సు రోడ్డులో వెళుతుండగా వెనుక నుంచి బీబీఎంపీ చెత్త లారీ ఢీకొనడంతో సాహిత్య లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. లారీ డ్రైవర్ పరారీ కగా పోలీసుసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
తాండూరు టౌన్ : బతుకుదెరువు కోసం తెల్లవారుజామునే నిద్రలేచి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని మృత్యువులా దూసుకొచ్చిన లారీ బలిగొన్నది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం షావుకార్‌పేట్‌కు చెందిన శ్రీశైలం (40) నాపరాతి పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జీవనాధారం కోసం ప్రతినిత్యం తెల్లవారుజామున తాండూరు బస్టాండు సమీపంలో పాల ప్యాకెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూడా యధావిధిగా అక్కడ పాలు విక్రయిస్తున్నాడు. కాగా నెల్లూరు నుంచి చెట్టినాడ్ సిమెంటు కర్మాగారానికి బొగ్గు లోడ్‌తో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్ వైపునకు లారీ వస్తున్నది. ముందు వెళ్తున్న మరో లారీని ఎడమ వైపు నుంచి లారీ డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోగా పక్కనే ఉన్న లారీకి తగిలింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డుకు ఓ మూలన పాల ప్యాకెట్లు విక్రయిస్తున్న శ్రీశైలంను ఢీకొట్టింది. అనంతరం బాలాజీ లాడ్జి ముందు పార్కింగ్ చేసి ఉన్న పవర్‌ప్లాంట్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, నిర్లక్ష్యంతో లారీ నడిపి వ్యక్తి మృతికి కారకుడైన డ్రైవర్ విజయ్‌నాథ్‌తో పాటు క్లీనర్ కాళేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ఆరిలోవలో లారీ బీభత్సం
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో ఆరిలోవ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక సాయి బాబా గుడి వద్ద లారీ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ ఇన్నోవాపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు. బాధితులు సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
నిన్న భూమిక..నేడు బిందు
-
ఈ పాపం ట్రాఫిక్ పోలీసులదే..!
సాక్షి, సిటీబ్యూరో: కొందరు ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసి ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ళ చిన్నారి భూమిక ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మొగ్గలోనే రాలిపోయింది... అదే లారీ పదేపదే ఒకే తరహా ఉల్లంఘనకు పాల్పడుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లతో సరిపెట్టారు. ఫలితమే మంగళవారం చోటు చేసుకున్న భూమిక విషాదాంతం. ఈ పాపం ట్రాఫిక్ పోలీసులదే అనడంలో సందేహం లేదు. ఆ నిషేధం నామమాత్రమేనా..? రాజధానిలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు లారీలు మృత్యుశకటాలుగా మారడంతో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై లారీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. రాచకొండ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలు రాకపోకలు సాగించాలి. అయితే ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనేందుకు భూమికను పొట్టనపెట్టుకున్న ఇసుక లారీనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మృత్యుశకటం ఉదయం 8 గంటల ప్రాంతంలోనూ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ‘స్వేచ్ఛగా’ విహరించడమే ఇందుకు నిదర్శనం. గతంలోనే ఇదే మాదిరిగా... భూమికను చిదిమేసిన లారీ (ఏపీ 29 వీ 7539) నిషేధిత సమయంలో ఉప్పల్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో విహరించడం ఇది తొలిసారి కాదు. గత మూడు నెలల్లో ఇలా ఉల్లంఘనకు పాల్పడుతూ రెండుసార్లు ‘రికార్డుల్లోకి’ ఎక్కింది. మంగళవారంతో కలుపుకుంటే మూడోసారి. అక్టోబర్ 18 ఉదయం 9.05 గంటలకు వీటీ కమాన్ ప్రాంతంలో ఈ లారీని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ సహా ఐదు ఉల్లంఘనలకు సంబంధించి రూ.2700 జరిమానా విధించారు. ఈ నెల 13న ఉప్పల్ టయోటా షోరూమ్ వద్ద రూ.700 జరిమానా విధించారు. ఈ రెండూ స్పాట్ చలాన్లే అని ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్ స్పష్టం చేస్తోంది. జరిమానా విధిస్తే సరా? పదేపదే నిషేధిత సమయాల్లో దూసుకువస్తున్న ఇలాంటి అనేక లారీలకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకసారి చలాన్ విధించిన తర్వాత 24 గంటల వరకు ఆ వాహనంపై అదే ఉల్లంఘనకు సంబంధించిన మరో చలాన్ విధించే ఆస్కారం లేదు. దీంతో అనేక వాహనాలు చలాన్ మొత్తాన్నీ కిరాయికి మాట్లాడుతుకున్న వ్యక్తుల నుంచే వసూలు చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వారికి కాసుల పంట... చిలుకానగర్ వద్ద ప్రమాదానికి కారణమైన ఆ లారీ ఉప్పల్ ఇసుక లారీల అడ్డా నుంచి బయలుదేరి నిషేధిత సమయంలోనే ఉప్పల్ చౌరస్తాను దాటుకుంటూ వచ్చింది. ఇసుక రవాణా వాహనాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, సముదాయాలకు సంబంధించినవీ ట్రాఫిక్ పోలీసులకు కాసుల పంట పండిస్తుంటాయి. అక్కడకు రాకపోకలు సాగించే భారీ వాహనాలను ‘వదిలేయడం’ కోసం వాటి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారనే ఆరోపణలున్నాయి. భూమికను చిదిమేసిన ఇసుక లారీ పదేపదే ఉప్పల్ ప్రాంతంలో విహరించడం వెనుక ఇలాంటి ‘సర్దుబాటు’ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే... నగరం నడిబొడ్డు హైదరాబాద్, చుట్టపక్క ల ఉన్న ప్రాంతాలు సైబరాబాద్, రాచ కొండ పరిధిల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ‘నిషేధం’ విషయంలో మూడు కమిషనరేట్ల అధికారులూ సమన్వయంతో పని చేయాలి. పగలు రాత్రి లేడా లేకుండా నగరం, కీలక శివారు ప్రాంతాల్లోకి లారీల రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలి. ఔటర్ రింగ్‌రోడ్ మినహా మరెక్కడా ఈ మృత్యుశకటాలు తిరక్కుండా చేయాలి. లోపల ఏరియాల్లో లోడింగ్, అన్లోడింVŠ కు కేవలం రాత్రి వేళల్లోనే అనుమతించాలి. నిబంధనలు, నిషేధాల్ని అతిక్రమించిన భారీ వాహనాలను స్వాధీనం చేసుకునే దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలి. (ప్రమాదానికి కారణమైన లారీకి జారీ చేసిన చలాన్) -
చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద లారీ బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చింతల్గుంట చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లోడ్‌తో వెళ్తున్న లారీ చెక్‌పోస్టు వద్ద మరో వాహనాన్ని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడిసెలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో, కారు ధ్వంసమయ్యాయి. -
లోయలో పడిన లారీ: ఇద్దరు మృతి
సాక్షి, విజయనగరం: ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బందుగామ్ సమీపంలోని కుంబారిపుట్టి వద్ద ఓ లారీ లోయలో పడిపోయింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ 40 అడుగుల లోయలో పడటంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాయగడ జిల్లా టెక్కిరి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన వారు. మృతులలో ధాన్యం వ్యాపారి తవిటిరాజు, కళాసి అప్పలనాయుడు ఉన్నారు. డ్రైవర్ వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా క్లీనర్ ఆచూకీ దొరకలేదు. బందుగామ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ
- తప్పిన పెనుప్రమాదం విజయవాడ: భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన విజయవాడలోని రాజీవ్ నగర్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ రోడ్లో వెళ్తున్న లారీని డ్రైవర్ మలుపు తిప్పే ప్రయత్నంలో అదుపతప్పి ఇంటి ప్రహరిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రహరీ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ప్రహరీ సమీపంలోని ఒక మోటార్ వాహనం, 4 సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంతపని చేశావయ్యా దేవుడా..
- లారీ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి - మిన్నంటిన ఆర్తనాదాలు పండుగ సరుకులు తెస్తానంటివి.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా! ఎంత పని చేశావయ్యా దేవుడా... అనే రోదనలతో ఆ ప్రాంతం దద్దరల్లింది. ఐదు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న భర్త.. విగతజీవుడై పడి ఉండగా ఇల్లాలి వేదనకు అంతులేకుండా పోయింది. మలి సంధ్యలో తనకు తోడు లేకుండా పోయాడన్న వేదన ఆమెను కలిచి వేసింది. - ఓడీ చెరువు: ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందివారిపల్లికి చెందిన బైముతక రంగప్ప( 65) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినాయక చవితి పండుగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు స్కూటర్‌పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా మహమ్మదాబాద్ క్రాసింగ్ సమీపంలోని బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఘటనలో లారీ కిందకు స్కూటర్ వెళ్లిపోయింది. వెనుక చక్రాలు రంగప్ప తలపై నుంచి దూసుకెళ్లాయి. తల నుజ్జునుజైంది. కుడి భుజం, చేయి నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాన్నా మా అందర్నీ వదలిపోతివా కుమారుడు, కుమార్తె రోదనలు స్థానికులను కలిచివేశాయి,. మృతుడి భార్య గంగులమ్మ రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఘటన స్థలాన్ని అమడగూరు ఎస్ఐ చలపతి, హెడ్‌కానిస్టేబుల్ నాగభూషణం పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మహబూబ్‌నగర్: జిల్లాలోని మక్తల్ మండలం, కాచ్వార్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ వైపు నుంచి వస్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులంతా చామన్‌పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విజయనగరం: ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కె.ఎల్.పురం బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న లెంక మధు, వర్మ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎల్.కె.వి. రంగారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ ఆటోనగర్‌లో లారీ బీభత్సం
-
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండలం దొరిగల్లు సమీపంలో సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలం దిగువపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నారాయణస్వామి(32) మరణించినట్లు ఎస్ఐ మగ్బుల్‌బాషా మంగళవారం తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండలం దిగువపల్లికి చెందిన వెంకటనారాయణరెడ్డి అనే రైతు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తన వేరుశనగ కాయలను ముదిగుబ్బ మండలం ఎగువపల్లి పరిసర గ్రామాల్లో కొనుగోలు చేసి ఆటోలో స్వగ్రామానికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో దొరిగల్లు వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్ నారాయణస్వామికి తీవ్ర గాయాలు కాగా, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమార్తెలు జాష్ణవి, వైష్ణవి, కుమారుడు చరణ్‌కుమార్ ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లలు విలపించడం చూసి అందరి హృదయాలు బరువెక్కాయి. -
లారీ ఢీకొని మహిళ దుర్మరణం
► మరో వ్యక్తికి తీవ్రగాయాలు పాలకొండ: మండలంలోని మంగళాపురం గ్రామ కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముంజు అక్కమ్మ(40) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన అక్కమ్మ.. భర్త చనిపోవడంతో ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఆదివారం కావడంతో మంగళాపురం గ్రామంలో ఉన్న తన చెల్లి ఎనేతల రమణమ్మ ఇంటికి బియ్యం, ఇతర సామగ్రి తీసుకువెళ్లింది. మధ్యాహ్నం వరకూ అక్కడే ఉండి భోజనం చేసి, తిరుగు ప్రయాణమైంది. బస్టాప్ వరకూ వస్తానంటూ చెల్లి రమణమ్మ కుమారుడు మురళి అనడంతో, ఇద్దరూ కలసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. పాలకొండ–రాజాం రహదారిపైకి వచ్చేసరికి రాజాం వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కమ్మ ముద్దలా మారింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అక్కడి నుంచి 50 మీటర్ల దూరం వరకూ లారీ దూసుకుపోయి ఆగింది. ద్విచక్రవాహనం లారీ కింది భాగంలో ఉండిపోయింది. బయటకు తుళ్లిపోయిన మురళికి కాలు విరిగింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతనిని రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఎం.చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘నిజమే.. జరగరానిది జరిగింది’
- ‘ఏర్పేడు’ మృతుల కుటుంబాలతో మంత్రి నారా లోకేశ్ - మునగలపాలెంలో బాధితులకు పరామర్శ - అంతా అయిపోయాక వచ్చారంటూ లోకేశ్‌ను నిలదీసిన మహిళ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘నిజమే.. జరగరానిది జరిగింది. ఘోరం జరిగిపోయింది. కారణాలేమైనా కావొచ్చు.. ఇకపై గ్రామాభివృద్ధి అవసరం. కలిసి కూర్చుందాం. అభివృద్ధిపై చర్చిద్దాం’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మునగలపాలెం రైతులకు సూచించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. శనివారం రాష్ట్ర మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాశ్లతో కలిసి మునగలపాలెంలో బాధిత కుటుంబాలను కలిశారు. చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మృతుల కుటుంబాలకు మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. దుర్ఘటనలో చనిపోయిన 12 మంది కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక దోపిడీని అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాననీ, ఇకపై అలాంటిదేమీ ఉండబోదని హామీ ఇచ్చారు. ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం?: ఈ సందర్భంగా గ్రామంలో శారద అనే మహిళ మంత్రి లోకేశ్‌ను మీడియా ముందే నిలదీసింది. ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం, అంతా అయిపోయాక... అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక దోపిడీపై ఎవరూ పట్టించుకోలేదని అంటుండగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. చర్యలు తీసుకోకపోతే అడగండి, కఠిన చర్యల తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం అన్నారు. ఇప్పుడేమంటావ్.. రావద్దంటావా? అంటూ సదరు మహిళపై అసహనాన్ని ప్రదర్శించారు. తన ఉద్దేశం అది కాదని ఆమె చెప్పుకొచ్చింది. అమరావతిలో రోడ్లు వేయడం కాదు, కాస్త మా గురించి కూడా పట్టించుకోండి అని కోరింది. దీంతో మరింత అసహనానికి గురైన లోకేశ్ ఆ మహిళను ఏ ఊరు మీది అని ప్రశ్నించారు. -
ఏర్పేడు లారీ ప్రమాదం మిగిల్చిన విషాదం
-
ప్రాణాలు తీసిన ఇసుక దందా
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పేడు వచ్చారు. అదే సమయంలో అటువైపుగా లారీ భారీ వేగంతో నిరసన కారుల వైపు దూసుకొచ్చింది. లారీ ఢీకొనడంతో మొత్తం 20మంది చనిపోగా, మరికొంతమందికి గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఈ మేరకు తీర్మానించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది అసువులు బాసిన విషయం విదితమే. నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పేడుకు వచ్చిన మృతుల బంధువలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రుకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ ప్రమాదంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆ సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసింది. పోలీసులు వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
మిర్చిలారీ బోల్తా: 10 మందికి గాయాలు
ఇంకొల్లు: ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొణికి గ్రామ శివారులో శనివారం ఒక మిర్చి లారీ బోల్తాపడింది. ఈ సంఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు మండలం పెనకలపాడులో గురువారం రాత్రి లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్(30) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కృష్ణమోహన్ తన స్నేహితులతో కలసి మల్లికార్జున ఇంటి వద్ద మాట్లాడుకొంటూ నిలబడి ఉండగా లారీ విపరీతమైన వేగంతో అతనిపై దూసుకెళ్లిందన్నారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు. మృతుని భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
తెల్లారిన బతుకులు
వారంతా కళాకారులు...ఊరూరూ తిరుగుతూ భజనలు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. ఎన్పీకుంట మండలం గొల్లపల్లిలో జరిగిన ఓ వర్ధంతి కార్యక్రమంలో భజన చేసేందుకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం – లారీ, ఆటో ఢీ - ముగ్గురి దుర్మరణం – మరో పది మందికి తీవ్ర గాయాలు – మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా వాసులు కదిరి టౌన్ \ తనకల్లు : వర్ధంతి కార్యక్రమం కోసం వచ్చిన భజన బృందం తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. తెల్లారేసరికల్లా ఇంటికి చేరుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మార్గమధ్యంలోనే లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. బృందంలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో పది మంది గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. చిత్తూరు జిల్లా పీటీఎం మండలం శ్రీనివాసరాయునిపల్లెకు చెందిన భజన కళాకారుల బృందం అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పెడపల్లి సమీపంలో గల గొల్లపల్లిలో గల సమీప బంధువు వర్ధంతికి నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఆటోలో గురువారం రాత్రి వచ్చారు. రాత్రి భజన అయిపోయాక తెల్లవారుజామున 3 గంటలకు అదే ఆటోలో స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలోని తనకల్లు మండలం చీకటిమానిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి(45) అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల సాయంతో మిగిలిన క్షతగాత్రులను వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ(66) మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న రత్నమ్మ(60)ను మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఆటో డ్రైవర్ నరసింహులు, శంకరప్ప, పార్వతమ్మ, లక్ష్మీదేవమ్మ, రెడ్డెమ్మ, నారాయణమ్మ, రాయప్ప, ఈశ్వరప్ప, లావణ్య, వెంకటరమణ గాయపడ్డారు. వారిలో నారాయణమ్మ, రెడ్డెమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, మెరుగైన వైద్యసేవల కోసం తిరుపతికి తరలించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా పొట్ట కూటి కోసం భజనలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మృతుల్లో కృష్ణమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణకు కూడా భార్య లక్ష్మీదేవి, ఇద్దరు సంతానం. రెడ్డెమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ మేరకు తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నడిరోడ్డుపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న ఒక లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై అడ్డంగా బోల్తాపడింది. ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ బోల్తా పడేందుకు కొన్ని క్షణాల ముందే పాఠశాల బస్సు ఈ మార్గంలో వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి లారీని పక్కకు తప్పించారు. ట్రాపిక్‌ను పునరుద్ధరించారు. -
అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
ఇద్దరు స్నేహితుల దుర్మరణం l దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి హైదరాబాద్: బోయిన్పల్లి నుంచి తాడ్బంద్కు వెళ్లే ప్రధాన రహదారి.. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయం.. ఒకే బైక్‌పై వెళుతున్న ముగ్గురు స్నేహితులు.. ఓ మూలమలుపు వద్ద బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో వారు ముగ్గురూ అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వారిలో ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీకెండ్ కోసం వెళ్లి: మల్కాజ్గిరి దుర్గానగర్ బస్తీకి చెందిన రమాకాంత్ కుమారుడు అనిరు«ధ్(20) నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అనిరుధ్ ఇంటి దగ్గర్లోనే ఉండే కృష్ణ రెండో కుమారుడు విశ్వచారి.. సాయిసుధీర్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. పక్కిం టివాళ్లు కావడం తో వీరికి మంచి స్నేహం ఉంది. అమీర్‌పేటకు చెందిన అఖిల్.. అనిరుధ్‌కు కాలేజీలో మిత్రుడు. ఇలా వీరి ముగ్గురి మధ్యా స్నేహబంధం ఏర్పడింది. వీకెండ్ రోజున సరదాగా గడిపేందుకు విశ్వచారి పెద్దమ్మ ఉండే ఫతేనగర్‌కు అనిరుధ్‌తో కలసి విశ్వచారి బస్సులో వచ్చాడు. ఆ తర్వాత అమీర్‌పేట లో అఖిల్‌ను కలుసుకున్నారు. అఖిల్ తన టీఎస్03 ఈఏ1993 నంబర్ గల యమహా ఎఫ్‌జెడ్‌పై అనిరుధ్, విశ్వచారితో కలసి దుర్గానగర్ బయలు దేరారు. బోయిన్పల్లి నుంచి తాడ్‌బంద్‌ను దాటే క్రమంలో తాడ్బంద్ బస్టాండ్ రాకముందు ఉండే మూలమలుపు వద్ద అతివేగంతో వచ్చిన వారి బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరి అవతలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో తాడ్బంద్ నుంచి బోయిన్పల్లి వైపు భారీ లోడ్‌తో వేగంగా వెళుతున్న లారీ వారి మీది నుంచి దూసుకెళ్లింది. అనిరుధ్, విశ్వచారి ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పది నిమిషాల్లో వస్తానని .. ‘పది నిమిషాల్లో వస్తాను నాన్నా..’అంటూ 2.30 గం టల ప్రాంతంలో విశ్వచారి తండ్రి కృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో ఆ కుటుంబం తట్టుకోలేక పోతోంది. రమాకాంత్ కుటుంబానికి అనిరుధ్ ఒక్కడే కుమారు డు కావడంతో గారాభంగా పెంచారు. అతను మరణించిన వార్త విన్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. దీంతో దుర్గా నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హెచ్చరికలు లేని మూలమలుపు బోయిన్పల్లి నుంచి తాడ్బంద్కు వెళ్లే దారిలో ఉన్న ఈ మూలమలుపులో అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి హెచ్చరికలు లేవు. ఈ మూలమలుపును విస్తరించాలని ప్రతిపాదనలు రూపొందించినా.. ఒకవైపు ముస్లింలకు చెందిన శ్మశానవాటిక, మరోవైపు రక్షణ శాఖ భూములు కావడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. దీంతో రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రోడ్డులో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. -
ఇద్దరు విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ
-
మంచిర్యాల జిల్లాలో లారీ బీభత్సం
తాండూరు: మంచిర్యాల జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బొగ్గులారీ అదుపుతప్పి రెండు ఎడ్లబండ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు నాలుగు ఎడ్లు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని తాండూరు మండలం మాదాపూర్ చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.