
గాంధీనగర్ : గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 19మంది దుర్మరణం చెందారు. సిమెంట్, ఇటుకల లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీ భావ్‌నగర్- అహ్మదాబాద్ హైవే మార్గంలోని భవలాయి గ్రామ సమీపంలో బోల్తా పడింది. శనివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.