సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment