chevella
-
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
రుణమాఫీపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదు: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే రుణమాఫీపై తమ ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.కోతలు లేకుండా రూ. 2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ అనేక హామీలు ఇచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్లపై ఒట్లు పెట్టిన సీఎం రేవంత్.. రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయకుండా దైవద్రోహానికి పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై ప్రశ్నిస్తే తమనే దబాయించారని, సభలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఏడిపించారని అన్నారు. రుణమాఫీ, హామీలపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదన్నారు. -
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
-
Ranga Reddy: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్‌ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
చేవెళ్ల మీటింగ్: ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసీఆర్ ఫైర్
చేవెళ్ల,సాక్షి: సీఎం పదవి నుంచి తాను పక్కకు జరగగానే ఇంత ఘోరమా అని బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలు ఇవ్వకున్నా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకే ఓటేశారని కాంగ్రెస్ అనుకునే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొరడా ఝళిపించాలని కేసీఆర్ పిలుపుచ్చారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని గుర్తు చేశారు. చేవెళ్లలో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. శనివారం(ఏప్రిల్ 13) చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్‌రెడ్డి. ఏం తక్కువ చేశాం రంజిత్‌రెడ్డికి. ఆయనేమన్నా పొద్దు తిరుగుడు పువ్వా. అధికారం ఎటు ఉంటే అటు మారుతాడా. రంజిత్ రెడ్డి అధికారం కోసమా.. పైరవీల కోసమా ఎందుకు పోయాడు. ఆయనను ధీటైన దెబ్బ కొట్టాలి’ అని చేవెళ్ల ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై ఓట్ల డబ్బాలతో యుద్ధం చేసి డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. 420 వాగ్ధానాలు చేసి అన్నీ మరిచిపోయారని మండిపడ్డారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి రాష్ట్రంలో లూఠీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీపై ఫైర్.. బీజేపీపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ‘అయితే మోడీ.. లేదా ఈడీతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గుడ్డిగా ఓట్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి. గత పదేళ్ళలో కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. తెలంగాణకు ఒక్కటి ఇయ్యలేదు. 150 ఉత్తరాలు రాసినా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసినా నేను పెట్టలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తాయి. ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేశాం. నూకలు తినమని ఓ బీజేపీ కేంద్ర మంత్రి చెప్పారు. బీజేపీకి ఓటు వేసి నూకలు తిందామా ? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేదు. మతం ఉచ్చులో పడి మోసపోవద్దు’ అని కేసీఆర్ కోరారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల ఐక్యత చాటాలి ‘కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే పనులవుతాయి. ధాన్యం కల్లాల వద్ద, ఓట్ల డబ్బాలతో రెండు రకాలుగా యుద్ధం చేయాలి. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల ఐక్యత చాటాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై వెంట పడి వేటాడుతాం. చేవెళ్ల సభకు వచ్చిన జనాన్ని చూస్తే కాసాని గెలుపు ఖాయమైపోయింది’ అని కేసీఆర్ అన్నారు. -
BRS Party: చేవెళ్లలో తొలి బహిరంగ సభ.. ఎంపీ ఎన్నికల్లో ఇదే వ్యూహం
సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుకోసం శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ మేరకు చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలను తరలించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్కు తిరుగుండదని నిరూపించాలని చూస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం రావాంటే ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరని భావిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్.. పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. తెరపైకి బీసీ నినాదం చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీసీ వాదానికి తెరతీసింది. అందరికంటే ముందుగా సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం.. ప్రచారంలో భాగంగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది.అయితే అనూహ్య పరిణామాల మధ్య పోటీ నుంచి రంజిత్‌రెడ్డి తప్పుకోవడంతో మరో అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా వారు పోటీకి ససేమిరా అనడంతో చివరకు జిల్లాకు సుపరిచితుడు బీసీ ఉద్యమ నేత, రంగారెడ్డి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌ను బీఆర్ఎస్ అధినేత చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ పోటీలోనే ఉండదు.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ అని అందరు భావించిన తరుణంలో కాసానిని అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ ట్రయాంగిల్‌గా మారిందనే చర్చ మొదలైంది. కాసానికి జిల్లాతో ఉన్న అనుబంధం, ఆయనకు ఉన్న పరిచయాలు, బీసీ ఉద్యమంలో ఆయన పాత్ర తదితర అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో అదనపు బలంగా మారాయి. అనుకున్న స్థాయిలో బీసీ వాదాన్ని తట్టి లేపగలిగితే ఆయనకు గెలుపు అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో శనివారం తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఈ సభను నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్లగొండ, కరీంనగర్‌లలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించింది. అయితే ఈ రెండు సభలూ రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో బీఆర్ఎస్ తొలి సభ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు బహిరంగ సభలు నిర్వహించాలా.. లేక కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలా అనే అంశంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సుమారు 20 రోజుల పాటు కేసీఆర్ పాల్గొనే సభలు, బస్సు యాత్ర షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సోషల్ మీడియా సమన్వయకర్తలను ప్రకటించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానానికి అభిలాశ్‌రావు రంగినేని, మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఆశప్రియ ముదిరాజ్ సమన్వయకర్తలుగా పనిచేస్తారు. -
కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకడం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులే దొరకడంలేదని, అందుకే ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రిని కూడా బయటనుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని, జితేందర్‌రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని చెప్పారు. చేవెళ్ల సీటు మోదీదేనని రాసి పెట్టు కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలోని 12, 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి వస్తానన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే తమ పార్టీపై దుష్ప్రచారం సాగుతోందని, మద్యం కుంభకోణం కేసులో చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
ఇక ఇందిరమ్మ కమిటీలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు కోసం గ్రామాల్లో ఇంది రమ్మ కమిటీలను ఏర్పాటు చేయ బోతున్నామని.. ప్రభుత్వం ప్రక టించిన ఏ పథకానికైనా ఇకపై ఆ కమిటీల ద్వారానే అర్హులు/లబ్ధిదా రులను ఎంపిక చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన ఐదు గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తామని, వాటిద్వారానే పథకాలను అందజేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని భరించలేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత వంటివారంతా కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో ఒక్క కుటుంబంలోని వారికే పదవులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీచేశాం. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితారావు అంతా కలిసి కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెడుతున్నారు. పేదల బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే మీ కడుపు మండిందా? త్వరలోనే మెగా డీఎస్సీ నీ బిడ్డ కవితను ప్రజలు ఓడిస్తే.. ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీని చేశావు. ఎంపీగా ఓడిన బంధువు వినోద్‌రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేశావు. మా పేదోళ్లు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీ బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రుల కష్టార్జితంతో అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ కోచింగ్ సెంటర్లలో చదివినా ఉద్యోగాలు రాక, పెళ్లిళ్లుగాక రోడ్లపై తిరుగుతుంటే.. చెట్లకు ఉరేసుకుని చనిపోతుంటే... ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశావా కేసీఆర్? నువ్వు మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? ఏ ఒక్కరోజైనా ఆ పేదబిడ్డల గురించి ఆలోచన చేశావా? కానీ కాంగ్రెస్ వచ్చిన వెంటనే 25వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. మార్చి 2న మరో రెండు వేల గ్రూప్స్ పోస్టులు భర్తీ చేస్తాం, త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. కుర్చిని తాకడం నీ తరం కాదు బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠానీల్లాగా అర్రాస్ (వేలం) పెట్టారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారా? మేం వచ్చిన తర్వాత జైల్లో వేశాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం. మీ నోటి నుంచి ఏనాడైనా అభినందించారా? ఎప్పుడు కుర్చిలో కూర్చుందామా అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇనాం కుర్చీ కాదు. వారసత్వంగా వచ్చిందికాదు. నల్లమల నుంచి కార్యకర్తగా కష్టపడితే వచ్చింది. దీన్ని తాకడం నీతరం కాదు. ఈ ప్రభుత్వం మూడు నెలలకో, ఆరు నెలలకో కూలుతుందని ఎవరైనా గ్రామాల్లోకి వచ్చి చెప్తే.. వారిని చెట్టుకు కట్టేసి తగిన బుద్ధి చెప్పండి. ఒక్కసీటైనా గెలిపించి చూపించు! ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డినే సీఎం అని చెప్తే కాంగ్రెస్‌కు మూప్పై సీట్లు కూడా రాకపోయి ఉండేదని ఓ సన్నాసి చెప్తుండు. నేను సవాల్ విసురుతున్నా.. ఇప్పుడు రేవంతే సీఎం, పీసీసీ అధ్యక్షుడు. నీకు దమ్ముంటే, ధైర్యముంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటైనా గెలిపించి చూపించు. నీలా తండ్రి పేరు చెప్పుకుని కుర్చిలో కూర్చోలేదు. కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి, లాఠీదెబ్బలు తిని, అక్రమ కేసుల్లో అరెస్టయి చర్లపల్లి జైల్లో మగ్గిన. భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి ఎదురొడ్డి కొట్లాడిన అసలు సిసలైన కార్యకర్తను నేను. మిమ్మల్ని ఓడించి కుర్చిలో కూర్చున్నోడిని. ఈ కార్యకర్తలు నాకు అండగా నిలబడ్డంత కాలం దేవుడొచ్చినా ఈ కుర్చిని తాకలేడు. గ్యారంటీలు అమలు చేసి తీరుతం.. సోషల్ మీడియా ఉంటే తామే గెలిచేవాళ్లమని కేటీఆర్ చెప్తున్నాడు. టీవీలు, పేపర్లన్నీ మీ చుట్టపోళ్లవే కదా! మాకేమన్నా మైకులు ఉన్నాయా? సినిమా థియేటర్లు ఉన్నాయా? క్లబ్‌హౌస్‌లు ఉన్నాయా? కార్యకర్తలు కష్టపడితేనే మాకు అధికారం వచ్చింది. మాకు ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, ఏ ట్యూబ్ అక్కరలేదు. మా కార్యకర్తలే మీ ట్యూబులైట్లు పగలగొట్టే బాధ్యత తీసుకున్నరు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. ఆడబిడ్డల కోసం ఆనాడు దీపం పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రూ.4 వందలకే సిలిండర్ ఇచ్చింది. కానీ మోదీ వచ్చిన తర్వాత రూ.1,200కు పెంచి మహిళల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నారు. మేం రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపేందుకు 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించాం. మహిళలను కోటీశ్వరులను చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 14 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపండి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది..’’ అని రేవంత్ పేర్కొన్నారు. చంపడమేనా గుజరాత్ మోడల్? బీజేపీ పదే పదే గుజరాత్ మోడల్ అని చెబుతోందని.. ఊర్లో ఉన్నవాళ్లందరినీ తగలబెట్టడమే మోడలా? అని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులను బెదిరించి మీ రాష్ట్రాలకు గుంజుకపోవుడా మీ మోడల్? ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపారు. ఇదేనా గుజరాత్ మోడల్? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ, ఆ మోడీ కలిసే ఉన్నారు. ఇవాళ మేం వేరని చెప్తున్నారు. ఈ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది?’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కి ఎక్కడిది?
సాక్షి, చేవెళ్ల: కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని, అందుకే.. ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటిస్తోంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జనలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు. ప్రజాగర్జన సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సభకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. అనంతరం డిక్లరేషన్‌కు సంబంధించిన పోస్టర్లను వేదిక మీద ఉన్న నేతలంతా ప్రదర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కీలకాంశాలు ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు. ►పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షలు సాయం ►పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం ►ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ►ప్రతి కార్పొరేషన్ ద్వారా రూ.750 కోట్లు మంజూరు ►మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు ► దళిత గిరిజన విద్యార్థులకు పది పాస్ అయితే రూ. 10 వేలు. ► డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 25 వేలు. ► పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు లక్ష రూపాయలు అందజేత. ► అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు అధికారంలోకి వస్తే.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వాటాల ద్వారా న్యాయం చేస్తాం’’ వెల్లడించారాయన. రేపు అమిత్ షా వస్తారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రజా గర్జన వేదిక నుంచి ప్రసంగించిన ఖర్గే.. ► తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఖం వస్తుంది. ఉద్యమంలో అనేక మంది భాగస్వామ్యం అయ్యారు. కానీ, తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడింది(కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి..). తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది?. ఇది తెలంగాణ ప్రజల పోరాటం. కేసీఆర్‌కు బలం ఇచ్చింది మేం. కానీ, మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కానీ, తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ► ప్రజల అభీష్టం.. సొనియా గాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడింది. ఇక్కడున్నవాళ్లంతా తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లే. కేసీఆర్‌ను గద్దెదించడానికే మీరంతా వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తాం. కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర చేశారు. అదీ కాంగ్రెస్ పార్టీ శక్తి. సీడబ్ల్యూసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. గతంలో సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చాను. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. ► రేపు అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని అంటారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఐఐటీ, ఎయిమ్స్ ఏర్పాటు చేసిందెవరు? కాంగ్రెస్ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశంలో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది ఎవరు?. ఉమ్మడి ఏపిలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్రశ్నించారు ఖర్గే. ► బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే నేరుగా బీఆర్ఎస్ను విమర్శించరు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తాం. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించుతాం. ► కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి.. అమలు చేస్తున్నాం. తెలంగాణలోనూ అదే చేస్తాం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుంది అని ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడగొట్టండి. దేశంలో మోదీని ఓడగొట్టండి అని ఖర్గే చేవెళ్ల వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’
సాక్షి, హుస్నాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవెళ్ల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే, అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలు బాధ కలిగించాయి. దేశ హోంమంత్రి మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?. మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలి?. అమిత్ షా వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఇక, అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదు. అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. -
‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చేవెళ్ల సభ సాక్షిగా ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. వాటి ఫలాలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. మజ్లిస్ పార్టీ స్టీరింగ్‌తో నడుస్తున్న కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధి జరగదంటూ విమర్శలు గుప్పించాయి. అయితే.. అయితే అమిత్ షా చేవెళ్ల ప్రసంగంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. షా చేసింది ముస్లిం విద్వేష ప్రసంగమన్న ఒవైసీ.. బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని విమర్శించారు. ‘‘ముస్లిం విద్వేష ప్రసంగం మాత్రమే కాదు.. బీజేపీకి తెలంగాణ పట్ల విజన్ లేదు. బూటకపు ఎన్కౌంటర్లు, హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, నేరస్థులను విడుదల చేయడం, బుల్డోజర్లను మాత్రమే వాళ్లు అందించగలరు. అసలు తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు? అని ఒవైసీ ట్విటర్వేదికగా అమిత్ షాపై కౌంటర్ విమర్శలు గుప్పించారు. రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడాలంటూ ఆయన షాకు చురకలు అంటించారు. ఒవైసీ మీద పడి ఎంతకాలం ఏడుస్తారంటూ మండిపడ్డారాయన. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని అమిత్ షా నిజంగా భావిస్తే.. 50 శాతం కోటా పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలి. అనుభావిక డేటా ఆధారంగానే వెనుకబడిన ముస్లిం సమూహాలకు రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని ఆయన గుర్తించాలి అని ట్వీట్లో ఒవైసీ పేర్కొన్నారు. ఈ విషయంలో సుధీర్ కమిషన్ రిపోర్ట్‌ను ఆయన చదవాలని, లేదంటే చదివిన ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని షాకు సూచించారు. సుప్రీం కోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అమిత్ షాకు ఒవైసీ గుర్తు చేశారు. Sir @AmitShah ye “owaisi owaisi” ka rona kab tak chalega? Khaali khattey dialog’aan maarte rehte. Please sometimes speak about record-breaking inflation & unemployment also. Telangana has the highest per capita income in the country Modi allegedly says reach out to pasmanda… — Asaduddin Owaisi (@asadowaisi) April 23, 2023 -
బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు
-
అధికారంలోకి రాగానే ముస్లిం ‘కోటా’ రద్దు
చేవెళ్ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగ వ్యతిరేక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వాటి ఫలాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. పార్టీకి పెరుగుతున్న మద్దతు, ఈ సభకు వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే, వచ్చే ఎన్పికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందనే విషయం స్పష్టమౌతోందన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని మొత్తం ప్రపంచం వీక్షిస్తోందన్నారు. చేవెళ్లలో బీజేపీ విజ యసంకల్ప సభతో గత 8, 9 ఏళ్ల అవినీతిమయ బీఆర్ఎస్ పాలనకు ‘రివర్స్ కౌంటింగ్’ మొదలైనట్టేనని చెప్పారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగ యువతను నిండా ముంచిన కేసీఆర్ సర్కార్‌కు ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. తాను మళ్లీ వస్తానని, అన్నింటికీ లెక్కలు అడుగుతానని, ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందో నిలదీస్తానన్నారు. ఆదివా రం చేవెళ్లలో జరిగిన తొలి ‘విజయసంకల్ప యాత్ర’ బహిరంగసభలో అమిత్‌షా పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ భగవాన్‌కి ప్రార్థనలు, ఉమ్మడి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి ప్రణామాలంటూ ప్రసంగం ప్రారంభించారు. ఎంఐఎం చేతుల్లో కారు స్టీరింగ్ ‘బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉంది. అందువల్ల దాని దిశ సరిగా ఉండదు. ఒవైసీ ఎజెండాపై నిర్లజ్జగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. మోదీ నేతృత్వంలో ఇక్కడ బీజేపీ అధికారానికి వచ్చాక పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. మీరు మజ్లిస్‌కు భయపడవచ్చేమో కానీ బీజేపీ భయపడదు. డబుల్ బెడ్రూం స్కీంలోనూ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. విద్యలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇది ఇక ముందు సాగదు. మజ్లిస్ స్టీరింగ్‌తో నడుస్తున్న కేసీఆర్ పాలనతో రాష్ట్రాభివృద్ధి జరగదు. అధికార, పోలీసు యంత్రాంగం పూర్తిగా రాజకీయంగా ప్రభావితమై ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కిందిస్థాయి వరకు చేరడం లేదు. అయితే కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలోని పేదలను ప్రధాని మోదీ నుంచి దూరం చేయలేరు. రాబోయే ఎన్నికల్లో భారీమెజారిటీతో ఇక్కడ బీజేపీ అధికారానికి రావడం ఖాయం. కమలం పువ్వుకు ఓటెయ్యండి, కమలంపై కూర్చు ని మహాలక్ష్మీ, వైభవ్లక్ష్మీ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఎవరి చేతుల్లోనో స్టీరింగ్‌తో నడిచే ప్రభుత్వంలా కాదు. దేశాభివృద్ధిలో తెలంగాణను భాగస్వామి చేసేలా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2024లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, ఆయన అండదండలతో 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలు సహకరించాలి..’ అని అమిత్‌షా కోరారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఒక్క ఉద్యోగ భర్తీ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వానికి అధికారం చెలాయించే అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ జైలుకు పంపుతాం. రాష్ట్రంలో ఎస్ఎస్సీ ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యాయి. టీఎస్పీఎస్సీ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు, యువత జీవి తం నాశనమైంది. ఎన్నికల మైదానంలో ఈ నిరు ద్యోగులు కూడా కేసీఆర్ ప్రభుత్వ లెక్కాపత్రాలు సరిచేసి తగిన తీర్పు ఇవ్వబోతున్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై కేసీఆర్ కనీసం నోరు విప్పలేదు. కేసీఆర్ ఎవరిని రక్షించాలని అనుకుంటున్నారు? ఆయనకు ధైర్యముంటే ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. విచారణ నిర్వహించకుండా మీరు తప్పించుకోగలమని అనుకుంటున్నారేమో.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతికి పాల్పడేవారిని జైలుకు పంపించడం ఖాయం. నిరుద్యోగ యువతపై లాఠీలు ప్రయోగించి, బీజేపీ నేతలను జైలుకు పంపించి ప్రజల నోరుమూయించలేరు. లీకేజీపై ప్రశ్నిస్తే సంజయ్‌ను జైలుకు పంపారు ‘పేపర్ లీకేజీని నిలదీసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైలుకు పంపించారు. కా నీ 24 గంటలు కూడా ఆయన్ను అందులో ఉంచలేకపోయారు. సంజయ్ చేసిన తప్పేమిటో కేసీఆర్ చె ప్పాలి. నిరుద్యోగ యువతకు జరిగిన నష్టంపై గొంతెత్తిన సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? (సభికులు లేదంటూ కేకలు పెట్టారు). కేసీఆర్ సర్కార్ జైలుకు పంపినా, కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడరు. ప్రభుత్వా న్ని గద్దె దింపేదాకా విశ్రమించరు. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అడ్డుకుంటే లక్షలాది మంది ప్రజలు బీ జేపీకి మద్దతుగా నిలిస్తే మీరేమీ చేయలేకపోయారు’ అని విమర్శించారు. రాష్ట్రానికి పెద్దయెత్తున కేంద్రం నిధులు ‘మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులిస్తోంది. మూడేళ్లలో రామగుండం ఫ్యాక్టరీ తెరిపించడం, ఎంఎంటీఎస్ రైలు విస్తరణ, తదితరాలన్నీ కలిసి భారీగా మేలు జరిగింది. తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కు కూడా మోదీ ఇచ్చారు. రూ.లక్ష కోట్లు ఇక్కడ హైవేల కోసం ఖర్చయ్యాయి. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండింతలు అయ్యాయి. ఈ ప్రాంతం గుండా వెళ్లే హైదరాబాద్–బీజాపూర్ హైవే కోసం డబ్బులిచ్చినా, కేసీఆర్ ఇంకా భూసేకరణ చేయకపోవడంతో ఐదేళ్లు ఆలస్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేవెళ్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనం అందుబాటులోకి రాలేదు. ఒకసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మోదీ ఇచ్చే రూపాయికి బీజేపీ ప్రభుత్వం 25 పైసలు కలిపి రూ.1.25 ఖర్చు చేస్తుంది..’ అని అమిత్‌షా అన్నారు. ప్రసంగానికి ముందు మహాత్మా బసవేశ్వర జయంతి పురస్కరించుకుని స్టేజిపై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి అమిత్‌షా నివాళులర్పించారు. హైదరాబాద్‌కు చెందిన బడే గులాం అలీఖాన్ జయంతి సందర్భంగా ప్రణామాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు, పార్టీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నేతలతో భేటీ అమిత్‌షాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు ముఖ్య నేతలతో పాటు ఎంపీ అరవింద్, రఘునందన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు శాలువాలు కప్పి సత్కరించారు. అక్కడినుంచి అమిత్‌షా నేరుగా నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ తరుణ్‌ఛుగ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. సుమారు నలభై నిమిషాల పాటు ఆయన పార్టీ నేతలతో కలిసి ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో చేవెళ్లకు బయలుదేరి వెళ్లారు. కాగా ట్రిపుల్ ఆర్ సినీ బృందంతో అమిత్‌షా భేటీ రద్దయ్యింది. ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్గా మార్పు ‘మీ కుటుంబ అవినీతిమయ పాలన గురించి తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో తెలిసి వచ్చింది. భారీగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పలు కుంభకోణాల్లో మీ సన్నిహితులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణలో అవినీతి గంగ వరదలా పారింది. వాటిని, తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా వాడుకుంటోంది. తమ అవినీతి, అక్రమాలు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రధాని అయినట్టు అనుకుంటున్నారు. కానీ ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు. అందులో మోదీ ఉన్నారు. 2024 ఎన్నికల్లోనూ మళ్లీ పూర్తి మెజారిటీతో ప్రధాని కాబోతున్నారు. చేవెళ్ల ప్రజలు 2024లో మోదీని ప్రధానిని చేస్తారా.. లేదా.. రెండు చేతులెత్తి చెప్పండి. రాష్ట్రంలోనే వారి పాలన, పని ముగిసిపోతుంటే, ఇంకా జాతీయ రాజకీయాల గురించి గొప్పలెందుకు? లోక్‌సభ ఎన్నికల సినిమా రావడానికి ముందే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ట్రైలర్ రాబో తోంది..’ అని అమిత్‌షా అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా? ఢిల్లీలో మోదీకి వినిపించేలా గట్టిగా చెప్పండి అంటూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయించారు. -
అమిత్ షా వచ్చింది అందుకు కాదా?.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం హీటెక్కింది. చేవెళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంక్పల సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు లిప్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కళాశాలల శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని అనుకున్నా. అమిత్ షా వచ్చింది అందుకు కాదా?. గత తొమ్మిదేళల్లో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ రాష్ట్రం పేరు ఎందుకు చెప్పలేదు. అంటూ కామెంట్స్ చేశారు. I thank HM @AmitShah Ji on laying the foundation for ☑️ ITIR Hyderabad ☑️ National Project status for Palamuru - RR lift irrigation project ☑️ Hyderabad Metro Phase 2 ☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing Colleges Oh Wait 😁 he did none of that. Amit… — KTR (@KTRBRS) April 23, 2023 -
‘ఇది ట్రైలర్ మాత్రమే.. వాళ్లంతా జైలుకే..’
సాక్షి, చేవెళ్ల: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ.. చేవెళ్లలో విజయ సంక్పల సభ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ప్రధాని మోదీకి వినపడేలా గట్టిగా నినదించాలి. తెలంగాణలో అవినీతి సర్కార్ పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించబోతోంది. మోదీ ఢిల్లీ నుంచి నిధులు ఇస్తుంటే అవి తెలంగాణ ప్రజలకు అందడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం. బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది. బీఆర్ఎస్తో ఏం సాధిస్తారు?. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. తెలంగాణలో యువతకు అన్యాయం జరగుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. బండి సంజయ్ ఏం తప్పు చేశారు. పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే సంజయ్‌ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది. బండి సంజయ్ అరెస్ట్‌ను మీరు సమర్థిస్తారా?. పేపర్ లీకేజ్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ సర్కార్ వచ్చాక అవినీతిపరులను జైలుకు పంపుతాం. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని కేసీఆర్ తెలుసుకోవాలి. మరోసారి మోదీనే ప్రధాని అవుతారు. తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది. ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు. 9 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదు. తెలంగాణ కోసం మోదీ ఎన్నో పనులు చేపట్టారు. హైవేల విస్తరణ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్-బీజాపూర్ హైవే కోసం నిధులిచ్చాం. కానీ, భూసేకరణను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. చేవెళ్ల ప్రజలకు ప్రయోజనం కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ జవాబు చెప్పాలి. ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు. కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం. మజ్లీస్‌కు కేసీఆర్ భయపడతారు.. బీజేపీ భయపడదు. అవినీతిపరులను బీజేపీ జైళ్లకు పంపిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది ట్రైలర్ మాత్రమే. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. -
సా.6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
-
తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది: అమిత్ షా
Updates.. - శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమిత్ షా. అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఇది ట్రైలర్ మాత్రమే.. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తోంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు ప్రధాని కుర్చీ ఖాళీ లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అవినీతి పరులను బీజేపీ జైళ్లకు పంపించడం ఖాయం కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు ఎంఐఎంకు భయపడేది లేదు తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు 9 ఏళ్లుగా టీచర్ల నియామకాలు చేపట్టలేదు తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు కేసీఆర్‌ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది బండి సంజయ్ ఏం తప్పు చేశారు పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అందుకే సంజయ్‌ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది బండి సంజయ్ అరెస్ట్‌ను మీరు సమర్థిస్తారా? పేపర్ లీకేజ్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. - బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నన్ను ఎనిమిది గంటల పాటు రోడ్లపై తిప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే బీజేపీ ధృడ సంకల్పం. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తాం. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా చేవెళ్ల వచ్చారు. - చేవెళ్ల చేరుకున్న అమిత్ షా - చివరి నిమిషంలో అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవాటెల్‌కు అమిత్ షా వెళ్లారు. - ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితలపై చర్చించారు. - అమిత్ షా.. బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై మరింత దూకుడు పెంచాలి. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అధికారమే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలి. బీఆర్ఎస్ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. - శంషాబాద్ నుంచి చేవెళ్ల సభకు బయలుదేరిన అమిత్ షా. - అమిత్ షాకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు. - కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్ చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. - వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు.. వాహనాలను లోపలికి అనుమతిస్తున్నారు. లిస్టులో పేరు ఉన్న వాళ్లని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. - ఏటీసీ సెంటర్ నుంచి అమిత్ షా నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నారు. - అమిత్ షా సుమారు రెండు గంటల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. - సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. - రాత్రి 7 గంటలకు అమిత్ షా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. - రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరుతారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్న అమిత్ షా
-
‘చేవెళ్ల’ సభతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం!
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల బహిరంగ సభ వేదికగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అటు బహిరంగ సభ, ఇటు ముఖ్య నేతలతో సమీక్షలతో.. తెలంగాణలో అధికార సాధనపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీని గెలిపించడం ద్వారా అవినీతి, కుటుంబ పాలనకు తెరదించాలని.. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు సాగేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారని అంటున్నాయి. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీని సమాయత్తం చేయడం, కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా ఆదివారం అమిత్ షా పర్యటన సాగనుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలతో.. చేవెళ్ల సభలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లపై అమిత్‌షా ఎన్నికల యుద్ధాన్ని మొదలుపెట్టనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, బీఆర్ఎస్ సర్కార్, అధికార పార్టీ నేతల తీరుపై అమిత్‌షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని అంటున్నాయి. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను, కుటుంబ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలను లేవనెత్తుతారని పేర్కొంటున్నాయి. ఇక వచ్చే నెల 10న కర్ణాటకలో పోలింగ్ ఉన్నందున.. తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను కూడా ప్రభావితం చేసేలా చేవెళ్ల సభలో అమిత్‌షా ప్రసంగం ఉంటుందని నేతలు అంటున్నారు. ఆదివారం సంఘ సంస్కర్త బసవేశ్వర జయంతి నేపథ్యంలో లింగాయత్ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలా, కర్ణాటక ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లను బీజేపీకి అనుకూలంగా మలుచుకునేలా ప్రకటనలు ఉండొచ్చని చెప్తున్నారు. చేరికలు, ఇతర అంశాలపై స్పష్టత సభ అనంతరం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతో కీలక అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి చేరికలు, సంస్థాగత అంశాలపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు. అమిత్‌షా పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతుందని.. బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందని అంటున్నారు. ఇక ఆదివారం చేవెళ్ల సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేతలు మురళీధర్‌రావు, ఈటల రాజేందర్ ఇతర నేతలు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
'ఆర్ఆర్ఆర్' టీంతో భేటీ కానున్న అమిత్ షా
'ఆర్ఆర్ఆర్' టీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈనెల 23న హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నొవాటెల్ కు వెళ్తారు. అక్కడ 'ఆర్ఆర్ఆర్' టీమ్‌తో 4 గంటల నుంచి 4.30 వరకు తేనీటి విందులో పాల్గొంటారు. ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి సహా ఆర్ఆర్ఆర్ టీంను విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించనున్నారు అమిత్ షా. కాగా గతంలో ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ టీంతో అమిత్ షా భేటీ కానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అమిత్ షా చేవెళ్ల వేదికగా జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా ఆర్ఆర్ఆర్ టీంతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. -
TS: అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఈనెల 23వ తేదీన మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్ హోటల్లో ఆర్ఆర్ఆర్ టీంతో అమిత్ షా సమావేశం కానున్నారు. అమిత్ షా షెడ్యూల్ ఇదే.. - ఆదివారం(23న) మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. - మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. - సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్ఆర్ఆర్ మూవీ టీంతో సమావేశం అవుతారు. - సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతుంది. - సాయంత్రం 5.15 గంటలకు అమిత్ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు. - సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్ షా బహిరంగ సభలో పాల్గొంటారు. - తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు. పొలిటికల్ హీట్ పెంచిన అమిత్ షా పర్యటన.. అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను సవాల్ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
ఒక మర్రితో మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో 760 మర్రి చెట్లకు గండం
అదో జాతీయ రహదారి.. రోడ్డుకు ఇరువైపులా 760 మర్రి వృక్షాలున్నాయి.. ఇప్పుడు రోడ్డు విస్తరణతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి.. వాటిని ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.. అయితే ఆ కసరత్తు తర్వాత వాటి సంఖ్య కనీసం మూడు వేలు కాబోతోంది. ఎలా అంటే.. అదో ఆసక్తికర ప్రయోగం. సఫలమైతే అద్భుతం. ఇందుకు వేదిక అవుతున్న రోడ్డు హైదరాబాద్ శివారులోని ‘అప్పా’జంక్షన్ నుంచి చేవెళ్ల మీదుగా కొనసాగుతున్న బీజాపూర్ హైవే. సాక్షి, హైదరాబాద్: పట్నం.. 3,4 దశాబ్దాల క్రితం వరకు హైదరాబాద్‌ను తెలంగాణ పల్లెలు పిలుచు కునేపేరు. ఈ నగరానికి దారితీసే ప్రధాన రహదారులన్నీ మర్రి చెట్లతో పందిరి వేసినట్టు కనిపించేవి. రాజీవ్ రహదారి, నిజామాబాద్ రోడ్డు, ఓల్డ్ బొంబాయి హైవే, బెంగళూరు రోడ్డు, విజయవాడ హైవే, సాగర్ రోడ్డు, చేవెళ్ల రహదారి.. ఇలా అన్ని రోడ్లూ ఇరువైపులా ఊడలు దిగిన మర్రి వృక్షాలతో అద్భుతంగా కనిపించేవి. దారి వెంట వెళ్లేవారికి చల్లని నీడనిచ్చేవి. కానీ అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ ఆ మర్రి చెట్ల అంతానికి కారణమైంది. ఒక్క చేవెళ్ల రోడ్డు తప్ప అన్ని ప్రధాన రహదారుల్లో ఆ మహా వృక్షాలు మాయమయ్యాయి. ఇప్పుడు ఆ చేవెళ్ల రోడ్డును కూడా విస్తరించేందుకు సిద్ధమవుతుండటంతో.. ఎన్హెచ్ఐఏ పరిధిలోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ కూడలి వరకు 41 కి.మీ. పరిధిలో ఉన్న 760 మర్రి చెట్లు ప్రమా దంలో పడ్డాయి. అయితే ఆ చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేయకుండా, ట్రాన్స్‌లొకేట్ (పెకిలించి వేరే చోట నాటడం) చేయడం ద్వారా రక్షించాలని వృక్ష ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంస్థ ముందుకొచి్చ, వాటిని ట్రాన్స్‌లొకేట్ చేయటమే కాకుండా.. ఆ 760 చెట్లను దాదాపు ఐదు వేల వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. మర్రికి స్వతహాగా ఉండే లక్షణాన్ని ఇందుకోసం ఉపయోగించుకోనుంది. ఊడ చెప్పిన జాడ.. పిల్లల మర్రి.. మహబూబ్‌నగర్ పట్టణ శివారులో దాదాపు మూడెకరాల్లో విస్తరించిన మర్రి వనం. 500–750 ఏళ్ల వయసు దాని సొంతమని నిపుణులు అంటున్నారు. ఓ చెట్టు ఊడలు భూమిలో నాటుకుని మరో చెట్టుగా ఎదిగి.. అలా ఎకరాల్లో విస్తరించింది. కోల్‌కతాలోని ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్లో కూడా ఇంతే. దాదాపు 250 ఏళ్ల వయసున్న మర్రి.. పిల్లలుగా విస్తరించి ఓ చిన్నపాటి అడవిని తలపిస్తోంది. ఇది మర్రికి ఉన్న సహజసిద్ధ ప్రత్యేక లక్షణం. ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని ఒక చెట్టు నుంచి మరికొన్ని చెట్లను సృష్టించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘వటా ఫౌండేషన్’సిద్ధమవుతోంది. కొమ్మలే మరో చెట్టుగా.. మర్రిచెట్టు కొమ్మలు చాలా దూరం వరకు ఎదుగుతాయి. వాటికి ఊతంగా నేలకు దిగే ఊడలు మరో మొదలుగా మారతాయి. అలా విస్తరిస్తూ పోతాయి. ఇప్పుడు చేవెళ్ల రోడ్డుపై ఉన్న వృక్షాల్లో అలాంటి కొమ్మలను గుర్తించి వాటిని తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చోట పాతుతారు. ఆ కొమ్మ నుంచి వేర్లు ఎదిగేవరకు పోషణ చేపట్టి దాన్ని మరో చెట్టులా మారుస్తారు. అలా ఒక్కో చెట్టుకు ఉన్న అలాంటి కొమ్మల ఆధారంగా ఐదు నుంచి పదిపదిహేను వరకు విడదీస్తారు. ఇప్పటికే నేలను తాకి ఎదుగుతున్న ఊడలుంటే.. వాటిని కూడా తల్లి చెట్టు నుంచి వేరు చేసి మరో చెట్టుగా పాతుతారు. ఆ ఆలోచన అప్పటిది.. రెండేళ్ల కింద గోవాలో వందేళ్ల వయసున్న మర్రి వృక్షం కూలిపోతే.. దాన్ని రక్షించాలంటూ స్థానికులు ఈ ఫౌండేషన్‌ను సంప్రదించారు. అక్కడికి వెళ్లిన దాని నిర్వాహకుడు ఉదయ్‌కృష్ణ.. దానికి వేళ్లూనుకున్న ఊడల కొమ్మలు గుర్తించి స్థానికుల సాయంతో జాగ్రత్తగా వేరు చేసి విడివిడిగా నాటితే అవి కొత్త చెట్లుగా ఎదగటం ప్రారంభించాయి. కొందరు స్థానికులు డ్రమ్ముల్లో మట్టి నింపి చిన్నచిన్న కొమ్మలను నాటి ఎదిగేలా చేశారు. అప్పటి నుంచే ఇలా ఒక చెట్టు నుంచి మరిన్ని చెట్లు సృష్టించొచ్చన్న ఆలోచన ఆ సంస్థలో ప్రారంభమైంది. గతేడాది సిరిసిల్లలో కూడా ఓ మర్రి వృక్షం పడిపోతే, దాన్ని ట్రాన్స్‌లొకేట్ చేసే క్రమంలో మూడు చోట్ల వేరువేరు కొమ్మలు నాటారు. అందులో రెండు వేళ్లూనుకున్నాయని ఉదయ్‌కృష్ణ తెలిపారు. ఈ క్రమంలోనే చేవెళ్ల రోడ్డులో ఉన్న చెట్లను వేల సంఖ్యలోకి మార్చే ప్రయోగానికి ఆయన సిద్ధమయ్యారు. చేవెళ్ల మర్రి రాష్ట్రం అంతటా.. ‘‘అప్పట్లో రోడ్లకిరువైపులా మర్రి చెట్లు ఉండే పద్ధతి కనుమరుగైంది. కానీ చేవెళ్ల రోడ్డుకు ఇంకా ఆ శోభ ఉంది. దాన్ని విస్తరించనుండటంతో అవి కూడా మాయం కానున్నాయి. కానీ అలా కానీయకూడదు. వాటిని కాపాడాలి. కొందరు ఔత్సాహికులు వాటి ట్రాన్స్‌లొకేషన్‌కు వీలుగా స్థలాన్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తల్లి చెట్టు నుంచి పిల్ల చెట్లను వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో నాటి ఆ వృక్ష సంపదను కాపాడాలన్నది ఆలోచన. చేవెళ్ల రోడ్డుపై వందల సంఖ్యలో ఉన్న మర్రిని వేల సంఖ్యలోకి మార్చి.. ఆ చెట్ల వరసకు గుర్తుగా రాష్ట్రమంతటా వాటిని నాటి పెంచాలన్నది ఆలోచన. భావితరాలకు ఇది గొప్ప కానుక అవుతుంది’’ – ఉదయ్‌కృష్ణ, వటా ఫౌండేషన్ నిర్వాహకులు చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్ -
ధరణిపై దండుగా కదలాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో భూములు రీ సర్వే చేస్తేనే ధరణి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో శనివారం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్), గ్రామీణ న్యాయపీఠం సంస్థ, తెలంగాణ సోషల్‌మీడియా ఫోరం, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కలెక్టరేట్ వరకు తీసుకుపోయిందని ఆరోపించారు. ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాసపత్రిక సంపాదకులు వి.లచ్చిరెడ్డి, సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్ నాయకులు కోదండరెడ్డి, బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం!
మేకల పెంపకంలో పదేళ్ల అనుభవంతో స్థిరమైన నికరాదాయం పొందుతూ.. జీవాల పెంపకంపై ఆసక్తి చూపే రైతులకు మార్గదర్శిగా నిలిచారు మూల మహేందర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడ గ్రామంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఆయన మేకలతో పాటు నాటు కోళ్లను పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఉచితంగా శిక్షణ ఇస్తూ వందలాది మంది రైతులకు తోడ్పాటునందిస్తున్నారు. జీవాల పెంపకంపై పూర్తి అవగాహన కలిగించుకొని, మక్కువతో పెంపకం చేపడితే వంద శాతం లాభాలు పొందుతారని నిక్కచ్చిగా చెబుతున్నారాయన. రైతు కుటుంబంలో పుట్టిన మహేందర్‌రెడ్డి బీఎస్సీ చదివి, కొంతకాలం బోర్వెల్ రంగంలో పనిచేశారు. 2005లో 14 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. తదనంతర కాలంలో వ్యవసాయంతోపాటు జీవాల పెంపకం కూడా తోడైతేనే నిరంతరం రైతుకు ఆదాయం వస్తుందని గ్రహించిన ఆయన మేకల పెంపకం వైపు దృష్టి సారించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి శిక్షణ, ప్రోత్సహకాలు లేకపోవటంతో సొంతంగానే అనేక రాష్ట్రాల్లో తిరిగి పరిశోధన చేశారు. గోట్ ఫార్మింగ్ పరిజ్ఞానం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సొంత ఖర్చులతో పర్యటించారు. స్థానిక రైతులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సక్సెస్ సాధిస్తామనే ధీమా ఎవరూ కల్పించలేకపోయారు. అయినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో మేకల పెంపకం చేపట్టారు. ∙ఎలివేటెడ్ షెడ్లో విశ్రమిస్తున్న మేకలు ఎకరంలో షెడ్లు, మూడెకరాల్లో మేత... ప్రభుత్వ సబ్సిడీ పథకాలు సైతం లేక సొంతం గానే 2013లో 65 మేకలతో పాక్షిక సాంద్ర పద్ధతిలో మహేందర్‌రెడ్డి మేకల పెంపకం ప్రారంభించారు. రూ. 13 లక్షలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో షెడ్లు నిర్మించారు. మహేందర్‌రెడ్డి మూడేళ్లు కష్టపడి మేకల సంఖ్యను 250కు పెంచారు. 1 ఎకరంలో షెడ్లు, నివాస భవనం నిర్మించారు. షెడ్డులో మేకలను నేలపైన కాకుండా.. మీటరు ఎత్తున చెక్కలతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించి, దానిపై మేకలు విశ్రమించేలా ఏర్పాటు చేశారు. పెంటికలు చెక్కల సందుల్లో నుంచి నేల మీద పడిపోతాయి. మేకలకు గాలి, వెలుతురు చక్కగా తగులుతుంది. షెడ్‌కు పక్కనే చుట్టూ ఇనుప కంచెతో దొడ్డిని ఏర్పాటు చేశారు. మేకలు అక్కడ ఆరుబయట ఎండలో తిరుగుతూ మేత మేస్తాయి. మరో మూడు ఎకరాలు మేకలకు కావాల్సిన పచ్చిగడ్డి సాగుకు ఉపయోగిస్తున్నారు. ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ. 65–75 వేల నికరాదాయం, ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం పొందుతూ మేకల పెంపకంలో పదేళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫామ్ వద్ద ఉచితం శిక్షణ తరగతులు ప్రతి శనివారం ఉచిత శిక్షణ మేకల పెంపకానికి ముందుకొచ్చే వారికి ఇప్పటికీ ప్రభుత్వపరంగా శిక్షణా కేంద్రాలు అందుబాటులో లేవు. ఈ లోటు భర్తీ చేయడానికి మహేందర్‌రెడ్డి సేవాభావంతో ముందుకొచ్చారు. సీనియర్ రైతుగా తన అనుభవాలను పంచాలనే ఆలోచనతో ప్రతి శనివారం తన ఫామ్ దగ్గరే ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పద్ధతులను 3 గంటల పాటు సవివరంగా బోధిస్తున్నారు. ఆయన పట్టుదల, నైపుణ్యం గుర్తించిన వెటర్నరీ శాఖ ఔత్సాహిక రైతులను ఆయన ఫామ్‌కు క్షేత్రపర్యటనకు తీసుకురావటం ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు, అగ్రి, ఫుడ్ బిజినెస్ విద్యార్థులు ఆయన వద్ద అనుభవపాఠాలు నేర్చుకుంటున్నారు. వెటరర్నీ ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు కోకొల్లలు. వ్యవసాయ కళాశాలలో అనేక సదస్సుల్లో ఆయన సుసంపన్నమైన తన అనుభవాలను పంచుతూ ఉంటారు. 2015లో రైతునేస్తం, 2016లో సీఆర్ఐడీఏ, 2018లో ఐసీఏఆర్ ఉత్తమ ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారాలు లభించాయి. మేకల పెంపకంలో మెలకువలు కొత్తగా గోట్ ఫార్మింగ్ చేపట్టే రైతులకు మహేందర్‌రెడ్డి చెబుతున్న సూచనలు: ►ఒక మేక సగటున రెండేళ్లలో మూడు ఈతల్లో ఈతకు రెండు పిల్లల చొప్పున ఇస్తుంది. ఒక మేక పిల్ల అమ్మకానికి రావడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. చిన్న పిల్లల పోషణను అశ్రద్ధ చేయకుండా మరణాల రేటు తగ్గించాలి. ►కనీసం 25 కేజీల బరువు ఉన్న మేకలనే అమ్ముకోవాలి. మార్కెటింగ్‌లో జీవాలను ఫారంలోనే అమ్ముకోవటం లాభాదాయంకంగా ఉంటుంది. నాణ్యమైన మేకల పెంపకమే నోటి ప్రచారంగా పనిచేస్తుంది. ►మేకల పెంపకాన్ని యాంత్రికంగా కాకుండా మనసుపెట్టి ఇష్టంగా చేస్తేనే వంద శాతం సక్సెస్ చేకూరుతుంది. ►ముందు జాగ్రత్త చర్యలను, యాజమాన్య మెలకువలు మక్కువతో పాటిస్తే.. 90 శాతం మందులు లేకుండానే మేకల సంతతిని పెంచుకుంటూ పోవచ్చు. ►మేలు రకం మేకల ఉత్పత్తితోనే లాభాలు వస్తాయి. మేకల ఉత్పత్తిలో తల్లి, తండ్రి మేకల నాణ్యత ముఖ్యం. ►పోషక విలువలు ఉండే నాణ్యమైన మేతలను మేకలకు కడుపునిండా అందించటంతో నాణ్యమైన మేకల ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు సాధ్యం. ►సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం ఎంతో మేలు. సగం ఎండు మేత, సగం పచ్చి మేతలను అందించాలి. ►ఇరుకుగా కాకుండా అవసరమైన విస్తీర్ణం మేరకు షెడ్ల నిర్మాణం, పరిశుభ్రత, చూడి మేకల, పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలివేటెడ్ షెడ్లు నిర్మించాలి. సీజన్‌కు తగిన రీతిలో షెడ్ల నిర్వహణ ఉండాలి. ►మేకల పెంపకంలో రైతు సక్సెస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్య లోపం రానివ్వకూడదు. జీవాలకు పోషక విలువలతో కూడిన మేతను కమం తప్పకుండా అందించాలి. మేకల రైతుల సేవలో.. నా ఫామ్‌లో 250 మేకలున్నాయి. వీటి పెంపకానికి మొత్తం 4 ఎకరాల భూమిని ఉపయోగిస్తున్నా. ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ 250 మేకలను పెంచుతున్నా. మేకల పెంపకంతోపాటు నాటు కోళ్ల పెంపకం చేపట్టా. 20 కోళ్లతో ప్రారంభించా. ఇప్పుడు 100కు చేరాయి. వీటిని 500లకు పెంచేందుకు కృషి చేస్తున్నా. మేకలు, కోళ్ల పెంపకానికి మొత్తంగా ఏడాదికి ఈ సుమారు రూ. 6 లక్షల ఖర్చు అవుతుంటే దాదాపు రూ. 14–15 లక్షల ఆదాయం వస్తున్నది. ఖర్చులు పోను ఏడాదికి సుమారు రూ. 8–9 లక్షల నికరాదాయం సంపాదిస్తున్నా. నా అనుభవాలను అందరికీ అందించి సహాయ పడాలనే ఆలోచనతో ఏడేళ్లుగా ప్రతి శనివారం ఉచితంగా ఫామ్ దగ్గరే రైతులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా. వారికి ఎప్పుడు ఏ సమాచారం కావాల్సినా ఫోన్లో అందిస్తూ వస్తున్నా. నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ సేవ కొనసాగిస్తునే ఉంటాను. రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తా. ఏడాదిలో 365 రోజులూ మేక మాంసానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలకు ప్రతి రోజు సగటున 7–8 వేల మేకల అవసరం ఉంటుందని అంచనా. ప్రభుత్వపరంగా కూడా జీవాల పెంపకంలో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మేకల పెంపకంపై అవగాహన, ఇష్టమే విజయ సోపానమవుతుంది. – మూల మహేందర్‌రెడ్డి (8008639618), ఆదర్శ మేకల పెంపకందారుడు, సింగప్పగూడ, చేవెళ్ల మం., రంగారెడ్డి జిల్లా – ఎస్.రాకేశ్, సాక్షి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా సాగుబడి నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు! -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్‌పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్‌పై ఆలూరు నుంచి గేట్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..
చేవెళ్ల: అర్థరాత్రి ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని భర్త మందలించటంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలు... చేవెళ్ల మండలంలోని కమ్మెట గ్రామానికి చెందిన బండ మహేశ్ వ్యవసాయం చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య బండ అమృత (19) బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుతుండటం చూసి ఈ సమయంలో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావని మందలించాడు. అంతే వెంటనే ఫోన్ కట్ చేసి పడుకుంది. భర్త మరో గంట తర్వాత లేచి చూసేసరికి భార్య కనిపించలేదు. బెడ్రూం డోర్ గడియ బయట నుంచి పెట్టి వెళ్లిపోయింది. ఎలాగోలా బయటకు వచ్చిన భర్త మహేశ్ చుట్టుపక్కల ఎంత వెతికిన కనిపించలేదు. ఆమె ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేయగా ఒకసారి రింగ్ అయి తర్వాత మళ్లీ చేస్తే స్విచ్ఆఫ్ వస్తుందని తెలిపారు. దీంతో గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించటం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పెళ్లి బంధంతో ఒక్కటైన మూగ జంట) -
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్‌లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
పెళ్లై రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదని..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లి జరిగి రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదన్న మనస్తాపంతో తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన చేవెళ్ల మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీగూడకు చెందిన కొలన్ శేఖర్‌రెడ్డికి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(30), కూతురు మాధవి ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మాధవికి రెండేళ్ల కిత్రం శంకర్పల్లి మండలం సింగపూర్ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డితో వివాహం జరిపించారు. కొంత కాలంగా అదనపుకట్నంతో పాటు భూమి కూడా ఇవ్వాలని భర్త నుంచి వేధింపులు పెరిగాయి. పలుమార్లు గ్రామ పెద్దల సమయంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మాధవి ఆరోగ్యం కూడా క్షీణించడంతో అక్క జీవితం ఏమవుతుందోనని శ్రీకాంత్‌రెడ్డి మదనపడసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు డ్రిప్ పైపుతో ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా -
దమ్ముంటే చేవెళ్ల నుంచి పోటీ చెయ్: రంజిత్‌రెడ్డి
పరిగి: ‘దమ్ముంటే రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చెయ్. నేనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తా. నువ్వో నేనో తేల్చుకుందాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మన ఊరు– మన పోరు’లో రేవంత్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి పరిగిలో మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అవును నా వ్యాపారం పౌల్ట్రీ. గుడ్లు అమ్ముకుంటే తప్పేముంది. చేవెళ్ల ఏ ప్రభుత్వం హయాం లో అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించిందో చర్చ చేద్దాం’ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గొప్పగా రూపొందించారని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్, ఎంపీ, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాం గ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దేవుని మాన్యాల కబ్జా లను నిరూపించాలన్నారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి
సాక్షి, చేవెళ్ల: అతివేగం, అజాగ్రత్త ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. పలువురికి గాయాలవగా.. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చేవెళ్ల మండలంలోని కేసారం బస్‌స్టేజీ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తల్లీకూతుళ్లతో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, బాదితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్‌లోని లింగపల్లి మయూరినగర్‌కు చెందిన భార్యభర్తలు రవికుమార్, స్రవంతి(30) తమ ఇద్దరు కూతూళ్లు మోక్ష, ధ్రువిక(5)తో కలిసి ఆల్టో కారులో హైదరాబాద్ నుంచి తాండూరు (కరన్‌కోట్) వెళ్తున్నారు. రవికుమార్ తాండూరు సమీపంలోని సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఫ్యాక్టరీకి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్నాడు. చేవెళ్ల మండలంలోని కేసారం గేట్‌వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా.. వీరి ముందున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు రోడ్డు పక్కకు వెళ్లిఆగిపోయింది. అదే వేగంతో ఉన్న ఇన్నోవా.. స్విఫ్ట్ వెనకాలే వస్తున్న రవికుమార్ ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టగా.. ఇన్నోవా కారు రోడ్డుపై బోల్తాపడింది. బోల్తాపడిన ఇన్నోవా కారును ఆ వెనకాలే వస్తున్న మరో ఇన్నోవా కారు ఢీకొట్టినా.. ఇందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదమేమీ జరగలేదు. ఆల్టోలో ఉన్న రవికుమార్‌తో పాటు మోక్షకు తీవ్రగాయాలయ్యాయి. పక్కసీట్లో కూర్చున్న స్రవంతి, ధ్రువిక కారులోనే ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందారు. చదవండి: మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్ బోల్తాపడిన ఇన్నోవా కారులో సయ్యద్ ఫైజల్(21) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఇందులో ప్రయాణిస్తున్న యువకులు జాఫర్, అలీ, రిజ్వాన్, అన్వర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడనుంచి పలువురు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి.. పార్టీకోసం వెళ్లి.. ఇన్నోవాకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు ఆదివారం చేవెళ్లలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకోసం హాజరయ్యారు. రాత్రి అక్కడే ఉండి విందు చేసుకుని, ఉదయాన్నే హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. బర్త్ డే కోసం వచ్చి.. రవికుమార్ చిన్న కూతురు ధ్రువిక పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఉండే తల్లిదండ్రులు, అత్తామామల వద్దకు వచ్చాడు. హైదరాబాద్‌లోని మయూరినగర్‌లోని లింగంపల్లి వీరి స్వస్థలం. ఉద్యోగ రీత్యా తాండూరులో ఉంటున్న రవికుమార్ కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం శనివారం తమ తల్లిదండ్రులు ఉండే లింగపల్లి చేరుకున్నారు. ఆదివారం చార్మినర్ ప్రాంతంలోని అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడ రాత్రి ఉన్నారు. తిరిగి సోమవారం ఉదయం ఉద్యోగంకోసం తాండూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రవికుమార్, పెద్ద కూతురు మోక్షలు గాయాలతో బయటపడగా.. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని వెళ్తున్న చిన్న కూతురు ధ్రువిక, భార్య మృతిచెందారు. -
ఒకదానివెనుక మరోటి.. నుజ్జునుజ్జయిన 7 కార్లు
చేవెళ్ల: అతివేగం.. ఏడు కార్లను ధ్వంసం చేయగా పలువురిని గాయపడేలా చేసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు–అంతారం బస్‌స్టేజీల మధ్య చోటు చేసుకుంది. చేవెళ్ల నుంచి ఆదివారం వికారాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న ఆరుకార్లు అంతే వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టాయి. కార్లు నుజ్జునుజ్జాయంటే ఏ మేరకు వేగంతో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయలయ్యాయి. ఓ కారులో ఉన్న బాలుడి చేయికి, కాలికి.. ఓ మహిళ తలకు గాయమైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై నుంచి కార్లను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు త్వరగా జరిగితేనే ప్రమాదాల నివారణ సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన చేవేళ్ల ఎమ్మెల్యే
సాక్షి, చేవెళ్ల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైవీ సుబ్బారెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో బుధవారం టీటీడీ చైర్మన్ ఇంట్లో ఆయను కలిసిన ఎమ్మెల్యే పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేయాలని టీటీడీ చైర్మన్‌ను కోరినట్లు వివరించారు. అలాగే నియోజకవర్గంలో పలు ఆలయాల జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తప్పకుండా మండపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారన్నారు. -
ప్రజాసమస్యలు నేను చూపిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ అంతా ఎంతో సుభిక్షంగా ఉందని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదేపదే చెబుతున్నారు. నేను పాదయాత్రకు వెళ్తున్నా..దమ్ముంటే నాతో కలిసి పాదయాత్రకు రండి. చేసిన అభివృద్ధిని మీరు చూపించండి. ప్రజా సమస్యలను నేను చూపిస్తా. మీరు చెప్పినట్లు తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే..నా ముక్కు నేలకురాసి, ఇంటికెళ్లిపోతా. అదే సమస్యలున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్, మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేస్తారా?..’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బుధవారం చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల కు, హత్యలకు కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల. చిత్రంలో వైఎస్ విజయమ్మ తదితరులు నిధులు ఆయన ఇంటికి : ‘దివంగత నేత వైఎస్సార్ హయాం లో రూ.33 వేల కోట్ల అంచనాతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసం రీడిజైన్ చేసి, లక్షా 33 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు కేసీఆర్ ఇంటికెళ్లగా..నీళ్లు ఆయన ఫాంహౌస్‌కు, నియామకాలు ఆయన కుటుంబసభ్యులకు వెళ్లాయి. ప్రజా సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పాదయాత్రను ప్రారంభిస్తున్నా..’ అని షర్మిల చెప్పారు. కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉంది. ఆయన రాహుల్ మాట వినక పోయినా..కేసీఆర్ మాట వినితీరాల్సిందే. కేసీఆర్ అవినీతి చిట్టా చేతిలో ఉందంటూ బీజేపీ అధినేత బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దు..’ అని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు తల్లి విజయమ్మ సహా షర్మిల సభావేదికపైకి చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం తొలుత విజయమ్మ, ఆ తర్వాత షర్మిల మాట్లాడారు. అనంతరం విజయమ్మ పాదయాత్రను ప్రారంభించి, షర్మిలను ఆశీర్వదించారు. కాగా ఎర్రోనికోటాల, కందవాడ, నారాయణదాసుగూడల మీదుగా చేవెళ్ల–మెయినాబాద్ శివారులోని నక్కలపల్లి బస కేంద్రానికి సాయంత్రం 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. తొలిరోజు మొత్తం పది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అప్పగిస్తున్నా.. ఆశీర్వదించండి: విజయమ్మ పాదయాత్ర ప్రారంభ సభలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ‘చేవెళ్లకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర సహా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు కూడా ఈ గడ్డ నుంచే ప్రారంభించారు. ఆయన అడుగులో అడుగు వేసేందుకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఆయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ షర్మిలను మీకు అప్పగిస్తున్నా. మీరంతా ఆమెకు అండగా నిలవండి. ఆశీర్వదించండి..’ అని పిలుపునిచ్చారు. -
చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
-
మర్రి.. వర్రీ..
మండే ఎండల్లో కూడా భాగ్యనగర ప్రాంతం చల్లగా ఉండేదట. ఏప్రిల్‌లో కూడా మంచు కురిసేదని ఇప్పటికీ చెబుతుంటారు. రోడ్లకిరువైపులా అశోకుడు చెట్లను పెంచిన తీరును కాకతీయులు కొనసాగించారు. హైదరాబాద్‌లో ఆ సంప్రదాయాన్ని రెండో నిజాం కూడా కొనసాగించారు. వారి హయాంలో నగరం చుట్టూ అన్ని ప్రధాన రహదారులపై వేల సంఖ్యలో మర్రి వృక్షాలు పెంచారు. నగరానికి దారితీసే అన్ని మార్గాల్లో పందిరి వేసినట్టుగా ఎదిగిన మర్రి వృక్షాలు చల్లటి వాతావరణాన్ని పంచేవి. రహదారుల విస్తరణతో రోడ్లపై ఉన్న వృక్షాలన్నీ కాలగర్భంలో కలిసిపోగా, మిగిలిన ఏకైక రోడ్డు కూడా ఆ జ్ఞాపకాన్ని కోల్పోబోతున్నది. సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయరహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలో ఉన్న మన్నెగూడ కూడలి వరకు దీన్ని 60 మీటర్ల వెడల్పుతో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో అభివృద్ధి చేయనున్నారు. రూ.929 కోట్లతో విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచింది. రెండుమూడు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ శుభవార్తనే. కానీ ఆ రోడ్డులో విస్తరించి ఉన్న ఊడల మర్రి వృక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవ లం 46 కి.మీ. దూరంలో 890 మర్రిచెట్లున్నాయి. ఇవన్నీ 80 నుంచి నుంచి వంద ఏళ్ల వయసున్న వృక్షాలు. వీటిని తొలగిస్తే, నగరంతో పెనవేసుకున్న నిజాం కాలం నాటి ఊడల మర్రులన్నీ అంతరించినట్టే. రెండేళ్లుగా కసరత్తు.. ఈ రోడ్డును విస్తరించనున్నట్టు ప్రభుత్వం గత ఐదారేళ్లుగా చెబుతోంది. రెండేళ్ల కిందటే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. మన్నెగూడ నుంచి పరిగిమీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరించింది. మన్నెగూడ వరకు నాలుగు వరుసల విస్తరణ బాధ్యత మాత్రం ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్నందున, కేంద్రప్రభుత్వం రెండేళ్లకిందట ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. అప్పటినుంచి అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ వృక్షాలను తొలగించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. దీంతొ స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వటా ఫౌండేషన్ అనే సంస్థ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఫిర్యాదు చేయడంతో, తాత్కాలింగా ఆ వృక్షాల తొలగింపు నిలిచిపోయింది. వాటిని పరిరక్షిస్తామని కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనుమానాలెందుకు? ప్రత్యామ్నాయం ఏమైంది? వృక్షాలను తొలగిస్తే పర్యావరణానికి భారీ చేటు తప్పదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం వేడెక్కకుండా కాపాడుతూ, ప్రాణవాయువునిచ్చే చెట్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నగరం చుట్టూ వందేళ్ల వయసుండే వృక్షాలు మాయమైన నేపథ్యంలో, ఈ కొద్ది వృక్షాలనైనా కాపాడుకోవాలి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో వాటిని మరో చోట నాటాల్సి ఉంది. ఇప్పుడు చేవెళ్ల రోడ్డు విస్తరణలో ఈ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. కానీ గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ట్రాన్స్‌లొకేషన్‌ను ప్రక్రియను అధికారులు అమలు చేయలేదు. భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో చేవెళ్ల రోడ్డుపై ఉన్న భారీ వృక్షాల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు వ్యయంలో చెట్ల తరలింపు ఖర్చు.. ఈ రోడ్డు విస్తరణకు కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లను కేటాయించింది. ఇందులో చెట్ల ట్రాన్స్‌లొకేషన్ ఖర్చులను కూడా చేర్చింది. సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములను గుర్తించి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేయాలనేది ఆలోచన. వృక్షాలను పరిశీలించి వాటిల్లో ట్రాన్స్‌లొకేట్ చేస్తే బతికేవాటిని గుర్తించి తరలిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ‘కొన్నింటికే పరిమితం చేస్తారేమో’ పెద్ద సంఖ్యలో ఉన్న చెట్లను తరలించటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకు తగ్గ ఉపకరణాలు కూడా అందుబాటులో లేవు. సచివాలయ నిర్మాణ సమయంలోనూ చాలా చెట్లను కొట్టేశారు. ఇక గండిపేట రోడ్డు విస్తరణలో, తరలింపునకు యో గ్యమైన చెట్లను కూడా నరికేశారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల రోడ్డుపైనా కొన్ని వృక్షాలనే ట్రాన్స్‌లొకేషన్‌కు గుర్తించి మిగతావాటిని నరికేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ‘‘ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియలో ఉచితంగా సేవలందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సాంకేతిక, ఆర్థిక సహకారం అందించి, స్థలాలు చూపితే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం’’ అని వటా ఫౌండేషన్ నిర్వాహకులు ఉదయ్‌కృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. కాల్చి.. కూల్చి ఈ రోడ్డుపై భారీ వృక్షాలున్నందువల్ల వాటిని తొలగించటం ఇష్టంలేక రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పడేకేసిందంటూ గతంలో ఓ అభిప్రాయం వ్యాపించింది. రోడ్డు విస్తరిస్తే భూములకు డిమాండ్ పెరుగుతుందని, కొందరు రియల్ వ్యాపారులు రైతులను ఎగదోసి మర్రి చెట్లను కూల్చే కుట్రకు తెరదీశారు. రాత్రికి రాత్రి వృక్షాల మొదళ్ల చుట్టూ మంటలు పెట్టి కాల్చివేయించారు. దీంతో చూస్తుండగానే వృక్షాలు నేలకొరిగాయి. ఇలా ఏడాదిన్నరలో ఏకంగా వంద మర్రి చెట్లను కూల్చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కాల్చివేతలు కొనసాగుతున్నాయి. -
అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ జనానికి గుండె ధైర్యం కల్పిస్తూ అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో చేవెళ్ల నుంచే తన యాత్ర మొదలవుతుందని, అక్కడే ముగుస్తుందని ఆమె వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో ప్రజా ప్రస్థానం పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర స్వరూపాన్ని, ఉద్దేశాన్ని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మినహా.. 90 నియోజకవర్గాల్లో ప్రతీ పల్లెను, గడపనూ తాకుతూ ఏడాదికిపైగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర మొత్తం తాను రోడ్డు పక్కే ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతోనే మమేకమవుతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆలకించేందుకే సమయం కేటాయిస్తానని చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలూ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది కౌలు రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చాక దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని తెలిపారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. పాదయాత్రలకు వైఎస్సార్ కుటుంబమే పెట్టింది పేరని, వైఎస్సార్ పాదయాత్రలోంచే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పుట్టాయని చెప్పిన షర్మిల.. వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చే దాకా.. పాదయాత్రలోనూ మంగళవారం దీక్షలు కొనసాగుతాయని షర్మిల చెప్పారు. -
అక్టోబర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర
-
అక్టోబర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. గత ఏడేండ్ల కేసీఆర్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, సీఎం కేసీఆర్ మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేవలం 3 లక్షల మందికే మాఫీ చేసి, 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో 91 శాతం మంది రైతులకు కనీసం రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. ఈ లెక్కన రైతులందరూ అప్పులపాలయ్యారని వైఎస్ షర్మిల అన్నారు. చదవండి: గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే! ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు: వైఎస్ షర్మిల -
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది: రాఘవరెడ్డి
చేవెళ్ల: ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కార్యాలయాన్ని బుధవారం కో-కన్వీనర్ కోరని దయానంద్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇంకా 34 లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది అని తెలిపారు. వర్గీకరణ వైఎస్సార్ కల అని చెప్పారు. మంద కృష్ణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ జరిగి ఉండాలని.. కానీ పాలకుల నిర్లక్ష్యంతో జరగలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కోరని ఉదయ్ కిరణ్, పంబాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్న పెద్దకర్మ రోజే తమ్ముడి మృతి
సాక్షి, చేవెళ్ల: అన్న పెద్ద కర్మరోజున తమ్ముడు వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని హస్తేపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం... హస్తేపూర్ గ్రామానికి చెందిన కుంటనోళ్ల అనంతయ్య అనారోగ్యంతో వారం రోజుల కిందట మృతి చెందాడు. దీంతో శుక్రవారం ఆయన కుటుంబసభ్యులు దశదిన కర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. మృతుడి తమ్ముడు కుంటనోళ్ల సాయన్న (52) గుండు చేయించుకుని పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావిలో దూకిన అతడు ఈత కొడుతూనే మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు బావిలో వెతికారు బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో అతన్ని పైకి తీయలేకపోయారు. సాయంత్రానికి మృతదేహం నీటిపై తేలింది. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సాయన్న భౌతికకాయానికి నివాలులరి్పంచారు. -
బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడవద్దంటూ తల్లి మందలించినందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన టి.శివశంకర్, పుష్పలత దంపతుల కూతురు సుప్రియ (18) మొయినాబాద్ మండలంలోని గ్లోబల్ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. ఇటీవల సుప్రియ ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి పుష్ప లత బుధవారం ఉదయం కూతురును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సుప్రి య.. బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు బెడ్రూమ్లో నుంచి ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చి లోపలికివెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించింది. తల్లి కేకలు వేయడంతో పక్కనున్నవారు వచ్చి చూడగా అప్పటికే సుప్రియ మృతిచెందింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సూరీడుపై హత్యాయత్నం) -
బిగ్ షాక్: కాంగ్రెస్‌కు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పార్టీ వీడతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెర దించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. అనంతరం బీజేపీలో చేరనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేవెళ్ల టికెట్‌పై హామీ రావడంతోనే ఆయన కాంగ్రెస్‌కు బై చెప్పేశారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటు కూడా వినియోగించుకున్నారు. ఆ తెల్లారే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. పారిశ్రామికవేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2013లో రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అనంతరం 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే 2018లో అకస్మాత్తుగా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొండా కుటుంబానికి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి. ఆయన తెలంగాణలో రజాకార్లతో పోరాడారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. కొండా దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా పౌరసత్వం ఉండి ఎంపీగా పని చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. After a hectic time campaigning, I will be taking a break for a week and may not be very active on Twitter for a week or so. However I may organize a meeting with Tweeple on this Sunday. In the meantime I will leave with a thought to think about, with a tweet later today. — Konda Vishweshwar Reddy (@KVishReddy) March 15, 2021 -
కారు డిక్కీలో కరెన్సీ కట్టలు..
సాక్షి, చేవెళ్ల: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారులు ఓ కారు డిక్కీలో తరలిస్తున్న రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారు డిక్కీలో రూ. 60 లక్షలు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నగదు గురించి ఆరా తీయగా.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినవిగా తెలిసింది. దీంతో పట్టుబడిన నగదును రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అనంతరం నగదును సీజ్ చేసి వివరాలు అందించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
సాక్షి, చేవెళ్ల: మద్యం మత్తులో ఓ తల్లి.. మహిళాలోకం తలదించుకునేలా వ్యవహరించింది. తాగిన మైకం లో మామతో గొడవపడిన ఆమె.. తన కోపాన్ని కన్నకొడుకుపై చూపించింది. కొడుకు మారాం చేస్తున్నాడని విచక్షణ కోల్పోయి పసివాడిని గొంతు నులిమి హత్య చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నగూడకు చెందిన దుంస శివకుమార్, పరమేశ్వరి దంపతులకు ఓ కూతురు, కొడు కు ధనుష్‌కుమార్(2) ఉన్నారు. భార్యాభర్తలు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శివకుమార్ ఒగ్గుకథల కార్యక్రమాల్లో డోలు కూడా వాయించేవాడు. అయితే మద్యానికి బాగా అలవాటుపడిన శివకుమార్ ఇటీవల కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. పరమేశ్వరి కూడా గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ మత్తుకు బానిసైంది. దీంతో ఇద్దరూ మద్యం మత్తులో రోజూ ఇంట్లో గొడవ పడుతుండేవారు. గొంతు నులిమి.. మంగళవారం డోలు వాయించే పనిమీద శివకుమార్ వేరే గ్రామానికి వెళ్లాడు. పరమేశ్వరి తాగిన మత్తులో రాత్రి సమయంలో ఇంటి పక్కనే ఉండే మామ వెంకటయ్యతో గొడవపడింది. ఇద్దరూ మాటామాట అనుకున్నారు. కోపంలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లింది. పిల్లలు మారాం చేస్తుండటంతో క్షణికావేశానికి గురైన పరమేశ్వరి విచక్షణ కోల్పోయి కొడుకు ధనుష్‌కుమార్ గొంతునులిమి హత్య చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లో పిల్లల శబ్దం వినిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కనే ఉండే కుటుంబీకులు వచ్చి చూడగా బాలుడు ధనుష్ విగతజీవిగా కనిపించాడు. చదవండి: (భర్తతో గొడవ.. బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన తల్లి) ఏమైందని పక్కనే మత్తులో కూర్చున్న తల్లి పరమేశ్వరిని అడిగితే.. గొడవచేస్తున్నాడని గొంతు నులిమి చంపేశానని చెప్పటంతో ఆందోళనకు గురైన పక్కింటివారు 100కు ఫోన్ చేయడంతో చేవెళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పరమేశ్వరిని ప్రశ్నించగా మామ వెంకటయ్యతో గొడవ పడ్డానని.. ఇంట్లోకి కోపంగా వచ్చిన తనను పిల్లలు సతాయించడంతో కొడుకు గొంతు నులిమి చంపానని అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులోనే తండ్రి ఈ సంఘటనతో పోలీసులు బాలుడి తండ్రి శివకుమార్‌కు ఫోన్ చేయగా అతను స్పందించలేదు. బుధవారం బంధువులు, గ్రామస్తులు గాలించగా చేవెళ్లలో కనిపించాడు. జరిగిన విషయం అతనికి చెప్పగా.. తాగిన మైకంలో ఉండటంతో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో శివకుమార్‌ను ఆస్పత్రిలో చేర్చారు. -
మందిర నిర్మాణానికి మహమ్మద్ విరాళం
మొయినాబాద్ (చేవెళ్ల): అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఓ ముస్లిం యువకుడు విరాళం అందజేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజగూడలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీమ్ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేలు విరాళం అందజేశాడు. దీనిపై బీజేపీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విరాళాల సేకరణలో కులమతాలకు అతీతంగా స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్) ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికై రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాలను సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు సహా ఇతర రంగాల సెలబ్రిటీలు మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. -
రంగారెడ్డి: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న కారు, ఏడుగురు మృతి
సాక్షి, రంగారెడ్డి: మరికొద్ది సేపట్లో సోదరుని ఇంటికి చేరుకుంటున్నామన్న పాతబస్తీవాసుల సంతోషాన్ని విధి చిన్నచూపు చూసింది. బోర్వెల్ లారీ మృత్యువు రూపంలో వచ్చి వారి ఆనందాలను ఆవిరయ్యేలా చేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంతో పాతబస్తీ కాలాపత్తర్‌లోని మక్కా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కందవాడ బస్‌స్టేజీ సమీపంలో బోర్వెల్ లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మిగతా వారిలో ఇద్దరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. హైదరాబాద్‌లోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఎండీ ఆసిఫ్‌ఖాన్(48), అతని భార్య పౌజియా(45) దంపతులు. నబియా బేగం సోదరి నజియా భాను (36) పక్షవాతానికి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మట్కల్ వద్ద చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కర్ణాటకకు వెళ్లేందుకు పాతబస్తీ నుంచి ఇన్నోవా కారులో బయలుదేరారు. చేవెళ్ల మల్కాపూర్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వెళ్లి... అక్కడి నుంచి వెళుదామని అనుకున్నారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) వీరితోపాటు ఆసిఫ్, నబియాల కూతురు మహేక్ సానియా(18), కుమారుడు ఆయాన్‌ఖాన్, ఆసిఫ్ తమ్ముడు అన్వర్‌ఖాన్, చెల్లెళ్లు ఆర్షియాబేగం(30), బావలు ఖాలీద్(50), తయాబ్‌ఖాన్, వీరి పిల్లలు ఆయేషా(5), నిసార్ (7) ఉన్నారు. ఉదయం 5 గంటల సమయంలో వీరు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చేవెళ్ల మండలంలోని కందవాడ బస్టేజీ సమీపంలోకి రాగానే.. మూలమలుపు వద్ద ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్నవారు అందులోనే ఇరుక్కుపోయి మృతి చెందారు. ఇన్నోవాలో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా.. వీరిలో ఐదేళ్ల ఆయేషాతోపాటు ఆసిఫ్, పౌజియా, మహేక్‌సానియా, నజియా, ఆర్షియా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఖాలీద్ మరణించాడు. ప్రస్తుతం అయాన్ఖాన్, తయాబ్‌ఖాన్ చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల నిసార్, అన్వర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్నోవాలో చిక్కుకుపోయిన మృతదేహాలను తీసి ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. -
నష్టాలు వచ్చాయని.. రియల్టర్ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చేవెళ్ల మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన వడ్ల అంజన్‌చారి (35) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతడు చేవెళ్లలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతినటంతో అంజన్‌చారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు అడుగుతుండటంతో కొన్నిరోజులుగా ఆందోళనలో ఉన్నాడు. ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజన్‌చారి తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అదే రోజు రాత్రి భార్య మమత దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తర్వాత శనివారం చేవెళ్ల మండల కేంద్రం నుంచి కందవాడ గ్రామానికి వెళ్లే దారి వైపున్న వెంచర్ వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. అంజన్‌చారిదే ఆ మృతదేహమని గుర్తించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో అంజన్‌చారి ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
చేవెళ్ల: ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బాల్య స్నేహితులే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్ (30), గారెల రవీందర్ (32), ఎన్కేతల రఘు (30) అక్కడికక్కడే మృతి చెందారు. నర్కుడ నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. 2005 సంవత్సరం టెన్త్ బ్యాచ్‌కు చెందిన వీరు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామం నుంచి నరేశ్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు గ్రామానికి పయనమయ్యారు. 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారనగా.. మార్గమధ్యలో మీర్జాగూడ బస్ స్టేజీ దాటిన తర్వాత అతివేగంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మర్రిచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీపై టీఆర్ఎస్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్కు చెందిన చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పల కంటే బీజేపీ ప్రభుత్వం ఘోర తప్పిదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని, కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని రంజిత్ రెడ్డి చెప్పారు. కాగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఏడాదిపూర్తి అయిన సందర్భంగా ప్రగతి నివేదన కార్యక్రమంతో ఎంపీ రంజిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా అని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వం కావాలని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. వైద్య విద్య ఉపాధి కల్పించలేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారు. లాక్డౌన్ ప్రకటించే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు. కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు. హెలికాప్టర్ మినీ అని సీఎం కేసీఆర్ చెబితే కనీసం పట్టించుకోలేదు. మోదీ ఇన్ని సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎంలోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంను నిలదీస్తాం. స్థానిక బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి తెచ్చే నిధులు గురించి కొట్లాడాలి’ అని అన్నారు. -
ప్రియుడే హంతకుడు
చేవెళ్ల: సంపన్న కుటుంబానికి చెందిన ఆమె.. ఫేస్బుక్లో పరిచయమైన ఓ ఫ్రెండ్ మాయలో పడింది. భర్త, పిల్లల్ని వదిలేసి అతడి వద్దకు వెళ్లిపోయింది. చివరకు కోరుకున్న ప్రియుడే కాలయముడై ఆమె ప్రాణాలు తీశాడు.. ఇదీ కొద్దిరోజుల క్రితం ‘దిశ’ఘటన తరహాలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా తంగడపల్లి బ్రిడ్జి కింద వెలుగు చేసిన మహిళ (36) హత్య కేసు మిస్టరీ. తన స్నేహితుడి సాయంతో ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. ప్రియుడి స్నేహితుడిని పట్టుకున్న పోలీసులు ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఆ రోజేం జరిగిందంటే.. మార్చి 17న చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులోని బ్రిడ్జి కింద యువతి మృతదేహం కనిపించింది. నగ్నంగా పడి ఉన్న ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైంది. ఒంటిపై ఖరీదైన నగలున్నాయి. పక్కనే నైలాన్ తాడు పడి ఉంది. ఇది మరో ‘దిశ’ఘటనలా ఉందంటూ అప్పట్లో ప్రచారమైంది. చేవెళ్ల పోలీసులు మహిళ ఆచూకీ కోసం రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు తెలిపారు. మృతదేహం కుళ్లిపోతుండటంతో ఇటీవల చేవెళ్లలోనే పూడ్చిపెట్టారు. మృతురాలిని సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించినట్లు తెలుస్తోంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ మహిళ భర్త వ్యాపారవేత్త అని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఫేస్బుక్ ద్వారా పరిచయం ముంబైలో ఉండే ప్రధాన నిందితుడికి ఈ మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అది ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి సిక్కిం నుంచి 4 నెలల క్రితం ముంబైకి వెళ్లి అక్కడే ఉండేది. ప్రియుడు మరో మహిళతో చనువుగా ఉంటున్నట్టు గుర్తించిన ఆమె.. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు పథకం పన్నాడు. చంపేసి ముంబైకి చెక్కేసి.. సీసీ కెమెరాల పుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల జీపీఎస్ ట్రాక్‌ను సేకరించడం ద్వారా పోలీసులు ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడికి బంధువు, స్నేహితుడైన యువకుడు హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఉంటున్నాడు. ప్రధాన నిందితుడు తాను హైదరాబాద్ వస్తున్నానని, కారు ఏర్పాటు చేయాలని కోరటంతో ఈ యువకుడు అద్దె కారును ఏర్పాటు చేశాడు. గత నెల 15న ముంబై నుంచి నిందితుడు తన ప్రియురాలిని తీసుకొని విమానంలో హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి యువకుడితో కలిసి అద్దె కారులో లాంగ్ డ్రైవ్ కోస మని ముగ్గురూ వికారాబాద్‌కు వచ్చారు. పథకం ప్రకారం నైలాన్ తాడుతో కారులోనే మహిళ మెడకు ఉరిబిగించి హత్య చేశారు. తంగడపల్లి బ్రిడ్జి వద్ద వాహనం ఆపి మృతదేహాన్ని తాడుతో కిందికి దించారు. ముఖం గుర్తించకుండా బండరాయితో మోది ఛిద్రం చేశారు. రాయితోపాటు మహిళ దుస్తులను తమతో తీసుకెళ్లారు. కారు తంగడపల్లి ప్రగతి రిసార్టు మీదుగా ప్రొద్దటూరు నార్సింగి మీదుగా ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రధాన నిందితుడు ముంబై వెళ్లిపోయాడు. కారు నంబర్ ఆధారంగా దానిని అద్దెకు తీసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకోవటంతో ఈ కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. -
కల్వర్టు కింద మహిళ మృతదేహం..
-
హతమార్చి.. ముఖం ఛిద్రం చేసి..
చేవెళ్ల: నుజ్జునుజ్జయిన ముఖం.. కల్వర్టు కింద రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన యువకుడు ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా తంగడపల్లిలో ఈ దారుణోదంతం వెలుగుచూసింది. ‘దిశ’ఘటనలా ఉందంటూ జరిగిన ప్రచారం కలకలం రేపింది. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లికి చెందిన యువకుడు శేరిల్ల నవీన్ ఉదయం ఏడు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా, వికారాబాద్– హైదరాబాద్ రహదారిపై గల కల్వర్టు కింద మహిళ మృతదేహం కనిపించింది. ముఖం మొత్తం నుజ్జయి, నగ్నంగా పడి ఉన్న ఆమె గురించి వెంటనే అతను సర్పంచ్ భర్తకు తెలిపాడు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్ఐ రేణుకారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బండరాళ్లతో మోదటంతో ముఖం గుర్తుపట్టరాని విధంగా మారింది. మృతదేహం వద్ద ఓ నైలాన్ తాడు తప్ప మరే ఆధారాలు లభ్యం కాలేదు. మహిళ వివస్త్రగా పడి ఉండగా, ఆమె దుస్తులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు. మృతదేహాన్ని వంతెన పైనుంచి తాడుతో కిందికి దించిన తరువాత ముఖంపై బండరాళ్లతో మోదినట్టుగా ఉంది. పక్కనున్న రాళ్లపై రక్తం అంటుకుని ఉండటంతో పోలీసులు ఈ అంచనాకు వచ్చారు. మహిళ ఒంటిపై రెండు బంగారు గాజులు, వేలికి బంగారు ఉంగరం, మెడలో బంగారు లాకెట్ ఉన్నాయి. ఘటన స్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని, అంటే వేరే ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి, హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు: డీసీపీ ఘటన జరిగిన తీరు.. మరో ‘దిశ’ఉదంతంలా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోందని, లభ్యమైన బంగారు నగలను ల్యాబ్‌కు తరలిస్తామని చెప్పారు. ఘటనపై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లను అప్రమత్తం చేశామన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించిన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఓటీ అడిషనల్ డీజీపీ సందీప్‌కుమార్‌తో పాటు క్లూస్‌టీం సభ్యులు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలు ఘటనా స్థలంలోనే తచ్చాడాయి. మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే భద్రపరిచారు. భయమేసింది.. మాది తంగడపల్లి. డ్రైవింగ్ చేస్తాను. ఉదయం 7 గంటలకు బహిర్భూమికని బైక్‌పై వచ్చాను. కల్వర్టు కింద తెల్లగా, బొమ్మలా ఏదో కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే మహిళ మృతదేహం.. ఒక్కసారిగా భయమేసింది. ఇటువంటివి ఇంతకుముందెప్పుడూ చూడలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి సర్పంచ్ భర్త సత్తయ్యగౌడ్‌కు చెప్పాను. అనంతరం పోలీసులు వచ్చి పరిశీలించారు. – శేరిల్ల నవీన్, తంగడపల్లి, ఘటనను మొదటగా చూసిన వ్యక్తి -
యువతి పై అత్యాచారం,హత్య
-
రంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన!
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మొహంపై కొందరు దుండగులు బండరాయితో మోదీ దారుణంగా హతమార్చారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అత్యాచారం జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. రంగంలోకి ఐదు బృందాలు: శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈరోజు ఉదయమే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. మహిళ ఒంటిపై దుస్తులు లేవు. వివస్త్రగా మృతదేహం పడిఉంది. ఆమె తలపై బండ రాయితో మోది చంపేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది. కేసును ఛేదించేందుకు ఐదు బృందాలను రంగంలోకి దింపాం. అన్ని కమిషనరేట్ల పరిధిలో పోలీసుల్ని అలర్ట్ చేశాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుంది. ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు ఉన్నాయి. -
చేవెళ్ల బస్‌స్టాండ్‌లో విషాద సంఘటన..
-
మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి..
సాక్షి, చేవేళ్ల: చేవెళ్ల బస్‌స్టాండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి చక్రాల కిందపడి పోయాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అధిక రద్దీ కారణంగా మైనర్ బాలుడు చనిపోయాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే రద్దీగా ఉన్న బస్సులను ఎక్కవద్దని, బస్సు ఫుట్‌బోర్డు పై నిలబడొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. One minor has died in an accident at Chevella bus stand while climbing on Bus footboard. Cyberabad Traffic Police request the students/ public not to take running buses and do not stand on the footboard. pic.twitter.com/0zSXK2YXw4— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) -
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
-
ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొనసాగుతున్న నిరసనలు ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ జంపన్న డిపో ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు జంపన్నను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ మాస్క్‌లు ధరించి ‘సేవ్ ఆర్టీసీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మహిళా కండక్టర్లంతా కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ రోజు ఉదయం బస్సులను ఆపి ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు విధుల్లోకి రావద్దంటూ పూలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్లకు రేపటి నుంచి మీరు విధులకు రావొద్దని, మేము చేసే ఉద్యమానికి మద్దత్తు పలకాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో పరిగి ఎమ్మెల్యేకు గాయాలు
చేవెళ్ల : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం షాబాద్ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మహేశ్‌రెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌రెడ్డి తన ఇన్నోవా కారులో డ్రైవర్ శ్రీకాంత్, గన్‌మెన్ పాషాతో కలిసి పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. చేవెళ్లకు చెందిన టేకులపల్లి మల్లేశ్ కారులో చేవెళ్లనుంచి తన దాబాకు వెళ్తున్నాడు. 2 కార్లు హైదరాబాద్ వెళ్తుండగా ముందు వెళ్తున్న మల్లేశ్ కారును ఎమ్మెల్యే వాహ నం వెనకనుంచి ఢీకొట్టంతో 2 కార్లు పల్టీ కొట్టాయి. -
కాళ్లు మొక్కి ప్రాధేయపడినా కనికరించలేదు..
-
వైరల్ : కాళ్లు మొక్కినా కనికరించలే..
సాక్షి, చేవెళ్ల: భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సూచించినా, బాధిత రైతులు కాళ్లు మొక్కి ప్రాధేయపడినా ఆ తహసీల్దార్ కనికరించలేదు. కొన్ని నెలలుగా బాధిత రైతులను తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. వారంరోజుల క్రితం రైతులు చేవెళ్ల తహసీల్దార్ పురుషోత్తం కాళ్లు మొక్కుతున్న వీడియో ఆదివారం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెవెన్యూ అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే .. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జంగిలి లింగయ్య, జంగలి సత్తయ్యల తండ్రి చిన్న మల్లయ్యకు సర్వే నెం 326లో 2 ఎకరాల 4 గుంటల భూమికి 2001లో ఓఆర్సీ వచి్చంది. వీరితోపాటు ఈ సర్వే నెంబర్లో మరో ఐదు మందికి కూడా గతంలోనే ఓఆర్సీలు రావడంతో సాగు చేసుకుంటున్నారు. బాధిత రైతులు లింగయ్య, సత్తకు సంబంధించిన భూమికి పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. భూ ప్రక్షాళన సమయంలో 1బీ రికార్డు కూడా సక్రమంగానే వచి్చంది. అనంతరం కొత్త పాస్‌బుక్‌లో వీరికి 2 ఎకరాల 4 గుంటలకు బదులుగా కేవలం 1 ఎకరం భూమి మాత్రమే నమోదైంది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరితోపాటుగా మండలంలోని మీర్జాగూడ(ఆలూరు రెవెన్యూ)కు చెందిన పర్వేద మల్లయ్యకు సైతం ఇదే సర్వే నంబర్లో ఉండాల్సిన 34 గుంటల భూమికి బదులుగా కేవలం 13 గుంటలు మాత్రమే కొత్తపాస్‌బుక్‌లో నమోదైంది. పక్కపక్కన భూమి కావడంతో పాటు ఒకేసర్వే నంబర్ భూమి కావడంతో ముగ్గురు రైతులు రికార్డు సరిచేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని వీఆర్ఓలు, తహసీల్దార్ చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొత్త పాస్‌బుక్‌లో తక్కువ భూమి నమోదైందని చూపిస్తున్న రైతు కలెక్టర్‌కు విన్నవించిన రైతులు ఇటీవల కలెక్టర్ లోకేష్‌కుమార్ చేవెళ్లలో ప్రజావాణి నిర్వహించగా బాధితులు ఆయనకు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోలేదు. నెల తర్వాత రెండోసారి ప్రజావాణికి కలెక్టర్, జేసీ హజరవగా బాధితులు మరోమారు కలిశారు. కలెక్టర్ అర్డీఓను ఆదేశించగా ఆయన తహసీల్దార్ పురుషోత్తంకు సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అనంతరం కలెక్టర్ ఆలూరు గ్రామంలో ప్రత్యేకంగా వారంపాటు రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసినా సమస్యను పరిష్కరించలేదు. దీంతో బాధిత రైతులు వారం రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ పురుషోత్తం కాళ్లమీద పడి ‘మా పని చేయండి సార్’ అని వేడుకున్నారు. అక్కడే ఉన్న వారి గ్రామస్తులు దీనిని వీడియో తీయగా గమనించిన తహసీల్దార్ వారిని లోపలికి పిలిచి మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాను.. వీడియో మాత్రం బయటకు రానివ్వవద్దని చెప్పారు. అయితే, ఇటీవల ఆలూరుకు వచి్చన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి ఈ వీడియోను బాధితులు చూపించారు. దీంతో ఆయన తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి హెచ్చరించినా ఫలితం లేదు. దీంతో గ్రామస్తులు వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆదివారం వైరల్‌గా మారింది. తహసీల్దార్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాధితులు కేశంపేట తహసీల్దార్ కాళ్లు మొక్కిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం ఆమె ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అ«ధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని బాధితులు ఆరోపించారు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవద్ద కట్ అయిన ఎకరం 25 గుంటల భూమి ఆన్లైన్లో మరో వ్యక్తి పేరుమీద కనిపిస్తుందని రైతులు తెలిపారు. ఇలాంటి తహసీల్దార్‌ను ఎక్కడా చూడలేదు బాధిత రైతులు లింగమయ్య, సత్యయ్య, పర్వేద మల్లయ్య తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సరిచేయాలని తహసీల్దార్‌ను అదేశించినా ఆయన పనిచేయడం లేదు. ఉన్నతాధికారులు సూచించిన తర్వాత కూడా మళ్లీ నాకు ఫైల్ పంపించి ఓఆర్సీ సరైనదా కాదా చెప్పాలని పంపాడు. పలు సమస్యల్లో కూడా ఆయన తీరు ఇలాగే ఉంది. గతంలో బాధిత రైతుల రికార్డులు ఎందుకు మారాయనే విషయం తహసీల్దార్ పరిశీలించాలి. అది వదిలేసి ఓఆర్సీలు సరైనవా కాదా అని తహసీల్దార్ ఫైల్ తిరిగి నాకు పంపుతున్నాడు. ఇలాంటి తహసీల్దార్‌ను నేను ఎక్కడా చూడలేదు. మంగళవారం కలెక్టర్ చేవెళ్లకు వస్తున్నారు. అక్కడే ఈ సమస్యను పరిష్కరిస్తాం.. రైతులు కూడా రావాలని సూచించాను. – హన్మంత్‌రెడ్డి, ఆర్డీఓ చేవెళ్ల ఆర్డీఓకు ఫైల్ పంపాను బాధిత రైతులు కావాలనే కాళ్లు మొక్కి వీడియో తీయించి ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఓఆర్సీ ముందుగానే వచి్చంది. అ తరువాత అదే గ్రామానికి చెందిన మరో రైతుకు కూడా ఓఆర్సీ ఇవ్వడంతో వారి భూమి కొత్త పాస్ పుస్తకంలో రాలేదు. ఈవిషయాన్ని నేను పరిశీలించగా బాధిత రైతుల వైపే న్యాయం ఉంది. అయితే, ఓఆర్సీని రద్దు చేసే అధికారం నాకు లేదు. ఓఆర్సీలను పరిశీలించాలని అర్డీఓకు ఫైల్ పంపాను. అనంతరం ఆర్డీఓ సూచన మేరకు చర్యలు తీసుకుంటాను. ఇందులో నా తప్పిదం ఏమి లేదు. – పురుషోత్తం, తహసీల్దార్, చేవెళ్ల -
పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి
సాక్షి, చేవెళ్ల: టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని, ఇందుకు మంత్రి ఈటల రాజేందర్ మాటలే నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని పలుగుట్ట, దేవునిఎర్రవల్లి, ఊరేళ్ల గ్రామాల్లో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రఘునందన్‌రావుతోపాటు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, కంజర్ల ప్రకాశ్ తదితరులు ముఖ్యఅతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను అవిష్కరించి పార్టీ సభ్యత్వాలను అందజేశారు. ఈసందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ భారతీయ పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని నరేంద్రమోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే పిరంగులై పేలి కేసీఆర్ కొంపముంచడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా దేవునిఎర్రవల్లి, ఊరేళ్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున యవుకులు బీజేపీ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విఠల్‌రెడ్డి. ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్, పద్మానాభం, రాములు, పాండురంగారెడ్డి, కుంచం శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, కావాలి శ్రీనివాస్, గాంధీ, సత్యనారాయణ, సత్యం, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
మేక ‘హరితహారం’ మొక్కను తినేయడంతో..
సాక్షి, చేవెళ్ల : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కను మేక తినడంతో ఆ మేక యజమానికి జరిమానా పడింది. పంచాయతీ అధికారులు మేక యజమానికి రూ. 500 జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం దేవల్ వెంకటాపూర్ (చిలుకూరు బాలాజీ దేవాలయం ఉన్న ప్రాంతం)లో ఇటీవల హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే, అదే గ్రామానికి చెందిన బైకని మల్లమ్మకు చెందిన మేకలు మొక్కలను తినేశాయి. ఈ నెల 21న ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు గుర్తించారు. జరిమానాకు సంబంధించిన రశీదును పంచాయతీ కార్యదర్శి రంజిత్‌కుమార్, సర్పంచ్ గునుగుర్తి స్వరూప మల్లమ్మకు అందజేశారు. -
స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు
సాక్షి, చేవెళ్ల: ‘స్నేహితుల విలువ వెల కట్టలేనిది. స్నేహితులు ఉన్న వారు జీవితంలో ఓడిపోరు. అది నా జీవితంలో జరిగింద’ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన ప్రాణ స్నేహతుడి గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. నా జీవితంలో స్నేహితుడు తిరుపతిరెడ్డిది ప్రత్యేక స్థానం. డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ , తిరుపతిరెడ్డి అంటే ఒక్కటే అన్నట్లుగా మా స్నేహం గురించి అందరికీ తెలుసు. వేరువేరు కుటుంబాలుగా ఉన్నా ఇద్దరం ఒక్కటే. మా ఇద్దరి పిల్లలు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. వరంగల్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో కలిశాం. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ డాక్టర్లుగా విద్యాభ్యాసం చేసి 3వేల రూపాయలకు ఉద్యోగం చేశాం. కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యోగం చేశాం. కలిసి వ్యాపారం ప్రారంభించి పౌల్ట్రీ రంగంలోనే నెంబర్ వన్‌స్థానానికి ఎదిగాం. ఇప్పటికీ మేము కలిసే ఉంటున్నాం. సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీలు కలిసి టూర్లకు వెళ్తాం. కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. మా స్నేహం గురించి కేటీఆర్‌కు, ఈటల రాజేందర్ తదితర రాజకీయ ప్రముఖలకు సైతం తెలుసు. వ్యాపారం నుంచి నేను రాజకీయాల్లోకి వస్తున్న విషయం కూడా ముందుగా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ తరువాతే నేను రజకీయాల్లోకి వచ్చాను. ఎప్పటీకీ మా స్నేహం ఇలాగే ఉంటుంది. అందుకే స్నేహితుల విలువ వెలకట్టలేనిది అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. -
ఖాళీ స్థలం విషయంలో వివాదం
చేవెళ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రహారీ, అంగడిబజారు కాలనీకి మధ్యలో ఉన్న వ్యవసాయశాఖకు కేటాయించిన గోదాం స్థలం విషయంలో వివాదం నెలకొంది. కాలనీవాసులు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు గురువారం పనులు చేస్తుండగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో నాయకులు కల్పించుకొని అందరి సమక్షంలో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పారు. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలకు అంగడి బజారు కాలనీకి మధ్య కొన్నేళ్ల క్రితం వ్యవసాయశాఖ అధికారులు గోదాం నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంది. దీంతో అది కాలనీవాసులకు, అటు పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఖాళీ స్థలంలోంచి పాములు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో స్థానిక నాయకులు నిర్మాణాన్ని కూల్చివేసి చదును చేశారు. ఖాళీ స్థలం ఉండడంతో తమకు కమ్యూనిటీ హాల్ కావాలని కోరగా సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు.. ఖాళీ స్థలం విద్యార్థుల మరుగుదొడ్లకు ఆనుకొని ఉందని, దీనిని ఆటస్థలంగా కేటాయిస్తే ఉపయోగంగా ఉంటుందని కోరారు. దీంతో ఎంపీపీ తన సొంత డబ్బులు వినియోగించి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనికి ప్రహారీ నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని బుధవారం పనులు చేసేందుకు సామగ్రిని ఎంపీపీ తెప్పించారు. ఈనేపథ్యంలో కాలనీవాసులు ఇది తమకు అనుకూలంగా ఉందని, ఇది అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారని గురువారం కాలనీవాసులు పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ స్థలం విషయంలో అటు ఎంపీపీ, ఇటు సర్పంచ్ వేర్వేరుగా హామీలు ఇవ్వడంతో ఈ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అక్కడికి వచ్చిన ఎంపీటీసీ వసంతం, ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, వార్డుసభ్యులు ఇరుర్గాలకు నచ్చజెప్పారు. దీనిపై పెద్దలంతా కలిసి పంచాయతీ ఆధ్వర్యంలో మాట్లాడి స్థలం ఎవరికి కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అప్పటి వరకు నిరీక్షించాలని ఉపాధ్యాయులను, విద్యార్థులను పంపించారు. అయితే, ఈ స్థలం విషయంలో ‘ఎంపీపీ వర్సెస్ సర్పంచ్’ అన్నట్లుగా స్థానికంగా సోషల్ మీడియలో జోరుగా ప్రచారం జరిగింది. చివరకు స్థలం ఎవరికి కేటాయిస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. -
‘ఎస్ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’
సాక్షి, రంగారెడ్డి : 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారనే ఆవేదనతో.. జంగయ్య అనే రైతు మంగళవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. పాల్గుట్ట గ్రామనికి చెందిన రైతు జంగయ్య తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాక తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. భూమి దగ్గరకు వెళ్లకుండా ఎస్ఐ రేణుకా రెడ్డి తనను బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి తనకు దక్కదనే భయంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు జంగయ్య. -
మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, చేవెళ్ళ : ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి అనే విద్యార్థిని చేవెళ్ళలోని వివేకానంద జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్‌పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపాల్సిన చర్యలు కానరాకపోవడం బాధకరం. (అందుకు పది రోజుల సరిపోతుంది కదా : హైకోర్టు) -
ఎవరి ఆశలకు గండి..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్‌కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కొందరు సెటిటర్లు వారి స్వస్థలాలకు వెళ్లడంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండటంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్ని కలు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. -
ఎవరి ఆశలకు గండి పడుతుందో?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండి కొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే ఈసారి పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా సెటిలర్లు ఉన్నారు. గురువారమే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉండటంతో.. సెటిలర్లు తమ సొంత ప్రాంతంలో ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీనికితోడు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండడంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్నికలు రావడంతో చాలామంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో..సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పైగా లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. క్షీణించిన పోలింగ్ శాతం ఎవరి గెలుపు అవకాశాలను కొంపముంచుతుందోనన్న బెంగ అభ్యర్థులను వెంటాడుతోంది. గత రెండు దఫాల్లో చేవెళ్లలో నమోదైన పోలింగ్ శాతం -
ఈవీఎంలు రిగ్గింగ్ చేసినా గెలుపు నాదే..
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను 3లక్షల మెజార్టీతో గెలుస్తానని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే నాయకుడు కావాలని చేవెళ్ల ప్రజలు కోరుతున్నారని, టీఆర్ఎస్ నేతలు ఈవీఎంలు రిగ్గింగ్ చేసినా తన గెలుపు ఖాయమని మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పరిగిలో నిర్వహించిన సభతో తమ బలమేంటో కేసీఆర్‌కు తెలిసిందని, చేవెళ్లలో రెండో స్థానం కోసమే టీఆర్ఎస్, బీజేపీలు కొట్లాడుతున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 400కి పైగా గ్రామాలు తిరిగానని, ఆరులక్షల మందిని కలిశానని, మూడు లక్షల హైఫైలు ఇచ్చానని, ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని కొండా చెప్పారు. అభివృద్ధి కోసమే కొండా కాంగ్రెస్‌లోకి.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తల్లి ప్రమోదిని అన్నారు. మంగళవారం యాలాల మండల కేంద్రంతో పాటు బెన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అభివృద్ధి కోసమే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారని గుర్తు చేశారు. సౌమ్యుడిగా, పేదల పక్షపాతిగా పేరున్న కొండాను ఎంపీగా గెలిపించుకుందామని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి పేదవాడు సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుతం పింఛన్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. -
చేవెళ్ల ఆశాకిరణం డాక్టర్ రంజిత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చిన ఆయన.. అనూహ్యంగా పది మంది కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించి వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన.. తన ప్రజాసేవను మరింత విస్తృతం చేసేందుకు ఎంపీగా ఆశీర్వదించాలని కోరుతున్నారు. తనకు అవకాశమిస్తే ప్రజలకు అత్యవరసరమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వలసల నివారణ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చేవెళ్లలో తనకు పోటీగా బరిలో నిలిచిన అత్యంత సంపన్న అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డిపై గెలవాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసేవకు అంకితం... దాదాపు మూడున్నర దశాబ్దాలుగా చేవెళ్ల ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న గడ్డం రంజిత్‌రెడ్డి సెప్టెంబరు 18, 1964లో వరంగల్‌లో జన్మించారు. తన పిల్లలకు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ విభాగంలో రంజిత్ రెడ్డి పీజీ పట్టా పొందారు. అనంతరం చేవెళ్లలోని అంతాపూర్ గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌కు సాంకేతిక సలహాదారుగా కెరీర్ ప్రారంభించారు. బ్రీడింగ్, ఫార్మింగ్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో విశేష అనుభవం గడించిన ఆరేళ్ల తర్వాత ఎస్ఆర్ హ్యాచరీస్ అనే ప్రైవేటు సంస్థను నెలకొల్పారు. తన వ్యాపార భాగస్వామి డాక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి అనతి కాలంలోనే తన కంపెనీని చేవెళ్లలో విస్తరించి విజయపథంలో దూసుకుపోతున్నారు. ఎస్ఆర్ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ రెడ్డి..తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంటి పలు పదవులు చేపట్టారు. పౌల్ట్రీ వ్యాపారులు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతున్నారు. కంపెనీ నిర్వహణ, సామాజిక కార్యక్రమాల ద్వారా వేలాది మందికి ఆయన ఉపాధి కల్పించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. చేవెళ్లతో ప్రత్యేక అనుబంధం... చేవెళ్ల తన స్వస్థలం కాకపోయినప్పటికీ తనకు, తన కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు అందించిన చేవెళ్ల అంటే రంజిత్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం. పుట్టింది వరంగల్‌లోనే అయినా 35 ఏళ్లుగా చేవెళ్ల ప్రజల ఆత్మీయత, అనురాగాలు పొందినందు వల్ల వారితో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా యవతకు ఉపాధి కల్పించడం వంటి సామాజిక కార్యక్రమాలు ఆయనలోని సేవాతృష్ణకు నిదర్శనం. అదేవిధంగా ఉన్నత విద్యావంతుడైన రంజిత్ రెడ్డి.. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, వొకేషనల్ ట్రెయినింగ్‌ల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి భరోసా ఇస్తున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న రంజిత్ రెడ్డి భార్య సీతా రంజిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికతకు ముగ్ధుడైన రంజిత్ రెడ్డి 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధికి పాటుపడుతూ.. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రంజిత్ రెడ్డి కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచి తానెంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పూర్తి మద్దతుతో రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. (సాక్షి అడ్వర్ట్‌టోరియల్) -
గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం
సాక్షి, తాండూరు : చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్ గ్రామంలో మంగళవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఎత్తిపోతల పథకం కింద కృష్ణ జలాల నీళ్లు తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు. వికారాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతానని హామీ ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా బలహీనపడ్డాయని చెప్పారు. ఈ తరుణంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారని స్పష్టంచేశారు. కేసీఆర్ హయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించి అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి తాండూరులో కాలుష్య నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు. మూడు లక్షల మోజార్టీ ఇస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మూడు లక్షల మోజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డితో కలిసి కరన్‌కోట్‌లో రోడ్‌షో నిర్వహించారు. రంజిత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఆయనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంపై టీఆర్ఎస్ జెండా ఎగురస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గట్టు రాంచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను, వైస్ ఎంపీపీ శేఖర్, కరన్‌కోట్ సర్పంచ్ వీణ, నాయకులు శంకుతల, రాంలింగారెడ్డి, హేమంత్ తదితరులు ఉన్నారు. -
అత్యంత సంపన్న అభ్యర్థి ఆయనే.. ఆస్తి ఎంతో తెలుసా!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంపన్న రాజకీయ నాయకుడిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 895 కోట్లుగా పేర్కొన్నారు. భార్య ఆస్తి విలువ రూ. 613 కోట్లు.. తన చరాస్తుల విలువ 223 కోట్లుగా పేర్కొన్న విశ్వేశ్వర్ రెడ్డి.. తన భార్య, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చరాస్తుల విలువ 613 కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక తన కుమారుడి చరాస్తుల విలువ రూ. 20 కోట్లని పేర్కొన్నారు. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 36 కోట్లుగా పేర్కొన్న ఆయన.. భార్య స్థిరాస్తుల విలువ కేవలం రూ. 1.81 కోట్లని తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 528 కోట్లని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ తన ఆస్తుల విలువ 667 కోట్ల రూపాయలని ప్రకటించారు. నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన.. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఏపీ సీఎం, కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘దశాబ్ద’ కీర్తి.. ప్రగతి స్ఫూర్తి
పచ్చని పల్లె సీమలు, ఆధునిక పట్టణాల కలబోతగా కనిపించే ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. దశాబ్ద చరిత్ర కలిగిన ఈ సెగ్మెంట్ పరిధిలో దేశానికి అన్నం పెట్టే రైతులు, రైతు కూలీలు ఓ వైపు.. ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు మరోవైపు కొలువుదీరాయి. ప్రతిష్టాత్మక ఫార్మా సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్‌వేర్ పార్కులతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ అంతర్జాతీయ సంస్థలను ఒడిలో పెట్టుకుంది. ఇంతటి ప్రాధాన్యం ఉండడంతో ఇక్కడి నుంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా :ఒకవైపు పల్లె సీమలు.. మరోవైపు ఆధునికతకుఅద్దం పట్టే పట్టణాల కలబోత చేవెళ్ల లోక్‌సభ. దశాబ్ద చరిత్ర కలిగిన ఈ లోక్‌సభపరిధిలో దేశానికి అన్నం పెట్టే రైతులు, రైతు కూలీలు ఓ వైపు ఉండగా.. మరోవైపు ప్రపంచ దేశాల సరసన నిలిపిన ఐటీ,సాఫ్ట్వేర్ కంపెనీలుకొలువుదీరాయి. ప్రతిష్టాత్మక ఫార్మా సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్‌వేర్ పార్కులతో పాటు ఉన్నత విద్యా సంస్థలు,వర్సిటీలు, పర్యాటక, ఆతిథ్యానికి కేంద్ర బిందువు ఈ లోక్‌సభ స్థానం. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలను, అంతర్జాతీయ సంస్థలకు ఆలవాలమైన ఈ ప్రాంతం ఉద్యోగ, ఉపాధిఅవకాశాలకూ కొదవలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పేరెన్నికగన్న స్టార్ హోటళ్లు ఇక్కడ వెలిశాయి. ఈ లోక్‌సభ సెగ్మెంట్ ఆవిర్భవించి పదేళ్లే అయినా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దీని సొంతం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఇక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో వికారాబాద్ జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలోనివి శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల సెగ్మెంట్లు. ఈ ఏడు సెగ్మెంట్లు కూడా గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగాయి. ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో కొన్ని కొత్త రంగారెడ్డి, ఇంకొన్ని వికారాబాద్ జిల్లాల్లోకి వెళ్లాయి. గతంలో ఈ విధానసభ స్థానాలు హైదరాబాద్, మెదక్ లోక్‌సభల్లో అంతర్భాగంగా కొనసాగాయి. లోక్‌సభ స్థానాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో చేవెళ్ల లోక్‌సభ ఆవిర్భవించింది. చెరోసారి గెలుపు చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికలు జరగాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరోసారి కైవసం చేసుకున్నాయి. 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మొత్తం ముగ్గురు అభ్యర్థులే తలపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డిపై ఆయన 18,532 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో జరిగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిపై విజయఢంకా మోగించారు. కార్తీక్‌పై 73,023 ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చారు. మొత్తం 13 మంది ఈ స్థానానికి పోటీ చేయగా.. ఇందులో ఒకరు స్వతంత్ర అభ్యర్థి కాగా మిగిలిన వారు ప్రధాన, చిన్నాచితక పార్టీల అభ్యర్థులు. మూడోసారిపాగావేసేదెవరో? చేవెళ్ల లోక్‌సభకు మూడోసారి జరగనున్న ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయనను.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నుంచి పారిశ్రామికవేత్త డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. నేడో రేపో ఆయన పేరును ప్రకటించే అవకాశముంది. ఇక బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, గజ్జల యోగానంద్ పేర్లు పరిశీలనో ఉన్నట్లు సమచారం. బైండోవర్ అంటే..! సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సమయంలో పోలీసుల నోటి వెంట తరచుగా వినిపించే మాట ‘బైండోవర్’. చాలామంది ఓటర్లకు బైండోవర్ అంటే ఏమిటో తెలియదు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పాత నేరస్తులను అదుపులోకి తీసుకుంటారు. రౌడీషీటర్లు, సారా తయారీదారులు, అమ్మకందారుల, బెల్ట్‌షాపుల నిర్వాహకులతో పాటు వివిధ కేసుల్లో ఉన్న నిందితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ కేసులు పెడుతుంటారు.అనంతరం వారిని తహసీల్దార్, ఆర్డీఓ ఎదుట హాజరుపరుస్తారు. సీఆర్పీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్ చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేస్తారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వీరు తహసీల్దార్ దగ్గర బాండ్ పేపర్‌పై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. కొంత మొత్తం నగదు లేదా స్థిరాస్తి ష్యూరిటీ చూపించాల్సి ఉంటుంది. బైండోవర్ అయిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడినా ష్యూరిటీ పెట్టిన సొమ్ము నుంచి వసూలు చేస్తారు. వీరు ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ అధీనంలోనే ఉంచుకుంటారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు మొత్తం ఓటర్లు : 24,15,598 పురుషులు : 12,51,210 మహిళలు : 11,64,093 -
చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి
-
చేవెళ్ల నుంచి ప్రచార భేరి
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరీ మోగించనుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సమర శంఖం పూరించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు చేవెళ్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభ నుంచి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇక ఈ వేదికగా ఇప్పటికే ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రజలకు వాగ్దానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై గత రెండు నెలలుగా ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోటీలో నిలిచే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టింది. ఈ నెల రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే వివిధ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎండగడుతున్నారు. ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు రైతులకు ఏడాదికి ఆర్థిక సాయం కింద అందించే రూ.6 వేలు ఏం సరిపోతాయని నిలదీస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని, డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పర్యటనలోనే రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రపంచంలో ఏ దేశంలో అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ కూడా ఇచ్చారు. ఈ హామీపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన కనీస ఆదాయ పథక వాగ్దానాన్ని పహాడీషరీఫ్ బహిరంగ సభ వేదికగా రాహుల్ ప్రకటించనున్నారు. ఈ సభకు కనీసం 2 నుంచి 3 లక్షల మందిని తీసుకురావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే రోజు ఉదయం కర్ణాటకలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పహాడీషరీఫ్ బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం 6 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సభా ఏర్పాట్లపై పరిశీలన చేవెళ్ల పార్లమెంట్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో రాహుల్ సభ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి సభ్యుడు షబ్బీర్‌అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్యెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, భద్రత అంశాలపై చర్చించారు.