పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి | BJP Leader Raghunandan Rao Speech In Chevella | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి

Published Sat, Aug 31 2019 12:28 PM | Last Updated on Sat, Aug 31 2019 12:37 PM

BJP Leader Raghunandan Rao Speech In Chevella - Sakshi

ఊరేళ్ల గ్రామంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు

సాక్షి, చేవెళ్ల: టీఆర్‌ఎస్‌లో లుకలుకలు ప్రారంభమయ్యాయని, ఇందుకు మంత్రి ఈటల రాజేందర్‌ మాటలే నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని పలుగుట్ట, దేవునిఎర్రవల్లి,  ఊరేళ్ల గ్రామాల్లో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం  నిర్వహించారు.  కార్యక్రమానికి రఘునందన్‌రావుతోపాటు  రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి,  జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ జంగారెడ్డి, కంజర్ల ప్రకాశ్‌ తదితరులు ముఖ్యఅతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను అవిష్కరించి పార్టీ సభ్యత్వాలను  అందజేశారు. ఈసందర్భంగా రఘునందన్‌ మాట్లాడుతూ  భారతీయ పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సైతం  బీజేపీలో చేరేందుకు  సిద్ధమవుతున్నారని అన్నారు.    రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి  వచ్చేది బీజేపీయేనని నరేంద్రమోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే పిరంగులై పేలి కేసీఆర్‌  కొంపముంచడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా  దేవునిఎర్రవల్లి, ఊరేళ్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున యవుకులు  బీజేపీ పార్టీలో చేరారు. వారిని  పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు  విఠల్‌రెడ్డి.  ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్,  పద్మానాభం, రాములు, పాండురంగారెడ్డి, కుంచం శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, కావాలి శ్రీనివాస్, గాంధీ,  సత్యనారాయణ, సత్యం,  యువకులు తదితరులు పాల్గొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement