
సాక్షి, రంగారెడ్డి : 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారనే ఆవేదనతో.. జంగయ్య అనే రైతు మంగళవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. పాల్గుట్ట గ్రామనికి చెందిన రైతు జంగయ్య తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాక తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. భూమి దగ్గరకు వెళ్లకుండా ఎస్‌ఐ రేణుకా రెడ్డి తనను బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి తనకు దక్కదనే భయంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు జంగయ్య.