
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఖమ్మంరూరల్: ఆరెకోడు గ్రామానికి చెందిన చెందిన బాణోతు అప్పారావు, గుగులోత్ నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు డబుల్‌బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదని సోమవారం ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ఊరికి 18 ఇళ్లు మంజూరు కాగా..భూములు, ఆస్తులు ఉన్న వారికి కేటాయించి, నిరుపేదలైన తమను విస్మరించారని ఆరోపించారు.
డబుల్‌బెడ్రూం ఇంటిలో ఉంటామని, తమకు కేటాయించాలని ఇక్కడ ధర్నా చేసినా పట్టించుకోకపోవడంతో ఇలా పురుగులమదు తాగినట్లు తెలిపారు. స్థానికులు 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా..వారు చికిత్స పొందుతున్నారు. తమకు ఇళ్లను కేటాయించాలని అప్పారావు భార్య గంగ, నరేష్ భార్య నీల ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment