rdo office
-
పాలీగ్రాఫ్‌తో పటాపంచలు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి నిప్పు లాంటి నిజాలు బయటకొస్తున్నాయి. గతేడాది జూలై 21వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే.. ఫైళ్లు దహనం చేశారంటూ సీఎం చంద్రబాబు సర్కారు చేసిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జి.గౌతమ్‌తేజ్‌కు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడైంది. అతడే నేరం చేశాడని నిరూపించలేమని అందులో పేర్కొన్నారు. దీంతో ఇదంతా కావాలని చేసిన సంఘటనగా ప్రభుత్వ వ్యవస్థలతో చిత్రీకరించేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రలు బెడిసికొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన కూటమి ప్రభుత్వం మదనపల్లె ఘటనలో మాత్రం డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఆగమేఘాలపై హెలికాప్టర్లో ఘటనాస్థలానికి పంపి ఏదో జరిగిపోయిందంటూ హంగామా చేసింది.గౌతమ్‌తోపాటు అప్పటి ఆర్డీవో మురళి, మరికొందరు కలసి కార్యాలయానికి నిప్పు పెట్టారని, భూములకు సంబంధించిన ఫైళ్లను దహనం చేశారంటూ ఆరోపించింది. ఈ ఘటనపై తొలుత అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సెక్షన్లు, కేసు దర్యాప్తు తీరును మార్చేశారు. నాలుగు ప్రశ్నలు..ఈ కేసు మొత్తం గౌతమ్‌తేజ్ చుట్టూ తిరిగింది. కుట్ర కోణం ఉందనే అనుమానంతో సీఐడీ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు చేయించారు. తెరవెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్ర ఏమిటి? అనే వాటిని వెలుగులోకి తేవాలని భావించారు. ఓ కేసుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం కీలకమైన పాలీగ్రాఫ్ పరీక్షను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తారు.సీఐడీ అధికారుల వినతి మేరకు 2024 నవంబర్ 26, 27వ తేదీల్లో అమరావతి ఏపీఎఫ్ఎస్ఎల్ అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్షలను నిర్వహించారు. సాంకేతికంగా నిజాలను రాబట్టేందుకు గౌతమ్‌తేజ్‌కు నాలుగు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. అగ్నిప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ తపస్విని ఫోన్ చేసి చెప్పడానికి ముందే మీకు తెలుసా..? సెక్షన్లో నిప్పు పెట్టింది మీరేనా? కార్యాలయంలో ప్రమాదం సృష్టించడానికి ఎవరితోనైనా కలసి ఇలా చేశారా?అగ్ని ప్రమాదానికి కారణాలను దాచి పెడుతున్నారా? అనే నాలుగు ప్రశ్నలకు ‘కాదు..’ అని గౌతమ్‌తేజ్ సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రమాదంలో కుట్ర కోణం లేదని, తెర వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఇందులో భూముల వ్యవహారం కూడా లేదని తేలిపోయింది. అరెస్టు సమయంలో గౌతమ్‌తేజ్ నుంచి సేకరించిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు మినహా ఈ కేసులో నేర నిరూపణకు ఇతర ఆధారాలేవీ లేవని అతడికి బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానం సైతం పేర్కొంది. వ్యవస్థలతో దుష్ప్రచారం..మదనపల్లె ఫైల్స్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పదేపదే అబద్ధాలు వల్లె వేశారు. ప్రమాదం జరిగిన మర్నాడు నాటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లను హెలికాప్టర్లో మదనపల్లెకు హుటాహుటిన పంపారు. కనీసం దర్యాప్తు కూడా జరగక ముందే ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్ అని నాడు డీజీపీ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సెక్షన్లను మార్చడంతో కేసు దర్యాప్తు తీరు పూర్తిగా మారిపోయింది.వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కేసుల నమోదుతో వేధింపులకు గురి చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలు సైతం వెబ్సైట్లో మాయం చేశారు. ఇక రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఏకంగా మదనపల్లెలో మకాం వేసి అణువణువూ గాలించినా ఫలితం శూన్యం. వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులు, ఉద్యోగులు, అధికారులను సీఐడీ రోజుల తరబడి విచారించింది. సీఐడీతోపాటు రెవెన్యూ, పోలీసు, ఫైర్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులను మదనపల్లెలో మోహరించింది.పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షగట్టి విష ప్రచారం..ఈ అగ్ని ప్రమాదం ఘటనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు పదేపదే విష ప్రచారం చేశారు. మదనపల్లెలో ప్రభుత్వ భూములను దోచుకున్నారంటూ తప్పుడు ఆరోపణలతో బురద చల్లారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేకున్నా మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పెద్దిరెడ్డి మద్దతుదారులను అక్రమ కేసులతో వేధించారు. ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోగా, ఎల్లో మీడియా దీనికి వంత పాడింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక! అంటూ తప్పుడు కథనాలను వండి వార్చింది. పచ్చ మీడియాలో ఏది రాస్తే పోలీసులు దాన్నే పాటించారు. విషపూరిత కథనాలను ప్రచురించిన రోజే నేతల నివాసాల్లో సోదాలు జరిగేవి. -
ఆర్డీవో ఆఫీసులోనే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటంపై పెద్దదుమారమే రేగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో శనివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. వివరాలిలా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పోలీసులు, ఇతర ఉద్యోగులు నవంబర్ 21 నుంచి 29 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిని భద్రపరిచే విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు.. సీల్ లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటం వివాదానికి కారణమైంది. ఈ విషయమై పోలింగ్ ఏజెంట్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాటిని తెరిచి ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి కౌంటింగ్ పాసుల కోసం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లు ఈ విషయాన్ని గుర్తించి, ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ ఆఫీ సర్ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన.. లాఠీ చార్జ్ ఆందోళనకారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్డీఓ అనంతరెడ్డి చాంబర్ నుంచి మరో గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ టి నుంచి డోర్‌ను బలంగా బాదారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచె ప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల్లో ఫలితాల సమయంలోనూ అధికారులు ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రిటర్నింగ్ అధికారి కూడా ఆయనే కావడంతో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మ«ధ్య తోపులాట చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయానికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళీకేరీ రాత్రి 10.30 గంటలకు ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్నారు. బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు, బాక్స్‌లను భద్రపరిచిన విధానంపై ఆరా తీశారు. ఈ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల ఏజెంట్లు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంపై మీకెంత నమ్మకం ఉందో మాకూ అంతే ఉంది. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకే మేమున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రాగలం’అని చెప్పారు. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసు ముందు బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తోపులాటలో పంబ శ్రీను అనే వ్యకికి చేతికి బలమైన గాయాలు కాగా.. కృష్ణ అనే మరో వ్యక్తి తలకు గాయమైంది. ఆగ్రహించిన ఆందోళనకారులు ఆర్డీఓ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. -
పట్టా మార్పిడికి రూ.13 లక్షలు డిమాండ్
నాగర్‌కర్నూల్ క్రైం: ఓ డిప్యూటీ తహసీల్దార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజి పేట మండలం మారేపల్లికి చెందిన వెంకటయ్య అదే గ్రామంలో మూడెకరాల 15 గుంటలను 2016లో కొనుగోలు చేశాడు. ఈ భూమిని తన పేరున పట్టా మార్పిడి కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన మల్లేశ్.. ఈ భూమిని 2006లో తనకు అమ్మారని వెంకటయ్య పేరు మీద పట్టా చేయొద్దంటూ అదే కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో వివాదం నడు స్తోంది. దీనిపై జేసీకి ఫిర్యాదు చేసేందుకు వెంకటయ్య కలెక్టరేట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల సి–సెక్షన్లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి అతనికి తారసపడ్డారు. వెంకటయ్యకు అనుకూలంగా పట్టా వచ్చేలా చూస్తానని అందుకు రూ.13 లక్షల లంచం ఇవ్వాలని జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా చివరికి రూ.10 లక్షలు విడతల వారీగా ఇవ్వాలని సూచించారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించగా సోమవారం వల పన్ని వెంకటయ్యతో నగదును తీసుకుంటున్న జయలక్ష్మిని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ కృష్ణాగౌడ్ తెలిపారు. -
నలుగురి ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చోటుచేసుకొంది. పెట్రోల్ బాటిళ్ళతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమ పంట పొలానికి వెళ్లే దారిని కబ్జా చేసి గేటు పెట్టారని ఆర్డీవోకు ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆర్డీవో గోపిరామ్... పొలానికి వెళ్లే దారిని చూపాలని ఈ మేరకు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
‘ఎస్ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’
సాక్షి, రంగారెడ్డి : 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారనే ఆవేదనతో.. జంగయ్య అనే రైతు మంగళవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. పాల్గుట్ట గ్రామనికి చెందిన రైతు జంగయ్య తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాక తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. భూమి దగ్గరకు వెళ్లకుండా ఎస్ఐ రేణుకా రెడ్డి తనను బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి తనకు దక్కదనే భయంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు జంగయ్య. -
ఆస్తికోసం కుమారుల అమానుషం
తెనాలి: ఆదరించకపోగా, చిత్రహింసలకు గురిచేస్తున్న కుమారుల అమానుషానికి ఓ వృద్ధ జంట భయంతో వణికిపోతోంది. ఉన్న ఇంటిని విక్రయించాలంటూ కొడుతున్న కుమారుల రెండురోజుల క్రితం పారిపోయిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’ సమావేశంలోనూ ఆర్డీఓ జి.నరసింహులుకు తన గోడు విన్నవించారు. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన 64 ఏళ్ల మర్రిపూడి నరసయ్య గతంలో సంగం డెయిరీలో బుల్ అటెండెంట్‌గా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. దేవతా విగ్రహాల తయారీలో కూలీగా ఒకరు, మరొకరు కాంట్రాక్టరుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కష్టార్జితంతో 74 సెంట్ల స్థలంలో కొంత మేర ఇల్లు నిర్మించుకున్నాడు. 2006లో కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం కుమారులను సంప్రదించగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, వచ్చే డబ్బుతో చెల్లి పెళ్లి చేయాలని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే నరసయ్య తన కుమార్తె పెళ్లి చేశారు. ఉద్యోగవిరమణతో వచ్చిన డబ్బు ఖర్చయ్యాక కొడుకుల నైజం బయటపడింది. అప్పటికే పెళ్లిళ్లయిన ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లోనే వేరు వంట ఆరంభించారు. చేసేదిలేక నరసయ్య దంపతులు కూడా వేరుగా వంట చేసుకుంటున్నారు. కొద్దిరోజులకు ఇంటిపైన రేకుల షెడ్డు వేసుకుని అందులోకి వెళ్లిపోయారు. ఇల్లు అమ్మి డబ్బు పంచాలంటూ కొడుకులు చేయిచేసుకొంటున్నారు. వృద్ధ దంపతులు నెలనెలా వచ్చే రూ.1000 పింఛన్ ఖర్చులకుచాలక కుమార్తెకు తెలిసినవాళ్ల దగ్గర అప్పులు తీసుకున్నారు. ఇందుకుగాను ఇల్లు అగ్రిమెంటు రాసి, ఆమె పేరిట తనఖా రిజిస్టరు చేశారు. అప్పట్నుంచి కొడుకులు మరింతగా వేధింపులు ప్రారంభించారు. పెద్ద కొడుకు నరసయ్య ఇంట్లో, రెండో కుమారుడు తెనాలిలో నెలకు రూ.4 వేల అద్దె ఇస్తూ నివసిస్తున్నారు. వారిద్దరూ తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నరసయ్య భార్యకు ఆరోగ్యం బాగోలేక చిక్కిశల్యమైంది. బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలోనూ వారిని ఆదుకోగా ఇంటి విషయమై తరచూ గొడవలు పెట్టుకోవటం కొడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కొడుకులను పిలిపించిన పోలీసులు, ఎవరో పెద్దమనిషి ఫోను చేయటంతో కేవలం హెచ్చరికలతో సరిపెట్టి పంపించేశారు. రెండురోజుల క్రితం రెండో కొడుకు, ఇతర బంధువర్గం ఉండగానే పెద్దకొడుకు నరసయ్యపై దాడిచేశాడు. భయంతో పోలీసులను ఆశ్రయించిన నరసయ్య తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాడు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తనను రక్షించాలని కోరారు. తన ఇంటినుంచి బిడ్డలను ఖాళీచేయిస్తే వేరొకరికి అద్దెకు ఇచ్చి, కొంతయినా బాకీలు తీర్చుకుంటామని వేడుకున్నారు. -
ఫైలు కదలాలంటే .. పైసలివ్వాల్సిందే!
కోడుమూరు పట్టణంలోని ఒక రేషన్ షాప్‌నకు బీసీ–డీ రిజర్వేషన్ వచ్చింది. దానికి బీసీ–ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీపడ్డాడు. ఇందుకోసం ఏకంగా కర్నూలు ఆర్డీఓ కార్యాలయం నుంచి బీసీ–డీ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో లంచాల బాగోతానికిఇదొక నిదర్శనం మాత్రమే. కర్నూలు సీక్యాంప్ : కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఇక్కడ పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదని ప్రజలు, రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బల్ల కింద చేయిపెడితేనే బల్ల మీద ఫైలు ముందుకు కదులుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు రోగి అయినా, దివ్యాంగుడైనా, చివరకు ఎన్ని కష్టాల్లో ఉన్నా.. కార్యాలయ సిబ్బంది కనికరం చూపడం లేదు. ‘మీ ఇబ్బందులతో మాకేంటి?! మాకివ్వాల్సింది ఇస్తేనే పని అవుతుంద’ని తెగేసి చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోనెగండ్ల మండలానికి చెందిన ఒక మహిళా డీలర్ చనిపోయారు. డీలర్‌షిప్‌ను ఆమె భర్త పేరుపై మార్చాలని కోరగా.. కార్యాలయంలోని ఓ అధికారి రూ.30 వేలు డిమాండ్ చేశారు. తనకు పక్షవాతం ఉందని, ఇబ్బందుల్లో ఉన్నానని సదరు వ్యక్తి వేడుకున్నా.. ఆ అధికారి కరుణ చూపలేదు. ‘నీకు ఎన్ని రోగాలు ఉన్నా మాకు అనవసరం. అడిగిన మొత్తం ఇస్తేనే నీ పేరుమీద మారుస్తా’ అంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. బాధితుడు దాదాపు ఆరు నెలల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాలేదు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి చివరకు అప్పుచేసి అడిగింది సమర్పించుకున్నాడు. ఆ వెంటనే పని పూర్తయ్యింది. ఈ ఏడాది మార్చిలో మీ–సేవ కేంద్రం కోసం కర్నూలు నగరానికి చెందిన ఓ దివ్యాంగుడు దరఖాస్తు చేసుకున్నాడు. వైకల్యం ఉండడంతో త్వరగానే అనుమతి వచ్చింది. అయితే.. ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆర్డీఓ కార్యాలయంలో రూ.40 వేలు లంచం అడిగారు. నానా అగచాట్లు పడి ఆ మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి వచ్చింది. రేషన్ షాప్ పనులకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు, బర్త్ సర్టిఫికెట్‌కు రూ.5 వేలు, మీ–సేవ కేంద్రానికి రూ.40 వేలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి ఇవ్వడానికి రూ.15 వేలు.. ఇలా ప్రతి పనికీ ఓ రేటు పెట్టి జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 20 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు, రైతులు నిత్యం కార్యాలయానికి వస్తుంటారు. వీరిని మామూళ్ల కోసం పీడిస్తుండడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా ఏడాదికేడాది ‘రేటు’ మారిపోతోంది. తక్కువ మామూళ్లు ఇచ్చేందుకు వస్తే.. ‘అది కిందటి ఏడాది రేటు. ఇప్పుడు పెరిగిపోయింది’ అంటూ నిర్మోహమాటంగా చెబుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పైగా తాము లంచం అడిగినట్లు బయట చెబితే శాశ్వతంగా పని ఆపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. వారు అడిగింది ఇచ్చుకోలేక, బయట చెప్పుకోలేక బాధితులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సబ్‌డివిజన్ జాప్యం చేస్తున్నారు: కర్నూలు మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్– 507లో నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. సబ్‌డివిజన్ చేయమని 2012 నుంచి అడుగుతున్నా.. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పట్టించుకోవడంలేదు. రూ.20 వేలు అవుతుందని చెప్పడంతో కంగుతిన్నా. మా పొలంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం నాకు రూ.90 వేలు ఇస్తుంది. అయితే.. నా పొలం సబ్‌డివిజన్ చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. -నారాయణ నాయక్, రుద్రవరం నా దృష్టికి తెస్తే చర్యలు: మా కార్యాలయంలో లంచం తీసుకోవడం లాంటి పనులు సిబ్బంది చేయరు. ఒకవేళ లంచం అడిగితే నా దృష్టికి తీసుకురండి. వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.- హుసేన్ సాహెబ్, ఆర్డీఓ -
గృహ‘మందు’ ఉంటామంటూ..
ఖమ్మంరూరల్: ఆరెకోడు గ్రామానికి చెందిన చెందిన బాణోతు అప్పారావు, గుగులోత్ నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదని సోమవారం ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ఊరికి 18 ఇళ్లు మంజూరు కాగా..భూములు, ఆస్తులు ఉన్న వారికి కేటాయించి, నిరుపేదలైన తమను విస్మరించారని ఆరోపించారు. డబుల్బెడ్రూం ఇంటిలో ఉంటామని, తమకు కేటాయించాలని ఇక్కడ ధర్నా చేసినా పట్టించుకోకపోవడంతో ఇలా పురుగులమదు తాగినట్లు తెలిపారు. స్థానికులు 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా..వారు చికిత్స పొందుతున్నారు. తమకు ఇళ్లను కేటాయించాలని అప్పారావు భార్య గంగ, నరేష్ భార్య నీల ప్రభుత్వాన్ని కోరారు. -
మున్సిపల్ వ్యవస్థలు నిధులపై దృష్టి పెట్టాలి
ఒంగోలు అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందించి మున్సిపల్ వ్యవస్థలు సొంత నిధులను పెంచుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం అన్నారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన కళాప్రాంగణం ప్రారంభించారు. రూ.40కోట్లతో ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలు వరకు ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైపులైన్ పనులు, రూ.9కోట్లతో గోరంట్ల కాంప్లెక్స్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి పైలాన్లు ఆవిష్కరించారు. అనంతరం ఏ1 కన్వెన్షన్ హాలులో పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. స్మార్ట్ సిటీల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటికీ దేశంలో మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీలు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తే పన్నుల రూపంలో నిధులు పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా మున్సిపాలిటీలకు రూ.85వేల కోట్లు కేటాయించామన్నారు. జిల్లాకి సంబంధించి రామాయపట్నం పోర్టు ఏర్పాటుకి కృషి చేస్తామని తెలిపారు. వాన్‌పిక్ పై చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపినట్లు చెప్పారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపితే పరిశీలించి తప్పక సహకరిస్తానన్నారు. చీమకుర్తి నుంచ హైవే ఏర్పాటు చేస్తామని వివరించారు. తన రాజకీయ ప్రవేశం ఒంగోలు నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 1977లో ఎంపీగా మొదటిసారి ఒంగోలు నుంచే పోటీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అధ్యక్షత వహించారు. -
భారమైపోయానని బాధిస్తున్నారు..!
► కొడుకు, కోడలు హింసకు గురి చేస్తున్నారంటూ వృద్ధురాలి ఆవేదన ► న్యాయం కోసం ఆర్డీఓ కార్యాలయం వద్ద పడిగాపులు టెక్కలి : ఇంట్లో భారంగా ఉన్నానని కొడుకు, కోడలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తన పేరుపై ఉన్న పంట పొలాల్ని కాజేసేందుకు నిత్యం హింసిస్తున్నారని సంతబొమ్మాళి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు భోరున విలపించింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయం అధికారులను ఆశ్రయించింది. నలుగురు కుమార్తెలకు వివాహాలు చేశానని, చివరగా ఒక్కగానొక్క కుమారుడు కుర్మయ్య తనను చేరదీస్తాడనుకుంటే భార్య కృష్ణమ్మతో కలిసి తనను నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వాపోయింది. తన పేరు మీద సుమారు 2 ఎకరాల పంట పొలం ఉందని, అది ఇవ్వాలంటూ వేధిస్తూ కనీసం తిండి కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. గ్రామంలో చేరదీసిన వారి వద్ద తలదాచుకుంటూ కాలం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అధికారులు న్యాయం చేయాలని విన్నవించింది. -
గుడివాడలో అఖిలపక్షంపై లాఠీచార్జి
-
గుడివాడలో అఖిలపక్షంపై లాఠీచార్జి
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇలపర్రు చేపలచెరువు భూములను ఎస్సీలకు పంచాలని కోరుతూ సోమవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముట్టడికి సీపీఎం, సీపీఐ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్షం నాయకులు నినాదాలు చేశారు. -
మరోచోటకు కలెక్టరేట్!
పీఆర్ అతిథిగృహంలో ఏర్పాటు చేసే అవకాశం ఆర్డీఓ కార్యాలయాన్నీ పరిశీలిస్తున్న అధికారులు నాగర్‌కర్నూల్: కలెక్టరేట్‌ను పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం (ఐఓసీ) నుంచి సమీపంలోని ఆర్డీఓ కార్యాలయానికిగానీ, పీఆర్ అతిథిగృహంలోకి గానీ మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి నాలుగు రోజులక్రితం కలెక్టర్ ఈ.శ్రీధర్ ఈ భవనాలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఐఓసీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కోర్టును నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని మూడో అంతస్తులో ఏర్పాటు చేశారు. అయితే కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చే వారు మూడు అంతస్తులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిపోయే అతిథులు, ప్రజాప్రతినిధులు, బాధితులతో ఇతర కార్యాలయాలకు అంతరాయం కలుగుతోంది. దీంతో నేరుగా కలెక్టరే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మూడో అంతస్తులో ఉ న్న కలెక్టరేట్‌ను గ్రౌండ్‌ఫ్లోర్‌కు మార్చాల ని మొదట భావించినా ఇక్కడ కాకుండా మరోచోట కలెక్టరేట్ ఉంటేనే బాగుం టుందని ఈ ఆలోచన చేశారంటున్నారు. వారం పదిరోజుల్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్‌ను మార్చేందుకు అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఇందులోభాగం గా దగ్గర్లోని ఆర్డీఓ కార్యాలయంలో ప లు మార్పులు, మరమ్మతులు చేసేం దుకు ఆర్అండ్బీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కలెక్టర్ ఈ.శ్రీధర్ నివాస గృహంగా ఉన్న పంచాయతీరాజ్ అతిథిగృహాన్ని కలెక్టరేట్ చేయాలన్న ఆలోచన ఉంది. ఇక్కడైతే కలెక్టర్ కార్యాలయంతోపాటు సంబంధిత శాఖలకు సరిపోయినంత స్థలం ఉండటంతో దీనిపైనే అధికారులంతా మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ నివాసాన్ని ఆర్డీఓ కార్యాలయానికి మార్చి పీఆర్ అతిథిగృహాన్ని పూర్తిస్థాయి కలెక్టరేట్‌గా మార్చేందుకు కలెక్టర్ సుముఖత చూపినట్లు అధికారులు తెలిపారు. ఐఓసీలో ప్రస్తుతం 17 శాఖలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. కలెక్టరేట్ ఖాళీ అయితే మరో ఐదారు శాఖలకు అక్కడ ఆఫీస్‌లు ఏర్పాటు చేసేందుకు అవకాశం లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అతి త్వరలోనే కలెక్టరేట్‌ను మార్చేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం -
ఆ జీఓను రద్దు చేయాలి
శిరోముండనం కేసులో పీపీ తొలగింపుపై నిరసన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా రామచంద్రపురం: వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బాధితుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆ జీవోను నిరసిస్తు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ, ఏఐకేఎంఎస్, దళిత సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజా సంఘాల నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, జె.æ సత్తిబాబు, ఆర్. రాగులు, జి. ఆదినారాయణ, వి. భీమశంకరం, వైఎస్సార్ సీసీ నాయకుడు పెట్టా శ్రీనివాసరావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి. సిద్ధూ తదితరులు మాట్లాడుతూ పీపీని తొలగించి ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తోట త్రిమూర్తులును భుజాన మోస్తూ దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఆ జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాయన్నారు. ఈమేరకు ఆర్డీఓ కె. సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. తొలుత ప్రధాన రహదారిలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం కళ్లకు నల్లబ్యాడ్జిలు కట్టారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వెంకటాయపాలెం ఎంపీటీసీ సభ్యుడు దడాల రవికుమార్, నాయకులు దడాల వెంకటరమణ, బొమ్ము మోహనరావు, మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాం, వినకోటి కొండ, పలివెల ప్రభాకర్, బొమ్ము సతీష్, ఇసుకపట్ల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేటను చూసి గర్వపడుతున్నా..
♦ కేంద్రం మన్ననలు పొందిన‘పేట’ ♦ వచ్చే యేడాది 5 అవార్డులు రావాలి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : సిద్దిపేట మండల పరిధిలోని ఇబ్రహింపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలతో పాటు మండల పరిషత్‌కు కేంద్రం మూడు అవార్డులను ప్రదానం చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సిద్దిపేట ప్రజలు, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాధించిన ఈ ఘనతను చూసి గర్వపడుతున్నానని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు అవార్డులను అందుకున్న అధికారుల, ప్రజాప్రతినిధులను మంగళవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అంతకుముందు సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డితో మాట్లాడుతూ అవార్డుల వివరాలు, కేంద్ర ప్రభుత్వ ఎంపిక ప్రమాణాలను, ఆయా గ్రామాల్లో సాధించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పరిశుభ్రత, ప్రమాణికంగా తెలంగాణ రాష్ట్రానికి 7 అవార్దులను వివిధ అంశాల్లో ఎంపిక చేసిందన్నారు. అందులో సిద్దిపేట మండలం మూడు అవార్డులను కైవసం చేసుకొవడం గొప్ప విషయమన్నారు. జాతీయ స్థాయిలో సిద్దిపేట ప్రతిష్టను ఇనుమడింపజేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు. వందశాతంతో దశ తిరిగింది జిల్లాలో ఆయా గ్రామ పంచాయితీల్లో వందశాతం పన్ను వసూలు జిల్లా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగు పరిచిందని, కేంద్రం జిల్లా అధికారులు సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని 14వ ఆర్థిక సంఘం కింద కోట్లాది నిధులను విడుదల చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది వార్షిక ఆస్తిపన్నులో జిల్లాలోని 1050 గ్రామ పంచాయితీలకు కేంద్రం రూ. 53 కోట్లను పారితోషికంగా ప్రకటించిందన్నారు. ఒక్కో గ్రామ పంచాయితీకి రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకం రానుందన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణంలో రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా నిలిచి 30 వేల గుంతలతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అందులో సిద్దిపేట నియోజకవర్గం 10 వేల ఇంకుడుగుంతలతో ఆగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డులు అందుకున్న డీపీఓ సురేష్‌బాబు, సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డి, సిద్దిపేట ఎంపీపీ యాదయ్య, ఇబ్రహీంపూర్, లింగారెడ్డి పల్లి సర్పంచ్‌లు లక్ష్మి, రామస్వామిను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి డీలర్లుగా డ్వాక్రా మహిళలు
విజయనగరం కంటోన్మెంట్: ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు ఇన్చార్జి డీలర్లుగా డ్వాక్రా మహిళలను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ ఎస్. శ్రీనివాసమూర్మి తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ వేయింగ్ మిషన్ల ద్వారానే సరుకులు ఇవ్వాలని, అలా ఇవ్వనివారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేస్తామన్నారు. జిల్లాలోని కొత్తవలస, వేపాడ, ఎస్ కోట ప్రాంతాల్లో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఏపీఐఐసీ ద్వారానే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్, శారదా స్టీల్స్ వంటి యాజమాన్యాలు కొత్తవలసలో భూములు కలిగి ఉన్నాయనీ, వారికి శాఖా పరం గా అవసరమైన సేవలందిస్తామని తెలిపారు. అలాగే వేపాడ మండలం కొండగంగుబూడి, కొత్తవలస మండలం చినరావుపల్లి, పెదరావుపల్లి, కంటకాపల్లి, చీపురువలస, ఎస్‌కోట మండలం చిన్న ముషిడిపల్లి, తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారన్నారు. -
జంబ్లింగ్ వద్దే వద్దు!
రాష్ర్ట ప్రభుత్వ చర్యలపై భగ్గుమన్న విద్యార్థిలోకం ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానంపై నిరసన జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిన రహదారులు మంగళగిరిలో విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం నరసరావుపేట ఆర్డీవో కార్యలయం ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని దయారత్నం కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ విధానం రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినుకొండలో స్తంభించిన ట్రాఫిక్.. వినుకొండ పట్టణంలో ప్రైవేటు కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కొద్దిసేపు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలకు లేని విధానం కేవలం ప్రైవేటు విద్యార్థులపై రుద్దటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కృష్ణవేణి, వాణి, గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్లో ధర్నా.. పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ప్రైవేట్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యార్థి జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టిల్స్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎత్తివేయాలని డి మాండ్ చేశారు. పట్టణంలోని తొమ్మిది ప్రైవేట్ కాలేజీలకు చెందిన సుమారు వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. మాచర్లలో ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కార్యక్రమంలో కృష్ణవేణి, పల్నాడు, జయభారత్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు. మంగళగిరిలో పోలీసుల అత్యుత్సాహం జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటన సోమవారం మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యాజమాన్యాలు మంగళగిరిలో ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల వ్యవహార శైలిపై కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహ ం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్, ఐఐటీలలో లేని జంబ్లింగ్ విధానం ఇంటర్లో ప్రవేశపెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేయగా అదేమంత్రి వర్గంలో ఉన్న నేటి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి ఆ విధానం ప్రవేశపెట్టడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జ్యోతి, పవన్, పులిపాక ఐజాక్, శ్యామ్, అభిషిత్, కిషోర్, నవీన్, భాషా తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
కొవ్వూరు: నీరులేక పంటలు ఎండిపోతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతన్న కన్నెర్ర చేశాడు. ఎత్తిపోతల పథకానికి నీరు నిలిపేయడంతో రైతులు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. నీటిని నిలిపేయడంపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి రైతులు తాళం వేసే ప్రయత్నం చేశారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఆర్డీవో కార్యాలయం ముట్టడి
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం ఆశావర్కర్లు ముట్టడించారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు చేస్తున్న నిరసనలకు సీఐటీయూ నాయకులు తమ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు ఆశావర్కర్లు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులకు ఆశావర్కర్లకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటలకు పైగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సీఐటీయూ కార్యకర్తలతో పాటు, ఆశావర్కర్లను అరెస్ట్ చేశారు. -
ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
నిజామాబాద్(కామారెడ్డి): కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని పలువురు రైతులు శుక్రవారం ముట్టడించారు. బెల్లం క్వింటాకు రూ.2800 చొప్పున ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలు చేతబట్టుకుని అధికారులను హెచ్చరించారు. -
అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే
- ఉడమలకుర్తి, చిన్నపల్లి గ్రామస్తుల ధర్నా - మద్దతు తెలిపిన ఎమ్మెల్యే చాంద్‌బాషా కదిరి: ‘‘తలుపుల మండలం గుండ్లకొండలో చేపట్టిన అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే.. లేదంటే అందరం ఇక్కడే ఏదైనా తాగి చచ్చిపోతాం..’’ అని ఆ కొండను ఆనుకొని ఉన్న చిన్నపల్లి, ఉడమలకుర్తి వాసులు హెచ్చరించారు. బుధవారం ఆ రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సుమారు 4 గంటల పాటు ధర్నాకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గుండ్లకొండలో తమ ఇలవేల్పు దేవుడు గుండ్లకొండరాజు గుడి ఉందని, మైనింగ్ లీజుదారులు ఆ గుడిని కూల్చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. కొండపై ఉన్న పురాతనమైన గుడి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని, తక్షణం లీజు అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనింగ్‌కు అనుమతులు కోరితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారని శాపనార్థాలు పెట్టారు. ఆ బ్లాస్టింగులతో తమ ఇంఇ గోడలు నెర్రెలు చీలడంతోపాటు వాటి శబ్దాలకు ఇళ్లలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అక్రమ మైనింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నపల్లి, ఉడమలకుర్తి గ్రామస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా హామీ ఇచ్చారు. ఆయన ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ఆ గ్రామస్తులతో కలిసి ఆర్డీఓతో మాట్లాడారు. తాను కూడా త్వరలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తానన్నారు. -
‘భూ సేకరణ’వద్దే వద్దు
- ఆర్డీఓ కార్యాలయూన్ని ముట్టడించిన సీపీఐ నేతలు - 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు కామారెడ్డి : భూ సేకరణ చట్టాన్ని సవరించొద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరోలో భాగంగా ఆపార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైల్‌భరోలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు వీఎల్ నర్సింహారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.బాల్‌రాజులు మాట్లాడుతూ..ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న భూ సేకరణ చట్టా న్ని మోడీ ప్రభుత్వం సవరించడం సరికాదన్నారు. ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాల్‌రాజు, దశరథ్, భానుప్రసాద్, నర్సింలు, రాజశేఖర్, మల్లేశ్, మల్లయ్య, ఖాసీం, రాజాగౌడ్, అరుణ్, సుధీర్, సంతోష్, ప్రవీన్, శ్రీను పాల్గొన్నారు. మన భూమిపై మన హక్కు వినాయక్ నగర్ : మన భూమిపై మన హక్కు నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు పేద రైతులను రోడ్డు పాలు చేసేలా ఉందని ఆరోపిం చారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి భారీ ర్యాలీగా బస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు ప్రేమ పావని మాట్లాడుతూ... ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు కార్పోరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. భూ సేకరణ చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సభల అంగీకారం మేరకే భూమి సేకరించాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్ రేటు కంటే నాలుగు రేట్లు అధికంగా ధర చెల్లించి వారికి పునరావాసం కల్పించాలని అన్నారు. కానీ, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న భూ సేకరణ బిలు వీటన్నింటికి విరుద్దంగా ఉందని మండిపడ్డారు. రాస్తారోకో వద్దకు ఒకటో టౌన్ పోలీసులు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఏఐటీయూసీ నాయకులు బోసు బాబు, వెంకట్‌రెడ్డి, ఓమయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
భార్య గొంతు నులిమి హత్యచేసిన భర్త..?
- హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు - గాయాలు చూసి ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లి నవీపేట: క్షణికావేశం ఇద్దరి జీవితాలను తారుమారు చేసింది. ఈ సంఘటనలో ఒకరు భార్య విగత జీవి కాగా భర్తపై కేసు నమోదైంది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్ కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన తెనుగు అంజయ్య నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్య తెనుగు అనితతో తరచూ గొడవ పడేవాడు. వీరికి పలుమార్లు పంచాయతీ పెద్దలు, కుటుంబ పెద్దలు సర్ధిచెప్పారు. శుక్రవారం రాత్రి రోజూలాగే ఇరువురు కలిసి మధ్యం సేవించి మళ్లీ గొడవకు దిగారు. దీంతో అంజయ్య అనితను తీవ్రంగా కొట్టి గొంతునులిమి చంపేశాడని తెలిపారు. పక్క గ్రామమైన అనంతగిరిలో ఉండే అనిత తల్లి శారదకు ఫోన్ చేసి ‘మీకూతురు మెట్లపై నుంచి పడిపోయింది తొందరగా రావాలని’ సమాచారమిచ్చాడు. దీంతో దీంతో బంధువులంతా తరలివచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా మృతురాలి చెవి కింద రక్తం కారడంతో అనుమానం వచ్చి తల్లితరపు బంధువులు నిశితంగా పరిశీలించగా గొంతుపై గాయాలు కనిపించారుు. తమ కూతురును భర్త అంజయ్య హత్య చేశాడని మృతురాలి తల్లి శరద పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్, ఎస్సై వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తాగిన మైకంలో భర్త అంజయ్య తన భార్యను చంపాడని రూరల్ సీఐ విలేకరులకు తెలిపారు. మృతురాలికి అజయ్(9), అరవింద్(3) అనే తొమ్మిదేళ్ల లోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
'అనంతలో కరువును నివారించాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువును నివారించేందుకు చర్యలు చేపట్టాలని వామపక్ష కార్యకర్తలు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుగొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా కరువు కోరల్లో చిక్కుకుని ఉందని... అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపించారు. ఈ నిరసనలో సీపీఐ, సీపీఐ ఎం చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బాబు మారని మనిషి
కనీస వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సుమారు ఐదు గంటలపాటు కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మారిన మనిషనని చెప్పుకున్నా... ఆయన మారని మనిషే అని ఇప్పుడు నిరూపించుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం అర్బన్ : ‘నేను మారిన మనిషినని.. అంగన్వాడీని బలోపేతం చేస్తా.. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా’ అని ఎన్నికల్లో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబా బు మిహ ళలను మోసం చేశారని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఓబులు విమర్శించా రు. కనీవ వేతనాలు, రాజకీయ వేధింపులు, తదితర డిమాండ్లపై సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్థానిక ఆర్డీవో కా ర్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. సీఎం డౌన్.. డౌన్.. ము ఖ్యంత్రికి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మండుటెండలో దాదాపు నాలుగు గంటలపాటు మహిళలు బైఠాయించారు. ముట్టడిని ఉద్దేశించి ఓబు లు మాట్లాడుతూ రాష్ర్ట ఆర్థిక బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నటికీ మారరని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసినవారిపై గుర్రాలతో తొక్కించాడు.. వాటర్ క్యాన్లు విసిరించాడని చంద్రబాబు పాలనలో సా గిన అరాచకాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్టును బలోపేతం చేస్తామంటూనే ప్రధాని నరేం ద్రమోదీ బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఐసీడీఎస్ కు రూ. 16 వేల కోట్లు బడ్జెట్లో కేటాయిం చగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అందులో సగానికి తగ్గించి కేవలం రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. ముట్టడికి యత్నం... పలువురి అరెస్టు : డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో ఒక్కసారిగా పోలీస్ బలగాలు ఓబుల, ఇంతియాజ్, నల్లప్పతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేయబోయారు. దీంతో పోలీసులకు, సీఐటీయూ నాయకులకు తీవ్ర తోపులాట జరిగింది. ఓబుల ప్రతిఘటించినప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించా రు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, కార్యదర్శి సావిత్రమ్మలను మహిళ పోలీసు లు అరెస్ట్ చేయడానికి రాగానే మహిళలు వారిని చుట్టముట్టారు. జైలుకు వెళ్లాడానికై న సిద్ధంగా ఉన్నాం.. అంటూ.. తీవ్ర స్థాయి లో పోలీస్ చర్యలకు నిరసన వ్యక్తం చేశారు. పట్టువదలని అంగన్వాడీ ఉద్యోగులు ఆర్డీ ఓ కార్యాలయం ముట్టడికి యత్నించారు. లక్ష్మిదేవి, సావిత్రమ్మ, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్నిపోశారు. ఆడపిల్లలులేని ఆయనకు తమ కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేకపోతే సరైన గుణపాఠం నేర్పుతామని శాపనార్థాలు పెట్టారు. ఈ నెల 17నరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. -
గర్జించిన అంగన్వాడీలు
పాలకొండ: ప్రభుత్వం తమను మోసగించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితులను ఆదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అరెస్టులతో ప్రధాన రహదారి దద్దరిల్లింది. వివరాలు పరిశీలిస్తే... తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శుక్రవారం డివిజన్ పరిధిలోని వేలాది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆర్డీవో కార్యాలయం ముట్టడికి సన్నద్ధమయ్యారు. కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఉద్యోగులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటికే డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ మోహరించారు. ఆదే సమయంలో కార్యాలయానికి చేరుకున్న ఆర్డీవో కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలంతా ఆయనను చుట్టు ముట్టడంతో సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం అంగన్వాడీలు ఆందోళన తీవ్రతరం చేశారు. ప్రధాన రహదారిని దిగ్భందించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. మరోపక్క రోడ్డుకు ట్రాఫిక్ నిలిచిపోవడడంతో అంగన్వాడీ నాయకులను, వారికి సహకరిస్తున్న సీఐటీయూ నాయకులు 30 మందిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అప్పటికీ శాంతించని అంగన్వాడీలు పోలీసు స్టేషన్‌కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీగా వెళ్లారు. సి ఐ వేణుగోపాలరావు, ఎస్ ఐ ఎల్. చంద్రశేఖర్‌లు వీరికి సర్దిచెప్పి అరెస్టు చేసిన వారికి సొంత పూచీ కత్తులతో విడిచి పెట్టారు. శ్రీకాకుళంలో 650 మంది అరెస్టు పీఎన్ కాలనీ (శ్రీకాకుళం) : తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించక పోతే ఆందోళనను ఉద్ధృ చేస్తామన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్దకు భారీగా అంగన్వాడీలు చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు మొహరించాయి. సీఐటీయు నాయకులు, అంగన్వాడీలతో పోలీసులు వాగ్వావాదానికి దిగారు. దీంతో పోలీసులు 650 మంది అంగన్వాడీలను అరెస్టు చేసి 1వ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వీరిని సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు, అంగన్వాడీలు ఈ నెల 17న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సీఐటీయూ డి. గణేష్, కె. నాగమణి, అంగన్వాడీ ప్రతినిధులు కె. కళ్యాణి, హిమబిందు, లక్ష్మి పాల్గొన్నారు. -
‘పెనుగొండ’ ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
పెనుగొండ(అనంతపురం): బస్సు లోయలో పడి 16 మంది విద్యార్థులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పరిహారాన్ని అందించింది. ఈ ఏడాది జనవరి 7న అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మధ్య రోడ్డు నిర్మాణ పనుల కోసం తవ్విన లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 16 మంది విద్యార్థులు మృతి చెందగా చాలా మంది విద్యార్థులు గాయపడిన విషయం విదితమే. కాగా, బాధితులకు పరిహారం అందిస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం పెనుగొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 90 బాధిత కుటుంబాలకు రూ.1.59 కోట్ల పరిహారాన్ని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే పార్థసారధి అందజేశారు. -
రైల్వే భూ పరిహారంపై వివాదం
ఆర్డీఓ సమక్షంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల వాగ్వాదం కళ్యాణదుర్గం : రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంపై వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. వివరాల్లోకివెళ్తే... టీడీపీ నేతలు పాపంపల్లి రామాంజినేయులు, పురుషోత్తం తదితరులు ఆర్డీఓ రామారావుతో కార్యాలయంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిననారాయణపురం సర్పంచ్ సుగుణ భర్త వెంకటేశులు మరో 20 మంది రైతులు పరిహారం కోసం ఆర్డీఓను కలిసేందుకు వెళ్లారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు మూడు సార్లు రైతులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అన్ని భూములకు ఒకే తరహా పరిహారం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలు రామాంజినేయులు, పురుషోత్తం జోక్యం చేసుకుంటూ ఇదంతా ఎన్నికల ముందు లబ్ధి కోసం మాజీ మంత్రి రఘువీరారెడ్డి రైల్వే టెండర్లు పిలిపించి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు వెంకటేశులు, తదితరులు ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని, తాము ఆర్డీఓతో మాట్లాడుతుంటే ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మీరంటే మీరే రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్డీఓ సైతం నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ జయనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ కొల్లప్ప, వైస్ ఎంపీపీ వెంకటేశులు, ములకనూరు కిష్టాతో పాటు మరో 50 మంది రైతులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. రైతులకు పరిహారం ఇచ్చేదాక రైల్వే పనులు చేయనియబోమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు, రైతులు ఆందోళనకు దిగడంతో ఆర్డీఓ కార్యాలయం గందరగోళంగా మారింది. చివరికి జోక్యం చేసుకున్న ఆర్డీఓ రెవెన్యూ చట్టప్రకారం ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు వచ్చే పరిహారాన్ని అందజేస్తామని, ఇందులో రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఇప్పటికే పరిహారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయాన్ని మరోసారి పైఅధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. -
బాలింత మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలి
జగిత్యాల : బాలింత మృతికి కారణమైన రాయికల్ పీహెచ్సీ వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు శుక్రవారం జగిత్యాల తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం వేంపల్లివెంకట్రావ్పేటకు చెందిన మోత్కుల విజయ(20)ను తొలికాన్పు కోసం కుటుంబసభ్యులు రాయికల్ పీహెచ్సీలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచగా, గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో అపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్రరక్తస్రావం కాగా, జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన బంధువులు వెంటనే రాయికల్ ఆసుపత్రిపై దాడి చేశారు. విజయ మృతికి కారణమైన వైద్యులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సదరు వైద్యులు, సిబ్బంది వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారిపై కేసు నమోదు చేయాలని, విజయ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు జగిత్యాల ఆర్డీవో ఎస్.పద్మాకర్ వచ్చి విజయ మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కోసం వైద్యుల బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నేడు త్రీమెన్ కమిటీ విచారణ రాయికల్ : విజయ మృతిపై విచారణ కోసం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో డాక్టర్లు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, భానుప్రియ ఉన్నారు. వీరు శనివారం రాయికల్ ఆసుపత్రిలో విజయ మృతిపై విచారణ చేపట్టనున్నారు. -
ఈ అన్నం ఎలా తినాలి సార్..?
భోజనం ప్లేట్లతో ఎస్టీ హాస్టల్ విద్యార్థుల నిరసన పెనుకొండ: భోజన పదార్థాలు సరిగ్గా వండడం లేదని, అడ్డ పేర్లతో పిలుస్తూ చేయిచేసుకుంటున్నారని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణంలోని ఎస్టీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు భోజనం ఉన్న ప్లేట్లను వెంట తీసుకొని వచ్చి అధికారులకు చూపుతూ హాస్టల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఉడికీఉడకని అన్నం పెడ్తున్నారని, భోజనం నాణ్యంగా లేదని ఆరోపించారు. అడ్డ పేర్లతో తమను అవమానపరుస్తున్నారని, తాము హాస్టల్లో ఉండలేకపోతున్నామన్నారు. అనంత రం ఏఓ అబ్దుల్ హమీద్‌కు వినతి పత్రం అందజేశారు. ఏఓ స్పందిస్తూ వసతి గృహానికి వెళ్లి విచారించాల్సిందిగా తమ సిబ్బందిని పంపారు. కార్యక్రమం లో సీఐటీయు నాయకులు రమేష్, చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏటిపాకలో ఆర్డీవో కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో పరిపాలన పర్యవేక్షణకు భద్రాచలం సమీపంలోని ఏటిపాక గ్రామంలో రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పరిపాలన వ్యవహారాలను స్వీకరించటం పూర్తయిందని, ఆ మండలాల్లో పనిచేసే ఉద్యోగుల డిసెంబర్ వేతనాలను జనవరిలో ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. పరిపాలన గురించి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర శాఖల అధికారులతో చర్చించినట్లు తెలిపారు. -
పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జగన్మోహన్ సూచించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలనిపేర్కొన్నారు. పింఛన్ దరఖాస్తులను పరిశీలించిన విచారణాధికారులు సూచించిన విధంగా వీఆర్వోలు, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేయాలన్నారు. పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీలోపు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో మారిన రూల్స్ ప్రకారం తహశీల్దార్లు ఈ నెల 30వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. చెరువుల పూడికతీతను చేపట్టేందుకు ఉద్దేశించిన కాకతీయ మిషన్ కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా చేపట్టాలన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నిర్దేశించిన మొక్కలను నాటించాలని సూచించారు. డీఎస్వో వసంత్‌రావ్, ఆర్డీవో శివలింగయ్య, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా
కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. డీలర్లు, మధ్యాహ్న భోజన నిర్వహకులు, ఇతర ఉద్యోగుల తొలగింపునకు నిరసనగా పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, రాచమల్లు, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. -
రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా
వేలూరు: ముకుందరాయపురంలోని సిప్కాట్లో ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాణిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమిలనాడు వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి దయానిధి మాట్లాడుతూ సిప్కాట్లో ఫ్యాక్టరీల కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని యజమానులు తెలిపారని పేర్కొన్నారు. ఇప్పుడు వారి గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశను మిగల్చడం సరికాదన్నారు. భూమి కోల్పోయిన రైతుల వారసులకు అర్హత ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ప్రియదర్శినికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాశీనాథన్, అధ్యక్షులు రామచంద్రన్, తాలూకా కార్యదర్శి వెంకటేశన్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
భయం.. భయం..
- ఇరాక్‌లో అంతర్యుద్ధంతో జిల్లావాసుల కలవరపాటు - అక్కడ మనోళ్లంతా క్షేమమని సమాచారం - అయినా బిక్కుబిక్కుమంటున్న కుటుంబసభ్యులు ఇరగవరం/అత్తిలి/దేవరపల్లి : ఎడారి దేశాల్లో చీమ చిటుక్కుమన్నా ఇరగవరం, అత్తిలి మండలాలు ఉలిక్కి పడుతున్నాయి. పొట్టచేత పట్టుకుని ఆయా మండలాల్లోని పలు గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. దీంతో అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇక్కడ వారి కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరగవరం మండలంలోని 21 గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది వరకు గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్నారు. వీరిలో అయినపర్రు, అర్జునుడుపాలెం, కంతేరు, పేకేరు, అయితంపూడి, ఓగిడి, ఏలేటిపాడు గ్రామాలకు చెందిన వారు అధికం. ముఖ్యంగా కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, దోహ ఖత్తర్, అబుదుబాయ్ వంటి దేశాల్లో వీరు జీవనోపాధి పొందుతున్నారు. ఇరగవరం నుంచి 15 మంది.. ఇరగవరం మండలంలో సుమారు 15 మంది వరకు ఇరాక్ వెళ్లినవారిలో ఉన్నారు. వీరిలో అయితంపూడి గ్రామానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. వీరంతా క్షేమమని సమాచారం ఉన్నా.. వారి కుటుంబసభ్యుల్లో మాత్రం భయం వెంటాడుతోంది. యువత చూపు.. గల్ఫ్ వైపు.. ఇరగవరం, అత్తిల్లి మండలాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం ఆటుపోట్లతో కూడుకుని ఉండటంతో వ్యవసాయ కూలీలు, యువకులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలవైపు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న ఏజెంట్ల ద్వారా ఆయా దేశాలకు పయనమవుతున్నారు. అయితే కొందరి పరిస్థితి దుర్భరంగా ఉంటోంది. అక్కడ పడరాని పాట్లు పడుతూ అప్పులపాలవుతూ క ష్టాలు పడుతున్నారు. ప్రతిఏటా వందల సంఖ్యలో ఈ మండలాల నుంచి ఏడాది దేశాలకు పనుల కోసం వెళుతున్నారు. చేదు అనుభవాలు ఎన్నెన్నో.. దేశంకాని దేశంలో.. భాష కాని భాషతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతు న్నారు. అక్కడ ప్రమాదవశాత్తు కన్నుమూస్తే మృతదేశాలు స్వదేశాలకు పంపేందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇక్కడ కుటుంబసభ్యులు నెలల తరబడి మృతదేశాల కోసం పోరాడుతున్నారు. అత్తిలి మండలం, ఇరగవరం మండలంలోని కంతేరు, ఏలేటిపా డు, నారాయణపురం, ఇరగవరం గ్రామాల్లో ఇ లాంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. భయం వెంటాడుతోంది అయినపర్రు గ్రామానికి చెందిన వెలగల గోవిందరెడ్డి ఇరాక్ నుంచి ఫోన్లో ‘సాక్షి’ విలేకరితో మాట్లాడుతూ సైఫమ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పారు. రెండేళ్లుగా ఇక్కడ ఉంటున్నానని.. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నానని అన్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు పూర్తి భద్రత కల్పించారని చెప్పారు. ఏ విధమైన ఆందోళన లేకపోయినా యుద్ధం జరుగుతుందన్న భయం మాత్రం వెంటాడుతోందన్నారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. - వెలగల గోవిందరెడ్డి, ఇరాక్‌లో ఉంటున్న అయినపర్రు గ్రామస్తుడు అత్తిలి నుంచి 40 మంది.. అత్తిలి మండలానికి చెందిన సుమారు 3 వేల మంది గల్ఫ్‌దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో అధిక శాతం మంది దుబాయి, సౌదీ, మస్కట్, మలేషియా, సింగపూర్, ఇరాక్ దేశాల్లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఆరవల్లి గ్రామానికి చెందిన వారు సుమారు వెయ్యి మంది ఎడారి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు పాలి, కొమ్మర, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం, బల్లిపాడు, తిరుపతిపురం, వరిఘేడు, ఉరదాళ్లపాలెం, అత్తిలి, మంచిలి గ్రామాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్నారు. అంతర్యుద్ధంతో ఆందోళన ఇరాక్‌లో అంతర్యుద్ధంతో అక్కడకు వెళ్లినవారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీవీలు, పత్రికల్లో వస్తున్న కథానాలను చూడటంతోపాటు ప్రతిరోజూ ఫోన్లో వారి యోగక్షేమాలపై ఆ రా తీస్తున్నారు. మండలానికి చెందిన సుమారు 45 మంది ఇరాక్‌లో ఉన్నట్టు సమాచారం. దేవరపల్లి నుంచి 30 మంది ఇరాక్‌లో అంతర్యుద్ధంతో దేవరపల్లి మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాలకు చెందిన 30 మంది యువకులు ఉపాధి కోసం ఏడాది క్రితం ఇరాక్ వెళ్లారు. అక్కడ ఆయిల్ కంపెనీల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరిలో మత్స్యకార కుటుంబాలవారే ఎక్కువ మంది. యర్నగూడెం నుంచి 18 మంది, త్యాజంపూడి నుంచి 12 మంది యువకులు ఇరాక్ వెళ్లినట్టు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో తామంతా క్షేమంగా ఉన్నామని అక్కడి యువకులు శుక్రవారం ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. త్వరలో స్వగ్రామాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న భయం వెంటాడుతోందని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని యర్నగూడేనికి చెందిన ముంగర రాము, ఉప సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు ‘సాక్షి’ విలేకరికి చెప్పారు. తహసిల్దార్‌ను కలిసిన కుటుంబసభ్యులు యర్నగూడేనికి చెందిన యువకుల కుటుంబసభ్యులు శుక్రవారం తహసిల్దార్ అక్బర్ హుస్సేన్‌ను కలిసి ఇరాక్‌లో ఉంటున్న వారి వివరాలు అందజేశారు. తణుకుకు చెందిన ఏజెంట్ ద్వారా ఇరాక్ వెళ్లినట్టు చెప్పారు. ఏజెంటు వివరాలను సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. య ర్నగూడేనికి చెందిన ముంగర లక్ష్మణరావు, ముంగర రామకృష్ణ, ముంగర సత్యనారాయణ, గణుసుల లక్ష్మణరావు, గణుసుల సర్వేస్వరరావు, శిరువేరు రాంబాబు, ముంగర రవి, ముంగర ఏసు, ముంగర నాగేష్, గణుసుల శ్రీను, పంతుల సత్యనారాయణ, ముంగర అయ్యన్న, గణుసుల శ్రీను, ముంగర శ్రీను, ముంగర కన్నయ్య (కృష్ణంపాలెం), ముంగర శ్రీను (కృష్ణంపాలెం), గణుసుల చంద్రరావు, ఎలిగంటి తాతబ్బాయి ఇరాక్‌లో ఉన్నారు. త్యాజంపూడికి చెందిన మరో 12 మంది ఉన్నట్టు సమాచారం. వివరాలు అందించండి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇరాక్‌లో పనిచేస్తున్న జిల్లావాసులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని డీఆర్వో కె.ప్రభాకరరావు ఓ ప్రకటనలో కోరారు. ఇరాక్‌లో ఉంటున్న జిల్లావాసులకు ఎటువంటి హాని జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఏలూరు కలెక్టరేట్ 08812-230052, ఏలూరు ఆర్డీవో కార్యాలయం 08812-232044, నరసాపురం ఆర్డీవో కార్యాలయం 08814-274401, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం 08813-231488, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం 08821-223661 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. -
ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆందోళన
గుంటూరు జిల్లాలో రేషన్ డీలర్ల వ్యవహారంలో టీడీపీ తీవ్ర అక్రమాలకు పాల్పడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీడీపీ అక్రమాలను కచ్చితంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ ఆయన ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిధులున్నా నిర్లక్ష్యమేనా!
చేవెళ్ల: ‘చేవెళ్ల ప్రాంతవాసులు ఎంతో అదృష్టవంతులు.. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రజల విజ్ఞప్తులకు మోక్షం లభించి ంది. ఆర్డీఓ కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేయడమే కాకుండా నూతన భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. వెంటనే పనులు ప్రారంభమవుతాయి’.. 2013 సెప్టెంబరు 30న చేవెళ్లలో ఆర్డీఓ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, శ్రీధర్‌బాబు, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి సమక్షంలో ప్రజల హర్షధ్వానాల మధ్య అప్పటి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. కానీ పది నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కానేలేదు. దీంతో అద్దె, ఇరుకు గదుల్లో అధికారులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆదేశాలు జారీ.. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం గతంలో నగరంలోని అత్తాపూర్‌లో ఉండేది. దూరాభారం అవుతుండటంతో నగరం నుంచి చేవెళ్లకు తరలించాలని ప్రజలు పలుమార్లు విన్నవించుకున్నారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాన్ని చేవెళ్లకు తరలించింది. స్థానిక విద్యుత్ ఏడీ కార్యాలయ భవనానికి రూ.10 లక్షలతో మరమ్మతులు చేశారు. గత ఏడాది సెప్టెంబరు 30న అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఆర్డీఓ సొంత భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. చాలీచాలని గదులతో ఇక్కట్లు ఇక్కడి ఆర్డీఓ కార్యాలయానికి చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పది మండలాలకు సంబంధించిన రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయ భవనం రెవెన్యూ కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది కూర్చోవటానికి స్థలంలేని పరిస్థితి. ఆర్డీఓతో పాటు ఏఓ, డీఐఓ, డిప్యూటీ స్టాటిస్టిక్స్, ముగ్గురు డీటీలు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్, టైపిస్టు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం ఏవో, డీటీలకు మాత్రమే సరిపడా గదులున్నాయి. మిగతా అధికారులు చిన్నచిన్న ఇరుకు గదుల్లో ముగ్గురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సిబ్బంది నియామకం జరిగితే పనులు చేసేందుకు చెట్టు కింద బెంచీలు, కుర్చీలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందేమోనని వాపోతున్నారు. చెట్లకింద పడిగాపులు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి రెవెన్యూ సంబంధిత పనులపై నిత్యం వందలాది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయంలో వేచి చూసేందుకు స్థలంలేక కార్యాలయం వెలుపల చెట్ల కిందపడిగాపులు కాస్తున్నారు. రెవెన్యూ పరిధిలోని తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ప్రతి శనివారం జరిగే రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి నిర్వహించే కోర్టు కేసులతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల నామినేషన్లపర్వం నుంచి కౌంటింగ్ వరకు తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగాయి. భవన నిర్మాణాన్ని చేపట్టండి- చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయ సొంత భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనందున పనులు వెంటనే ప్రారంభించేలా అ దికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ని త్యం అధికారులు, సిబ్బంది ఇరుకుగదుల్లో పనిచేస్తున్నారని స్పష్టంచేశారు. పనిమీద వచ్చిన వారు కనీసం నిల్చునేం దుకు కూడా స్థలంలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యలు స్పందించి వెంటనే ఆర్డీఓ కార్యాలయ భవన నిర్మాణం పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జస్ట్..ఇచ్చేశారు..!
నిబంధనలు హుళక్కి. ఉన్నతాధికారుల ఆదేశాలూ బేఖాతర్. తమకు నచ్చితే చాలు రూలు,గీలూ జాన్తానై అంటూ ఎవరికైనా కట్టబెట్టేస్తారు. ఇదీ నాగకర్నూల్ నడిబొడ్డున ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీకి చెందిన స్థలానికి పట్టిన దుర్గతి. సంబంధిత అధికారులు, రాజకీయ పెద్దలూ కలిసి సాగించిన వ్యవహారం. నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: అధికారుల అవినీతి, రాజకీయ నేతల ఒత్తిళ్ల ఫ లితంగా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ నడిబొడ్డున కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. ప్రభుత్వం తిరస్కరించినా తప్పుడు తేదీలతో లోపాయికా రి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తప్పుడు డాక్యుమెం ట్లతో లావాదేవీలు అధికారుల అవినీతి బరితెగింపునకు నిదర్శనంగా మారింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిని అనుసరించి డీసీఎంఎస్‌కు స్థలం ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని వినియోగంలోకి తెచ్చి డీసీఎంఎస్‌కు ఆదా యం కల్పిస్తామని బీఓటీ(బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిన నిర్మాణాలకు అనుమతిచ్చారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిం ది. ఇందులో సాయిగార్డెన్స్ పేర నిర్మించిన ఫంక్షన్‌హాల్ ఒకటి. దీని నిర్మాణానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో డీసీఎంఎస్ అధికారులు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఆ తర్వాత జరిగిన మార్పిళ్లు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఉన్నాయి. పట్టణంలోని డీసీఎంఎస్ స్థలంలో ప్రధాన రహదారి పక్కన నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వెనక వైపు, పంచాయతీ కార్యాలయం ముందు బీఓటీ పద్ధతిన ఫంక్షన్‌హాల్ నిర్మాణం తలపెట్టి టెండర్లు పిలిచారు. ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా, ఇందులో వాడకంటి సురేష్ అనే వ్యక్తికి దక్కింది. డీసీఎంఎస్ స్థలాల్లో బీఓటీ పద్ధతిన నిర్మాణాలపై ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ‘సహకార’ కమిషనర్,రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో వీటిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఫంక్షన్‌హాల్‌కు సంబంధించి కొన్ని ఒప్పంద పత్రాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు నాగర్‌కర్నూల్‌లో డీసీఎంఎస్ స్థలంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి అనుమతించాలంటూ కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు డీసీఎంఎస్ ప్రతి పాదనలు పంపింది. వాటిని తిరస్కరిస్తూ జనవరి 16, 2010న కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని ఇక్కడి అధికారులు తుంగలో తొక్కారు. అనుమతి జనవరి 16,2010న తిరస్కరించగా, వాడకంటి సురేష్ అనే వ్యక్తికి జూన్22, 2010న సర్వేనం.331, 334, 335లో 5313 చదరపు గజాలు బీఓటీ పద్ధతిన నిర్మాణానికి అనుమతిస్తూ రిజిస్టర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తిరస్కరించిన ఐదునెలలకు బీఓటీ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకున్న డీసీఎంఎస్ ఆ తర్వాత మరో నెలరోజులకు తాపీగా కార్యవర్గ సమావేశంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి అనుమతిస్తూ తీర్మానం చేసుకోవడం అధికారుల, ప్రజాప్రతినిధుల బరితెగింపునకు పరాకాష్ట. రోడ్డు, క్లబ్ స్థలం ఆక్రమణ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బీఓటీ పద్ధతిన ఫంక్షన్‌హాల్ నిర్మాణం కాగా ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేసిన వ్యక్తి మరో అడుగు ముందుకు వేశారు. డీసీఎంఎస్ స్థలంతోపాటు పక్కనే ఉన్న రిక్రియేషన్ క్లబ్ (ప్రస్తుతం టీవీ రిలే స్టేషన్) స్థలం దాదాపు వెయ్యి గజాలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. పన్నెండు కోట్ల విలువైన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా పొందిన సురేష్ మరో రూ. రెండుకోట్ల విలువైన క్లబ్, రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. పర్యవేక్షించాల్సిన నగర పంచాయతీ కూడా ఈ ఆక్రమణ గురించి కిమ్మనడం లేదు. మూసివేయాలన్న ఆదేశాలు బేఖాతరు నాగర్‌కర్నూల్‌లోని డీసీఎంఎస్ స్థలం బీఓటీ పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో అవకతవకలు జరిగాయంటూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి సెప్టెంబర్ 10, 2012న సహకార కమిషనర్, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ని నియామక అధికారిగా నియమించారు. కొన్ని అవకతవకలు ఉన్నాయని గుర్తించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈనెల ఐదున విచారణ కోసం హాజరు కావాల్సిందిగా ఫంక్షన్‌హాల్ నిర్మించిన వి.సురేష్‌కు గతనెల 20న డీసీఓ ఎం.ప్రసాదరావు సమన్లు పంపారు. విచారణ పూర్తిచేసి తుది నిర్ణయం తీసుకునే వరకు ఫంక్షన్ హాల్ మూసేయాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇవేవీ డీసీఎంఎస్ అధికారులు, ఫంక్షన్‌హాల్ యజమాని మాత్రం పట్టించుకోలేదు. మరోసారి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేశారు. ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. నోటీసులు జారీ చేస్తాం సాయిగార్డెన్స్ నిర్మాణం డీసీఎంఎస్ స్థలం కన్నా అధికంగా ఉంది. రోడ్డు, క్లబ్ స్థలం ఆక్రమించి నిర్మించారు. సంజాయిషీ నోటీసు జారీ చేస్తున్నాం. -రవికాంత్, కమిషనర్, నగర పంచాయతీ, నాగర్‌కర్నూల్. మూసి వేయించే బాధ్యత కమిటీదే నిర్మాణం అవకతవకలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నాం. విచారణ సమయంలో ఫంక్షన్‌హాల్ మూసి వేయాలంటూ నిర్వాహకులకు సమన్లు జారీ చేశా. కమిటీకి కూడా సమాచారమిచ్చా. అయినా మూసి వేయించలేదు. ఆ బాధ్యత కమిటీదే. విచారణ వరకే నాకు అధికారాలు ఉన్నాయి. ఎం.ప్రసాదరావు, విచారణాధికారి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్, -
ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ
కావలి, న్యూస్‌లైన్: కావలి కాలువ ఆయకట్టులోని పొలాలు ఎండకుండా ప్రణాళికాబద్ధంగా సాగునీరు అందించాలని సోమశిల ప్రాజెక్ట్ అధికారులను కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆదేశించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను శుక్రవారం ‘భగీరథయత్నం’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆయన స్పందించారు. కావలి కాలువ ఆయకట్టు ైరె తులకు సాగునీరందించే విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి సోమశిల ప్రాజెక్ట్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ చివరి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్లు ఇస్తారో చెబితే ఆ రోజు తాను వచ్చి పరిశీలిస్తానన్నారు. ఆయకట్టు పరిధిలో ఏ ఒక్క పొలం ఎండకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ ద్వారా నీరు తలరించి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఎప్పటిలోపు నింపుతారో చెప్పాలన్నారు. కావలి కాలువను పర్యవేక్షించే అధికారులు స్పందిస్తూ 1వ తేదీ వరకు చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తామన్నారు. అనంత రం ఎస్పీపాళెం మేజర్‌కు విడుదల చేస్తామని వివరించారు. ఆ సమయంలోనే చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. బ్రాహ్మణక్రాక, చామదల, హనుమకొండపాళెం, ఎస్వీపాళెం, గౌరవరం మేజర్లతో పాటు మైనర్కాలువలకు ఎంతనీటిని విడుదల చేస్తే పంటను కాపాడుకోవచ్చో చెప్పాలని అధికారులను ఆరా తీశారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో చివరి ఆ యకట్టు పంట పొలాలకు నీ రు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఆషామాషీగా నీటి వి డుదల చేయడం సరికాదన్నా రు. రైతులకు సాగునీరు అం దించే విషయంపై ఎప్పటికప్పుడు తాను సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానన్నారు. పొలాలు ఎండుతున్నాయనే విషయం ఆయక ట్టు పరిధిలో ఎక్కడా కనిపించరాదన్నారు. కా వలి కాలువను పర్యవేక్షిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృం దాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన రైతులు పైర్లు ఎండుతున్నాయని దగదర్తి మండలం తా ళ్లూరు పంచాయతీ చైతన్యనగర్‌కు చెందిన రై తులు కలెక్టర్‌ను కలిశారు. తమకు కావలి కా లువ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. నీటి విడుదలపై అధికారులతో చర్చించామని, పంటలు ఎండకుండా కాపాడుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.సమావేశంలో సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ సోమశేఖర్, ఈఈ నాయక్, డీఈలు రాఘవరావు, రాజేంద్రప్రసాద్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీదేవి పాల్గొన్నారు. ఆందోళనవద్దు ప్రతి ఎకరా పండిస్తాం జలదంకి: సాగునీటి కోసం రైతులు ఆందోళన చెంద వద్దని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు. నాటిన ప్రతి ఎకరాను పండించేం దుకు సాగునీటిని అందిస్తామన్నారు. కావలి ఈఈ రాఘవరావు, కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు చేరుకుంటున్న నీటిని పరి శీలించి ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతుందని, ఎప్పటి లోగా పూర్తిస్థాయిలో నిండుతుందని ఈఈని అడిగి తెలుసుకున్నారు. చినక్రాక, అన్నవరం గ్రా మాల రైతులు సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయని కలెక్టర్‌కు చెప్పారు. జలదంకి పెద్దచెరువుకు చెందిన రైతులు కూడా తమ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పెద్దచెరువు పరిధిలో రెండు వేల ఎకరాల్లో పంట ఎండుముఖం పట్టిందన్నారు. చినక్రాక రిజర్వాయర్ నుంచి ఏటి కాలువ ద్వారా సాగునీరు అందించాలని, లేకుంటే చెరువుకు నీరు అందించాలని కోరారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటిని విడుదల చేస్తున్నామని, పొలాలకు సాగునీటిని విడుదల చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ కేవీ నారాయణ, తహశీల్దార్ మాల్యాద్రిరావు తదితరులు ఉన్నారు. -
శ్మశాన స్థలం చూపండి
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నోరోజులుగా తాము శ్మశానం కోసం వాడుకుంటున్న స్థలంలో అంత్యక్రియలు చేయనివ్వక పోవడాన్ని నిరసిస్తూ మండలంలోని పాతూరు గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఏకంగా మృతదేహం తీసుకువచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాతూరు గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య(80) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఎప్పటి నుంచో శ్మశానంగా ఉన్న గ్రామశివారులోని 255/256 సర్వేనంబర్లలో ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కిష్టయ్య కుటుంబీకులు సిద్ధమయ్యారు. అయితే అందరూ శ్మశానంగా భావిస్తున్న స్థలం తమదనీ, తమ వద్ద పట్టా కూడా ఉందని గ్రామానికే చెందిన పుష్పలత ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించ కూడదని వెల్లడించారు. ఈ స్థలం తమదేనంటూ కోర్టులో కేసు కూడా వేశానని తెలిపారు. అంతేకాకుండా విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపారు. స్పందించిన రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని సర్వే నంబర్ 255/256 స్థలంపై వివాదం కోర్టులో ఉన్నందున అందులో ఎవరినీ ఖననం చేయకూడదని గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు...ఇదేం అన్యాయమని అధికారులను ప్రశ్నించారు. అయినా వారు సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులంతా కిష్టయ్య మృతదేహాన్ని తీసుకుని మెదక్ ఆర్డీఓ కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించారు. సుమారు మూడు గంటల పాటు తమ ఆందోళన కొనసాగించారు. గ్రామంలోని శ్మశానవాటికలకు పట్టాలిస్తే మృతదేహాలను ఎక్కడ పూడ్చి పెట్టాలో చెప్పాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ విజయలక్ష్మి అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రస్తుతం అందరూ శ్మశానంగా భావిస్తున్న సదరు భూమికి సంబంధించిన పట్టా గ్రామానికే చెందిన ఆకుల పుష్పలత వద్ద ఉందనీ, ఆ భూమి తమదేనంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు 2014 జనవరి 24 వరకూ స్టే విధించిందన్నారు. అందువల్ల ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కోర్టు స్టే తీరిన తర్వాత సదరు భూమిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అంతవరకూ మరోస్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తహశీల్దార్ పాతూరు వాసులకు చెప్పారు. అయితే ఇందుకు వారు అంగీకరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ సమయంలోనే అక్కడకు చేరుకున్న రూరల్ సీఐ కిషన్‌కుమార్, ఎస్ఐ వేణుకుమార్‌లు పాతూరు గ్రామస్తులను శాంతింపజేశారు. అనంతరం గ్రామ శివారులోనే మరోచోట 9 గుంటల ప్రభుత్వ భూమిని శ్మశానానికి వాడుకోవాలని తహశీల్దార్ సూచించటంతో వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారు. -
నకి‘లీలల్లో’ ఉన్నతాధికారులు!
సాక్షి, నిజామాబాద్ : లింగంపేట్ మండలంలో వెలుగు చూసిన నకిలీ పహాణీల వ్యవహా రంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు వీఆర్ఓ కృష్ణారెడ్డి గదిని సోదా చేసి, సుమారు వందకుపైగా పట్టాదారు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల హస్తం లేనిదే ఓ వీఆర్ఓ వద్ద ఇన్ని పాసుపుస్తకాలు(కొత్తవి) ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాసుపుస్తకాలను ఆర్మూ ర్ మండలంలోని పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ముద్రిస్తారు. ఆర్డీఓ కార్యాలయాల నుంచి వచ్చిన ఇండెంట్ మేరకు వాటిని ఆర్డీఓ కార్యాలయాలకు పంపుతారు. ఇలా ఆరు నెలల క్రితం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌కు 10 వేలు, బోధన్, కామారెడ్డి డివిజన్లకు ఐదు వేల చొప్పున పాసుపుస్తకాలను కేటాయించారు. కామారెడ్డి డివిజన్లోని పది మండలాల పరిధిలో సుమారు 250కిపైగా గ్రామాలున్నా యి. సగటున ఒక్కో గ్రామానికి 20కి మించి పాసుపుస్తకాలు అందే అవకాశాలు లేవు. కానీ ఒక్క లింగంపే ట్ వీఆర్ఓ వద్దే సుమారు వందకు పైగా పాసుపుస్తకాలు లభించడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారు ల ప్రమేయం ఉండిఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ పహాణీల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే వీఆర్ఓ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ మహేశ్గౌడ్లపై కేసులు నమోదు చేశారు. మహేశ్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. లోతుగా విచారణ జరిపితే ఉన్నతాధికారుల ప్రమే యం బయటపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే కింది స్థాయి సిబ్బందిని బలిచేసి, ఈ అక్రమాలనుంచి బయటపడేందుకు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది. సొసైటీలకు లక్షల్లో కుచ్చుటోపి.. నకిలీ పాసుపుస్తకాలు, బోగస్ పహాణీలతో అక్రమార్కులు సహకార సంఘాలకు లక్షల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. బోగస్ పహాణీ లు, నకిలీ పాసుపుస్తకాలతో ఎకరాలకు ఎకరాలు ఉన్నట్లు చూపి సొసైటీల నుంచి లక్షల రూపాయల్లో దీర్ఘకాలిక రుణాలు పొందినట్లు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు సైతం లింగంపేట్, నల్లమడుగు, శెట్పల్లి పీఏసీఎస్‌లలో ఇలా రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. -
పోడు... పోరు
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కామ్రేడ్లు కదం తొక్కారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలంటూ నినదించారు. కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు వేల మంది ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నిరసనకారులు అక్కడ ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు సాగుదారులపై నిర్భందాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని, దీనిని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు. కోనేరు కమిటీ సిపారసులను అమలు చేయాలన్నారు. అడ్డూఅదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం వేస్తోందని విమర్శించారు.ప్రజలు సంఘటితంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనులకు పోడు భూములు సాగు చేసుకునే హక్కు ఉందన్నారు. పోడు భూముల్లో సాగుచేసే వారికే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు చేసే వారిపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సీపీఐ పోరాడుతోందన్నారు. గిరిజనులను పోడుభూమి నుంచి ఎవ్వరూ విడదీయలేరన్నారు. తుపాకులు పట్టుకుని వచ్చినా గిరిజనులను ఏమీ చేయలేరన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పేదవారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులకు, తూటాలకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును కేంద్ర కేబినేట్ ఆమోదించడం హర్షణీయమన్నారు. రానున్న ఎన్నికలు ప్రత్యేక రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. వెయ్యి మంది బలిదాలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌కు కన్నువిప్పు కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తెలంగాణ గుర్తుకొచ్చిందని వ్యాఖ్యానించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేదని అన్నారు. వితంతువులకు, వికలాంగులకు రూ.3 వేలు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, ఏపూరి బ్రహ్మం, దొండపాటి రమేష్, మునీర్, డీసీసీబీ డెరైక్టర్ మండే వీరహనుమంతరావు, బరిగెల సాయిలు, బందెల నర్సయ్య, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు
చింతలపూడి, న్యూస్‌లైన్ : చింతలపూడిలో వెలుగు చూసిన ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు చే యనున్నట్లు ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు తెలిపారు. చింతలపూడి మండలం యర్రంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎస్కే లాల్ అహ్మద్ రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలు, పాస్‌బుక్కులు, టైటిల్ డీడ్లు తయారుచేసి అమ్ముకుంటున్న కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టేందుకు గురువారం చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆర్డీవో ఎస్సై బి.మోహన్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఇంట్లో లభించిన రెవెన్యూ రికార్డులు, నకిలీ స్టాంపులు, నకిలీ పాస్ పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇది జిల్లాలోనే పెద్ద ఫోర్జరీ కేసని, రెవెన్యూ శాఖ ప్రతిష్టకు సంబంధించిందన్నారు. జిల్లా అధికారులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. నిందితునికి సహకరించిన వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. లాల్ అహ్మద్ నుంచి లబ్ధి పొందినవారు వెంటనే నకిలీ పత్రాలు అందజేస్తే వారిపై క్రిమినల్ కేసులు ఉండవని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన తర్వాత నకిలీ పత్రాలపై గ్రామాల్లో బహిరంగ విచారణ చేపడతామని, అప్పుడు బయటపడితే కేసులు తప్పవని ఆర్డీవో నాగేశ్వర రావు హెచ్చరించారు. -
108 ఉద్యోగుల వినూత్న నిరసన
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : సమస్యలు పరిష్కరించాలని 108 కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 29వ రోజుకు చేరింది. వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షల్లో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఈఎంఆర్ఐ, జీవీకే యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే 360 మంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా నెలకు రూ.15వేల వేతనం, ఎనిమిది గంటల పనిదినం, 108 సర్వీస్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గణేశ్, నాయకులు సతీష్, నర్సారెడ్డి, నవీన్, రాజన్న, సాగర్, భోజన్న, వసీం, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బిల్లు పెట్టాలె
కల్వకుర్తి/కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణకు సానుకూలమని చెబుతున్న కేంద్ర ప్ర భుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లుపెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని టీఎన్జీ ఓ, టీజేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు డి మాండ్ చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కల ఫ లించందని రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని సీ మాంధ్రులకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రాలుగా కలిసిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం భోజన వి రామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టా రు. కల్వకుర్తిలో టీఎన్జీఓ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ కోసం వందలమంది తెలంగా ణ బిడ్డలు బలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. ఏపీఎన్జీ ఓల ఉద్యమం అర్థం లేనిదన్నారు. సీమాంధ్ర పెట్టుబడుదారులు తెలంగాణను అడ్డుకునేం దుకు కుట్రపన్ని ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీ మాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పర్వతా లు, తాలూకా కార్యదర్శి బావండ్ల వెంకటేష్, లింగం, డీటీ విజయ్‌కుమార్, శివానంద్, మణిపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఉద్యోగులు మ రో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు గద్వాల టీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగ, రాజకీయ జేఏసీ నాయకులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిం చారు. ‘జై తెలంగాణ..జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. జేఏసీ డివిజన్ కన్వీనర్ వీరభద్రప్ప మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రక్రియను మొదలుపెట్టేలా అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. సీమాంధ్రలో జరిగే ఉధ్యమాలకు సీఎం, మంత్రులు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ సొత్తు : టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి సుధీర్ఘ పోరాటాల ఫలితంగానే కేంద్రం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందని, జాప్యం చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో లంచ్‌అవర్‌లో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగఫలితం వల్ల కాంగ్రెస్ అధిష్టానం కళ్లు తెరిచి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్రులు తమ ఆందోళన విరమించి రాష్ర్ట విభజనలకు సహకరించాలని కోరారు. టీజేఏసీ కోచెర్మన్ ప్ర భాకర్, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి బక్క శ్రీనివాస్‌లు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణ సొత్తు అని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ ఆర్. మాధవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, తెలంగాణ లైబ్రేరియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్ పాల్గొన్నారు. టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ డి మాండ్ చేశారు. మంగళవారం బాలుర జూని యర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వార్థపూరిత సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని, వారి ఉద్యమానికి తలొగ్గితే తెలంగాణ వాదుల ఆగ్రహానికి కాంగ్రెస్‌పార్టీ గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యజేఏసీ కన్వీనర్ మాదవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఫిజికల్ డెరైక్టర్స్ అసోసియేషన్ నాయకులు పాపిరెడ్డి, సురేష్‌కుమార్, విద్యావంతుల వేధిక జిల్లా నాయకులు సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.