కల్వకుర్తి/కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణకు సానుకూలమని చెబుతున్న కేంద్ర ప్ర భుత్వం వెంటనే పార్లమెంట్‌లో బిల్లుపెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని టీఎన్‌జీ ఓ, టీజేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు డి మాండ్ చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కల ఫ లించందని రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని సీ మాంధ్రులకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రాలుగా కలిసిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని పిలుపునిచ్చారు.
మంగళవారం ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం భోజన వి రామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టా రు. కల్వకుర్తిలో టీఎన్‌జీఓ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ కోసం వందలమంది తెలంగా ణ బిడ్డలు బలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. ఏపీఎన్‌జీ ఓల ఉద్యమం అర్థం లేనిదన్నారు. సీమాంధ్ర పెట్టుబడుదారులు తెలంగాణను అడ్డుకునేం దుకు కుట్రపన్ని ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీ మాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పర్వతా లు, తాలూకా కార్యదర్శి బావండ్ల వెంకటేష్, లింగం, డీటీ విజయ్‌కుమార్, శివానంద్, మణిపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట
తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఉద్యోగులు మ రో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు గద్వాల టీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగ, రాజకీయ జేఏసీ నాయకులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిం చారు. ‘జై తెలంగాణ..జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. జేఏసీ డివిజన్ కన్వీనర్ వీరభద్రప్ప మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రక్రియను మొదలుపెట్టేలా అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. సీమాంధ్రలో జరిగే ఉధ్యమాలకు సీఎం, మంత్రులు సహకరిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ తెలంగాణ సొత్తు : టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి
సుధీర్ఘ పోరాటాల ఫలితంగానే కేంద్రం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందని, జాప్యం చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో లంచ్‌అవర్‌లో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగఫలితం వల్ల కాంగ్రెస్ అధిష్టానం కళ్లు తెరిచి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందన్నారు.
సీమాంధ్రులు తమ ఆందోళన విరమించి రాష్ర్ట విభజనలకు సహకరించాలని కోరారు. టీజేఏసీ కోచెర్మన్ ప్ర భాకర్, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి బక్క శ్రీనివాస్‌లు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణ సొత్తు అని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ ఆర్. మాధవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, తెలంగాణ లైబ్రేరియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ డి మాండ్ చేశారు. మంగళవారం బాలుర జూని యర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వార్థపూరిత సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని, వారి ఉద్యమానికి తలొగ్గితే తెలంగాణ వాదుల ఆగ్రహానికి కాంగ్రెస్‌పార్టీ గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యజేఏసీ కన్వీనర్ మాదవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఫిజికల్ డెరైక్టర్స్ అసోసియేషన్ నాయకులు పాపిరెడ్డి, సురేష్‌కుమార్, విద్యావంతుల వేధిక జిల్లా నాయకులు సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బిల్లు పెట్టాలె
Published Wed, Aug 14 2013 5:29 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement