CM kirankumar reddy
-
విజయోత్సాహం..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ర్ట్ర ఏర్పాటుకు కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో నిజంగానే జిల్లాలో ఉద్యమంతో మమేకమైన నాయకులు ఎవరన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశానంతరం హోంమంత్రి షిండే ప్రకటన చేశాక జిల్లా వ్యా ప్తంగా సంబరాలు జరిగాయి. ఎవరికి వారు తాము చేసిన రాజీనామాల వల్లే ఏర్పడిందని ప్రకటనలు కూడా ఇచ్చారు. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్‌లో పలువురు ఎమ్మెల్యేలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. మరికొం దరు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో అంటకాగారు. సీఎం కిరణ్ పూర్తిస్థాయిలో సమైక్యవాదాన్ని బాహాటంగా వినిపిస్తున్నారని తెలిసీ ఆయనతో తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏర్పాటు చేశారన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇక, అధికారిక పదవుల్లేని నేతలు సైతం కొందరు సీఎం వర్గంగా పిలిపించుకునేందుకు తెగ తాపత్రయపడ్డారు. జిల్లా కాంగ్రెస్‌లో జరిగిన పరి ణామాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో విభిన్న దృశ్యమే ఆవిష్కతమైంది. అటు జేఏసీ, ఇటు తెలంగాణవాద పార్టీలు చేపట్టిన ఆందోళనల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్న నేతలు, అంటీముట్టనట్టు వ్యవహరించిన నేతల తీరును విశ్లేషిస్తే.. అసలు కాంగ్రెస్‌లో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనే అంశం ఇట్టే అర్థమవుతుందంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల్లో.. పూర్తిస్థాయిలో మమేకమైన నేతగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే ఎక్కువ క్రెడిట్ దక్కుతోందంటున్నారు. 2009 డిసెంబరు 9 ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకున్నాక తెలంగాణ వ్యాప్తంగా మొన్న మొన్నటి దాకా ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సాగిన ఉద్యమంలో జిల్లాకు ముఖ్యమైన స్థానమే ఉంది. మలి ఉద్యమంలో తొలి అమరుడిగా గుర్తింపు ఉన్న శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తర్వాత మరి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని అధిష్టానానికి గడువు పెట్టి, ఆతర్వాత తన మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. అయితే, సొంత పార్టీలో కొనసాగుతూనే తెలంగాణవాదాన్ని బలంగా వినిపించి తెలంగాణ వ్యాప్తం గా గుర్తింపు పొందారు. చివరకు జిల్లా కేంద్రం లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం జరిగిన ప్రతీ ఉద్యమంలో ముందుండి నడిచారు. ఎంపీలు.. జిల్లాకు చెందిన ఎంపీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచీ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. తమ అధినేత్రి సోనియాగాంధీపై విశ్వాసం ఉందని చెబుతూనే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేశారు. ‘దేశ పార్లమెంటు చరిత్రలో అధికార పార్టీకి చెందిన ఎంపీలమై ఉండి సస్పెండ్ అయ్యాం. కేవలం తెలంగాణ సాధన కోసమే అధిష్టానంపై కొట్లాడాం. చివరకు కల నెరవేరుతోంది. తెలంగాణ ప్రజల ఆంకాక్షను నెరవేస్తున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు..’ అని ఎంపీ రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం తెలంగాణవాదాన్ని వినిపిస్తూనే, సీఎం కార్యక్రమాల్లోనూ వేదికలను పంచుకున్నారు. జిల్లాలో జరిగిన సీఎం పర్యటనలను కోమటిరెడ్డి సోదరులు బహిష్కరించగా, సుఖేందర్‌రెడ్డి మా త్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా, సమైక్యవాదులకు వ్యతిరేకంగా మీడియా ఎదుట ప్రకటనలకే పరిమితం కాగా, క్షేత్రస్థాయి ఆందోళనల్లో పాల్గొన్నది లేదు. మంత్రులు.. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మంత్రి జానారెడ్డి తెలంగాణ జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆచితూచి అడుగేసే జానా ఎన్నడూ అధినాయకత్వాన్ని కాదనే రీతిలో వ్యవహరించలేదు. మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 610 జీఓ అమలు కమిటీ చైర్మన్‌గా, కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం సమావేశాల్లో ప్రతినిధిగా పాల్గొన్నా మూడు నాలుగు నెలల కిందటి దాకా తెలంగాణ గురించి బలంగా, బహిరంగంగా వాదించింది లేదు. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ తెలంగాణ సాధన సభ తర్వాతి నుంచే తెలంగాణ సభా వేదికలపై కనిపిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, సీఎంతో తన నియోజకవర్గంలో పర్యటనలు పెట్టించారన్న అసంతృప్తి తెలంగాణవాదుల్లో ఉంది. ఎమ్మెల్యేలు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులనే అనుసరించారు. వెంకట్‌రెడ్డితో పాటు రాజీనామా చేశారు. వెంకట్‌రెడ్డితో పాటు కలిసి వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బాలూనాయక్, భిక్షమయ్యగౌడ్‌లు తెలంగాణవాదాన్ని వినిపిం చినా, అధిష్టానానికి వ్యతిరేకంగా ఏ పనులూ చేయలేదు. ఇక, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి మొదట్లో వినిపించినంత బలంగా తెలంగాణవాదాన్ని వినిపించలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన తనయుడి రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు కావాల్సినంత సంయమనాన్ని పాటించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన పెట్టించి, ఆ సభా వేదికపై కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయకుండా ఉండిపోయారంటున్నారు. -
రాష్ట్ర విభజనపై సీఎం వాదన సరైందే
కూసుమంచి, న్యూస్‌లైన్: రచ్చబండలో సీఎం ఫ్లెక్సీలు చించటం, తగులబెట్టటం ఏంటి నాన్సెన్స్..ఇది శోచనీయం.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనే ప్రభుత్వ సారధి, ఆయనకు రెండు ప్రాంతాల ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత ఉంది... రాష్ట్ర విభజనపై సీఎం వాదనలో తప్పేం లేదు, సీఎం క్రమశిక్షణ కలిగిన నాయకుడు’- అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌నుంచి జిల్లా పర్యటనకు వచ్చిన రేణుకాచౌదరికి జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆమె పైవిధంగా స్పందించారు. సీఎం సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్నారు... తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు ఆయనకు ఈలెక్కలు గుర్తుకు రాలేదా అంటూ విలేకరులు ప్రశ్నించగా నాడు ఆయన కూడా ఆత్మహత్యలు వద్దని అప్పీలు చేశారుగా, సీఎం ఏప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు..రెండు ప్రాంతాలకు సమన్యాయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మరోలా కాదు అంటూ రేణుకాచౌదరి బదులిచ్చారు. ఒక సమస్య వలన మరో సమస్య తలెత్తకూడదనేది సీఎం ఆలోచనని అన్నారు. సీఎం రాష్ట్ర విభజనపై తలెత్తే సమస్యలను ముందుంచుతున్నారు.. ఆయనను కేంద్రం సీఎంగా నియమించింది తన భాధ్యతను తాను నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ‘జిల్లా ఆడబిడ్డగా భద్రాచలం నుంచి గడ్డిపోచను కూడా పోనివ్వను..ఖబడ్దార్’ అంటూ ఈ సందర్భంగా రేణుకాచౌదరి అన్నారు. భద్రాద్రి రాముడు ఆశీస్సులతో, కాంగ్రెస్ కార్యకర్తల అండతో భద్రాచలాన్ని కాపాడేందుకు పోరాడతానని అన్నారు. నేను జిల్లా ఆడబిడ్డగా జిల్లాకోసం పోరాడుతున్నా ..నాకు అడ్డుచెప్పేవారు ఉంటే ముందుకు రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రేస్ నాయకులు సోమ్లా నాయక్, అయితం సత్యం, పోరిక లక్ష్మీబాయి, రాయల నాగేశ్వరరావు, పరుచూరి మురళీకృష్ణ , కొరివి వెంకటరత్నం, పోటు లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న బంద్‌కు పలు సంఘాలతోపాటు టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు సంపూర్ణ మదతు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జేఏసీ, విద్యార్థి, న్యాయవాద, డాక్టర్ల సంఘాలు బంద్ విజయవంతానికి ప్రచారం నిర్వహించాయి. బంద్‌ను విజయవంతం చేయూలని శాంతి ర్యాలీలతో కదం తొక్కారుు. తెలంగాణ సభకు అనుమతినివ్వకుండా హైదరాబాద్‌లో సీమాంధ్ర సభలకు అనుమతినిస్తున్న సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి తీరును ఎండగట్టారుు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల యజమానులు, ఆటోయూనియన్లు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారుు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న, ఆర్టీసీ ఎన్ఎంయూ రిజినల్ కార్యదర్శి సీహెచ్.యాకస్వామి, టీఎంయూ రాష్ట్ర చైర్మన్ తిరుపతయ్య, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నల్లెల రాజయ్య, జనగామ కుమారస్వామి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల యజమానులు మద్దతు ప్రకటించారు. బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బస్స్టేషన్లు, రైల్లేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సెంట్రల్ జైలులో నక్సలైట్ ఖైదీలు కూడా తెలంగాణకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. -
తెలంగాణపైసీఎం కుట్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీమాంధ్ర కుట్రను బయట పెట్టుకున్నారని ఆరోపిస్తూ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ పిలుపు మేరకు ఇందూరులో బంద్ ను విజయవంతం చేయటానికి తెలంగాణవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు జిల్లాలోని ఆరు డిపోల్లోని బస్సులను బయటకు తీయవద్దని, విధులను 24 గంటలు బహ్కిరించాలని తీర్మానించారు. టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు సంపూర్ణ బంద్‌పై ప్రత్యేక దృష్టి సారిం చాయి. దీంతో జిల్లాలోని ఆరు డిపోలకు చెంది న 635 బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి నెల కొంది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలతో పాటు వివిధ యూనియన్లు, సంఘాలతో కూడిన జేఏసీలు కూడా బంద్ విజయవంతం కోసం కృషి చేస్తున్నాయి. సీమాంధ్రకు చెంపపెట్టుగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణవాదులు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ వాదుల నిరసన వెల్లువలను గమనిస్తున్న జిల్లా పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, సినిమాథియేటర్లు, పెట్రోల్‌బంకులు, ఆటోలు ఇతర వాహనాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించారు. అత్యవసర సర్వీసులను మినహాయించి జిల్లా బంద్ విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కృషి చేస్తున్నాయి. ఏపీఎన్జీవో సభ నిర్వహణను వ్యతిరేకించనప్పటికీ సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీ పిలుపుమేరకు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిర్ణయించింది. సీపీఐ కూడా బంద్‌లో భాగస్వామి అవుతోంది. బంద్ విజయవంతం కోసం... జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నటరాజ్, దేవి, లలితామహల్, ఉషాప్రసాద్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని థియేటర్ల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొని సినిమా పోస్టర్లను చింపివేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాను నడువకుండా అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కల్పించిన బందోబస్తుతో అడ్డంకుల నడుమ నాలుగు థియేటర్లలో తుఫాన్ సినిమాను ప్రదర్శితమైంది. బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తు న్న తుఫాన్ సినిమాను అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాల జేఏసీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా పోస్టర్లను తగులబెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రదర్శన చేపట్టి, మానవహారాన్ని నిర్మిం చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సత్వరమే చేపట్టాలని నందిపేటలో తెలంగాణ దీక్ష లు కొనసాగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవరిస్తున్న తీరును నిరసిస్తూ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ జేఏసీ శాంతి ర్యా లీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వైఖరిని తప్పుపట్టారు. -
తెలంగాణపైసీఎం కుట్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చి, తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీమాంధ్ర కుట్రను బయట పెట్టుకున్నారని ఆరోపిస్తూ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ పిలుపు మేరకు ఇందూరులో బంద్ ను విజయవంతం చేయటానికి తెలంగాణవాదులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు జిల్లాలోని ఆరు డిపోల్లోని బస్సులను బయటకు తీయవద్దని, విధులను 24 గంటలు బహ్కిరించాలని తీర్మానించారు. టీఎంయూ, ఈయూ, ఎన్‌ఎంయూలు సంపూర్ణ బంద్‌పై ప్రత్యేక దృష్టి సారిం చాయి. దీంతో జిల్లాలోని ఆరు డిపోలకు చెంది న 635 బస్సులు రోడ్డు ఎక్కని పరిస్థితి నెల కొంది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాలతో పాటు వివిధ యూనియన్లు, సంఘాలతో కూడిన జేఏసీలు కూడా బంద్ విజయవంతం కోసం కృషి చేస్తున్నాయి. సీమాంధ్రకు చెంపపెట్టుగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణవాదులు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ వాదుల నిరసన వెల్లువలను గమనిస్తున్న జిల్లా పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తగిన చర్యలకు పోలీసుశాఖ శ్రీకారం చుట్టింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, సినిమాథియేటర్లు, పెట్రోల్‌బంకులు, ఆటోలు ఇతర వాహనాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించారు. అత్యవసర సర్వీసులను మినహాయించి జిల్లా బంద్ విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా రాజకీయ జేఏసీతో పాటు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కృషి చేస్తున్నాయి. ఏపీఎన్జీవో సభ నిర్వహణను వ్యతిరేకించనప్పటికీ సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా రాజకీయ జేఏసీ పిలుపుమేరకు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిర్ణయించింది. సీపీఐ కూడా బంద్‌లో భాగస్వామి అవుతోంది. బంద్ విజయవంతం కోసం... జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నటరాజ్, దేవి, లలితామహల్, ఉషాప్రసాద్ థియేటర్లలో ప్రదర్శిస్తున్న తుఫాన్ సినిమాను విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని థియేటర్ల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొని సినిమా పోస్టర్లను చింపివేశారు. తెలంగాణలో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాను నడువకుండా అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కల్పించిన బందోబస్తుతో అడ్డంకుల నడుమ నాలుగు థియేటర్లలో తుఫాన్ సినిమాను ప్రదర్శితమైంది. బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తు న్న తుఫాన్ సినిమాను అడ్డుకోవడానికి విద్యార్థి సంఘాల జేఏసీ కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. సినిమా పోస్టర్లను తగులబెట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్‌లో ప్రదర్శన చేపట్టి, మానవహారాన్ని నిర్మిం చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సత్వరమే చేపట్టాలని నందిపేటలో తెలంగాణ దీక్ష లు కొనసాగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవరిస్తున్న తీరును నిరసిస్తూ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. సీఎం కుట్రపూరిత వైఖరికి నిరసనగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోవడానికి ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ జేఏసీ శాంతి ర్యా లీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిల వైఖరిని తప్పుపట్టారు. -
పథకాలు గిరిజనులకు అందించేందుకు మరింత కృషి అవసరం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనుల దరికి చేర్చేందుకు అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాల్సి ఉందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్మెంట్ ఫెలోస్’ రూపొం దించిన ‘ఫ్రంది బాటమ్ అప్’ పుస్తకాన్ని బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల గిరిజనుల్లో ఒకసారి నమ్మకాన్ని కలిగిస్తే సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరమవుతుందన్నారు. గతేడాది ఏప్రిల్ 7న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్మెంట్ ఫెలోస్’ పథకం కింద రాష్ట్రంలో 8 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 15 మంది ‘ఫెలోస్’ను నియమించారు. ఏజెన్సీ గ్రామాల్లో ఏడాదిపాటు వివిధ అంశాలపై వీరి పరిశీ లనలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం, సెర్ప్ సీఈఓ రాజశేఖర్, మానవ వనరుల శాఖ డీజీ ప్రశాంత మహాపాత్ర, అడిషనల్ డీజీ ఆర్.వి.చంద్రవదన్ పాల్గొన్నారు. -
సీఎం కిరణ్‌తో బొత్స, మర్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌తో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్న అంశంపై బొత్స, కిరణ్‌లు చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక ట్రామిరెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె విరమణకు యత్నాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశాలపై కూడా చ ర్చించారని తెలుస్తోంది. పెద్ద పదవికే శైలజానాథ్ సమైక్యవాదం: జేసీ సాక్షి, హైదరాబాద్: మరింత పెద్ద పదవి కోసమే మంత్రి శైలజానాథ్ సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజల ఉద్యోగ, సాగునీటి అవసరాల కోసమే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామన్నారు. -
తెలంగాణ బిల్లు పెట్టాలె
కల్వకుర్తి/కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణకు సానుకూలమని చెబుతున్న కేంద్ర ప్ర భుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లుపెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని టీఎన్జీ ఓ, టీజేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు డి మాండ్ చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కల ఫ లించందని రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని సీ మాంధ్రులకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రాలుగా కలిసిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం భోజన వి రామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టా రు. కల్వకుర్తిలో టీఎన్జీఓ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ కోసం వందలమంది తెలంగా ణ బిడ్డలు బలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. ఏపీఎన్జీ ఓల ఉద్యమం అర్థం లేనిదన్నారు. సీమాంధ్ర పెట్టుబడుదారులు తెలంగాణను అడ్డుకునేం దుకు కుట్రపన్ని ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీ మాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పర్వతా లు, తాలూకా కార్యదర్శి బావండ్ల వెంకటేష్, లింగం, డీటీ విజయ్‌కుమార్, శివానంద్, మణిపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్న లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఉద్యోగులు మ రో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు గద్వాల టీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం గద్వాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగ, రాజకీయ జేఏసీ నాయకులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిం చారు. ‘జై తెలంగాణ..జైజై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. జేఏసీ డివిజన్ కన్వీనర్ వీరభద్రప్ప మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రక్రియను మొదలుపెట్టేలా అన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. సీమాంధ్రలో జరిగే ఉధ్యమాలకు సీఎం, మంత్రులు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ సొత్తు : టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి సుధీర్ఘ పోరాటాల ఫలితంగానే కేంద్రం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందని, జాప్యం చేయకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో లంచ్‌అవర్‌లో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగఫలితం వల్ల కాంగ్రెస్ అధిష్టానం కళ్లు తెరిచి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్రులు తమ ఆందోళన విరమించి రాష్ర్ట విభజనలకు సహకరించాలని కోరారు. టీజేఏసీ కోచెర్మన్ ప్ర భాకర్, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి బక్క శ్రీనివాస్‌లు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణ సొత్తు అని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ ఆర్. మాధవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, తెలంగాణ లైబ్రేరియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్ పాల్గొన్నారు. టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ డి మాండ్ చేశారు. మంగళవారం బాలుర జూని యర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వార్థపూరిత సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని, వారి ఉద్యమానికి తలొగ్గితే తెలంగాణ వాదుల ఆగ్రహానికి కాంగ్రెస్‌పార్టీ గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యజేఏసీ కన్వీనర్ మాదవరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఫిజికల్ డెరైక్టర్స్ అసోసియేషన్ నాయకులు పాపిరెడ్డి, సురేష్‌కుమార్, విద్యావంతుల వేధిక జిల్లా నాయకులు సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సోనియా డెరైక్షన్లోనే బాబు, కిరణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శకత్వంలోనే ముఖ్యమంత్రి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించు, పాలించు చందంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజు అతి దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం వెలువడగానే ప్రతిపక్షనేత చంద్రబాబు స్వాగతిస్తారు. రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలంటారు. సీఎం కిరణ్ తీరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత బయటకువచ్చి ప్రతిపక్షనేతలా మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా లేవనెత్తిన అంశాలన్నీ సీడబ్ల్యూసీ ముందు ఎందుకు చెప్పలేదు? రాష్ట్రాన్ని ముక్కలు చేసేది కాంగ్రెస్ పార్టీనే... దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసేదీ ఆ పార్టీనేతలే... ఉద్యమాల్లో పాల్గొనేదీ వారే. ఎందుకీ డ్రామాలు?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే సోనియా దర్శకత్వంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్‌పై అభాండాలు అన్యాయం... రాష్ట్ర విభజనకు బీజం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వేశారని, అందుకే నిర్ణయం జరిగిందంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవర్ని మభ్యపెట్టడానికని శోభ సూటిగా ప్రశ్నించారు. విభజనకు రాజశేఖరరెడ్డే బీజం వేసుంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు అమలు జరగలేదని ప్రశ్నించారు. మహానేత మరణించిన వంద రోజుల్లోనే లేఖ పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? అని నిలదీశారు. ‘‘2000 సంవత్సరంలో సీఎల్పీ లీడర్‌గా రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు వెళ్లి సోనియాగాంధీకి లేఖ ఇచ్చారని కిరణ్ చెబుతున్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా మీరు కూడా ఉన్నారు కదా! ఆ రోజు అదే జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ప్రతీదానికి ఉచిత విద్యుత్‌కు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ పథకాలకు నేనే సలహాలు ఇచ్చానంటూ చెబుతున్నావు... విభజన విషయానికొచ్చేసరికి బీజం వేసింది వైఎస్ అంటూ ఆయనపై నిందలు వేస్తారా? మీరు చేస్తున్న డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు... మీకు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారు’’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి దగ్గరుండే ఎమ్మెల్యేల చేత సోనియాగాంధీకి లెటర్ ఇప్పించినట్లయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో మీడియా సంస్థలున్నా... పత్రికల్లో కథనాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ ఇచ్చేటప్పుడు పార్టీ అధ్యక్షురాలు రాష్ట్రానికి వచ్చారనే రాజశేఖరరెడ్డితోపాటు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్ ఎం.సత్యనారాయణ అక్కడికి వెళ్లినట్లు ఆమె వివరించారు. మాకున్న దూరదృష్టి మీకేదీ? రాష్ట్ర విభజన జరిగితే నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలలో తలెత్తే అంశాలను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెలరోజులకిందటే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాస్తే, అధికార యంత్రాంగం చేతిలో పెట్టుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోయారని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నిర్ణయం వెలువడిన తర్వాత తొమ్మిది రోజులకు తీరిగ్గా బయటకొచ్చి ఇతరులపై బురద చల్లుతూ అభాండాలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకున్న ఆలోచన, దూరదృష్టి అధికారంలో ఉన్న పార్టీకి లేదా? కిరణ్ కళ్లు మూసుకొని పరిపాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమైన తొమ్మిది రోజులకు మీడియా ముందుకొచ్చి సీఎం చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఒక సామాన్య వ్యక్తిని తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటూ హైకమాండ్‌కు చెప్పి, తానేదో గొప్పగా బ్యాటింగ్ చేశానంటూ మీడియాకు లీకులిచ్చి, ఇప్పుడు సిగ్గులేకుండా దివాలాకోరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్‌మ్యాప్‌లతో పలు కోర్‌కమిటీలలో పాల్గొన్న మీకు ఏ విషయం చెప్పకుండానే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారా? అనేది సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ను సంప్రదించిన వ్యక్తులు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మీకు చెప్పకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. మీ అనుమతి లేకుండానే నిర్ణయం జరిగినట్లయితే గౌరవం లేని పార్టీలో ఎందుకున్నారని నిలదీశారు. వెంటనే రాజీనామా చేసి బయటకు రాకుండా ఎవర్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని శోభ మండిపడ్డారు. -
కిరణ్, బొత్సలకు సమైక్యాంధ్ర సెగ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు ఆదివారం వారు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం వచ్చారు. రఘువీరాను పరామర్శించి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం, పీసీసీ చీఫ్‌లను చూసిన ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినదించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. మడకశిర పట్టణంలో జేఏసీ, వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒక యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. ఆరు వాహనాలపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అడ్డుకుని.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. ఎంపీకి సమైక్యవాదుల ‘చింత’ తిరుపతి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎంపీ చింతా మోహన్ ఏర్పాటుచేసిన సమావేశాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని, తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా వంద బైక్‌లతో వచ్చిన స్కూటర్ మెకానిక్‌లు అతిథిగృహం బయట హారన్లు, నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు గెస్ట్‌హౌస్ గేట్లు మూసివేసి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ తాను ఉత్తుత్తి రాజీనామాలు చేయనని, కేవలం కొందరు రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసం రాజీనామాల నాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే ఒక రైలు బోగి నిండా పట్టే జనాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని వద్ద సమైక్యవాదాన్ని విన్పిస్తానన్నారు. ‘అనంత’ను అడ్డుకున్న విద్యార్థులు శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఆమరణదీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని జేఏసీ నేతలు అడ్డుకున్నారు, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించి ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ఎంపీ తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు.