సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌తో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్న అంశంపై బొత్స, కిరణ్‌లు చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక ట్రామిరెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె విరమణకు యత్నాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశాలపై కూడా చ ర్చించారని తెలుస్తోంది.
పెద్ద పదవికే శైలజానాథ్ సమైక్యవాదం: జేసీ
సాక్షి, హైదరాబాద్: మరింత పెద్ద పదవి కోసమే మంత్రి శైలజానాథ్ సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజల ఉద్యోగ, సాగునీటి అవసరాల కోసమే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామన్నారు.
సీఎం కిరణ్‌తో బొత్స, మర్రి భేటీ
Published Tue, Aug 27 2013 6:49 AM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM
Advertisement
Advertisement