bosta satya narayana
-
మీకు చేతనైతే.. ప్రభుత్వానికి బొత్స సవాల్
-
వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స
విజయవాడ, సాక్షి: బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలనుకుంటారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కాకుండా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నారు. మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టాం. నిత్యావసర సరుకులను ప్రతిఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్దాన్ని నిజం చేయాలకుంటారు. 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ఆనాడు నేను మంత్రిగా ఉన్నా.. అప్పడు బుడమేరకు వదర వస్తే.. తగు జాగ్రత్తలు తీసుకున్నాం. పైనఉన్న బ్యారేజీలు(శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల)నుంచి కిందకి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. .. రేపల్లె సమీపంలో వరదలలో గండిపడితే నెల్లూరు కృష్ణపట్నం పోర్టు నుంచి 250 లారీలతో మట్టిని తెప్పించి పూడ్చాము. మా బాధ్యతగా అప్పడు మేము చేశాం. బుడమేరకు వరద వస్తుందని అధికారులకు ముందే తెలిసినా నిర్లక్ష్యంగా పట్టించుకోలేదని వారే మాట్లాడిన విషయాన్ని మనం వార్తల్లో చూశాం. వర్షాల విషయంలో వాతావరణ శాఖ ముందుగానే సూచించింది. ఈ ప్రభుత్వం వరదలపై ఎటువంటి మానిటరింగ్ చేయలేదు. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అసలు ఆలోచననే లేదు. గత ప్రభుత్వం బురదజల్లె ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వరదలు వచ్చిన సమయంలో అధికారులతో కలిసి ఇక్కడ తిరిగి సహాయక చర్యలు చేపట్టాం. ..అదృష్టవశాత్తు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ కట్టడంతో నగరానికి చాలా పెద్ద ముప్పు తప్పింది. విపత్తు విషయంలో ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కూడా బాధితులకు సాయం అందించటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. మూడు రోజులపాటు చాలా మందికి బాధితులకు నీరు, పాలు, ఆహారం లేదు. మేము ఆహారం, నీరు అందించేతవరకు ప్రభుత్వం స్పందించలేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితుల నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలని వైఎస్సార్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. -
వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
విజయవాడ, సాక్షి: మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. విజయవాడ వరద బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తోంది. నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 50 వేల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుంది. 33 డివిజన్లల్లో సరుకుల పంపిణీ జరగనుంది. వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే రెండు దశల్లో వరద నీటిలో అవస్థలు పడ్డ బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంచగా.. ఇప్పుడు మూడో విడతలో నిత్యావసరాలు ఇస్తున్నారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప పని చేయరా? -
టీడీపీ, పవన్‌కు మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబులో ఒరిజినాలిటీ లేదు.. మా పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా, మంత్రి బొత్స సత్యానారాయణ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ తాను గెలిస్తే చాలు అనుకుంటున్నాడు. మాది కుటంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటంబ పార్టీ కాదా?.చంద్రబాబు కుటుంబం తరఫున ఐదు మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రం ఏమైనా చంద్రబాబుకు పోటీ చేయడానికి రాసి ఇచ్చారా?. ప్రతిపక్ష పార్టీ నేతలుగా మేము పోరాటాలు చేసి గెలుస్తున్నాము. లోకేష్ లాగా అడ్డదారిలో తాము పదవులు పొందలేదు. ప్రధాన మంత్రిని విమర్శించడానికి నా స్థాయి సరిపోదా?. లోకేష్ స్థాయి సీఎం జగన్ విమర్శించేందుకు సరిపోతుందా?. నేను ఎంపీగా చేశాను మంచిగా పని చేశాను. ఒక శుంఠ సీఎం గురించి మాట్లాడినప్పుడు నేను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటి?.టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సర్వేలను నేను నమ్మను. మా ముఖ్యమంత్రి టార్గెట్ 175కు 175. చంద్రబాబులో ఒరిజినాలిటీ పోయింది. మా పథకాలన్నీ కాపీ కొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉద్యోగులకు మేలు చేసింది. గతంలో ఉద్యోగులకు టీడీపీ ఏమైనా మేలు చేసిందా?’ అని ప్రశ్నించారు. -
పాదయాత్రకు మించి బస్సు యాత్రకు ప్రజాదరణ
-
రాళ్లు వేయించకునే అలవాటు బాబుకు ఉండోచ్చు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. లోపాయికారీ ఒప్పందాలు చేస్తున్నది టీడీపీనే అని మండిపడ్డారు. ‘స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఏరోజైనా మాట్లాడిందా?. స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో ఉన్నది వైఎస్సార్సీపీ. చంద్రబాబు గాజువాకలో ఏం మాట్లాడారో ఆయనకే తెలీదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు... ప్రజలకు అంతా తెలుసు. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌పై దాడి జరిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డ్రామాలు, నటించడం చంద్రబాబుకు బాగా తెలుసు. సీఎం వైఎస్ జగన్ యాక్టర్ కాదు.. జగన్ రియల్ హీరో. రాళ్లు వేయించకునే అలవాటు చంద్రబాబుకు ఉండోచ్చు. మేం ఎవరికీ ఏదీ ఆపాదించం.. కానీ జగన్‌పై కుట్ర ప్రకారమే దాడి జరిగింది. పవన్ కల్యాణ్‌క ఏం తెలుసు?. పవన్ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలి. జగన్‌పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారు. చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారు. చంద్రబాబు సైకిల్ బాగుందా? ఎప్పుడో తుప్పు పట్టిపోయింది. పవన్ డొల్లతనం ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది. చంద్రాబాబు 14 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు. ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? వాలంటీర్లపై చంద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడారు. ఇప్పడు తానొస్తే వాలంటీర్లకు జీతం 10వేలు చేస్తానంటున్నాడు’ అని మంత్రి బొత్స మండిపడ్డారు. -
బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు. సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుంది’ అని బొత్స అన్నారు. ఇక.. చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మంతి బొత్స సత్యనారాయణ. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా.. ‘సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా?. పచ్చ కామెర్లు వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. కొన్ని పత్రికలు సిద్దం సభలకు వచ్చిన వారు గ్రాఫిక్స్ అనే భ్రమల్లో ఉన్నారు. వారినే అలాగే భ్రమల్లో ఉండమనండి. రాష్ట్రంలో బీజేపీ, జనసేన ఉందా? ఎన్నికలు తరువాత రాష్ట్రంలో టీడీపీ కూడా ఉండదు. ముడు పార్టీలు కలిసిన మాకెందుకు భయం. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా. అక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. భీమిలి నుంచి నేను ఎందుకు పోటీ చేస్తాను?’ అని బొత్స అన్నారు. -
వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు
పిచ్చి కాకపొతే.. పోయిపోయి మైక్ టైసన్‌తో పోరాడాలని ఎవరనుకుంటారు.. హుస్సేన్ బోల్ట్‌తో పరుగెత్తాలని ఎందుకనుకుంటారు. షార్క్‌తో సెల్ఫీ దిగాలని ఎందుకనుకుంటారు. అలాగే రాజకీయంగా చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల జోలికి పోకూడదని కూడా అనుకుంటారు.. వాటిల్లో చీపురుపల్లి ఒకటి. ఇక్కణ్ణుంచి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈపాలి ఆయన్ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కూడా శతథా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 2014 లో గెలిచిన కిమిడి మృణాళిని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కొన్నాళ్ళు మంత్రిగా చేసారు అయితే ఆ తరువాత 2019 లో ఆవిడకు బదులుగా కొడుకు నాగార్జునను రంగంలోకి దించారు కానీ సత్తిబాబు ఎత్తులు... అనుభవం... వీటిముందు నాగార్జున నిలవలేదు. ఓడిపోయారు.. ఈసారి కూడా మళ్ళీ అక్కడ పోటీ చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు.. స్థానికంగానే ఉంటూ పదిమందినీ కలుస్తూ గతంలో ఓడిపోయినా సానుభూతి మిక్స్ చేసి గెలుద్దాం అని ఆశిస్తున్నారు. అయితే ఈ తరుణంలో విశాఖకు చెందిన గంటా శ్రీనివాసుని చీపురుపల్లిలో దించుతారని లీకులొచ్చాయి. ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే గంటా ఈసారి ఏకంగా జిల్లా క్రాస్ చేసేసి విజయనగరం వచ్చి బొత్స మీద పోటీ చేస్తారని అన్నారు.. గంటా కూడా తక్కువైనోడు కాదు.. పక్కా గెలుపు అనిపిస్తేనే నియోజకవర్గం మారతాడు తప్ప ఇలా సింహానికి ఎదురెళ్లే రకం కాదు. సేఫ్ గేమ్ ఆడతాడు తప్ప ప్రయోగాలు చేసేందుకు ఏమాత్రం సిద్ధపడని రకం అయన. అలాంటి వ్యక్తి బొత్సకు ఎదురెళ్లి ఓటమిని కొనితెచ్చుకోవాలాలని ఎందుకు అనుకుంటాడు. అందుకే నేను రానుగాకరాను అనేశాడు... దీంతో రెండో కృష్ణుడు ఎవరబ్బా అని చూస్తే సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు కనిపించారు.. ఆయన్ను పెద్దాయన మీరైతేనే బొత్సను ఓడిస్తారు.. చీపురుపల్లి వెళ్ళండి అన్నారట చంద్రబాబు.. దీనికి ఆ పెద్దాయన...' బాబుగారు నాకు టిక్కెట్ ఇవ్వకుంటే మానేయండి అంతేకానీ బొత్సకు ఎదురుగా పోటీ చేయమని చెప్పకండి.. ఎందుకంటే ఈ వయసులో నేను చికెన్ షాప్ ముందు తొడగొట్టలేను సారీ అని తప్పుకున్నట్లు చెబుతున్నారు. అలా ఇలా కాదని ఇంకో కాపు అభ్యర్థిని తెరముందుకు తెచ్చిన చంద్రబాబు ఆమెను సైతం చీపురుపల్లి వెళ్లాలని కోరారట. 2014 లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీతకు చీపురుపల్లి టిక్కెట్ ఇస్తాను... వెళ్లి బొత్స మీద పోటీ చేయండి అన్నారట.. గంటా, కళా వంటి పెద్దలే పారిపోతుంటే నేనెళ్ళి ఎందుకు ఓటమిని మోయాలి అంటూ ఆబ్బె.. నాకు వద్దండి... అది తప్ప ఇంకేదైనా ఇవ్వండి అని గీత కూడా చంద్రబాబు దగ్గర కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చీపురుపల్లికి టీడీపీ అభ్యర్థి దొరకడం లేదట.. ఖర్చులు మొత్తం పార్టీ తరఫున పెట్టుకుంటాం.. పోటీ చేయండి అంటున్నా ఎవరూ రావడం లేదని టీడీపీ వర్గాలు బావురుమంటున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
‘పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారు’
సాక్షి, అమరావతి: పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని ఆయన సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని తెలిపారు.జాయిన్ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నానని అన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మరోసారి గుర్తుచేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని చెప్పారు. మీరు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామని చెప్పారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని అన్నారు.రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్వాడీలను మరోసారి కోరుతున్నానని తెలిపారు. అంగన్వాడీల అందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని చెప్పారు. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని, బాలింతలు, శిశువులకు ఇబ్బంది రాకుండా వెంటనే అంగన్వాడీల సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరుతున్నామని అన్నారు. వారి సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తి చేస్తున్నామని బొత్సా సత్యనారాయణ అన్నారు. చదవండి: చంద్రబాబు పల్లకి మోసేందుకు ముద్రగడ నో..! -
AP: మున్సిపల్ కార్మికులతో చర్చలు
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చదవండి: టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ -
YSRCP Bus Yatra: ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర మొదలు.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, విజయనగరం: రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్సీపీయే. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ నిన్నటి సభలో సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు. వ్యక్తి గత దూషణలు చేయలేదు. లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తి గతం కాదు’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్ ►26- ఇచ్చాపురం ►27-గజపతినగరం ►28-భీమిలి ►30-పాడేరు ►31-ఆముదాలవలస ►నవంబర్ 1-పార్వతీపురం ►నవంబర్ 2 -మాడుగుల ►నవంబర్ 3 -నరసన్నపేట ►నవంబర్ 4 -ఎస్.కోట ►నవంబర్ 6 -గాజువాక ►నవంబర్ 7 -రాజాం ►నవంబర్ 8 -సాలూరు ►నవంబర్ 9 -అనకాపల్లి చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల -
టెన్త్ ఫలితాల్లో తిరుగులేని ‘మన్యం’.. రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా తిరుగులేని ఫలితాలు సాధించింది. 87.47 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఫలితాలతో నంద్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. అలాగే, ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 6,05,052 మంది పరీక్షలకు హాజరుకాగా.. 4,37,196 మంది అంటే 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 శాతమైతే బాలురది 69.27 శాతం. 933 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో ‘జీరో’ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలోని ఓ హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలిస్తున్నాయన్నారు. అందుకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాలే నిదర్శమన్నారు. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఐదు శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో సైతం 80.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమని ఆయన తెలిపారు. జీరో శాతం ఉత్తీర్ణత నమోదైన 38 పాఠశాలల్లో కారణాలను విశ్లేషిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. జవాబుపత్రాల నకలు కావాల్సిన వారు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి పొందచ్చని ఆయన తెలిపారు. ఆయా విద్యార్థులు ఈనెల 13వ తేదీలోగా ఠీఠీఠీ. ఛిజఝట. ్చp. జౌఠి. జీn వెబ్సైట్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అధైర్య పడకుండా దీనిని ఒక సవాలుగా తీసుకుని సప్లమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని మంత్రి బొత్స తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా ఉండాలన్నారు. జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, టైంటేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే, ఫెయిలైన విద్యార్థుల కోసం సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీటికి హాజరయ్యేవారు ఆదివారం (ఈనెల 7వ తేదీ) నుంచి మే 17వ వరకూ ఫీజు చెల్లించవచ్చని, రూ.50 అపరాథ రుసుంతో మే 22 వరకూ అవకాశం కల్పించామన్నారు. ఇక ఈ పరీక్షా ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్ ఠీఠీఠీ. bట్ఛ. ్చp. జౌఠి. జీnలో పొందుపరిచామని, మరో నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలను కూడా వెబ్సైట్లో ఉంచుతామని బొత్స వివరించారు. నిర్ణీత సమయంలో ఎస్సెస్సీ మార్కుల జాబితాలను సంబంధిత పాఠశాలలకు పంపిస్తామన్నారు. మరోవైపు.. సీఎం ఆలోచనల మేరకు మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా కృషిచేస్తున్నామన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిలైన వారు అధైర్యపడొద్దని హితవు పలికారు. విద్యార్థులు ఉన్నత చదువుల వైపు పయనించేలా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యా ప్రమాణాలు అందిస్తోందన్నారు. ఆ ఆరుగురూ పాస్.. దృష్టిలోపం విద్యార్థుల కోసం డిజిటల్ విధానంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ తరహాలో పరీక్షలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. అనంతపురం జిల్లాలోని పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, యక్కలూరి దివ్యశ్రీ, మేకా శ్రీధాత్రి, యేకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మల కోసం డిజిటల్ రూపంలో ఈ పరీక్షలు న్విహించారు. జీరో ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే.. ఈసారి జీరో ఫలితాలు వచ్చిన 38 స్కూళ్లలో 29 ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. మరో 9 మాత్రమే ఇతర యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఉండడం గమనార్హం. పాఠశాలల వారీగా చూస్తే.. ప్రైవేటువి 22, ప్రైవేటు ఎయిడెడ్వి 7, ప్రభుత్వ 1, జెడ్పీవి 5, ఆశ్రమ పాఠశాలలు మూడు జీరో ఫలితాలు సాధించాయి. ‘ప్రైవేటు’ అనుమతులకు వెబ్సైట్ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, గుర్తింపునిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్ విండో ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుచేసేవారు, ఇప్పటికే ఉన్న స్కూళ్లకు నిర్ణీత వ్యవధిలో ఆర్ అండ్ బీ, ఫైర్, మున్సిపాలిటీ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద్‌రెడ్డి, డైరెక్టర్ (కో–ఆర్డినేషన్) పి. పార్వతి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కే. శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం పాల్గొన్నారు. -
AP: టెన్త్‌లో పెరిగిన ఉత్తీర్ణతా శాతం.. ఫస్ట్, లాస్ట్ జిల్లాలు ఇవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ ఉత్తీర్ణత గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతం 72.26 శాతం వచ్చింది.. అలాగే బాలుర కంటే బాలికలే పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 75.38 శాతంతో పైచేయి సాధించారు. ఇక ఫెయిలైన విద్యార్ధులు అధైర్య పడవద్దని.. జూన్ మొదటీ వారంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విజయవాడలో టెన్త్ ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే విద్యాశాఖ రికార్డుస్ధాయిలో ఫలితాలని ప్రకటించారు.. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 60.39 శాతంతో చివరి స్ధానంలో నంద్యాల జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలకి రాష్ట్రంలో 6,05,052 మంది పరీక్షకు హాజరు కాగా 4,37,196 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 72.26 శాతం కాగా గత ఏడాది 68 శాతం ఉత్తీర్ణత వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగింది. వారిలో 69.27 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా 75.38 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలురు కంటే బాలికలు 6.11 ఎక్కువ శాతంలో ఉత్తీర్ణులై పై చేయిగా నిలిచారు. ఇక 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో 95.25 శాతం అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను www.bse.ap.gov.inలో ఉంచారు. దీనికి సంబంధించి పాస్ వార్డ్ CBSE@2025 అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. గత ఏడాది టెన్త్ ఫలితాలలో 71 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 38 పాఠశాలలకి తగ్గించగలిగారు. ఇందులోనూ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 29 ఉండటం విశేషం.. ఇక ఒక ప్రభుత్వ హైస్కూలులో.. మరో ఐదు జెడ్పీ హైస్కూలులో జీరో శాతం ఫలితాలు వచ్చాయి.. జీరో శాతం ఫలితాలపై పాఠశాల వారీగా సబ్జెక్టు వారీగా విశ్లేషించి వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నించాలని మంత్రి బొత్స అధికారులని ఆదేశించారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! అలాగే నేరుగా పరీక్షలు రాసిన ఆరుగురు అంధ విద్యార్ధులు పాసయ్యారు.. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుండి 10వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు అభ్యర్థులు మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసిన 80.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడకుండా ఒక సవాల్ గా తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించాలన్నారు. పిల్లలు అధైర్య పడకుండా తల్లితండ్రులు వారిని ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విధంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు కొరకు హాజరయ్యే విద్యార్థులు మే 7 నుండి 17వ తేదీ వరకూ ఫీజులు చెల్లించవచ్చునన్నారు. టెన్త్ పరీక్షలపై గత ఏడాది జరిగిన సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎటువంటి ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీగా నిర్వహించారు. -
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించబోతోంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: ఏపీలో ఏడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌కు దిగారు. ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మెజార్టీ లేకపోయినా గెలుపుపై సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు మాట్లాడే ప్రతి పనికిమాలిన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుకి ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తాం. గంటా మాటలు గొప్పలు చెప్పుకోవడానికే. రాజీనామా ఆమోదిస్తే స్పీకర్ చెబుతారు కదా. గంటా అతని పబ్లిసిటీ కోసం చెప్పుకుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి. టీడీపీ నేతలకు నిలకడ లేదు. -
‘జనసేన అసలు రాజకీయ పార్టీనేనా? ఆ లక్షణం ఒక్కటీ లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు శనివారం నాటి విశాఖ గర్జన ప్రతిరూపంగా నిలిచిందని, జోరు వానలోనూ ప్రజలు గర్జనలో పాల్గొన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖకు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఓ కనువిప్పు అని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ మీద.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత ద్వేషం అని ప్రశ్నిచారు. రాజధానికి విశాఖ దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవేరవన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని స్పష్టం చేశారు. ‘విశాఖలో ఇంటింటికెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. విశాఖ గర్జన జరుగుతుంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా? ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రజలు చొక్కా పట్టుకుని అడగాలి. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా ఉంది. జనసేనకు ఓ విధానం ఉందా..? జనసేన అసలు రాజకీయ పార్టీనేనా..? జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు. విశాఖకు రాజధాని వద్దని పవన్ ఎందుకొద్దంటున్నారు? గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా? ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి.. పోలీసులను తప్పు పడతారా? ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా? మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరు? జనసేన రాజకీయ పార్టీ కాదు. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలి.. రైల్ కనెక్టివిటీ ఉండాలి. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉంది? విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.’ అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ తీరుపై విశాఖ వాసుల ఆందోళన.. పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు -
రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బొత్స
-
విమర్శలు చేసుకునే సమయం కాదు
-
పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదని..
-
పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదని.. : సజ్జల
సాక్షి, అమరావతి: మాటకు విపరీతార్థాలు తీసి లేనిది ఉన్నట్లుగా రాయడం ఎల్లో మీడియాకు పుట్టుకతో వచ్చిన బుద్ధి అని అది పోదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్సార్సీపీ ఎన్డీయేలో చేరుతున్నట్లుగా వార్తలు రాశారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాటలకు విపరీతార్థాలు తీసి, లేనిది ఉన్నట్లుగా చెప్పి ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోంది. దాంట్లో భాగమే వైఎస్సార్సీపీ ఎన్డీయేలో చేరుతున్నట్లుగా రాసిన వార్త . అందుకే పుట్టుకతో వచ్చిన పోదని పెద్దలంటారు’ అని సజ్జల ట్వీట్ చేశారు. (రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ) -
‘గిట్టుబాటు ధరకు కృతనిశ్చయంతో ఉన్నాం’
సాక్షి, విజయనగరం: రైతుల కోసం వైఎస్సార్ ఒకడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రిని మించి రైతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం చీపురుపల్లి పరిధిలోని గుర్లలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 28వేల మంది రైతులకు రూ.34 కోట్ల పెట్టుబడి సాయం చెక్కులను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు నలుగురికి అన్నం పెట్టేవాడిగా వుండాలని కోరుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు సాయం చేసే కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ కంటే అధికంగా రైతులకు సహాయం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కి దక్కిందని ప్రశంసించారు. ఎన్నికల సమయంలో రైతులకు ప్రతి ఏటా రూ.12,500 పెట్టుబడి సహాయం చేస్తామని హామీ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఆ మొత్తానికి రూ. వేయి పెంచుతూ రూ.13,500 చేశామని తెలిపారు. అదేవిధంగా నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లపాటు రైతుభరోసా సహాయం అందించాలని నిర్ణయించామని వెల్లడించారు. నవంబరు 15వ తేదీ వరకు ఈ పథకంలో రైతులు పేర్లు నమోదు చేసే అవకాశం వుందని.. రైతులు తమ పేర్లు నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైనా సరి చేస్తామన్నారు. ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నదే సీఎం జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా సమస్యలు వస్తే వాటిని సరిచేసి పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల పంటలకు మద్ధతు, గిట్టుబాటు ధరలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. రైతులు పండించే పంటలకు .. వారు పంట వేసినప్పుడే మద్ధతు ధర ప్రకటించి భరోసా కల్పిస్తామన్నారు. పంటలు పండించే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో గిట్టుబాటు ధరలకు.. మార్కెట్ కమిటీల ద్వారా పంటలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పండించే ఇరవై పంటలకు ప్రభుత్వం మద్ధతు ధరలు ప్రకటించిందని.. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
రేపటి నుంచే ‘కావాలి జగన్..రావాలి జగన్’
సాక్షి, గుంటూరు : నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోమవారం నుంచి ‘ కావాలి జగన్..రావాలి జగన్’ అనే కార్యక్రమాన్ని175 నియోజక వర్గాల్లో చేపడుతున్నామని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి సమన్వయ కర్త ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను జనంలోకి తీసుకెళ్తూ వాటి ద్వారా చేకూరే లబ్ధిని తెలియజేయాలన్నారు. అధికారం పోతుందని తెలిసే టీడీపీ నేతలు అవినీతి, దోపీడీలకు పాల్పడుతున్నారని బొత్స విమర్శించారు. చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని పాలించడం వదిలేసి దోచుకోవడమే పరమావధిగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. బాబు దోపిడీలను ప్రజలకు వివరిస్తూనే అధికారంలోకి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి : ఉమ్మారెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. మరీ ముఖ్యంగా బూత్ కమిటీ సభ్యులు అలర్ట్‌గా ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే న్యాయం జరుగుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. నవరత్నాల వల్ల కలిగే లబ్దిని జనాలకు వివరించాలని పార్టీ సభ్యులకు సూచించారు. -
'తనకు ప్రత్యేక హోదా కోసం బాబు యత్నాలు'
గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా బంద్ నిర్వహిస్తామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ 29న చేపట్టే బంద్‌కు వామపక్షాలు మద్ధతు తెలుపుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం కాకుండా ఆయన హోదా కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీహార్‌కు లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని అక్కడి సీఎం నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని గుర్తుచేశారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు మాత్రం ప్యాకేజీ కావాలని కేంద్రం ముందు మోకరిల్లారని బొత్స విమర్శించారు. -
ఏటిసేస్తాం.. పోనాది!
పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఓటమి చీపురుపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రాజకీయ చతురతకు దర్పణంగా నిలిచి, విజయనగరం జిల్లాను తన కన్నుసన్నల్లో పెట్టుకుని పదేళ్ల పాటు ఇటు జిల్లా, అటు రాష్ట్రంలో చక్రం తిప్పిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తన కుటుంబంలోనే 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా, పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన కేవలం పదిహేను రోజుల్లో టికెట్టు సంపాదించుకుని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కిమిడి మృణాళిని చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో ఆది నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్న శ్రీను సైతం విజయం కోసం రేయింబవళ్లు శ్రమించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రధానంగా చీపురు పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
బొత్స రాజకీయ జీవితం వైఎస్ పుణ్యమే
వెఎస్సార్ సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన కాబోయే సీఎం జగన్ : పెనుమత్స చీపురుపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలకు మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని, అటువంటి నాయకుడ్ని బొత్స విమర్శించడం ఆయన నీచ బుద్ధికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన అన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం సాయంత్రం గరివిడి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. బొత్సకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ దయతో తాను రాజకీయంగా ఎదగలేదని, గత ఎన్నికల్లో ఆయన ఫొటో లేకుండానే గెలిచానని అంగీకరించగలరా అని ప్రశ్నిం చారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ఫొటో పెట్టుకుంటేనే ఈ నియోజకవర్గ ప్రజలు బొత్సను గెలిపించారని తెలిపారు. వైఎస్సార్ దయ తో రాష్ట్రస్థాయి రాజకీయాలను నెరిపిన బొత్స ఆయన్నే విమర్శించే స్థాయి కి వచ్చారన్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడి పదవిలో ఉండి కూడా ఆయన తోటపల్లి కాలువ పనులను పూర్తి చేయించలేకపోయారని, అంటే ఇక్కడి ప్రజలపై బొత్సకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. పా ర్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధించారని తెలిపారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తోటపల్లి కాలువ పనులు పూర్తి చేయించి సాగునీరు అం దిస్తామని, గరివిడిలో ఫేకర్ సమస్య పరిష్కరించి, కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం కావడం ఖాయం నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబ శివరాజు అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా ఒమ్మి, సతివాడ గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్ సంక్షేమ పథకాల అమలు జగన్మోహన్రెడ్డి పాలనతోనే సాధ్యమని చెప్పారు. అంతకుముందు పార్టీ విజయనగ రం ఎంపీ అభ్యర్థి బేబీనాయన మాట్లాడుతూ రాష్ట్ర రాజ కీయాల్లో జగన్మోహన్రెడ్డి మడమ తిప్పని నేత అని అన్నారు. పార్టీకి ఎనలేని ప్రజాదరణ ఉందని, వారే తమ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి సురేష్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు విజయనగరం మున్సిపాలిటీ/టౌన్: టీడీపీ అధినేత చం ద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మవద్దని వైఎ స్సార్ సీపీ విజయనగరం ఎంపీ బేబీనాయన కోరారు. విజయనగరం పట్టణంలోని గంట స్తంభం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ అంటూ అనేక టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలతో ముందుకు వస్తున్న బాబును, ఆ పార్టీ అభ్యర్థులను నమ్మొద్దని కోరారు. జగన్ సీఎం కావడం చారిత్రాత్మక అవసరమన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా పోటీ చేసిన తాను కాంగ్రెస్ నాయకుల వెన్నుపోట్లు వల్లే నాలుగుసార్లు ఓటమి పాలయ్యాయని, చివరికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందానని చెప్పా రు. ఎన్నికల్లో తనను, ఎంపీ అభ్యర్థి బేబీనాయనను ఫ్యా న్ గుర్తుపై ఓటేసి, గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాగునీరు, రోడ్లు, ఇళ్లు వంటి మౌలి క సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. -
మళ్లీ జోడు పుఠాణీ!
మాజీ మంత్రి బొత్సతో టీడీపీ కుమ్మక్కు ఇటకర్లపల్లిలో బొత్స సమావేశం హాజరైన టీడీపీ కేడర్ గ్రామస్తుల విస్మయం చీపురుపల్లి, న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీ నాయకులు మళ్లీ కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారు. నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూ ఇదే తరహా కుట్రలకు పాల్పడిన ఆ రెండు పార్టీల నాయకులు..ఇప్పుడు మళ్లీ ఒక్కట య్యారు. ఇప్పటివరకు పరోక్షంగా అరుుతే తమకు.. లేకపోతే టీడీపీకి ఓటు వేయూలని గ్రా మాల్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని ఇటకర్లపల్లిలో జరిగిన సభతో డెరైక్ట్ అయ్యూరు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి ఇటకర్లపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామానికి చెందిన టీడీపీ కేడర్ మొత్తం హాజరైంది. దీంతో నియోజకవర్గంలో ఈ విషయం తెలిసిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి ఇటకర్లపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మీసాల రమణ తన వర్గంతో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేందుకు కార్యకర్త కూడా లేరు. ఇదే పరిస్థితి మండలంలోని జి. ములగాంలో కూడా ఉంది. అక్కడ కూడా మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు తన వర్గంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది. దీంతో బొత్స అక్కడ సమావేశం నిర్వహించలేని దుస్థితి నెల కొంది. ఇటకర్లపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీకి చెందిన ఆ గ్రామ పెద్ద లు, కార్యకర్తలు హాజరయ్యా రు. ఇటకర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేకపోయినప్పటికీ.. బొత్స సమావేశం జరుగుతుందని ముందుగానే టీడీపీ నియోజక వర్గ స్థాయి నాయకులకు తెలిసినప్పటికీ ఎందుకు స్పందించలేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాయకులు గ్రామ స్థాయి కేడర్‌ను ఎందుకు నిలువరించలేకపోయారన్న ప్రశ్నబలంగా వినిపిస్తోంది. అయితే సమావేశానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీలో చేరారంటే అదీ లేదు. కానీ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. ఓట్లు వేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరకుండా టీడీపీలో ఉంటూనే, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య ర్థి సమావేశానికి వెళ్లడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది పార్టీ నుంచి బయటికి వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. బయటికి వెళ్లినవారిలో తిరిగి వచ్చేందుకు ఇంకా కొందరు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు చెబుతామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో వార్‌రూం భేటీలో పాల్గొన్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారందరినీ తిరిగి పార్టీలోకి రావాలనికోరుతున్నాం. విభజనపై అందరికీ సెంటిమెంట్లు ఉన్నాయి. అందరం పోరాడాం. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే తప్పు చేయలేదు. అన్ని పార్టీలకు పాత్ర ఉంది. అందుకే సాయిప్రతాప్‌ను కూడా కోరడం జరిగింది. ఆయన తిరిగి రావడం సంతోషం. ఇంకా వచ్చేవాళ్లు ఉన్నారు. ఎవరెవరు వస్తారో త్వరలో చెబుతాం’’ అని బొత్స చెప్పారు. -
బొత్సకు షాక్!
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోలుకోలేని షాక్ తగిలింది. పదేళ్ల ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది. ఆయన రాజకీయ కోట బీటలు వారింది. వైఎస్సార్ సీపీలోకి భారీగా నాయకులు చేరడంతో చీపురుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. రోజు వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు బొత్సకు చేయిచ్చారు. ఆయనతో రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. ఆయన ప్రధాన అనుయాయుడు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి గురువారం వైఎస్సార్ సీపీలో చేరగా, మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు రాం...రాం చెప్పి, విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఆయనతో పాటు బొత్స సన్నిహితులైన 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. వీరే కాదు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా లో అనేక మంది కాంగ్రెస్ నాయకులు బొత్సను వది లేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కబంధహస్తాల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయన బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడేది లేదంటూ నిష్ర్కమణకు సన్నద్ధమవుతున్నారు. షాడో నేత ఆగడాలు, సతాయింపు భరించాల్సిన రోజులు పోయాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయని నేతలు చెప్పుకొస్తున్నారు. ఫలించని బొత్స మంత్రాంగం కోల్పోతున్న పట్టును నిలబెట్టేందుకు బొత్స తీవ్ర ప్రయత్నాలే చేశారు. వదిలి వెళ్లిపోతున్న నాయకుల విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ పార్టీ మారిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. కనీసం మాట వినలేదు. ఇక కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పేశారు. పరోక్షంగా మీకో దండమని చెప్పేసి వచ్చేశారు. ఈ క్రమంలోనే చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో దాదాపు 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి, గురువారం రాత్రి రెండు బస్సులు, 20 కార్లలో బయలుదేరి వెళ్లి, విజయవాడలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మీసాల రమణ, కరిమజ్జి శ్రీనివాసరావు, కోరాడ రామారావు, గొర్లె రమణ, పిసిని శ్రీను, రెల్లి అప్పలనాయుడు, చింతాడ లక్ష్మణ, అధికార్ల శ్రీనుబాబు, బాణాన శ్రీనివాసరావు, చందక గురునాయుడు, పనస అప్పారావు, అంబల్ల రామకృష్ణ, రేవల్ల సత్తిబాబు, బూర్లె నరేష్, సరిది రమేష్, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తదితరులు ఉన్నారు. ఆందోళనలో బొత్స.. నాయకులు, కార్యకర్తలు చేజారడంతో బొత్స టెన్షన్‌కు లోనవుతున్నట్టు తెలిసింది. రాజకీయ అస్థిరతను కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కేడర్‌ను నిలబెట్టకపోతే పుట్టి మునిగిపోయే పరిస్థితి ఉందని భయపడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గతంలో కలిసి పనిచేసిన నాయకులందరికీ ఫోన్ చేసి రావాలని కబురు పెట్టారు. కానీ స్పందన రాలేదు. -
బొత్స అను నేను..
విజయనగరం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టాన్ని చివరకు ఇలా కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు. రెండో సారీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వందరోజులకే ఆయన హఠాన్మరణం తరువాత రాష్ట్రం అథోగతిపాలైంది. జిల్లా ప్రగతి కునారిల్లింది. వర్గరాజకీయలు, రాష్ట్ర విభజనకే పరిమితమైన మంత్రులు జిల్లాకు చేసింది ఏమైనా ఉంది అంటే విభజన బాధను మిగల్చడమే. అభివృద్ధి మాట అటుంచి జిల్లా ప్రజల మనోభావాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి, తమ అధిష్టానానికి చెప్పడంలో విఫలమయ్యారు. 2009వ సంవత్సరంలో రాజశేఖరరెడ్డి పుణ్యమా అని గద్దెనెక్కిన వీరి పదవీకాలం రాష్ర్టపతి పాలనతో నిస్తేజంగా ముగిసింది. చేజారిన పదవులు... ప్రస్తుత 13వ అసెంబ్లీ కాలంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు, విజయనగరం జిల్లాకు చెందిన మరొకరు రాష్ట్ర మంత్రులుగా చేశారు. జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన శత్రుచర్ల విజయరామరాజు మంత్రి పదవుల్లో కొనసాగినా జిల్లాకు ఒరగబెట్టింది ఏమీలేదు. రాష్ర్టపతి పాలనతో వీరి పదవులు చేజారిపోయాయి. బొత్స... జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి న ఒకే ఒక్క మంత్రిగా బొత్స సత్యనారాయణ చాలా శాఖల బాధ్యతలు వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలు, గృహనిర్మాణ శాఖ, రోశయ్య హయాంలో పంచాయతీరాజ్, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అయితే ఆయన సొంతలాభం చూసుకున్నారే తప్పా ప్రజలకు ఒరిగింది ఏమీలేదనే విమర్శలు జిల్లా ప్రజల నుంచి అధికంగా వచ్చాయి. మద్యం, భూ, ఇసుక మాఫియాలకు పాల్పడినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మద్యం సిండికేట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి దాడులు చేయించింది. దీంతో జిల్లాలో చాలా మంది ఏసీబీ అధికారులకు చిక్కారు. బినామీలుగా ఉన్న పేదలు పోలీస్ స్టేష న్ల చుట్టూ తిరిగి నానా పాట్లు పడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాన్ని మంత్రి అణిచివేయించారని ఆరోపణలున్నాయి. ఆయన కారణంగానే పోలీసులు కర్ఫ్యూ అమలు చేసి, తమను నానా ఇబ్బందులకు గు రి చే శారని పట్టణ ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. శత్రుచర్ల.... ఇక జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన శత్రుచర్ల విజయరాజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రవాణాశాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించినా, జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో కొంత మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయింది. సీఎం కిరణ్ రాజీనామా తర్వాత మంత్రుల హోదా కోల్పోయినప్పటికీ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ కోరడంతో కొనసాగారు. అయితే, ఈలోపే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎన్నికలు మరో ఆరు నెలలు పొడిగిస్తారని, కొత్త కేబినెట్ ఏర్పాటై మంత్రి పదవులు ఉంటాయని వారు ఆశించారు. ఒకానొక సమయంలో ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించాలని బొత్స పావులు కదిపారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లోపే కాంట్రాక్ట్‌లు దక్కించుకోవచ్చని, నిధుల పందేరానికి దిగొచ్చని, ఈలోగా ఎంతో కొంత వెనకేసుకోవచ్చని భావించా రు. అయితే, వారి ఆశలు ఆడియాశలయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం నో చెప్పడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. దీంతో మంత్రులు పదవులను కోల్పోగా, ఎమ్మెల్యేలు అధికారాన్ని కోల్పోయారు. నేతల జోరుకు బ్రేక్ వేసినట్లయింది. డమ్మీలుగా ఎమ్మెల్యేలు రాష్ర్టపతి పాలనతో అసెంబ్లీ స్తుప్తచేతనావస్థలో ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలందరూ డమ్మీలయిపోయారు. పదవి ఉన్నా వారంతా ఏమీ చేయలేని నిస్సహాయులు. ఇన్నాళ్లూ అధికారం చెలాయించిన నేతల చేతులు కట్టేసినట్లయింది. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా వైఎస్సార్సీపీలోకి చేరడంతో బొబ్బిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు ముందే మాజీ అయ్యారు. ఆ తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వైఎస్సార్ సీపీలో చేరారు. మిగతా ఏడుగురిలో ఇద్దరు టీడీపీ తరఫున, ఐదుగురు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చివరి వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన పలువురు ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. తమ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుని పెద్దఎత్తున వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని వ్యవహారాల్లో చేతులు పెట్టి పెద్ద ఎత్తున దందా నడిపారు. అన్నీ తామై వ్యవహరించారు. దొరికిన కాడికి దోచుకున్నారు. ఎన్ని చేసినా ఐదేళ్ల తర్వాత పదవీకాలం ముగిసి, మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావడం పరిపాటి. కానీ ఈసారి అనూహ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందుగానే అధికారాన్ని కోల్పోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనకు కేంద్రం తెరలేపడంతో ఊహించని విధంగా మిగిలిపోయారు. ఇప్పుడంతా సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయారు. -
బొత్స సోదరుడిపై భూఆక్రమణ కేసు
భూయాజమాన్య వివాదం ‘సుప్రీం’లో పెండింగ్.. యథాతథస్థితి ఉత్తర్వులున్నా సతీష్ భవన నిర్మాణ పనులు కబ్జాపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు హైదరాబాద్, న్యూస్‌లైన్: పీసీసీ అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదైంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ రెవెన్యూ అధికారులు నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నం.12 కమాన్‌లో ఉన్న సర్వే నంబరు 403లోని 500 గజాల స్థలంలో బొత్స సతీష్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను రెండు నెలల క్రితమే అప్పటి తహసిల్దార్ చంద్రకళ అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను ఆధీనంలోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సంక్రాంతి సెలవుల్లో సతీష్ మళ్లీ నిర్మాణ పనులు మొదలెట్టారు. స్థలం చుట్టూ ఐరన్ షీట్లు వేస్తూ, లోపల పునాదుల తవ్వే పనులు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ ఐరన్ షీట్లను తొలగించారు. సతీష్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం యాజమాన్యానికి సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. సతీష్ నిర్మాణం చేపట్టిన స్థలం భాగంగా ఉన్న మొత్తం 15 ఎకరాల భూమి తనదేనంటూ షేక్ అహ్మద్బిన్ ఆమోదీ అనే వ్యక్తి భూఆక్రమణల నిరోధక కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. అసలు ఇది ప్రభుత్వ స్థలమంటూ యథాతథ స్థితి ఉత్తర్వులతో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా సతీష్ రాజకీయ బలంతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సతీష్‌పై భూఆక్రమణ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డెక్కిన ఆటో
సాక్షి, హైదరాబాద్ : ఆటో సమ్మె ముగిసింది. కార్మిక సంఘాలు అధికారులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆటో కనీస చార్జీ ని రూ.16 నుంచి రూ.20 కి పెంచుతూ రవాణా శాఖ మంగళవారం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త ఆటోచార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సంయుక్త రవాణా కమిషనర్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. చార్జీల పెంపుతోపాటు, పలు సమస్యలపై నాలుగు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆటోసంఘాల ప్రతినిధులతో రవాణా శాఖ కమిషనర్ జి.అనంతరామ్, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి చర్చలు జరిపారు. చార్జీల పెంపు, ట్రాఫిక్ చలానాలను పెంచుతూ విడుదల చేసిన 108 జీవో రద్దు, కార్మికుల సంక్షేమ బోర్డు తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ చర్చల్లో రవాణా కమిషనర్ అనంతరామ్‌తో పాటు, అదనపు రవాణా కమిషనర్ శ్రీనివాస్, సంయుక్త రవాణా కమిషనర్ బి.వెంకటేశ్వర్లు, ఆటోసంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్ , నరేందర్, సత్తిరెడ్డి, కిరణ్, అమానుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ చలానాల పెంపును కొంతమేరకు ఉపసంహరించుకోనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే ప్రయాణికుల భద్రత, ఈ చలానాలు తదితర అంశాలపై జంట కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు, ఆటోసంఘాలతో కలిపి ఈ నెల 25వ తేదీన ఒక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై రవాణాశాఖ మొదటి నుంచి సముఖంగానే ఉందని, దీనిపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. ఈ అంశంపై కార్మిక శాఖ అధికారులతో త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే క్రమంగా రోడ్డెక్కిన ఆటోలు... సాయంత్రం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రోడ్లపైకి వచ్చాయి. ఇక కనీస చార్జీ రూ.20 కార్మిక సంఘాల డిమాండ్లకు రవాణా శాఖ ఓకే ఫిబ్రవరిలో కొత్తచార్జీలు అమల్లోకి! మరికొన్ని నిర్ణయాలు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరిగే ఆటోలన్నీ విధిగా మీటర్ చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలి. చార్జీలు పెంచిన తరువాత 3 నెలల్లోపు ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాలి {పతి ఆటోలో విధిగా ఆటోయజమాని, డ్రైవర్ వివరాలను తెలిపే చార్ట్‌ను ఏర్పాటు చేయాలని డాక్యుమెంట్లు కూడా ఆటోలో ఉండాలి. ఈ చలానాలు, ట్రాఫిక్ చలానాల తగ్గింపు, తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కాగా చార్జీల పెంపు నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉన్న ప్రీపెయిడ్ బూత్‌ల చార్జీలు కూడా సవరించాలని ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. -
బొత్స వల్లే కర్ఫ్యూ
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్: విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ రావడానికి బొత్స అండ్ కంపెనీయే కారణమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. శుక్రవారం ధర్మపురి గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాదయూత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో అమాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. విజయనగరంలో టోపీలు పెట్టి వేషాలు మార్చే నాయకులను నమ్మవద్దని కోలగట్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. ధర్మపురి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా పంచాయతీగానే ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారని, దీనికోసం పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, జిల్లా నాయకుడు ఎస్.ఎన్.ఎంరాజు, కనకల మురళీమోహన్, విజ్జపుప్రసాద్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, ఎస్.ఎం.కె.బాషా, తుంపల్లి రమణ, ముద్డాడ చంద్రశేఖర్, మైలపల్లిపైడిరాజు, గుండెల ప్రకాష్‌రావు, ధర్మపురి నాయకులు గెదేల ఆదిబాబు, పతివాడ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
పార్టీని వీడే మంత్రులెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బాటలోనే నడవాలని రాష్ట్ర పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, అప్పుడు పార్టీలో కొనసాగే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారన్న అంశంపై పీసీసీ నేతలు అంచనా వేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా సీమాంధ్ర మంత్రుల్లో పార్టీని వీడేవారెందరు,ఏం జరిగినా కచ్చితంగా పార్టీలోనే కొనసాగే వారెందరని కూపీ లాగుతున్నారు. ఏ జిల్లాలో ఏ మంత్రి ఎలా ఆలోచిస్తున్నారు, ఆయన వ్యూహమేమిటి అంటూ వారి సన్నిహిత నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిరోజులుగా సీమాంధ్ర మంత్రులను విడివిడిగా పిలిపించుకుని దీనిపై నేరుగా మాట్లాడుతున్నట్టు తెలిసింది. సీఎం, బొత్సతో కలిపి మంత్రివర్గంలో ప్రస్తుతం సీమాంధ్ర నుంచి 19 మంది ఉన్నారు. విభజనపై ముందుకే వెళ్తే వీరిలో కనీసం తొమ్మిది మంది పార్టీని వీడతారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు... కోస్తాంధ్రలో కన్నా ల క్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు), పార్థసారథి (కృష్ణా), తోట నరసింహం (తూర్పుగోదావరి), ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు), ఎం.మహీధర్‌రెడ్డి (ప్రకాశం), ఉత్తరాంధ్రలో పి.బాలరాజు (విశాఖపట్నం), కొండ్రు మురళీమోహన్ (శ్రీకాకుళం), రాయలసీమలో ఎన్.రఘువీరారెడ్డి (అనంతపురం), సి.రామచంద్రయ్య (కడప) కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని హామీ ఇచ్చారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న మంత్రులెవరూ కాంగ్రెస్‌లో కొనసాగుతారన్న నమ్మకం పార్టీ పెద్దలకు లేదంటున్నారు. ముఖ్యంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న మంత్రులంతా పార్టీని వీడనున్న వారేనని పెద్దలు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీతో ఉంటారన్న దానిపై కూడా పీసీసీ అంచనాలు రూపొందిస్తోంది. -
అసెంబ్లీలో తీర్మానం ఉండదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం పార్టీ పరంగా శిలా శాసనమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీ లోగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. 2014 ఎన్నికల వరకూ కిరణ్‌కుమార్‌రెడ్డే సీఎంగా కొనసాగుతారని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, వ్యక్తిగతంగా రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదన్నదే తమ అభిమతమన్నారు. అసెంబ్లీలో విభజన అంశంపై తీర్మానం చేయడం ఉండదని, అభిప్రాయాలను మాత్రమే కేంద్రం తెలుసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరుల తో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలపై జూలై 12న జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో సీఎం 253 పేజీల నివేదికను, తాను 18 పేజీల నోట్‌ను అధిష్టానానికి అందజేశామన్నారు. విభజన వల్ల తలెత్తే పరిస్థితులను వారి ముందుంచుతూ.. ఈ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తామిద్దరం చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అంతమాత్రాన తమ ప్రాంత ప్రజల మనోభావాలను చెప్పకుండా ఉండలేమన్నారు. విభజన నిర్ణయం జరిగిపోయిందని, మళ్లీ నిర్ణయాన్ని మార్చాలంటే సీడబ్ల్యూసీ మాత్రమే చేయాల్సి ఉందని బొత్స అన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తారని ఎక్కడో చిన్న ఆశ మిగిలి ఉందన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైనందువల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను బొత్స ఖండించారు. ‘ఆ నాడు జగన్‌ను అరెస్టు చేసినప్పుడు సీబీఐ, న్యాయస్థానం చాలా మంచి పనిచేశాయని పొగుడుతారా? ఈ రోజు చట్ట ప్రకారం బెయిల్ వస్తే కాంగ్రెస్ కుమ్ముక్కైందని అంటారా? ఇదేం రాజకీయం’ అని ప్రశ్నించారు. మరోవైపు బొత్స మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. అధిష్టానం బాటలోనే నడవాలనే అంశంపై రెండ్రోజుల్లో సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని బొత్స భావిస్తున్నారు. -
విభజనకు 2008లోనే ఓకే చెప్పాం: బాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజనకు అనుకూలమని తాను 2008లోనే చెప్పానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరించారు. అయితే, రెండు ప్రాంతాల వారికి న్యాయం చేయాలని తాము చెప్పామని.. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని ధ్వజమెత్తారు. 42 రోజులుగా ప్రజలు పోరాటం చేస్తుంటే వారిని పిలిచి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సోమ, మంగళవారాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల్లోని ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. సమస్యను కాంగ్రెస్ మరింత జటిలం చేసిందని ఆరోపించారు. సోనియాగాంధీ చేతిలో ప్రధాని మన్మోహన్సింగ్ కీలుబొమ్మ అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రధానిని కలవటానికి వెళ్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదని ప్రధాని అనటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థుడని, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా.. అక్కడో మాట ఇక్కడో మాట చెప్తారని ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉత్సవ విగ్రహమని, లిక్కర్ డాన్ అని రాష్ట్రం గురించి పట్టించుకోరని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులో దీక్షలు చేశారని, ఆయనను ఉస్మానియా, నిమ్స్‌కు తరలించారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారని, ఇంటి భోజనాలు తెప్పించారని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. దేశంలో నాలుగుసార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు వస్తే మూడుసార్లు టీడీపీ కీలక పాత్ర పోషించిదని.. తనను ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కూడా కోరారని, అయితే రాష్ట్రంలో ఉండటం కోసం తాను తిరస్కరించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ఫోన్లు ఉండటం తన ఘనతేనని చెప్పుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు సైబర్‌బాద్‌ను ఏర్పాటుచేసి అభివృద్ధి చేశానన్నారు. -
కాంగ్రెస్‌ను వీడే ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి వలస వెళ్లే ఎమ్మెల్యేలు ఇంకొందరు ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున సొంత పనులు చక్కదిద్దుకునేందుకే వారు పార్టీలో కొనసాగుతున్నారని తెలిపారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలంతా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లొచ్చిన వాళ్లేనని, స్వార్థ ప్రయోజనాల కోసమో, ఆత్మస్థైర్యం లేకనో కాంగ్రెస్‌ను వీడి వెళుతున్నారని చెప్పారు. ఒక వ్యక్తి పార్టీని వీడితే కొంత నష్టం ఉంటుందని, అదే సమయంలో మంచి లాభం కూడా జరుగుతుందని, అదేమిటనేది వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తున్నారో లేదో తెలియదన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర భవన్లో తెలంగాణ లాయర్లు వెళ్లి అలజడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు తెలిపారు. విడిపోతే తప్పులేదు.. కానీ సమైక్యంగానే ఉండాలి: తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా విడిపోతే తప్పులేదని తాను గతంలో చెప్పిన మాట వాస్తవమేనని, ఇప్పటికీ యూ టర్న్ తీసుకోలేదని బొత్స చెప్పారు. అయితే తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సమైక్యంగా ఉండాలని కోరుకోవడం పార్టీ ధిక్కారం కాదని, అభ్యర్థన మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిందిగా హైకమాండ్ పెద్దలను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం కిరణ్‌తో బొత్స, మర్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌తో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్న అంశంపై బొత్స, కిరణ్‌లు చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక ట్రామిరెడ్డి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె విరమణకు యత్నాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అంశాలపై కూడా చ ర్చించారని తెలుస్తోంది. పెద్ద పదవికే శైలజానాథ్ సమైక్యవాదం: జేసీ సాక్షి, హైదరాబాద్: మరింత పెద్ద పదవి కోసమే మంత్రి శైలజానాథ్ సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజల ఉద్యోగ, సాగునీటి అవసరాల కోసమే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామన్నారు. -
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు:బొత్స
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ప్రక్రియ ఆగిపోలేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన బొత్స ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదంటూనే, రాష్ట్ర విభజనకు రాజ్యాంగ ప్రక్రియ అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటైన ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధిచినది మాత్రమేనన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన బొత్స సత్యనారాయణ.. విభజన ప్రక్రియ నడుస్తోందని, ఆంటోని కమిటీ వల్ల దానికి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నెల 19న ఆంటోనిని రెండోసారి కలవనున్న తెలంగాణ నేతలు.. సీడబ్యూసీ తీర్మానాన్ని యధావిధిగా అమలు చేయాలని, విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న తెలంగాణ జిల్లాల్లో మంత్రుల, ఎమ్మెల్యేల విస్తృతస్థాయి సమావేశం ఉంటుందన్నారు. అయితే.. మంత్రి దానం నాగేందర్ మాత్రం భిన్న స్వరం వినిపించారు. హైదరాబాద్‌పై చాలా అనుమానాలు ఉన్నాయని.. రాజధాని సమస్యలపై అంటోనీ కమిటీని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నట్లు చెప్పారు దానం. ఈ నెల 20న సీమాంధ్ర నేతలు ఆంటోనీ కమిటీని కలుస్తారని పీసీసీ చీఫ్ బొత్స చెప్పారు