కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స | Noen kommer til kongressen: congresse | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స

Published Tue, Apr 8 2014 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స - Sakshi

కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది పార్టీ నుంచి బయటికి వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. బయటికి వెళ్లినవారిలో తిరిగి వచ్చేందుకు ఇంకా కొందరు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు చెబుతామని పేర్కొన్నారు.

సోమవారం ఉదయం ఢిల్లీలో వార్‌రూం భేటీలో పాల్గొన్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారందరినీ తిరిగి పార్టీలోకి రావాలనికోరుతున్నాం. విభజనపై అందరికీ  సెంటిమెంట్లు ఉన్నాయి. అందరం పోరాడాం. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే తప్పు చేయలేదు. అన్ని పార్టీలకు పాత్ర ఉంది. అందుకే సాయిప్రతాప్‌ను కూడా కోరడం జరిగింది. ఆయన తిరిగి రావడం సంతోషం. ఇంకా వచ్చేవాళ్లు ఉన్నారు. ఎవరెవరు వస్తారో త్వరలో చెబుతాం’’ అని బొత్స చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement