మళ్లీ జోడు పుఠాణీ!
- మాజీ మంత్రి బొత్సతో టీడీపీ కుమ్మక్కు
- ఇటకర్లపల్లిలో బొత్స సమావేశం హాజరైన టీడీపీ కేడర్
- గ్రామస్తుల విస్మయం
చీపురుపల్లి, న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీ నాయకులు మళ్లీ కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారు. నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూ ఇదే తరహా కుట్రలకు పాల్పడిన ఆ రెండు పార్టీల నాయకులు..ఇప్పుడు మళ్లీ ఒక్కట య్యారు. ఇప్పటివరకు పరోక్షంగా అరుుతే తమకు.. లేకపోతే టీడీపీకి ఓటు వేయూలని గ్రా మాల్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని ఇటకర్లపల్లిలో జరిగిన సభతో డెరైక్ట్ అయ్యూరు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి ఇటకర్లపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామానికి చెందిన టీడీపీ కేడర్ మొత్తం హాజరైంది. దీంతో నియోజకవర్గంలో ఈ విషయం తెలిసిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
వాస్తవానికి ఇటకర్లపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మీసాల రమణ తన వర్గంతో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేందుకు కార్యకర్త కూడా లేరు. ఇదే పరిస్థితి మండలంలోని జి. ములగాంలో కూడా ఉంది. అక్కడ కూడా మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు తన వర్గంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది. దీంతో బొత్స అక్కడ సమావేశం నిర్వహించలేని దుస్థితి నెల కొంది.
ఇటకర్లపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీకి చెందిన ఆ గ్రామ పెద్ద లు, కార్యకర్తలు హాజరయ్యా రు. ఇటకర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేకపోయినప్పటికీ.. బొత్స సమావేశం జరుగుతుందని ముందుగానే టీడీపీ నియోజక వర్గ స్థాయి నాయకులకు తెలిసినప్పటికీ ఎందుకు స్పందించలేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాయకులు గ్రామ స్థాయి కేడర్‌ను ఎందుకు నిలువరించలేకపోయారన్న ప్రశ్నబలంగా వినిపిస్తోంది.
అయితే సమావేశానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీలో చేరారంటే అదీ లేదు. కానీ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. ఓట్లు వేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరకుండా టీడీపీలో ఉంటూనే, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య ర్థి సమావేశానికి వెళ్లడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.