
సాక్షి, అమరావతి: మాటకు విపరీతార్థాలు తీసి లేనిది ఉన్నట్లుగా రాయడం ఎల్లో మీడియాకు పుట్టుకతో వచ్చిన బుద్ధి అని అది పోదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్సార్‌సీపీ ఎన్డీయేలో చేరుతున్నట్లుగా వార్తలు రాశారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాటలకు విపరీతార్థాలు తీసి, లేనిది ఉన్నట్లుగా చెప్పి ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోంది. దాంట్లో భాగమే వైఎస్సార్‌సీపీ ఎన్డీయేలో చేరుతున్నట్లుగా రాసిన వార్త . అందుకే పుట్టుకతో వచ్చిన పోదని పెద్దలంటారు’ అని సజ్జల ట్వీట్ చేశారు. (రామోజీరావుకు మంత్రి బొత్స బహిరంగ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment