విజయవాడ, సాక్షి: మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. విజయవాడ వరద బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తోంది.
నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 50 వేల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుంది. 33 డివిజన్లల్లో సరుకుల పంపిణీ జరగనుంది.
వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే రెండు దశల్లో వరద నీటిలో అవస్థలు పడ్డ బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంచగా.. ఇప్పుడు మూడో విడతలో నిత్యావసరాలు ఇస్తున్నారు.
ఇదీ చదవండి: మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప పని చేయరా?
Comments
Please login to add a commentAdd a comment