సాక్షి, అమరావతి: అధికారంలో ఉండి కూడా.. కూటమి నేతలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ, తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ముందుకు వస్తున్నారు.
భారీ వర్షాలు, వరద ధాటికి విజయవాడ నగరం నీట మునిగింది. నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా వరద నీటిలోనే ఉండిపోయింది. పలు కాలనీలకు ఇంకా అధికారులు వెళ్లకపోవడం, సహాయక చర్యలు అందకపోవడం.. పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన వంతు బాధత్యను నిర్వర్తిస్తోంది.
వరద బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ నేతలు నిలుస్తున్నారు. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాలకు తిరిగి పాలు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని.. ఎలాంటి సాయమైనా అందించేందుకు వైస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని నేతలు భరోసా ఇచ్చారు.
ఇక.. ఇప్పటికే పార్టీ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని నేరుగా బాధితులకే అందేలా చూడాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతలకు సూచించారు. దీంతో.. బాధితుల అవసరాల మేరకు సహాయం అందించే ప్రయత్నాల్లో ఉన్నారు వైఎస్సార్సీపీ నేతలు.
Comments
Please login to add a commentAdd a comment