సాక్షి, విశాఖపట్నం: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు.
అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు. సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది’ అని బొత్స అన్నారు. ఇక.. చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మంతి బొత్స సత్యనారాయణ.
నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా..
‘సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా?. పచ్చ కామెర్లు వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. కొన్ని పత్రికలు సిద్దం సభలకు వచ్చిన వారు గ్రాఫిక్స్ అనే భ్రమల్లో ఉన్నారు. వారినే అలాగే భ్రమల్లో ఉండమనండి. రాష్ట్రంలో బీజేపీ, జనసేన ఉందా? ఎన్నికలు తరువాత రాష్ట్రంలో టీడీపీ కూడా ఉండదు. ముడు పార్టీలు కలిసిన మాకెందుకు భయం. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా. అక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. భీమిలి నుంచి నేను ఎందుకు పోటీ చేస్తాను?’ అని బొత్స అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment