vishakapantam
-
AP Rains: ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం.. అల్ప పీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో.. ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో పల్నాడులో కుండపోత వాన పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా తీరం వెంబడి కొనసాగనున్న తీవ్రమైన ఈదురు గాలులు కొనసాగుతాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే సూచించింది వాతావరణ శాఖ.ఇదీ చదవండి: అకాల వర్షం నిండా ముంచేసింది -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అల్లూరి జిల్లా: గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది.రైల్వే అధికారుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.రైల్వే అధికారుల వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గృహాల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.ఆ సమయంలో అరకు వెళ్తున్న ఓ గూడ్స్ వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రాకపోకల్ని నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లను పునరుద్దించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. -
ఎల్లో మీడియాపై గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
సాక్షి,విశాఖ : ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లోమీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది..కేబినెట్లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సైకీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు కొన్నారు..ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగింది? ..వైఎస్ జగన్‌ను అదానీ కలిస్తే తప్పు. అదానీ జగన్‌ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధికమొత్తంలో కరెంట్‌ను కొనుగోలు చేసి రూ.86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా.. రాష్ట్రానికి లక్షా పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా...ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు రూ.20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు.. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము’ అని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
విశాఖలో భారీ అగ్నిప్రమాదం..
-
చంద్రబాబుకి నిజం అంటే భయం.. అందుకే : వైఎస్సార్సీపీ శ్యామల
సాక్షి, తాడేపల్లి: నిజాలంటే సీఎం చంద్రబాబుకి భయమని అన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఏన్డీయే అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్యామల ఎక్స్ వేదికగా స్పందించారు.నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే.. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో టీసీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు బయటపెట్టారు. సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది అంటూ విమర్శలు సంధించారు. నిజాలంటే @ncbn గారికి భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. వైజాగ్‌లో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే @ysjagan గారు విశాఖలో టీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు… pic.twitter.com/VNfu2gQ1u0— Are Syamala (@AreSyamala) October 10, 2024 -
భారత్ అమ్ముల పొదిలో ‘అరిఘాత్’
సాక్షి, విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్’చేరింది. అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారుతోందన్నారు.దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.అరిఘాత్ ప్రత్యేకతలు..పొడవు: 111.6 మీటర్లు వెడల్పు: 11 మీటర్లు డ్రాఫ్ట్: 9.5 మీటర్లు బరువు: 6,000 టన్నులు సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్. మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు -
Vizag: ట్రైన్లో కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి యత్నం
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న రైలులో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు..పలు మార్లు తాకడానికి ప్రయత్నించడంతో అలెర్ట్ అయిన బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు నిందితుడిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం ఓ విద్యార్ధిని విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఓ రైలు ఎక్కింది. రాత్రి పూట కావడంతో నిద్రలోకి జారుకుంది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కదులుతున్న రైల్లో రెచ్చిపోయిన నిందితుడు విద్యార్ధినిని లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు ఆమెను అసభ్యంగా తాకేందుకు యత్నించాడు. దీంతో నిద్రలో ఉన్న విద్యార్ధిని అతడిని నుంచి తప్పించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు నిందితుడ్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. -
అవాస్తవాలపై సంజాయిషీ అవసరం లేదు: ఎంపీ విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను...ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అని అన్నారు.అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2024 ఈ వ్యవహారంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఆ వదంతులు నమ్మొద్దు: అదీప్ రాజ్
సాక్షి, విశాఖపట్నం: తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ వచ్చిన వదంతులను నమ్మొద్దని పెందుర్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పేర్కొన్నారు. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారుఆదివారం సాయంత్రం నేతలతో సమావేశం అనంతరం గ్యాస్టిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని, రేపటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. -
బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేశామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంటా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కల్యాణ్ వెంపర్లాడుతున్నారు. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు. సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుంది’ అని బొత్స అన్నారు. ఇక.. చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు మంతి బొత్స సత్యనారాయణ. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా.. ‘సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా?. పచ్చ కామెర్లు వారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. కొన్ని పత్రికలు సిద్దం సభలకు వచ్చిన వారు గ్రాఫిక్స్ అనే భ్రమల్లో ఉన్నారు. వారినే అలాగే భ్రమల్లో ఉండమనండి. రాష్ట్రంలో బీజేపీ, జనసేన ఉందా? ఎన్నికలు తరువాత రాష్ట్రంలో టీడీపీ కూడా ఉండదు. ముడు పార్టీలు కలిసిన మాకెందుకు భయం. నేను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తా. అక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. భీమిలి నుంచి నేను ఎందుకు పోటీ చేస్తాను?’ అని బొత్స అన్నారు. -
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్‌లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలు
విశాఖపట్నం: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ రన్‌వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఇదీ చదవండి: Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే.. -
వైజాగ్ టెస్టులో గెలుపెవరిది.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టులో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు మాత్రం తొలి మ్యాచ్ ఫలితాన్నే వైజాగ్ టెస్టులోనూ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఇరు జట్లు బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనున్నాయి. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తన అమ్మమ్మ ఇలాఖాలో మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. మ్యాచ్‌కు ముందే ఎదురు దెబ్బలు.. ఇక రెండో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తొలి టెస్టులో గాయపడిన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా.. ఇప్పుడు వైజాగ్ టెస్టుకు దూరమయ్యారు. వారి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వారిద్దరి లేని లోటు తీర్చలేనది. ఎందుకంటే తొలి టెస్టులో జడ్డూ, రాహుల్ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా జడ్డూ బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ సత్తాచాటాడు. మొదటి టెస్టులో 89 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టుకు జడ్డూ స్ధానాన్ని ఎవరూ భర్తీ చేస్తారన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్కు అవకాశమిస్తారో లేదా సౌరభ్ కుమార్, వాషింగ్టన్లో ఎవరైనా జట్టులోకి వస్తారో వేచి చూడాలి. ఒక వేళ కుల్దీప్ జట్టులోకి వస్తే కేవలం బౌలింగ్ పరంగా మంచి ఎంపికైనప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం అంతంత మాత్రమే. రజిత్ పాటిదార్ అరంగేట్రం..? ఇక కేఎల్ రాహుల్ స్ధానంలో రజిత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరు టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నారు. అయితే మేనెజ్మెంట్ మాత్రం పాటిదార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదైమనప్పటికీ రాహుల్ వంటి సీనియర్ ఆటగాడి స్ధానాన్ని పాటిదార్ ఎంతవరకు న్యాయం చేస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లి వచ్చేది ఎప్పుడు? ఇక తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కన్పించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నప్పుడు.. కోహ్లి వంటి ఆటగాడు జట్టులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు విరాట్ దూరమయ్యాడు. అయితే సిరీస్ మొత్తానికి కూడా విరాట్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోహ్లి సిరీస్ మొత్తానికి దూరమైతే భారత్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గిల్, అయ్యర్ ఫామ్‌లోకి వస్తారా? రెండో టెస్టులో అందరి కళ్లు టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పైనే ఉంటాయి. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన వీరిద్దరూ వైజాగ్ టెస్టులోనైనా తిరిగి వారి రిథమ్‌ను పొందాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా టెస్టుల్లో శ్రేయస్ పర్వాలేదన్పిస్తున్నప్పటికీ.. గిల్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. మొదటి టెస్టులో కేవలం 23 పరుగులు మాత్రమే శుబ్‌మన్ చేశాడు. గత 9 ఇన్నింగ్స్‌లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. గిల్ జట్టులో తన స్ధానాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. రికార్డు మనదే.. ఇక విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో టీమిండియా ఓటమనేదే ఎరుగదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (167), పుజారా (119) సెంచరీలతో . అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సహా ఎనిమిది వికెట్లతో (మ్యాచ్‌లో) ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అదే విధంగా 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 203 పరుగులు తేడాతో టీమిండియా భారీ విజయం అందుకుంది. -
విశాఖలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ...ఏర్పాట్లను పరిశీలించిన అవంతి
-
Vizag: పోగొట్టుకున్న విలువైన బ్యాగు.. గంటల వ్యవధిలో
విశాఖపట్నం: మహిళ పోగొట్టుకున్న విలువైన బ్యాగును గంటల వ్యవధిలో చేధించి తిరిగి ఆమెకు విశాఖపట్నం నగర పోలీసులు అందించారు. బుధవారం సాయింత్రం సుమారు 04.30 గంటల సమయంలో కే.భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎం.వీ.పీ సర్కిల్ వరకు ఒక పాసింజర్ ఆటో ఎక్కింది. సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయి , కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి చుట్టుప్రక్కల ఆటో కోసం వెతుకగా కనపడకపోవడంతో ఎం.వీ.పీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని తెలిపారు. తక్షణం స్పందించి.. ఆమె తెలిపిన వివరాలు ఆధారంగా కానిస్టేబుల్ పీ.హరి, అప్పుఘర్ ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో సదరు ఆటోను కనిపెట్టారు. సదరు ఆటో డ్రైవర్ ఆర్. కొండలరావు అలియాస్ రాజు కూడా స్వచ్ఛందంగా బ్యాగ్‌ను అప్పగించడానికి వస్తున్నట్లు తెలిపారు. గురువారం అడిషనల్ డీజీపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ.రవి శంకర్ చేతుల మీదుగా బాధితురాలికు ఆమె బ్యాగును అందజేసి , బ్యాగ్ కనిపెట్టడంలో ప్రతిభ కనబర్చిన ఎంవీపీ కానిస్టేబుల్ పి.హరిని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. అదే విధంగా బ్యాగును కనిపెట్టడంలో సహాయం చేసిన సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన రాజును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. చదవండి: ఈనాడు ట్యాబ్ కథనంపై మంత్రి బొత్స ఫైర్ -
ఐటీ హబ్‌గా అవతరించనున్న విశాఖ
ఐటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని కేంద్రం ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ ఐటి ఎగుమతుల విలువ రూ. 986 కోట్లు ఉండగా.. 2022-23 నాటికి ఎగుమతులు గణనీయంగా పెరిగి రూ. 1867 కోట్లకు చేరుకున్నాయని స్టెపి నివేదిక తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతులు 90 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. అవకాశాల వెల్లువ ఇక 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగులు 14527 మంది ఉండగా.. 2022-23 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగుల 24719 కి పెరిగారు. గత 4 ఏళ్లలో వేలాది మంది ఉపాధి పొందారు. దీనికి తోడు కొత్తగా ప్రారంభమైన ఇన్ఫోసిస్‌తో పాటు విస్తరిస్తున్న ఐటీ కంపెనీల 2023-24 సంవత్సరంలో ఏపీ ఐటి ఎగుమతులు మరో 20శాతం పెరగనున్నట్లు అంచనా. తద్వారా వేల ఐటీ ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. విశాఖ పెట్టుబడలు వరద విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి టీసీఎస్,హెచ్‌సీఎల్,యాక్సెంచర్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో విశాఖ ఐటీ హబ్‌గా అవతరించనుంది. హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు ఇక రాష్ట్రంలో ఐటీ ఉద్యోగ అవకాశాలు అంతకంతకూ పెరుగుతుండడం విద్యార్ధులకు, నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక అనిశ్చితి, తొలగింపులు వంటి క్లిష్ట సమయాల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లో వృద్ది సాధించడంపై ఐటీ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్ గెలుస్తే అంటూ.. 'బోల్డ్ ఆఫర్' ప్రకటించిన తెలుగు హీరోయిన్
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా వరల్డ్ కప్-2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్‌ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి ప్రపంచ కప్ భారత్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉండటమే.. ఇలాంటి సమయంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖాభోజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 'ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా' అంటూ పోస్ట్ పెట్టింది. స్ట్రీకింగ్ అంటే ఏంటి..? ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది దుస్తులు తొలగించి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడమే స్ట్రీకింగ్ అంటారు. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఇప్పుడు రేఖా భోజ్ కూడా అలాంటి పని చేయనుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ఆమె తెలుపుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తే...వైజాక్ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండియా గెలుస్తే... బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. వాటికి రేఖా భోజ్ కూడా ఇలా రిప్లై ఇచ్చింది. లేదండి.. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా. నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.' అని రేఖా బోజ్ తెలిపింది. కానీ కొందరు మాత్రం అంతే బోల్డ్‌గా వైజాగ్ వచ్చేస్తామంటూ భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.. రేఖా భోజ్ ఎవరు..? బోల్డ్ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఆమె గతంలో వైరల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.. విశాఖపట్నంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.. అదరగొట్టిన వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో బెజవాడ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైగర్స్ 7 వికెట్లతో ఉత్తరాంధ్ర లయన్స్‌ను ఓడించింది. లయన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మహీప్ కుమార్ (77 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికీ భుయ్ (41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా వారియర్స్ విజేతగా నిలిచింది. వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ప్రశాంత్ (73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. విహారి (71; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ రెడ్డి (58 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సూపర్ ఓవర్లో కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేయగా, వారియర్స్ 2 పరుగులు చేసి గెలిచింది. -
రాయలసీమ కింగ్స్ ‘హ్యాట్రిక్’ విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్ రెండో సీజన్లో రాయలసీమ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ జట్టును ఓడించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. త్రిపురాణ విజయ్ (25 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయలసీమ కింగ్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ హనుమ విహారి (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ రెడ్డి (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తన్నీరు వంశీకృష్ణ (39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు ఏకంగా 21 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం. తపస్వి ఆల్‌రౌండ్ ప్రదర్శన మరో మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ 93 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెపె్టన్ కోన శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (36 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పిన్నింటి తపస్వి (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిర్లా శ్రీనివాస్ (13 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 14.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తపస్వి, పృథీ్వరాజ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. -
ఎల్లుండి విశాఖకు సీఎం వైఎస్ జగన్
-
అబద్దాల కట్టుకథతో మరోసారి ఈనాడు వార్తాకథనం
-
ఏయూలో వియత్నాం విద్యార్థుల సందడి
-
టీమిండియా ఘోర ఓటమి.. 10 వికెట్ల తేడాతో ఆసీస్ భారీ విజయం
విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 1-1తో సమం చేసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్(66 నాటౌట్), ట్రావిస్ హెడ్(51 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. మిచెల్ మార్ష్ అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి ఓవర్ నుంచే భారత బ్యాటర్లకు ప్రత్యర్ధి పేసర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ గిల్ వికెట్‌ను కోల్పోయిన భారత్.. అనంతరం ఏ దశలోనే కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో అక్షర్ పటేల్ (29) పరుగులతో రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది. చదవండి: IND vs AUS: గోల్డన్ డక్‌లు.. సూర్యను పక్కన పెట్టండి!అతడిని జట్టులోకి తీసుకురండి -
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. విశాఖకు చేరుకున్న సునీల్ గావస్కర్
విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్దమైంది. ఆదివారం(మార్చి 19)న జరగనున్న ఈ మ్యాచ్‌కు నిర్వహాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు దాదాపు 25 వేల మంది స్టేడియంకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు వాఖ్యతగా వ్యవహరించనున్న టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ విశాఖకు శనివారం చేరుకున్నారు. అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు.. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్!
ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నిర్మాణం జరగనుంది. మొదటి దశ పనులు 2025లో ప్రారంభం కానున్నాయి. విస్తీర్ణం పరంగా ఇప్పటి వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 44 ఎకరాల్లో విస్తరించింది. ఇదే ప్రపంచంలో అతది పెద్దది. రెండో స్థానంలో 43 ఎకరాల్లో విస్తరించిన బీజింగ్ డబ్ల్యూటీసీ నిలిచింది. శంషాబాద్‌లో నిర్మించబోయే వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు ఎత్తులో 12 అంతస్థులకే పరిమితం కానున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్కైస్క్రాపర్లకు అనుమతి లేదు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం రూ.4000 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ డబ్ల్యూటీసీకి అనుబంధంగా సర్వీస్ అపార్ట్మెంట్లతో పాటు 225 గదుల హోటల్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తంగా వివిధ దశల్లో కలిపి 2035 నాటికి డబ్ల్యూటీసీ పనులు పూర్తి కావచ్చని అంచనా. డబ్ల్యూటీసీ సెంటర్ కోసం ఇప్పటికే 15 ఎకరాల స్థల సేకరణ పూర్తవగా నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. మిగిలిన భూసేకణ పనులు జరుగుతున్నాయి. శంషాబాద్‌తో డబ్ల్యూటీసీ పనులు చేపడుతున్న సంస్థనే విశాఖపట్నంలోనూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. రిషికొండ సమీపంలో 20 లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు. చదవండి: ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక