సాక్షి, విశాఖపట్నం: స్కూల్ క్రికెట్‌లో సంచలన రికార్డులతో చెలరేగుతున్న 15 ఏళ్ల ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు భారత అండర్-19 జట్టు తరఫున కూడా సత్తా చాటాడు. ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల అండర్-19 టోర్నీలో సర్ఫరాజ్ (66 బంతుల్లో 101; 17 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై గెలిచింది. సర్ఫరాజ్‌కు తోడు స్థానిక ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (95 బంతుల్లో 94 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ ఫార్య్చూన్ (99 బంతుల్లో 90; 15 ఫోర్లు) శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో సీవీ మిలింద్, అభిమన్యు లాంబా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 39.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 275 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సర్ఫరాజ్, భుయ్ ఐదో వికెట్‌కు 19.5 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడం విశేషం. మరో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 147 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది.
సర్ఫరాజ్ సెంచరీ
Published Thu, Sep 26 2013 1:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement