అల్లూరి జిల్లా: గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది.రైల్వే అధికారుల అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
రైల్వే అధికారుల వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం బొర్రా గృహాల సమీపంలో కొత్తవలస కిరండూల్ రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆ సమయంలో అరకు వెళ్తున్న ఓ గూడ్స్ వ్యాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రాకపోకల్ని నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌లను పునరుద్దించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment